దేశంలోని మద్యం ప్రియుల రుచులు, అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా-కోలా ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా దిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్ దక్షిణాది మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్‌ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారతదేశంలో దిల్లీ, ఉత్తరాఖండ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు.
ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
కంపెనీ ఇప్పటికే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ మార్కెట్లలోకి ప్రవేశించింది. సెప్టెంబరు 2019లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి 2023 నాటికి అమ్మకాలు 1,25,000 కేసుల నుంచి సుమారు 10 లక్షల కేసులకు పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో 96 శాతం రిటైల్ అమ్మకాలేనని సంస్థ తెలిపింది. గత ఏడాది కంపెనీ 100 శాతం ఫెసిలిటీను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో 1,00,000 హెక్టోలీటర్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2,00,000 హెక్టోలీటర్ల లక్ష్యంతో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి విస్తరణ చర్యలు చేపట్టినట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment