Young Age
-
హల్లో ప్లీజ్ హియర్..
ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాప్టాప్స్ పట్టుకుని చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పనిచేయడం, రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించడం.. ఇవి సరిపోవన్నట్టు వీకెండ్స్‌లో పబ్స్, క్లబ్స్‌లో చెవులు చిల్లులు పడే మ్యూజిక్ హోరులో మునిగి తేలడం.. ఇవన్నీ నగరంలో టీనేజర్లు, యువత జీవనశైలిలో రొటీన్ పనులు. అయితే నేడు వీరు అనుసరిస్తున్న ఈ రకమైన పద్ధతులు రేపటి వారి వినికిడి లోపానికి కారణం కానున్నాయా? అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నాయి అధ్యయనాలు. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. సురక్షితం కాని శ్రవణ పద్ధతులు అవలంబిస్తుండడం వల్ల ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. వీరిలో కూడా అత్యధికులు యువత, టీనేజర్లే కానుండడం ఆందోళనకరం. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు బిఎమ్‌జె గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం, పరిమితికి మించి స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలు (పర్సనల్ లిజనింగ్ డివైజెస్/పిఎల్డిలు) ఉపయోగించడం, పెద్దగా ధ్వనించే సంగీత వేదికలు యువత వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 శాతం టీనేజర్లు, 48 శాతం మంది యుక్తవయసు్కలు పరిమితికి మించి చెవులుకు పనిపెడుతున్నారని పరిశోధనలో తేలింది. ఈ సంఖ్యల ఆధారంగా, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 0.67, 1.35 బిలియన్ల మంది మధ్య, యుక్తవయసు్కలు వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు లెక్కగట్టారు.పరిమితి మీరుతున్నారు..గతంలో వెలువడిన ఓ పరిశోధన ఫలితాల ప్రకారం పీఎల్డీ వినియోగదారులు తరచూ 105 డెసిబుల్స్ కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటారు. వినోద వేదికలలో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డెసిబుల్స్మించి ఉంటాయి.. అయితే వైద్యులు అనుమతించిన స్థాయి పెద్దలకు 80 డెసిబుల్స్. పిల్లలకు 75 డెసిబుల్స్ మాత్రమే కావడం గమనార్హం. ‘ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు సురక్షితమైన వినికిడి మార్గాలను ప్రోత్సహించడం ద్వారా నష్ట నివారణకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం’ అని ఈ సందర్భంగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.టిన్నిటస్ సమస్యే ఎక్కువ.. నన్ను కలిసిన నగరవాసుల్లో కొందరికి చిన్న వయసులోనే వినికిడిలోపాలతో పాటు టిన్నిటస్ అనే ఒక సమస్య పెరుగుతోందని కూడా గుర్తించాం. టిన్నిటస్ అంటే ఫోన్ రింగింగ్, ఇతర శబ్దాలు పదే పదే తలలో, చెవుల్లో గింగురుమనే ఫాంటమ్ సెన్సేషన్స్. కొంత మంది దీని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే మరి కొందరు దీర్ఘకాలిక చెవినొప్పి అనుభవిస్తున్నారు. తీవ్రమైన శబ్దాలు, తద్వారా కలిగే అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తాయి. అంతేకాదు వినికిడి సమస్యలు డిప్రెషన్, డిమెన్షియా, మతిమరుపు వ్యాధుల తీవ్రత పెరగడానికి కూడా కారణం అవుతాయి. – డా.ఎమ్.ప్రవీణ్‌కుమార్, ఇఎన్టీ వైద్యులు -
యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..?
వయసు పెరగడమన్నది అందరిలోనూ చాలా సహజంగా జరిగిపోతుంటుంది. చాలాకాలం పాటు యూత్‌ఫుల్‌గా కనిపించడం అందరూ కోరుకునేదే. అంతేగానీ... వయసు పెరగాలని ఎవరూ కోరుకోరు. కొందరు వయసుపరంగా చాలా పెద్దవారైనా... చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తారు. వయసు చెప్పగానే ఆశ్చర్యపోయేంత యౌవనంతో ఉంటారు. ఇలా వయసు తగ్గి యౌవ్వనంతో కనిపించడంతో పాటు, కేన్సర్‌ను కూడా నివారించే ఆహారాన్ని కాదనుకునేవారెవరు? అలా వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేయడంతోపాటు కేన్సర్‌ను నివారించే పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి, వాటితో ఉండే ఇతర ప్రయోజనాలేమిటి అనే విషయాలను తెలుసుకుందాం. వయసు పెరగడంతో శారీరకంగా కొన్ని మార్పులు వస్తాయి. ఉదాహరణకు చర్మం కాస్త వదులైపోడం, కళ్ల కింద, నుదుటి మీద గీతల వంటివి. ఇలా వచ్చే మార్పులనే ఏజింగ్‌తో వచ్చే మార్పులంటారు. కొన్ని రకాల ఆహారాలతో ఈ ఏజింగ్ ప్రక్రియ వేగవంతవుతుంది.ఉదాహరణకు ఎక్కువ తీపి ఉండే పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ వంటి జంక్‌ఫుడ్ తీసుకునేవారిలో ఏజింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఏజింగ్కూ, అలాగే కొందరిలో కేన్సర్‌కు దారితీసే ఫ్రీ–ర్యాడికల్స్ అనే పదార్థాలు కారణం. ఈ ఫ్రీ–ర్యాడికల్స్‌ను సమర్థంగా అరికట్టేవే యాంటీఆక్సిడెంట్స్. దేహంలో ప్రతినిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగేటప్పుడు కొన్ని కాలుష్య పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీరాడికల్స్ అంటారు. అవి కణాలను దెబ్బతీస్తాయి. ఫ్రీ–రాడికల్స్ అన్నవి దేహంలోని ఏ కణంపై ప్రభావం చూపితే ఆ కణం జీవిత కాలం తగ్గిపోతుంది. ఆ కణం కూడా గణనీయంగా దెబ్బతింటుంది.యాంటీ ఆక్సిడెంట్స్ అంటే...? ఆహారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్‌తో చర్య జరిపి, కణాలపై వాటి ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేవే యాంటీ ఆక్సిడెంట్స్. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఫ్రీ–ర్యాడికల్స్లో ఉండే పదార్థాలు కణాల్లోని రసాయనాలతో ఆక్సిడేషన్ చర్య జరపడం ద్వారా కణాన్ని దెబ్బతీస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఫ్రీ–ర్యాడికల్స్‌ను అడ్డుకుని ఆహారంలో ఉండే కొన్ని పోషకాలు ఆక్సిడేషన్ కానివ్వకుండా ఆపుతాయి. అలా ఫ్రీర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. అంటే ర్యాడికల్స్ ద్వారా జరిగే ఆక్సిడేషన్ను తటస్థీకరణ (న్యూట్రలైజ్) చేస్తాయి. అందువల్ల ఫ్రీ–రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆగిపోతాయి. దాంతో ఫ్రీ–రాడికల్స్ కణాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదు. మామూలు కణం కేన్సర్ కణంగా మారడమూ ఆగిపోతుంది. అలా ఫ్రీ–రాడికల్స్ కారణంగా కణంలో ఆక్సీకరణ జరగకుండా ఆపేస్తాయి కాబట్టే ఆహార పదార్థాల్లోని ఆ పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు.యాంటీ ఆక్సిడెంట్స్‌తో లాభాలివి.. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి జీవక్రియల ద్వారా కణంలో జరిగే విధ్వంసాన్ని (సెల్ డ్యామేజీని) ఆపేస్తాయి. సెల్ డ్యామేజ్ తగ్గడం వల్ల కణం చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సెల్ డ్యామేజీలు కాలుష్యం వల్ల, పొగతాగడం, అత్యధిక శారీరక శ్రమ, అల్ట్రావయొలెట్ కాంతి వల్ల జరుగుతుంటాయి. ఫలితంగా చర్మం ముడుతలు పడటం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ–ర్యాడికల్ వల్ల జరిగే అనర్థాలను నిరోధించడం వల్ల ఈ దుష్పరిణామాలన్నీ ఆగుతాయి లేదా తగ్గుతాయి. దాంతో చాలా కాలం పాటు వయసు పెరిగినట్లుగానే కనిపించదు. దాంతో చాలాకాలంపాటు యౌవనంగా కనిపిస్తారు. ఫ్రీ–రాడికల్స్ ఒక్కోసారి కణంలోని స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తాయి. అప్పుడా మామూలు కణం కాస్తా... కేన్సర్ కణంగా మారిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. పోషకాల్లోని రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్... వాటితో ప్రయోజనాలుబీటా–కెరోటిన్ అనే పోషకానికి యాంటీఆక్సిడెంట్ గుణం ఉంటుంది. ఇవి పసుప్పచ్చ, నారింజరంగులో ఉండే అన్ని పండ్లు, కూరగాయల్లో, ఆకుకూరల్లో బీటా కెరొటిన్ ఉంటుంది. ఇవి మన శరీరంలోని కణాల్లోని పైపొర (సెల్ మెంబ్రేన్)ను సురక్షితంగా కాపాడతాయి. దాంతో ఆ పొరను ఛేదించి ఏ హానికరమైన కాలుష్యాలూ కణంలోకి చేరలేవు. అందుకే పైన పేర్కొన్న రంగు పండ్లు తింటే క్యాన్సర్ నుంచి రక్షణతో పాటు కణం చాలాకాలం పాటు ఆరోగ్యంగా, యౌవనంతో ఉంటుంది. లైకోపిన్ అనే ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఎరుపు రంగు పిగ్మెంట్ ఉండే ఆహారాల్లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. అయితే టొమాటోలో ఇది మరీ ఎక్కువ. పుచ్చకాయలోనూ ఎక్కువే. లైకోపిన్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటమేగాక... పెద్దపేగు కేన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్ కేన్సర్‌ను నివారించడంలో లైకోపిన్ చాలా సమర్థంగా పనిచేస్తుంది. అల్లిసిన్ అనే చాలా శక్తిమంతమైన ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లిసిన్ రక్తంలోని కొలెస్టరాల్నూ తగ్గిస్తుంది. ఇది వెల్లుల్లి, ఉల్లిలో ఎక్కువగా ఉంటుంది.ఐసోథయనేట్స్, ఐసోఫ్లేవోన్స్ యాంటీ ఆక్సిడెంట్లు సోయా ఉత్పాదనల్లో, క్యాబేజీ, కాలిఫ్లవర్‌లలో పుష్కలంగా ఉంటాయి. అవి అనేక రకాల కేన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. యాంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ద్రాక్షలో, బెర్రీ పండ్లలో ఎక్కువ. గుండె జబ్బులను యాంథోసయనిన్ నివారిస్తుంది. ఫ్లేవనాయిడ్స్ అన్నవి చాలా చిక్కటి ముదురు రంగులో ఉండే అన్ని రకాల పండ్లలోనూ, కూరగాయల్లోనూ లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్. వాటికి ఫ్రీ–రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేసే గుణం చాలా ఎక్కువ. అందుకే వాటిల్లో సహజసిద్ధమైన క్యాన్సర్ నిరోధక గుణాలు ఎక్కువ. పుల్లగా ఉండే నిమ్మజాతి పండ్లలో లభ్యమయ్యే విటమిన్–సి కూడా చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్–ఈ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్స్. చివరగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలను తీసుకుంటే ఒక పక్కన మంచి యౌవ్వనాన్ని చాలాకాలం పాటు కాపాడుకోవడమే కాకుండా... ఎన్నో రకాల కేన్సర్లను సమర్థంగా నివారించినట్టూ అవుతుంది. (చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్‌గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
సీఎం పీఠంపై మహిళా శక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా ముఖ్యమంత్రులు సుచేతా కృపలానీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. నందిని శతపథి దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు. శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత శశికళ కకోద్కర్ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. అన్వర తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు. వి.ఎన్.జానకి రామచంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు. జె.జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మాయావతి బహుజన సమాజ్ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. రాజీందర్ కౌర్ భట్టాల్ పంజాబ్‌కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్ కౌర్ భట్టాల్ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు. రబ్రీ దేవి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి. సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమా భారతి రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వసుంధర రాజే గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆనందిబెన్ పటేల్ గుజరాత్‌కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. మహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియామూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత. -
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించాలి: ఆప్ ఎంపీ
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన చద్దా గురువారం మాట్లాడుతూ.. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం ప్రజలు 35 సంవత్సరాలలోపే ఉన్నారని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారని చెప్పారు. ‘‘యువ భారతం మనది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ప్రస్తుత కాలానికి సరిపోదు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఇక 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే. దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి లోక్‌సభ ఎన్నికైనప్పుడు 26 శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే.ఇక రెండు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరం. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని రాఘవ్ చద్దా అన్నారు. #WATCH | In Rajya Sabha, AAP MP Raghav Chadha demands the minimum age for contesting elections in India should be reduced from 25 years to 21 years. He says "India is one of the youngest countries in the world. 65% of our population is less than 35 years old and 50% of our… pic.twitter.com/NjL8p2Qjmb— ANI (@ANI) August 1, 2024 -
యూపీ కుర్రాడికి ప్రధాని మోదీ ఎందుకు లేఖ రాశారు?
ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అవసరమైనప్పుడు కొందరికి లేఖలు కూడా రాస్తుంటారు. తాజాగా యూపీలోని ఒక యువకునికి ప్రధాని మోదీ లేఖరాశారు.ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని మొహల్లా పిర్బతవాన్లో నివసిస్తున్న అభయ్ చంద్వాసియాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అభయ్‌ను ప్రశంసించారు. అభయ్ గత 20 ఏళ్లుగా మోటార్ న్యూరాన్ డిజార్డర్ అనే నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం 95 శాతం మేర శారీరక వైకల్యంతో జీవిస్తున్నాడు.ప్రధాని మోదీ తన లేఖలో అభయ్ చంద్వాసియాను ప్రశంసించారు. ‘ప్రేమతో కూడిన మీ మాటలు దేశం కోసం మనస్పూర్తిగా పని చేసేవారికి కొత్త శక్తిని ఇస్తాయని మోదీ పేర్కొన్నారు. అభయ్ తన స్వీయ రచనలోని ప్రతి పదాన్ని ప్రధాని మోదీకి అంకితం చేశారు. శారీరక వైకల్యంతో మంచం మీదనే ఉంటున్నప్పటికీ అభయ్ పలు స్ఫూర్తిదాయకమైన రచనలు సాగించాడు. అవి చదివినవారు వీటిని రాసిన వ్యక్తి శారీరక వైకల్యంతో బాధపడుతూ, కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైనవాడంటే ఎవరూ నమ్మలేరు.ప్రధాని నరేంద్ర మోదీపై అభయ్కు ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి, నాయకత్వ సామర్థ్యాలను వర్ణిస్తూ కవిత్వం రాశాడు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ అభయ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నుంచి లేఖ రావడంపై అభయ్ ఆనందం వ్యక్తం చేశారు. -
కుటుంబ పోషణ భారమై యువకుడి అత్మహత్య
రాజాపూర్: మండల కేంద్రంలో శుక్రవారం ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌లోని రాంనగర్‌కు చెందిన శివ (24) రాజాపూర్‌లో ట్రాక్టర్ మెకానిక్ దుకాణం ఏర్పాటు చేసుకొని తల్లి, చెల్లితో కలిసి ఉంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం ఉండవెల్లి: అప్పుల బాధతో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గోపాల్ (45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఇంటి నిర్మాణం, ఒకే ఏడాదిలో కుమారుడు, కుమార్తె వివాహం చేశాడు. దీంతో అప్పులు అధికమవడంతో ఆర్థికభారంతో మండల కేంద్రం శివారులోని పంట పొలంలో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మరో యువకుడు.. మహమ్మదాబాద్: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారి ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గూళ్ల అంజి (28) చెరువుల్లో చేపలు పట్టడానికి కూలీ పనికి వెళ్లేవాడు. తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారి గురువారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుని మృతిచెందాడు. అంజికి భార్య మేఘన, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. బస్సు ఢీకొని వ్యక్తి.. భూత్పూర్: మండలంలోని ఎల్కిచర్ల సమీపం భట్టుపల్లితండా (ఏవీఆర్ కాలనీ) వద్ద శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని 35 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగర్‌కర్నూల్ నుంచి భూత్పూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. నల్లటిరంగు టీషర్డు, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి బస్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్.. నలుగురికి గాయాలు పెబ్బేరు రూరల్: ఎడ్లబండిని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మ, బాలీశ్వరమ్మ, బిచ్చన్న వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై ఇంటికి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన రమేష్ ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వేగంగా వచ్చి ఎడ్లబండిని ఢీకొట్టాడు. ప్రమాదంలో ఎడ్లబండిపై ఉన్న వారితో పాటు రమేష్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇది చదవండి: short circuit: పొలంలో పని చేస్తుండగా వరికోత మిషన్ దగ్ధం -
మెదటిసారిగా ఓటేసిన ఆనందంలో యువతులు (ఫొటోలు)
మెదటిసారిగా ఓటేసిన ఆనందంలో యువతులు (ఫొటోలు) -
వందలమందికి ప్రాణంపోసిన ‘రక్తవీర్’
బీహార్‌లోని సుపౌల్‌కు చెందిన ఒక యువకుడు రక్తదాతలకు స్ఫూర్తిదాయకునిగా నిలుస్తున్నాడు. ఈ యువకుని చొరవతో ఇప్పటివరకు 1,100 మంది ప్రాణాలు నిలిచాయి. వివిధ సామాజిక సంస్థలు ఆ యువకుడిని సన్మానించాయి. ఈ కుర్రాడి పేరు అవినాష్ కుమార్ అమర్ అలియాస్ లోలప్ ఠాకూర్(28). ఇప్పటి వరకు అవినాష్ 330 లీటర్ల రక్తాన్ని తమ సంస్థ ద్వారా దానం చేశాడు. నగరంలో ఎవరికి రక్తం కావాలన్నా అందరికీ ముందుగా అవినాష్ పేరు గుర్తుకువస్తుందని స్థానికులు చెబుతుంటారు. మూడేళ్ల క్రితం 2019 ఆగస్టు నెలలో తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు, అతనిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో తనకు తొలిసారిగా రక్తదానం చేయాలనే ఆలోచన వచ్చిందని అవినాష్ తెలిపారు. తరువాత అవినాష్ తన స్నేహితులతో కలిసి ఓ రక్తదాన సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ‘రక్తవీర్ గ్రూప్’ అని పేరు పెట్టారు. ఈ గ్రూప్ 2019 నుండి అవసరమైనవారికి రక్తం అందిస్తూ వస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియడంతో వారంతా అవినాష్ మొదలు పెట్టిన సంస్థ ద్వారా రక్తం అందించేందుకు ముందుకు వచ్చారు. తమ సంస్థకు సోషల్ మీడియా ఒక వరంలా మారిందని అవినాష్ తెలిపారు. తమ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో చాలమంది చేరారని, వారంతా రక్తదానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక కార్యకర్తలు కూడా తమ సంస్థకు అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: గఢ్‌ముక్తేశ్వర్‌లో కార్తీక పూర్ణిమ సందడి -
ఎక్సలెంట్ రైటర్స్ ! అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు!
అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు ఉన్నారు తెలుసా? వాళ్లు ఆ సాహసం చేయడం వల్లే ఈ రోజు మనం వాళ్ల గురించి మాట్లాడుకోగలుతున్నాం. ఇక్కడ చెప్పుకోబోయే పిడుగులు పిన్న వయసులోనే చేయి తిరిగిన రచయితలకు మల్లే అద్భుతమైన పుస్తకాలను అవలీలగా రాసేశారు. పుస్తక ప్రియుల చేత ‘ఎక్సలెంట్’ అనిపించుకున్నారు. వాళ్లెవరంటే.. డోరతీ స్ట్రెయిట్ అమెరికన్ రచయిత్రి. 1958లో జన్మించిన డోరతీ.. నాలుగేళ్ల వయసులోనే ‘హౌ ద వరల్డ్ బిగాన్ ’ అనే పుస్తకం రాసి తన అమ్మమ్మకు బహుమతిగా ఇచ్చింది. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? అని తల్లి వేసిన ప్రశ్నే ఆమెలోని రచన సృజనను వెలికి తీసిందట. ప్రస్తుతం ఆమెకు 65 ఏళ్లు. క్రిస్టఫర్ పాయోలీనీ పదిహేనేళ్ల వయసులోనే హైస్కూల్ పూర్తి చేసిన క్రిస్టఫర్ తన మొదటి నవల ‘ఎరగాన్’ రాయడం ప్రారంభించాడు. తన పద్దెనిమిదో ఏట ఆ పుస్తకాన్ని ప్రచురించాడు. అది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో చేరింది. ఆ సిరీస్‌లో మరో మూడు పుస్తకాలు రాశాడు క్రిస్టఫర్. ఆ సిరీస్ ప్రేరణతో 2006లో పలు సినిమాలూ వెలువడ్డాయి. ఏన్ ఫ్రాంక్ ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’.. ప్రపంచంలో అత్యధికులు చదివిన పుస్తకాల్లో ఒకటి. రెండవ ప్రపంచయుద్ధకాలంలో.. జర్మనీకి చెందిన ఏన్ ఫ్రాంక్ అనే అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని నాజీలు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు ఏన్కు 15 ఏళ్లు. బందీగా ఉన్న సమయంలో.. తమ నరకయాతనను ఎప్పటికప్పుడు డైరీలో రాసింది. అదే ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పుస్తకంగా ప్రచురితమైంది. ఇది హిట్లర్ దాష్టీకాలకు.. నాటి యూదుల ఆవేదనకు సాక్ష్యంగా నిలిచింది. ఏన్.. తను తలదాచుకున్న బంకర్లోనే ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిన రెండేళ్లకు ఈ పుస్తకం ప్రపంచం ముందుకు వచ్చింది. సుమారు 60కి పైగా భాషల్లో అనువాదమైంది. మాటీ స్టెపనేక్ అమెరికన్ సుప్రసిద్ధ కవులు, వక్తల పేర్లలో మాటీ స్టెపనేక్ పేరు కూడా వినిపిస్తుంది. ఆ అబ్బాయి రాసిన జర్నీ త్రూ హార్ట్సాంగ్స్ అనే పుస్తకం బాగా పాపులర్ అయ్యింది. మస్క్యులర్ డిస్ట్రోఫియా బాధితుడైన మాటీ .. చిన్న వయసులోనే అనేక పాటలు, పద్యాలు, కవితలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పీస్ అడ్వకేట్‌గానూ వ్యవహరించాడు. అనారోగ్య సమస్యలతో 2004లో.. తన 13వ ఏట తనువుచాలించాడు. (చదవండి: హైటెక్ డాన్స్‌మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!) -
మన స్నేహం మరణంలో కూడ.. మిత్రమా..!
మహబూబ్‌నగర్: కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి మృత్యుఒడికి చేరారు. స్కూటీని కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లా గుడిగండ్లలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన ఉదయ్‌కుమార్(28) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అంబర్‌పేటకు చెందిన అఖిల్ (26)తో పరిచయం ఏర్పడింది. అఖిల్ ఐటీఐ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉంటున్నాడు. అయితే సోమవారం రాత్రి ఉదయ్‌కుమార్, అఖిల్ ఇద్దరు కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా స్కూటీపై హైదరాబాద్ నుంచి బయలుదేరి మక్తల్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గుడిగండ్ల దగ్గర రాయచూర్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న కర్ణాటక బస్సు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా.. అఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో అఖిల్‌ను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం సమాచారం అందుకున్న ఎస్ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అఖిల్ తల్లి ఉమ, ఉదయ్‌కుమార్ తండ్రి మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!
అమెరికాలో తల్లీకొడుకుల అనుబంధానికి తలవంపులు తెచ్చే ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన కుర్రాడు తన తల్లికి ‘సెక్స్ బానిస’గా ఉంటూ కాలం గడుపుతూ వచ్చాడు. హ్యూస్టన్ పోలీసులు ఈ ఆశ్చర్యకర వివరాలను వెల్లడిస్తూ.. రూడీ ఫరియాస్ ఇంతకాలం తన తల్లితోనే ఉన్నాడని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం మాయమైనప్పుడు రూడీ ఫరియాస్ టీనేజర్. సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచి.. ఫాక్స్ న్యూస్ వెలువరించిన రిపోర్టు ప్రకారం రూడీ ఫరియాస్ మాయవడం గురించి ఒక సామాజిక కార్యకర్త తెలిపిన నేపధ్యంలో ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు అతని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కార్యకర్త చేస్తున్న ఆరోపణల ప్రకారం అతని తల్లి జెనీ సైన్టనా అబద్ధాలు చెబుతూ, తన కుమారుడిని సుమారు దశాబ్ధకాలం పాటు దాచివుంచింది. రూఢీ తల్లి అతనికి మత్తు పదార్థాలు ఇస్తూ అతనితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేది. ‘తరచూ బెదిరించేది’ సామాజిక కార్యకర్త క్లానెల్ ఎక్స్ చేసిన ఆరోపణల ప్రకారం జెనీ సైన్టనా తన కుమారుడితో తండ్రి పాత్ర పోషించాలని డిమాండ్ చేసేది. దీనిని వ్యతిరేకిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కుమారుడిని బెదిరించేది. అదృశ్యమైన వ్యక్తులను గాలించే హ్యూస్టన్ పోలీసు విభాగానికి చెందిన యూనిట్ అధికారులు సామాజిక కార్యకర్త క్లానెల్ ఎక్స్ సమక్షంలో రూడీ ఫరియాస్, అతని తల్లి జెనీ సైన్టనాలను విచారించారు. భర్తలా వ్యవహరించేందుకు.. ఫాక్స్ 26 హ్యూస్టన్ వెబ్సైట్లో పోస్ట్ అయిన ఒక వీడియోలో ఆ సామాజిక కార్యకర్త విస్తుపోయే వివరాలు వెల్లడించారు. ఆ మహిళ తన కుమారునితో బెడ్ షేర్ చేసుకుంది. కుమారుడిని తన భర్తగా ఉండాలంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. ఫరియాస్ అదృశ్యమయ్యాడంటూ వార్తలు వచ్చిన సమయంలో అతని వయసు 17 సంవత్సరాలు. అతని తల్లి 2015లో పోలీసులతో.. హ్యూస్టన్‌లోని తమ ఇంటికి దగ్గరలో రెండు కుక్కలను వాకింగ్‌కు తీసుకువెళ్లిన అనంతరం ఫరియాస్ అదృశ్యమయ్యాడని, ఆ శునకాలు ఇంటికి వచ్చినా, అతను తిరిగి రాలేదని ఆమె తెలిపింది. ఇది కూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే.. కాగా ఆ కుర్రాడు తన తల్లి తీరుకు విసిగిపోయాడు. తన జీవితాన్ని తాను గడపాలనుకున్నాడు. తల్లికి బానిసగా బతుకుతూ ఎంతో విసిగిపోయానని పోలీసులకు తెలిపాడు. ఈ ఉదంతంపై పోలీసులు మాట్లాడుతూ జెనీ తన కుమారునితో ఒక రోజుకు మాత్రమే తండ్రిగా నటించాలని చెప్పి, అతనిని దీర్ఘకాలం పాటు తన సెక్స్ బానిసను చేసుకుందని ఆరోపించారు. తరువాత కుమారుడిని ఎనిమిదేళ్లు దాచివుంచిందన్నారు. ఆమె పోలీసుల కన్నుగప్పి ఇన్నేళ్లూ ఈ వ్యవహారం సాగించిందన్నారు. నిరాకరిస్తున్న పోలీసులు ది ఇండిపెండెంట్ రిపోర్టు ప్రకారం పోలీసులు ఆ తల్లిపై వస్తున్న దుర్వ్యవహార ఆరోపణలను నిజమని నిర్ధారించేందుకు నిరాకరించారు. దర్యాప్తు అధికారులు దీనిపై స్పందిస్తూ ‘కల్పిత రిపోర్టు’తో కూడిన ఆరోపణలపై కోర్టులో కేసు నడవదన్నారు. కాగా న్యూయార్క్ పోస్టును అనుసరించి పోలీసులు ఈ ఇంటర్వ్యూలోని నిజానిజాలపై చర్చించేందుకు నిరాకరించారు. అలాగే వారు ఈ ఇంటర్వ్యూ రిపోర్టు అవాస్తమని కొట్టివేయకపోవడం కూడా విశేషం. ఇది కూడా చదవండి: ట్రంప్ దిగజారితే.. కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు -
సుధా మూర్తి కోపంతో జేఆర్డీ టాటాకు రాసిన లేఖలో అంత వుందా.. అదే మహిళలకు వరమైంది!
