న్యూఢిల్లీ: యువత తమ భావోద్వేగాలను వ్యక్త పరిచేందుకు స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు బీర్‌ను సేవిస్తుంటారు. గతంలో యువత బీర్‌లో కొంత ఆల్క్‌హాల్ శాతం ఉన్న పట్టించుకునే వారు కాదు. కానీ ప్రస్తుత యువత వైఖరిలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి హానీ కలిగించే ఆల్కహాల్ కలిగిన బీర్‌కు యువత దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే బీర్ అంటే విపరీతంగా ఇష్టపడేవారు సైతం ఆల్కహోల్ శాతం లేని బీర్‌ను ఇష్టపడుతున్నారు. కొంత మంది తక్కువ ఆల్కహాల్ శాతమున్న బీర్‌నైనా ఓకే అంటున్నారు.
ఇప్పటికీ దేశంలో 85 శాతం ఆల్కహాల్ బీర్లనే సేవిస్తున్నారు. కాగా దేశంలోని అనేక బీర్ కంపెనీలు (యునైటెడ్ బెవరేజ్, అన్‌హిసర్ ఇన్‌బెవ్) నాన్ ఆల్క్‌హాల్, ఆల్క్‌హాల్ కలిగిన బీర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా దేశంలోని బీర్ వినియోగంపై మింటెల్ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే గత ఆరు నెలల్లో బీర్ వినియోగించిన 25 ఏళ్ల పైబడిన 1,655 మంది దేశీయ ఇంటర్నెట్ వినియోగదారులను మింటెల్ సర్వే చేసింది. తమ సర్వేలో 25నుంచి 34ఏళ్ల యువత పాల్గొన్నారు. కాగా తక్కువ ఆల్కహాల్ శాతం లేదా పూర్తిగా ఆల్కహాల్ శాతం లేని బీర్లవైపే 40శాతం యువత మొగ్గు చూపినట్లు సర్వే పేర్కొంది.
(చదవండి: థియేటర్‌లో బీరు, బ్రీజర్ ఓకేనా: నాగ్ అశ్విన్)
Comments
Please login to add a commentAdd a comment