Sudha Murthy: ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసమే లేదు. అయితే ఇటీవల ఈమె కపిల్ శర్మ షోలో పాల్గొని తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందరితో షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి వెల్లడించిన సుధా మూర్తి, తాజాగా జేఆర్డీ టాటాకు కోపంతో లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. సుధా మూర్తి 1974లో బెంగళూరులో చదువుకునే టాటా ఇన్స్టిట్యూట్లో ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని చెప్పుకొచ్చింది. అయితే ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్ప్లై చేసుకోకూడదని వెల్లడించింది. ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చిందని వెల్లడించింది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) నోటీసులొని ప్రకటన చూసిన తరువాత జేఆర్డీ టాటాకు లేఖ రాసినట్లు తెలిపింది. అందులో మహిళలు అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు, 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది. ప్రతి సంవత్సరం టాటా పుట్టిన రోజు సందర్భంగా మార్చి 15న తమ ఇన్స్టిట్యూట్కు వచ్చారని, అప్పుడు ఆయనను భయంతోనే దూరం నుంచి చూశానని తెలిపింది. సుధా మూర్తి రాసిన లేఖ పనిచేసినట్లే ఉంది. అందువల్లనే టాటా సంస్థల్లో మహిళలు కూడా ముందుకు వెళుతున్నారు. దీనికి ప్రధాన పాత్ర 'సుధా మార్తి'దే అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!
ఎవరైనా స్కూలుకెల్లే వయసులో అల్లరి చేస్తారు.. గేమ్స్ ఆడుకుంటారు. ఇవి తప్పా వేరే ఆలోచన కూడా సరిగ్గా ఉండదు. అయితే ఇలాంటి ఆలోచనలకు భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన 'సంకర్ష్ చందా' (Sankarsh Chanda). కేవలం 17 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు. సంకర్ష్ చందా హైదరాబాద్ ఏరియా ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసిన తరువాత 2016లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రూ. 2000లతో ప్రారంభించి కేవలం రెండేళ్లలో అదనపు పెట్టుబడులు కూడా పెట్టాడు. ఒక సంవత్సరంలో తాను సుమారు రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టానని, రెండు సంవత్సరాల్లో ఆ షేర్ల విలువ రూ. 13 లక్షలకు చేరిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సంకర్ష్ చందా 2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆ సమయంలో తన చదువుకి స్వస్తి చెప్పి స్టాక్‌లు, బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ఫిన్‌టెక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. చదువు మానేసి తన మొత్తం దృష్టిని కేవలం దీనిపైనే నిమగ్నం చేశారు. సొంతంగా బిజినెస్ స్టార్ చేసినందుకు 2017లోనే తన 8 లక్షల షేర్లను విక్రయించాడు. స్టార్టప్‌ల సంపాదించిన సొమ్మును మళ్ళీ పెట్టుబడిగా పెట్టాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే భారీ లాభాలను గడించాడు. తన మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 100 కోట్లు వరకు ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం. ఇది మొత్తం తన మొత్తం స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పాటు కంపెనీ వ్యాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. 14 సంవత్సరాల వయసులో ఫాదర్ ఆఫ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్ అని పిలువబడే అమెరికన్ ఆర్థిక వేత్త బెంజిమన్ గ్రాహం కథనం చదివిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి కలిగిందని, అప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు చదవడం, డబ్బు పట్ల మానవ ప్రవర్తన గురించి తెలుసుకోవడం ప్రారంభించినట్లు సంకర్ష్ చందా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!) తాను చదవడానికి కూడా పుస్తకాలను ఇతరుల వద్ద నుంచి లేదా లైబ్రరీ నుంచి తీసుకుంటానని చెప్పాడు. ఒకవేల నేను సొంతంగా పుస్తకాలను కొంటే వాటిని ఉంచడానికి కనీసం నాకు రెండు, మూడు గదులు కావాల్సి వస్తుంది. దానికి అదనపు డబ్బు కావాల్సి వస్తుంది. అందుకే బుక్స్ కొననని చెప్పాడు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా అడుగుజాడల్లో నడుస్తూ.. చదువుకు స్వస్తి చెప్పి నిండా పాతికేళ్లు కూడా లేని సంకర్ష్ చందా ఏకంగా వంద కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సలహాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణం ఏంటి ?
-
చెలరేగిన బ్లేడ్ బ్యాచ్.. నడిరోడ్డుపై యువకుడి హత్య
సాక్షి, తూర్పుగోదావరి(ధవళేశ్వరం): ప్రశాంతంగా ఉన్న ధవళేశ్వరం గ్రామంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బ్లేడ్‌బ్యాచ్ దుండగులు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడి దాడిలో ధవళేశ్వరం కంచర్లలైన్ ప్రాంతానికి చెందిన యువకుడు అండిబోయిన రాజేష్ (23) మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కత్తితో దాడి తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్న అండిబోయిన రాజేష్ తండ్రి గతంలో మృతి చెందారు. తల్లి, రాజేష్ కలిసి జీవనం సాగిస్తున్నారు. అతడికి వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం కంచర్లలైన్ సెంటర్లో రాజేష్ ఉన్నాడు. ఆ సమయంలో బ్లేడ్‌బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సభ్యులు బైక్‌పై అక్కడకు వచ్చారు. రాజేష్‌ను వెయ్యి రూపాయలు అడిగారని స్థానికులు చెబుతున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో రాజేష్‌ను ఇందిరా కాలనీకి చెందిన బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడు (మైనర్) కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ముగ్గురు దుండగులూ అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న రాజేష్‌ను స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాడికి పాల్పడిన బాలుడిపై ధవళేశ్వరంలో ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రాజేష్ హత్యతో అతడి తల్లి రోడ్డున పడింది. చదవండి: (రాసింది ఒకటి.. చేసింది మరొకటి.. ‘స్టార్’ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాకం) స్థానికుల ఆగ్రహం బ్లేడ్‌బ్యాచ్ దాడిలో రాజేష్ మృతి చెందడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ధవళేశ్వరం ప్రధాన రహదారిపై మంటలు వెలిగించి, బైఠాయించారు. రాజేష్‌ను హత్య చేసిన బ్లేడ్‌బ్యాచ్ యువకుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రధాన రహదారి మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిచారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బ్లేడ్‌బ్యాచ్ పని పట్టాలి ధవళేశ్వరంలో రోజురోజుకూ పేట్రేగిపోతున్న బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కంచర్లలైన్ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం దాడికి ఒడిగట్టిన బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు తరచుగా కంచర్లలైన్ ప్రాంత వాసులపై దాడులకు పాల్పడుతున్నారని, అయినప్పటికీ పోలీసులు తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంతో వారి ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బ్లేడ్‌బ్యాచ్ పని పట్టే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, అనకాపల్లి: పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయినవారు అనకాపల్లికి చెందిన కడలి లీలా ప్రసాద్, లక్ష్మీవర్మగా గుర్తించారు. వీరిలో లీలా ప్రసాద్ మృతదేహాం లభ్యంకాగా, లక్ష్మీవర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: (400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి) -
సీఎం జగన్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి రోజా
-
మహిళా పీజీలో దుర్మార్గం.. రహస్యంగా నగ్న వీడియోలు
సాక్షి, బెంగళూరు: నగరంలో పీజీలో ఉంటున్న యువతుల నగ్న దృశ్యాలు మొబైల్లో వీడియో తీసి వారిని లైంగికంగా వేధిస్తున్న కామాంధుడిని ఆగ్నేయ విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మనహళ్లిలో నివసిస్తున్న పాండిచ్చేరికి చెందిన నిరంజన్ పట్టుబడిన నిందితుడు. పీజీ పక్కనే ఇంటిలో ఉంటూ... నిందితుడు నిరంజన్ మహిళల పీజీ పక్కనే మరో పీజీలో ఉంటున్నాడు. అక్కడ పీజీలో యువతులు స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో రహస్యంగా తన గది నుంచి వీడియో తీసేవాడు. అనంతరం వారి నెంబర్లకు వీడియో పంపించి కలవాలని ఒత్తిడి తెచ్చేవాడు. వినకపోతే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించేవాడు. దీంతో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కామాంధుడు నిరంజన్‌తో చాట్ చేశారు. మీ డిమాండ్‌కు ఒప్పుకుంటున్నామని యువతుల మొబైల్ ద్వారా మెసేజ్ పంపించారు. నిజంగా యువతులు సెక్స్‌కు ఒప్పుకున్నారని నిరంజన్ హోటల్‌కు వెళ్లడంతో ఈ సమయంలో ఆగ్నేయ విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీజీ నిర్వాహకుడితో నమ్మకంగా ఉంటూ చెత్త పనులు నిరంజన్ నాలుగేళ్లుగా బొమ్మనహళ్లి పీజీలో ఉంటున్నాడు. పీజీ యజమానితో ఆత్మీయంగా ఉండేవాడు. ఇతను మహిళా పీజీ నిర్వహిస్తున్నారు. తల్లి పంపించే డబ్బుతో ఎంజాయ్ చేసే నిరంజన్ పీజీకి సంబంధించిన ఏ పనైనా దగ్గర ఉండి చేసేవాడు. దీంతో మహిళల పీజీలో దర్జాగా సంచరించేవాడు. ఇదే సమయంలో పీజీలో యువతుల కదలికలపై నిఘా పెట్టాడు. యజమాని ఇచ్చిన చనువుతో నిరంజన్ మహిళా పీజీలోకి వెళ్లి యువతులు స్నానం చేసే సమయంలో రహస్యంగా మొబైల్లో నగ్న దృశ్యాలు తీసేవాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (బుద్ధి మారని ఉపాధ్యాయుడు.. వాట్సాప్‌లో హనీమూన్ గురించి విద్యార్థినితో..) -
ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్
సాక్షి, హైదరాబాద్ (జీడిమెట్ల): పెళ్లయిన వ్యక్తి వేరే యువతిని ప్రేమించగా ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతో ఎలుకల మందు సేవించి చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌రెడ్డి వివరాల ప్రకారం.. చింతల్ చంద్రానగర్‌కు చెందిన మలిన్(28), మమత భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మలిన్ బాలానగర్‌లోని ఓ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే పరిశ్రమలో పనిచేసే ఓ యువతిని మలిన్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతి ముందు వ్యక్తపరచగా ఆమె తిరస్కరించింది. దీంతో మలిన్ ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎలుకల మందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో మలిన్ భార్య మమత చికిత్స నిమిత్తం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం మలిన్‌ను గురువారం వైద్యులు డిశ్చార్జి చేశారు. అదేరోజు మలిన్‌కు చాతిలో నొప్పి రావడంతో మమత అతడిని మళ్లీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే మలిన్ మృతిచెందాడు. మలిన్ భార్య మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన) -
నాకు మాత్రమే తెలుసు ఎందుకుపోతున్నానో.. మరో జన్ముంటే మళ్లీ కలుద్దాం
సాక్షి, ఒంగోలు: ‘‘ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడు.. నన్ను పిలుస్తున్నాడు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’’ అంటూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దారవీడు మండలం మద్దలకట్ట పంచాయతీ చాట్లమడ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఏర్వ వెంకట పూర్ణశేఖరరెడ్డి (24) చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని.. ప్రేమ వంటి వ్యవహారం లేదని.. పిరికివాడిని కాదని.. ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడని.. తనను పిలుస్తున్నందునే ఆత్మహత్య చేసుకున్నట్లు’ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆస్తులన్నీ చెల్లి సాయిలక్ష్మి పేరుమీద రాయాలని చెప్పాడు. పూర్ణ శేఖరరెడ్డికి శివుడు అంటే ఎనలేని భక్తి భావం ఉంది. తండ్రి మృతి చెందగా.. తల్లి, చెల్లి ఉన్నారు. చదవండి: (రవికుమార్‌తో వివాహేతర సంబంధం.. తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం) -
కరీంనగర్ లో లోన్ యాప్ కు మరో యువకుడు బలి
-
నువ్వు ఎవడివిరా అంటూ విచక్షణా రహితంగా పొడిచి..
ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో శనివారం అర్ధరాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ యువకుడు స్నేహితులతో కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశాడు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన వనం సుధాకర్‌కు ఇద్దరు కుమారులు కార్తీక్, వనం రాకేశ్(26) ఉన్నారు. రాకేశ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. శనివారం స్కూల్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో ఉన్న మరుపల్లి నిఖిల్ బేకరికి వెళ్లాడు. అక్కడ నిఖిల్, శ్రీనాథ్, వంశీలతో రాకేశ్ మాట్లాడుతుండగా కడిపికొండ నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు నిఖిల్ బేకరి ఎదుట మూత్ర విసర్జన చేశారు. ఈక్రమంలో నిఖిల్, రాకేశ్ మూత్రవిసర్జన చేసిన యువకులను నిలదీశారు. దీంతో నువ్వు ఎవడివిరా అంటూ షాపు నిర్వాహకుడిని ప్రశ్నిస్తూ బైక్‌పై వచ్చిన వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఇంతలో బైక్‌పై వచ్చిన గాడుదల రాజేశ్‌తోపాటు మరో వ్యక్తి ఫోన్ చేసి బంటి, యోగి భాస్కర్‌ను పిలుపించుకున్నారు. ఓ పక్క ఇరువురు మాట్లాడుతుండగానే గాడుదల రాజేశ్ తన వద్ద ఉన్న కత్తి తీసి రాకేశ్‌ను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈక్రమంలో అడ్డుకోబోయిన నిఖిల్, శివపై దాడి చేశాడు. దీంతో నిఖిల్ కుప్పకూలాడు. శివ పారిపోతుండగా వెంటపడి కత్తితో దాడి చేశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత రాజేశ్ కత్తి చూపిస్తూ అడ్డువస్తే అందరికీ ఇదే గతి పడుతోందని హెచ్చరిస్తూ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. శివ మిల్స్‌కాలనీ పోలీసులతో పాటు గాయపడిన నిఖిల్ తల్లిదండ్రులు, రాకేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం) రాకేశ్, నిఖిల్‌ను 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాకేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిఖిల్‌ను ఎమర్జెనీ వార్డుకు తరలించారు. మృతుడి సోదరుడు వనం కార్తీక్ ఆదివారం మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు. కాగా, స్నేహితుల వద్దకు వెళ్లకుంటే బతికేవాడి బిడ్డా అంటూ వనం రాకేశ్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పాతకక్షలే కారణమా..? రాకేశ్ హత్య అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇరువురు యువకుల మధ్య పాతకక్షలు ఉన్నాయా..?, క్షణికావేశంలో కత్తితో దాడి చేశారా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. కాగా, ఇరువురి మధ్య పాతకక్షలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు యువకుడి హత్య కేసుతో సంబంధమున్న ఇరువురిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడు శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌కు చెందిన గాడుదల రాజేశ్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, అతడితోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నట్లు విశ్వనీయంగా తెలిసింది. మిగతా వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు సమాచారం. -
ఎస్సై కల నెరవేరకుండానే..
నిజామాబాద్: ఎస్సై కొలువు సాధించాలని ఆ యువకుడు కన్న కలలను విధి కబలించింది. పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. నిజాంసాగర్ మండలం అచ్చంపేటకు చెందిన మార ఆంజనేయులు(30) ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాసి వస్తుండగా లారీ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ వద్ద చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన మార అంజవ్వ కుమారుడు ఆంజనేయులు ఎస్సై కావాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం దుండిగల్ లక్ష్మారెడ్డి కళాశాలలో ఎస్సై ప్రిలిమినరి పరీక్ష రాశాడు. అనంతరం షాపుర్‌లోని రూమ్‌కు బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొంది. లారీ టైర్లు ఆంజనేయులు మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి అంజవ్వతో పాటు భార్య సారిక, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఇటు పరీక్ష.. అటు సోదరుడి వివాహం ఆంజనేయులు చిన్నాన్న కుమారుడి చింటూ పెళ్లి ఆదివారం నిజామాబాద్‌లో జరిగింది. ఎస్సై పరీక్ష రాసిన తర్వాత వివాహానికి హాజరు కావాలని ఆంజనేయులు అనుకున్నాడు. అంతలోనే రూమ్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు
కారంచేడు (బాపట్ల): వివాహేతర సంబంధం నెరపుతున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కారంచేడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామానికి చెందిన పేర్లి సురేష్ (35) కొంత కాలంగా కారంచేడు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కారంచేడులోని యువతి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు కానీ, తెల్లవారే సరికి సురేష్.. యువతికి చెందిన ఇంటి వరండాలో ఉరేసుకుని మృతిచెందాడు. అతడిని చంపి, ఉరేసినట్లు చిత్రీకరించే యత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇతని వ్యవహారం వల్లే భార్య ధనలక్ష్మి కొద్దిరోజుల కిందట అలిగి పుట్టింటికి వెళ్లింది. మృతుడికి చందు, కిరణ్యలనే ఇద్దరు పిల్లలున్నారు. మృతుని శరీరంపై అనేక గాయాలున్నట్లు గుర్తించామని, తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు ఇమ్మానుయేలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి)