coca cola
-
కోకాకోలా సీక్రెట్స్ అమ్మబోయిన ఉద్యోగి.. పెప్సీ ఏం చేసిందంటే..
ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానియాలకు ఉన్న ప్రసిద్ధి గురించి తెలిసిందే. తమ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను అత్యంత పకడ్బందీగా ఉంచుతుంది కోకాకోలా. అయితే ఈ సీక్రెట్స్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంది ఓ ఉద్యోగి. కానీ పెప్సీ కంపెనీ ఇచ్చిన షాక్‌తో కటకటాలపాలైంది.కోకా-కోలా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న జోయా విలియమ్స్ కొత్త ఉత్పత్తికి సంబంధించిన వ్యాపార రహస్యాలను పెప్సీకి విక్రయించడానికి ప్రయత్నించి అరెస్టు అయింది. జోయా విలియమ్స్, ఆమె సహచరులు ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ డుహానీతో కలిసి దొంగిలించిన కోకాకోలా సమాచారాన్ని 1.5 మిలియన్ డాలర్ల (రూ. 12.6 కోట్లు) భారీ ధరకు విక్రయించడానికి కుట్ర పన్నారు. అయితే పెప్సీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కోకాకోలాకు, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.ఇదీ చదవండి: కంపెనీ డేటా లీక్.. రూ.57 లక్షలు డిమాండ్కోకా-కోలా గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసిన విలియమ్స్, ఒక రహస్య కొత్త ఉత్పత్తిని కలిగి ఉన్న ఫియల్‌ను దొంగిలించి విక్రయించడానికి ప్రయత్నించి పట్టుబడింది. ఎఫ్‌బీఐ ఒక రహస్య ఆపరేషన్‌లో పెప్సీ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించి నిందితులను పట్టుకుంది. వీరి మధ్య పలు దఫాలుగా లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో డిమ్సన్ ఒక కుకీ బాక్స్‌లో దాచిన 30,000 డాలర్లు తీసుకుని కోకాకోలా సీక్రెట్ పత్రాలు, ఫియల్‌ను అందజేసారు. విలియమ్స్, ఆమె సహచరులను వారి అక్రమ ఒప్పందం పూర్తయ్యేలోపు అరెస్టు చేయడంతో ఈ అండర్‌కవర్ ఆపరేషన్ ముగిసింది. -
కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేత
ప్రముఖ కూల్‌డ్రింక్ కంపెనీ కోక-కోలా..తన అనుబంధ సంస్థ బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ (బిగ్)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ), అంతర్జాతీయ బాట్లింగ్ కార్యకలాపాలను బిగ్ నిర్వహిస్తోంది. జూన్ 30 నుంచి బిగ్ కార్యకాలాపాలను నిలిపేస్తున్నట్లు కోక-కోలా తెలిపింది.ఇప్పటివరకు బిగ్ చేపడుతున్న వ్యవహారాలు కోక కోలా అంతర్గత బోర్డు నియంత్రణలోకి వస్తాయని సంస్థ చెప్పింది. భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలు ఈ బోర్డు నిర్వహిస్తుందని తెలిపింది. బాట్లింగ్‌లో వాటాలను తగ్గించుకుని, బ్రాండ్, ఉత్పత్తులపై కోక కోలా దృష్టిపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 1997లో ప్రారంభమైన హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్‌కు ఇండియాలో 16 ప్లాంట్లు ఉన్నాయి. 3500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 25 లక్షల మంది రిటైలర్లకు కూల్‌డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్లాంట్లలో వాటాలను స్వతంత్ర సంస్థలకు విక్రయించడం ద్వారా రూ.2,420 కోట్లను సంస్థ సమీకరించింది. గతేడాది నవంబరులో మహారాష్ట్ర ప్లాంట్ కోసం రూ.1387 కోట్లు, గుజరాత్లో రూ.3000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ ఏడాది మేలో వెల్లడించింది.రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు సాఫ్ట్‌డ్రింక్స్ రంగంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీ కోక-కోలా తన వ్యాపార విస్తరణపై దృష్టిసారించడం ఇన్వెస్టర్లకు మేలు చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోటీని తట్టుకుని తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!
సమ్మర్ వచ్చేసింది...ఎండలు మండిపోతున్నాయని కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కల్తీ కోకా కోలా డ్రింక్ బాటిల్స్ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!) ఈ వీడియో ప్రకారం కోకా కోలా లేబుల్స్ వేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఒక వ్యక్తి డ్రింక్‌ను నింపుతున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందిరా ఇది.. ఎపుడు చూడలే అంటూ ఒకింత ఆందోళనగా కమెంట్స్ చేస్తున్నారు. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ఈ కోకాకోలా ఫ్యాక్టరీలో తయారైనా ఒకటే, బాత్ రూంలో తయారైనా ఒకటి పెద్దగా తేడా ఏముంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోకాకోలాను ట్యాగ్‌ను గమనార్హం. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఏ ప్రదేశానికి చెందినది అనే వివరాలు అందుబాటులో లేవు. మరి ఈ వీడియోపై కోకా కోలా కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) A forward doing the rounds. Things get ...... With @CocaCola pic.twitter.com/vAhxcDhb1F — R. Balakrishnan (@BalakrishnanR) March 29, 2024 -
ఈ ట్రిక్ ఎపుడైనా ట్రైచేశారా? మ్యాజిక్..అస్సలు వదలరు!
వంటిల్లు, వంట ఇంటి సామాను జిడ్డు వదిలించడం అంత తేలిక కాదు. దీనికి సంబంధించి అనేక చిట్కాలను మనం చూసే ఉంటాం. వాటిని చాలామంది పాటించి ఉంటారు కూడా. తాజాగా ఇలాంటి వంట ఇంటి చిట్కా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టూత్‌పేస్ట్+కోకాకోలా+క్లీనర్+బేకింగ్-సోడా+వాటర్‌తో తయారు చేసిన లిక్విడ్ మ్యాజిక్ఇంటర్నెట్ హల్చల్ చేస్తోంది. లెర్న్ సంథింక్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే మూడు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. చిన్ని కోకోకాలా బాటిల్లో కొద్దిగా టూత్ ప్లేస్ వేసి బాగా కలిపాడు. ఆ రువాత ఆమిశ్రమాన్ని ఒకగిన్నెలోపోసి, దానికి బేకింగ్ సోడా, లిక్విడ్ క్లీనర్,కొద్దిగా నీళ్లు కలిపాడు. ఆ తరువాత దీన్నీ ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుని జిడ్డు పట్టిన పెనాన్ని శుభ్రం చేయడం ఇందులో చూడొచ్చు. This Magic products made by toothpaste+cocacola+cleaner+baking-soda+water pic.twitter.com/KOOeJwuvWn — Learn Something (@cooltechtipz) March 12, 2024 -
AP: ‘ప్రాజెక్ట్ జలధార’.. అద్భుత ఫలితాలు
సాక్షి, అనంతపురం : ఇటీవల నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ను జాతీయ అవార్డుతో సత్కరించింది. అనంతపురంలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ జలధార ద్వారా కరువు ప్రాంతాలలో అభివృద్ధికి దోహదపడినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో ’ప్రాజెక్ట్ జలధార’ ద్వారా ...ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోసాధించిన ఫలితాలను గురించి ఆనందన –కోకా–కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాలను పెంపొందించటంలో ఎన్నదగిన ఫలితాలను సాధించిందన్నారు. వివరాల్లోకి వెళితే... పెరిగిన భూగర్భజలసిరి... గ్రామీణాభివృద్ధి ఎన్జిఓ ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్ సహకారంతో ఆనందన – కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ’వాటర్ స్టీవార్డ్‌షిప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగమైన ప్రాజెక్ట్ ’జలధార’ ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తద్వారా అనంతపురంలో 5 చెక్ డ్యామ్స్‌ను కోడూరు– సుబ్బారావుపేట, ముద్దపల్లి– తిమ్మడిపల్లి , మధురేపల్లి – కందురుపర్తి నల్లపరెడ్డి పల్లి గ్రామాలలో 416 మిలియన్ లీటర్ల నీటి సేకరణ సామర్థ్యంతో నిర్మించారు.దీంతో భూగర్భజలాల పెంపుదల కారణంగా సాగు విస్తీర్ణంలో 35% పెరుగుదల నమోదయింది, తగ్గుతున్న నీటి కొరత... ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్య కూడా పరిష్కారమవుతోంది. భూగర్భ జలాలు పెరగటంతో పంట దిగుబడిలో కూడా గణనీయమైన రీతిలో 75% పెరుగుదల నమోదయింది. దానితో పాటే భూసారమూ పెరిగింది. ఒక సంవత్సరంలో రైతులు బహుళ పంటలు పండించడానికి ఇది వీలు కల్పించింది. అదనంగా, 82% మంది రైతులు పంటల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను గమనించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా 7 నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిర్వహణలో స్థానికుల ప్రమేయాన్ని కూడా పొందగలిగింది. ఇందులో 75 మంది పురుషులు, 17 మంది మహిళలు సహా 92 మంది సభ్యులు ఉన్నారు. నీటి–ఎద్దడి ఉన్న భూములలో భూగర్భ జలాలను పెంచటం, వాటర్షెడ్లను మెరుగుపరచడం ద్వారా కోకోకోలా ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆ కృషి ఫలితంగానే కంపెనీ వినియోగిస్తున్న నీటిలో 200% పైగా తిరిగి అందించగలిగింది. మంచి ఫలితాలు సాధించాం... అనంతపురంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో. భూమి నాణ్యత మెరుగుపరచి పంట దిగుబడిని, భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచగలిగాం. ఫలితంగా, నేడు రైతులు విభిన్న పంటలను పండిస్తున్నారు మా నీటి నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి తగిన శిక్షణ పొందాయి. ఇదీచదవండి.. వేడెక్కిన ఏపీ రాజకీయం -
మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్‌లో కొత్త బీర్ బ్రాండ్ ఎంట్రీ..
దేశంలోని మద్యం ప్రియుల రుచులు, అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా-కోలా ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్‌ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారతదేశంలో దిల్లీ, ఉత్తరాఖండ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! కంపెనీ ఇప్పటికే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ మార్కెట్లలోకి ప్రవేశించింది. సెప్టెంబరు 2019లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి 2023 నాటికి అమ్మకాలు 1,25,000 కేసుల నుంచి సుమారు 10 లక్షల కేసులకు పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో 96 శాతం రిటైల్ అమ్మకాలేనని సంస్థ తెలిపింది. గత ఏడాది కంపెనీ 100 శాతం ఫెసిలిటీను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో 1,00,000 హెక్టోలీటర్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2,00,000 హెక్టోలీటర్ల లక్ష్యంతో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి విస్తరణ చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?
కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. థమ్స్ అప్, మ్కా, ఫాంటా, స్ర్పైట్, మాజా, కోకా కోలా జీరో షుగర్, డైట్ కోక్, ష్వెప్స్, ఛార్జ్డ్, కిన్లే, మినిట్ మెయిడ్, స్మార్ట్ వాటర్, రిమ్ జిమ్, హానెస్ట్ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది. కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే.. 2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
టీ ఉత్పత్తికి సిద్ధమైన పాపులర్ కూల్ డ్రింక్ బ్రాండ్
'కోకా-కోలా' (Coca-Cola) అనగానే అందరికి గుర్తొచ్చేది కూల్ డ్రింక్స్. ఈ సంస్థ ఇప్పుడు కొత్త విభాగంలో ప్రవేశించడానికి సిద్దమైనట్లు తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ విభాగంలో పాపులర్ బ్రాండ్‌గా ఎదిగిన కోకా కోలా ఇండియా టీ పానీయాల విభాగంలోకి ప్రవేశించడానికి సన్నద్ధమైంది. హానెస్ట్ టీ పేరుతో కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకురానున్నట్లు కోకాకోలా ఇండియా ఇటీవల వెల్లడించింది. ఈ ఉత్పత్తిని కోకా కోలా అనుబంధ సంస్థ 'హానెస్ట్' తీసుకురానున్నట్లు సమాచారం. కోకా-కోలా టీ ఉత్పత్తి కోసం కంపెనీ లక్ష్మీ టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మకైబారి టీ ఎస్టేట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సంస్థ త్వరలోనే 'ఆర్గానిక్ ఐస్డ్ గ్రీన్ టీ'ని తీసుకురానుంది. కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఏడవ ఎడిషన్‌లో రెండు కంపెనీల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! తమ కస్టమర్లకు టీ పానీయాలను అందించడంలో భాగంగానే కోకా-కోలా ఇండియా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ టీని ఐస్డ్ గ్రీన్ టీ లెమన్-తులసి, మ్యాంగో ఫ్లేవర్స్‌లో తీసుకురానున్నట్లు సమాచారం. దీని కోసం పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో ప్రత్యేకంగా లక్ష్మీ గ్రూప్ మకైబారి ఎస్టేట్ నుంచి సేకరించనున్నారు. త్వరలోనే కంపెనీ ఈ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. -
భారీ పెట్టుబడులకు కోకాకోల సర్వం సిద్ధం
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోల సిద్ధమైంది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో కోకాకోల ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమ సంస్థకు భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ అని తెలిపారు. అయితే, దేశీయంగా తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కోకాకోల సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి తెలిపారు. ఇందులో భాగంగా అమీన్పూర్ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలోనే 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టమన్నారు. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో 1000 కోట్ల రూపాయలతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏప్రిల్ నెల 22న ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని అన్నారు. ఈ మేరకు అక్కడ సంస్థ నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారం, తమ ప్లాంట్ నిర్మాణంలో వేగం, ఈ ప్రాంతంలో వ్యాపార వృద్దిని దృష్టిలో ఉంచుకొని కోకా కోలా సంస్థ అదనంగా మరో 647 కోట్ల రూపాయలను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్ లో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24 నాటికి పూర్తి అవుతుందని వెల్లడించింది. దీంతోపాటు రాష్ట్రంలో తాజాగా రెండవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్/ వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలియజేసింది. -
షాకింగ్.. ఇదే జరిగితే కోకాకోల కథ కంచికే!
ప్రపంచ వ్యాప్తంగా కోకాకోలా గురించి తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రమే అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కోక్ అంటే చాలు ఎగబడిపోతారు. గతంలో ఈ శీతల పానీయాలు చాలా ప్రమాదమంటూ కొన్ని వార్తలు తెరకెక్కాయి, కానీ అవన్నీ బలంగా నిలువలేకపోయాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కోకాకోలా (CocaCola)లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దారించనుంది. ఆస్పర్టేమ్ అనే స్వీటెనర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్వీటెనర్ వల్ల భవిష్యత్తులో క్యానర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ పరిశోధనల విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఈ స్వీటెనర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిర్దారించింది. ఈ కారణంగా కోకాకోలా క్యాన్సర్ కారకం అవుతుందని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. (ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ అధికారిక ప్రకటన జులై నెలలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని చాలా దేశాలు దీని వినియోగాన్ని నిషేధిస్తాయి, మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే ఐఏఆర్సీ ఈ ఆస్పర్టేమ్ ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది, ఎంత మోతాదు దాటితే ప్రమాదం అనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు. 1984లో వెలువడిన కొన్ని నివేదికలు ఆస్పర్టేమ్ తక్కువ మోతాదులో ప్రతి రోజూ తీసుకున్న ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించాయి. ఇన్ని రోజులూ వీటినే అనేక దేశాలు ఉదాహరణలుగా చెబుతూ ముందుకు సాగాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది క్యాసర్ కారకం అని ప్రకటిస్తే.. ఆ తరువాత పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి. -
100 శాతం ఆర్‌పీఈటీ బాటిళ్లు.. దేశంలో ఫస్ట్ టైమ్!
సాక్షి, న్యూఢిల్లీ: కోకా–కోలా సంస్థ 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటిరీయల్ (ఆర్‌పీఈటీ) తో రూపొందించిన కిన్లే సీసాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. 100శాతం ఆర్పీఈటీతో రూపొందించిన సీసాను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి అని సంస్థ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలు లేని ప్రపంచం సృష్టించే క్రమంలో 2030 నాటికి ప్యాకేజింగ్‌లో కనీసం 50శాతం రీసైకిల్డ్ బాటిళ్లను ఉపయోగించే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు టెక్నికల్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకర్మాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కోకా–కోలా ఫ్రాంచైజ్ భాగస్వామి సర్వారాయ సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీపీపీ రామ్మోహన్ మాట్లాడుతూ... సంస్థ నిర్ణయం సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. -
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
రియల్మీ కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. అదిరే కలర్స్‌లో
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ కోకా-కోలాకంపెనీ భాగస్వామ్యంతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. రియల్మీ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కోకా -కోలా ఎడిషన్‌ను ఫిబ్రవరి 10న చేయబోతున్నట్టు ప్రకటించింది. సరికొత్త కలర్స్‌లో, యూజర్ ఇంటర్ఫేస్లో (UI) కీలక మార్పులతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. స్టోరేజ్ మార్పు తప్ప, మిగిలిన ఫీచర్లు గత ఏడాది నవంబర్‌లో లాంచ్ చేసిన మోడల్ మాదిరిగానే ఉండబోతున్నాయి. గతేడాది మార్వెల్ భాగస్వామ్యంతో రియల్మీ జీటీ నియో3 థోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా కోకా కోలాతో జతకట్టింది. పరిమిత-ఎడిషన్ ఫోన్‌ను కోకాకోలా లోగోతో బ్లాక్ అండ్ రెడ్ డ్యుయల్ టోన్ కలర్స్‌లో ఆకర్షణీయంగా లాంచ్ చేస్తోంది. రియల్మీ 10 ప్రో కోకా-కోలా ఎడిషన్ ఫీచర్లు (అంచనా) 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13, స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 108 ఎంపీ ప్రోలైట్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ధర భారత్‌లో రూ.20 వేల లోపే ఉండొచ్చని అంచనా. కాగా రియల్మీ 10 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.19,999. అలాగే రియల్మీ 10 ప్రో ప్లస్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.24,999గాను, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ ధర రూ.27,999గా ఉన్నాయి. -
Elon Musk - Twitter : ‘కోకకోలాలో కొకైన్’.. అసలేముందక్కడ!
ట్విటర్లో ఫేక్/స్పాన్ ఖాతాలు ఎన్ని ఉన్నాయనే అంశంపై ఈలాన్ మస్క్ వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ ప్రస్తుత యాజమాన్యం చెబుతున్న సంఖ్యలు వాస్తవ పరిస్థితులకు మధ్యన పొంతన ఉండటం లేదంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. తన వాదనను సమర్థించుకునేలా అనేక ఉదాహారణలు చూపెడుతున్నారు. ట్విటర్ బోర్డుకు చుక్కులు చూపెడుతున్నాడు.. ట్విటర్‌ను టేకోవర్ చేసే విషయంలో ఈలాన్‌మస్క్ పునారాలోచనలో పడ్డట్టు ప్రకటించారు. దీనిపై ఇటీవల జరిగిన ఓ పోడ్కాస్ట్లో ఈలాన్ మస్క్ స్పందించారు. ట్విటర్లో ఫేక్ ఖాతాలు 20 శాతానికి పైగానే ఉన్నాయని, ఇక మనుషుల ఖాతాల్లోనూ యాక్టివ్ యూజర్ల సంఖ్య మరింత తక్కువ అంటూ వివరణ ఇచ్చారు. ఇందులో కోసం ఇటీవల తాను చేసిన ఓ ట్వీట్‌కి వచ్చిన స్పందనను ఉదహారించారు. మస్క్ రికార్డ్ ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించిన తర్వాత నెక్ట్స్ ఏం కొనబోతున్నారంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు.. దానికి బదులిస్తూ నెక్ట్స్ కోకకోలాను కొనుగోలు చేసి అందులో కొకైన్ పెడతానంటూ ఈలాన్ మస్క్ చమత్కరించాడు. అయితే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మొత్తం మీద ఈ ట్వీట్‌కి 4.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలో జీవించి ఉన్న మనుషుల్లో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్‌గా ఇది రికార్డు సృష్టించింది. Next I’m buying Coca-Cola to put the cocaine back in — Elon Musk (@elonmusk) April 28, 2022 ఇంత తక్కువగా అంటే.. రికార్డు సృష్టించిన కోకకోలా - కొకైన్ ట్వీట్‌పై ఈలాన్ మస్క్ స్పందిస్తూ.. ట్వీటర్కు 217 మిలియన్ల మానిటైజ్డ్ యాక్టివ్ యూజర్ల ఉన్నట్టుగా ట్విటర్ చెబుతోంది. ఇదే సమయంలో రికార్డు సృష్టించిన కోక్ - కొకైన్ ట్వీట్‌కి వచ్చిన లైకులును పరిశీలిస్తే ఇది కేవలం 2 లేదా 2.5 శాతానికి మించదు అన్నారు. అంతమంది యాక్టివ్ యూజర్లు ఉన్నప్పుడు రికార్డు ట్వీట్‌కే ఇంత తక్కువ లైక్స్ రావడం అనేక సందేహాలకు తావిస్తోందంటున్నాడు ఈలాన్ మస్క్. నా ట్వీట్ అనే కాదు బాగా వైరల్ అయ్యే ట్వీట్స్‌కి కూడా నాలుగు మిలియన్ లైకులు వస్తున్నాయి. అంటే యాక్టివ్ యూజర్ల సంఖ్య 2 శాతం దగ్గరే ఉంటోంది. దీనికి కారణం ఫేక్/స్పామ్ అకౌంట్లు అంటూ తర్కిస్తున్నాడు ఈలాన్ మస్క్. ప్రజలకు నిజాలు తెలియాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. నీకో దండం బాబు ఇక ఈలాన్‌మస్క్ చేస్తున్న ఆరోపణలు సమర్థించేవారు ఉన్నారు. ట్వీటర్ బోర్డు ఫేక్ ఖాతాలు కేవలం 5 శాతం ఉన్నట్టుగా చెబుతోంది. అయితే ఈ ఐదు శాతం అన్నది కనిష్టం. గరిష్టంగా ఇంది 20 శాతానికి పైగానే ఉంటుందంటున్నారు. ఓ వైపు మస్క్ ఆరోపణలు..మరోవైపు అతనికి పెరుగుతున్న మద్దతులో ట్విటర్‌కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 44 బిలియన్ డాలర్ల డీల్ సంగతి దేవుడెరుగు! ఈలాన్తో వచ్చిన తంటా తొలగిపోతే చాలనుకునే పరిస్థితి క్రమంగా బలపడుతోంది? అత్యధిక లైకులు ఈ ట్వీట్‌కే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్ బ్లాక్ పాంథర్ చిత్ర నటుడు చాడ్విక్ బోస్మన్ పేరిట ఉంది. ఆయన మరణించినప్పుడు కుటుంబ సభ్యలు ఆ విషయాన్ని ఆయన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ 7.1 మిలియన్ లైకులు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది. pic.twitter.com/aZ2JzDf5ai — Chadwick Boseman (@chadwickboseman) August 29, 2020 అప్పట్లో కొకైన్ ఉండేది చాలామందికి ఫేవరేట్ డ్రింకులలో ఒకటైన కోకకోలాలో ప్రారంభంలో కొకైన్ కలిపేవారు. కోలా ఆకుల నుంచి సంగ్రహించిన కొకైన్‌ను, కోలా నట్స్ నుంచి సేకరించిన కోలాను కలిపి ఈ డ్రింకును 1890లలో తయారు చేశారు అప్పట్లో అమెరికాలో కొకైన్‌ను ఔషధంగా వినియోగించేవారు. ప్రతీ కోక్ బాటిల్లో 9 మిల్లీగ్రాముల కొకైన్ ఉండేది. అయితే కాలక్రమేనా కొకైన్ వాడకంపై విమర్శలు రావడంతో.. అమెరికా కోలాలో కొకైన్ కలపడాన్ని నిషేధించింది. ఇక ఈలాన్‌మస్క్ - ట్విటర్ డీల్ విషయంలో ఇప్పుడు కోక్బ్రాండ్కి ఉచితంగా పబ్లిసిటీ దొరుకుతోంది. చదవండి: ట్విటర్ డీల్.. ఈలాన్‌మస్క్ షరతులు వర్తిస్తాయి .. -
చివరికి కోకకోలాది అదే నిర్ణయం?
పెట్రోల్, వంటనూనె, పప్పులు, సబ్బులు ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు బేరేజెస్ వంతు వచ్చింది. సాఫ్ట్‌డ్రింకుల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది కోకకోలా. కరోనా ప్రభావం ఆ తర్వాత వచ్చిన ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన ద్రవ్యోల్బణం మరికొద్ది కాలం కొనసాగే అవకాశం ఉండటంతో ధరల పెంపు తప్పదనే నిర్ణయానికి వచ్చినట్టు కోకకోలా ఇండియా , సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ సంకేత్రాయ్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ధరల పెంపుపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కోకకోల పరిధిలో అనేక సాఫ్ట్ డ్రింకులు వివిధ పరిణామాల్లో లభిస్తున్నాయి. దీంతో ధరల పెంపు ప్రభావం అమ్మకాలపై పడకుండా ధరల పెంపు ఎలా చేపట్టాలి, ఏ విభాగంలో ధరలు పెంచాలనే అంశంపై కోకకోలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ధరల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చదవండి: మండిపోతున్న ఎండలు.. దుమ్ము రేపుతున్న ఏసీల అమ్మకాలు -
Elon Musk: నెక్స్ట్ ఏం కొనబోతున్నాడో చెప్పిన ఎలన్ మస్క్
బహు తిక్క మేధావి ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశాడు. సోషల్ మీడియా శృంఖలాలు తెంచడంలో భాగంగానే తాను ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. నాటకీయ పరిణామల నడుమ సుమారు 44 బిలియన్ డాలర్ల డీల్‌తో ఎట్టకేలకు ట్విటర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ తరుణంలో.. ఈ ఉదయం(ఏప్రిల్ 28) మరో ట్వీట్ చేశాడు. తాను తర్వాత కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తయారీతో మల్టీనేషనల్ కంపెనీగా పేరున్న ఈ అమెరికన్ కంపెనీని, మస్క్ చేజిక్కిచుకోనున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానంటూ సంచలన ప్రకటనతో ట్వీట్ చేశాడు. కోకా కోలా.. ట్రేడ్‌మార్క్ శీతల పానీయంలో రెండు ప్రాథమిక పదార్థాలు ఉండేవి. కోకా ఆకులు, కోలా గింజలు. కోలా గింజలు కెఫిన్ యొక్క మూలం కాగా, కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ ‘కొకైన్’ వస్తుంది. కోకా-కోలా ఒకానొక సమయంలో ఎక్కువగా కోకా ఆకుల మీదే ఆధారపడింది. కొకైన్‌ను ఆ కాలంలో ఔషధంగా పరిగణించినప్పటికీ.. ఒకానొక టైం వచ్చే సరికి నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో.. అమెరికా దానిని నిషేధించగా.. కోకా కోలా నుంచి ‘సీక్రెట్ రెసిపీ’గా పేరున్న కోకా ఆకులు దూరమై.. బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చి చేరాయి. Next I’m buying Coca-Cola to put the cocaine back in — Elon Musk (@elonmusk) April 28, 2022 ఈ తరుణంలో మస్క్.. కోకా కోలాకు తిరిగి ‘కొకైన్’ వైభవం తీసుకొస్తానంటూ ట్వీట్ చేయడం విశేషం. ఇంకోవైపు మెక్‌డొనాల్డ్స్‌ను కొనుగోలు చేస్తానంటూ గతంలో ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్‌ను.. తిరిగి తానే షేర్ చేసిన మస్క్.. అద్భుతాలు చేయలేనంటూ మరో తిక్క ట్వీట్‌తో బదులివ్వడం విశేషం. టెస్లా వాటా, షేర్లు అమ్మడంతో మొదలైన మస్క్ యవ్వారం.. ఆపై ట్విటర్ కొనుగోలుతో తారాస్థాయికి చేరుకుంది. జోక్‌గా భావించిన ప్రతీ విషయాన్ని నిజం చేసుకుంటూ పోతున్నాడు ఈ ప్రపంచ కుబేరుడు. చదవండి👉: క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం? చదవండి👉🏾: ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. వీడియో వైరల్ -
కోకాకోలా రాథోడ్.. ఎస్సైకి ఊహించని షాక్
కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి.. సినిమాల్లో చూపించినట్లు కాదు. చాలా సున్నితంగా.. హుందాగా ఉంటాయి. వాదనలు వింటూనే న్యాయమూర్తులు ప్రతీ విషయాన్ని గమనిస్తుంటారు కూడా. అయితే అది తెలియని ఓ ఎస్సై.. అడ్డంగా బుక్కై మూల్యం చెల్లించుకున్నాడు. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం ఇంకా వర్చువల్ వాదనలే నడుస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ హైకోర్టులో ఓ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగా.. ఎస్సై ఏఎం రాథోడ్ కూల్‌గా కోకా కోలా టిన్ను కూల్‌గా సిప్ చేస్తూ ఉన్నారు. అది గమనించిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్.. వెంటనే అదనపు గవర్నమెంట్ ప్లీడర్ డీఎం దేవ్నానితో ‘వీడియో కాన్ఫరెన్స్‌లో మిస్టర్ రాథోడ్ కూల్ డ్రింక్ తాగుతున్నారా ఏంటి?’ అని ప్రశ్నించారు. దీనికి ఏజీపీ వెంటనే క్షమాపణలు తెలియజేశాడు. అయినా సీజే శాంతించలేదు. ‘ఇదేం మీ ఆఫీస్ కాదంటూ..’ ఎస్సై రాథోడ్‌ను సున్నితంగా మందలించింది కోర్టు. అంతేకాదు కోకాకోలా తాగినందుకు శిక్షగా.. వంద కోకాకోలా టిన్లను బార్ అసోషియేషన్ సభ్యులకు పంచాలని సీజే అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఎస్సైని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ ఉల్లంఘనల కింద శిక్ష తప్పదని హెచ్చరించింది. ‘‘మిస్టర్ కోకా కోలా రాథోడ్.. మీరొక్కరే తాగడానికి వీల్లేదు. సాయంత్రం కల్లా బార్ మెంబర్స్ అందరికీ కోకా కోలాను అందించండి’’ అంటూ ఆదేశించింది. దీంతో సదరు ఎస్సై మంగళవారం సాయంత్రమే ఆ ఆదేశాల్ని పాటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఇద్దరు మహిళల్ని రాథోడ్, తోటి సిబ్బంది కలిసి చితకబాదారనే పిటిషన్ మీద వాదనల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో వర్చువల్ వాదనల సందర్భంగా ఓ అడ్వొకేట్ సమోసా తింటూ కనిపించగా.. ‘ఇలాంటివి చూసి ఇతరులకు కూడా తినాలని అనిపించదా? నోరురదా? ఇతరులకు ఇవ్వకుండా మీరొక్కరే తింటారా?’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ..అందరికీ సమోసాలు పంచాలంటూ సదరు న్యాయవాదిని ఆదేశించింది. తాజా ఘటన నేపథ్యంలో.. సమోసా ఘటనను మరోసారి గుర్తు చేశారు సీజే. -
David Warner: వీటిని పక్కకు పెట్టొచ్చా.. రొనాల్డోకు మంచిదైతే నాకూ మంచిదే..
David Warner tries to do a Cristiano Ronaldo at presser Goes Viral: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. అక్టోబరు 28 నాటి మ్యాచ్‌లో 42 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందు ఐపీఎల్-2021 సీజన్లో తనకు ఎదురైన చేదు అనుభవాలు, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే, వార్నర్ మాత్రం ఫామ్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించని, బౌలర్లపై ఒత్తిడి పెంచి పరుగులు రాబట్టడంపైనే దృష్టి పెడతానని వ్యాఖ్యానించాడు. అది అస్సలు సాధ్యం కాదు ఈ మేరకు అర్ధ సెంచరీ సాధించిన వార్నర్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విమర్శకుల నోళ్లు మూయించగలమా? అదైతే అస్సలు సాధ్యం కాదు. ఆటలో ఇవన్నీ సహజం. బాగా ఆడినపుడు ప్రశంసలు... అలా జరగని పక్షంలో విమర్శలు ఉంటాయి. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా... ముఖంపై చిరునవ్వు చెదరనీయకకుండా పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాలి’ అని చెప్పుకొచ్చాడు. క్రిస్టియానోకు మంచిదైతే.. నాకూ మంచిదే కదా ఇక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా వార్నర్ ప్రవర్తించిన తీరు ఆసక్తికరంగా మారింది. యూరో ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను పక్కకుపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. వార్నర్ సైతం గురువారం ఇదే తరహాలో వ్యవహరించాడు. ‘‘వీటిని పక్కకు పెట్టవచ్చా’’ అంటూ తన ముందున్న కోకా కోలా బాటిళ్లను తీసి కిందపెట్టాడు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి.. బాటిళ్లను టేబుల్ మీద పెట్టాల్సిందిగా సూచించాడు. ఇందుకు నవ్వుతూ సమాధానమిచ్చిన వార్నర్... ‘‘ఓహో అక్కడే పెట్టాలా.. సరే’’ అన్నాడు. ఆ తర్వాత... ‘‘ఒకవేళ క్రిస్టియానోకు ఇది మంచిదైతే.. నాకు కూడా మంచిదే’’అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆసీస్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా రోనాల్డో కోక్ వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి భారీ స్థాయిలో నష్టం జరిగిన సంగతి తెలిసిందే. వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. చదవండి: టీమిండియా క్రికెటర్‌కు డబుల్ ధమాకా.. కవల పిల్లలు జననం pic.twitter.com/JXSFYWLKkr — Thakur (@hassam_sajjad) October 28, 2021 View this post on Instagram A post shared by ICC (@icc) -
కోకాకోలా సరస్సును ఎప్పుడైనా చూశారా..?
Coca Cola Lake: ఎప్పుడైనా ‘కోకాకోలా’లో ఈత కొడుతున్నట్లు కలకన్నారా? అయితే, ఇప్పుడ ఆ కలను నిజం చేసుకోండి. ఆశ్చర్యపోతున్నారా! నిజం, బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో నార్టే దక్షిణ తీరంలో ‘కోకాకోలా సరస్సు’ ఉంది. అసలు పేరు ‘లగోవా ద అరారాక్వారా’. ఇందులోని నీరు, అచ్చం కోకాకోలా రంగులా ఉంటే, రుచి మాత్రం సాధారణ నీటి కంటే కాస్త ఉప్పగా ఉంటుంది. ఐరన్, అయొడిన్ సహా కొన్ని రసాయనాల కారణంగా దీనికి ఆ రంగు వచ్చిందని, పైగా ఇవి శరీరానికి ఏ హాని చేయవని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు నిరూపించారు. దీంతో చాలామంది ఈ సరస్సులో ఈత కొట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పైగా వేసవిలో ఇక్కడ స్పెషల్ వాటర్ ప్రోగ్సామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సరస్సు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. మీరు కూడా ఈ కోకాకోలా సరస్సులో ఈత కొట్టాలనుకుంటే, బ్రెజిల్ వెళ్లాల్సిందే మరి. చదవండి: ఆ గ్రామం.. కోట్ల ఏళ్లుగా సజీవం -
రొనాల్డో ఎఫెక్ట్: ఇకపై బాటిల్స్ ముట్టుకుంటే..
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్ఏ. ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో -
29వేల కోట్లు ఢమాల్! కోకా కోలా యాడ్ గుర్తుందా?
మంచి నీళ్లే తాగాలని.. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ వద్దంటూ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో చేసిన కామెంట్ కీలక పరిణామానికి దారితీసింది. రోనాల్డో వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి ఊహించని రీతిలో డ్యామేజ్ జరిగింది. యూరో ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. వాటర్ బాటిల్ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) అని కామెంట్ చేశాడు. తర్వాత ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే 36 ఏళ్ల రొనాల్డో కామెంట్ ఎఫెక్ట్ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది. కోకా కోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. కోకాకోలా రియాక్షన్ ఇక క్రిస్టియానో రొనాల్డో వ్యవహరించిన తీరుపై యూరో ఛాంపియన్షిప్ స్పానర్‌షిప్‌గా వ్యవహరిస్తున్న కోకాకోలా స్పందించింది. ‘ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు’ అని బదులిచ్చింది. ఎవరి టేస్ట్లు వాళ్లకు ఉంటాయి. అవసరాలను బట్టి ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు. అందులో తప్పేముంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నీళ్లతో పాటు కోకా కోలా డ్రింక్‌లు కూడా సర్వ్ చేస్తున్నాం. అతని కంటే ముందు ఎంతో మంది ప్లేయర్లు కోక్ తాగం చూసే ఉంటారు అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రొనాల్డో.. యాడ్ గుర్తుందా? ఇక ఇప్పుడు ఏ డ్రింక్‌ల పట్ల అయితే క్రిస్టియానో రొనాల్డో అయిష్టత, అసహ్యం కనబరిచాడో.. కొన్నేళ్ల క్రితం అదే కార్బొనేట్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీకి ఒక యాడ్ చేశాడు. 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకా కోలా బ్రాండ్‌కు యాడ్ చేశాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ యాడ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కొందరు రొనాల్డ్ తీరును తప్పుబడుతుండగా.. అభిమానులు మాత్రం ఆ వయసుకి రొనాల్డోకి అంత పరిణితి లేదని, అతని డైట్లో చాలా ఏళ్లుగా మార్పు వచ్చిందని గుర్తుచేస్తున్నారు. చదవండి: రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు -
ప్రకటనలు నిలిపివేసిన కోకాకోలా
శాన్ ఫ్రాన్సిస్కో : గ్లోబల్ అడ్వర్టైజింగ్లో ప్రధాన శక్తిగా అవతరించిన కోకాకోలా కంపెనీ సోషల్ మీడియాలో 30 రోజుల వరకు ప్రకటనల్ని నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోందంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోకాకోలా ప్రకటనల్లో హింసకు తావివ్వకుండా పూర్తి పారదర్శకతతో ప్రజలకు జావాబుదారీతనంతో ఉండే దిశగా అడుగులు వేస్తున్నాం. మా ప్రకటన విధానాల్లో ఏదైనా మార్పు అవసరమా అన్న అంశాలపై అంచనావేయడానికి తాత్కాలికంగా ప్రకటనల్ని నిలిపివేస్తున్నాం అని కంపెనీ కంపెనీ చైర్మన్, సీఈవో క్విన్సీ క్లుప్త అన్నారు. ప్రపంచంలోనే జాత్యంహకారానికి చోటు ఉండకూడదని పేర్కొన్నారు. ద్వేషం, జాత్యహంకారం లేదా హింసను ప్రేరేపించే ప్రకటనల్ని నిలిపివేయాలని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (ఎన్‌ఐఏసిపి) సంస్థ ఇప్పటికే పలు కంపెనీలను కోరింది. మెరుగైన సామాజం కోసం మనమందరం పాటుపాడాలని ఫేస్బుక్ వేదికగా కోరింది. అమెరికాలో నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా లిప్టన్ టీ, బెన్ అండ్ జెర్రీ సహా పలు కంపెనీలు 2020 చివరి వరకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు సైతం జత్యాంహకారానికి వ్యతిరేకంగా తమ వంతు కృషి చేస్తున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లవారి ప్రాణాలూ ముఖ్యమే) ఉద్యమం విస్తృతం అవుతుండటంతో.. రంగుకు ప్రాధాన్యతనిచ్చే ధోరణులు అన్ని రంగాలలోనూ మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రసిద్ధ యు.ఎస్. కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇటీవలే.. చర్మాన్ని తెల్లబరిచే సౌందర్యసాధనాల విక్రయాన్ని ఇండియాలో నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీ.కామ్ కలర్ ఫిల్టర్‌ను తొలిగించే దిశగా నిర్ణయం తీసుకుంది. రంగును బట్టి భాగస్వామిని ఎంచుకునే కలర్ ఫిల్టర్‌ను తొలిగించాలంటూ పిటిషన్ దాఖలైన పద్నాలుగు గంటల్లోనే 1500 మంది ఫర్గా సంతకాలు చేశారు. దీంతో వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన సైట్‌లోని స్కిన్ కలర్ ఫిల్టర్‌ను తొలగించబోతోంది ఆ పెళ్లిచూపుల సంస్థ షాదీ డాట్ కామ్ (‘వైట్, ఫెయిర్, లైట్ పదాలు తొలగిస్తున్నాం’ ) మెన్నటికి మెన్న తాజాగా మన దేశవాళీ హిందుస్థాన్ లీవర్ సంస్థ కూడా తమ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే మాటను తొలగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫెయిర్, వైట్, లైట్ అనే మాటల్ని అందానికి ఏకపద ఆదర్శ నిర్వచనాలుగా వాడటం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన క్రమంగా పలు దిగ్గజ కంపెనీ ప్రకటనల్లో పలుమార్పులు రాబోతున్నాయన్నమాట. (ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్ నుంచి జేజే ఔట్! ) -
53 వేల కోట్లు నష్టపోయిన జుకర్‌బర్గ్
వాషింగ్టన్: నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్‌బుక్‌కు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్బుక్ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది. (భారత్‌లో గూగుల్ పే బ్యాన్? ఎన్పీసీఐ క్లారిటీ) ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్బుక్ ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. (యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ డౌన్‌గ్రేడ్) దీంతో ఫేక్ న్యూస్ పై సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని చెప్పారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. -
షాకిచ్చిన కోర్టు.. ఐదు లక్షల ఫైన్
న్యూఢిల్లీ: శీతల పానీయాలు థమ్సప్, కోకాకోలాలు ఆరోగ్యానికి హానికరం.. నిషేధించాలంటూ పిల్ దాఖలు చేసిన వ్యక్తికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని, ఆయన చేసిన వాదనలను నిరూపించలేకపోయారంటూ రూ.5లక్షల జరిమానా విధించింది. వివరాలు.. చావ్డా అనే వ్యక్తి కోకాకోలా, థమ్స్ అప్ ఆరోగ్యానికి హానికరం.. వాటిని నిషేధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘పిటిషనర్ ఒక 'సామాజిక కార్యకర్త' అని చెప్పుకుంటున్నారు. పిటిషనర్‌కు ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే పిటిషన్ దాఖలైంది. అతని వాదనలు నిరూపించబడలేదు. అతనికి జరిమానా విధించడం సమంజసం. అందుకే అతడికి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని తెలిపారు. ఒక నెలలోపు 5 లక్షల రూపాయలను టాప్ కోర్ట్ రిజిస్ట్రీలో జమ చేయాలని.. అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల రికార్డ్ అసోసియేషన్‌కు పంపిణీ చేయాలని కోర్టు చావ్డాను ఆదేశించింది. -
ప్లాస్టిక్ వేస్ట్‌లో నంబర్‌వన్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ : ‘కోకాకోలా’ కూల్ డ్రింక్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణకు అత్యంత ప్రమాదకారిగా మారింది కూడా ఈ బ్రాండ్ ప్లాస్టిక్ సీసాలే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్లాస్టిక్ వేస్టేజ్‌ని సృష్టిస్తున్నది జార్జియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కోకాకోలా కూల్ డ్రింక్స్ కంపెనీ అని ఓ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత స్థానాల్లో నెస్లే, పెప్సికో, మాండెలెజ్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు సృష్టిస్తున్న ప్లాస్టిక్ వేస్టేజ్‌కి సమానంగా ఒక్క కోకాకోలా కంపెనీయే సృష్టిస్తున్నట్లు ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్స్’ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఇటీవల తన 72 వేల మంది కార్యకర్తలతో ప్రపంచవ్యాప్తంగా బీచ్‌ల వద్ద, కాల్వలు, చెరువుల వెంట, రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, ర్యాపర్లు, బ్యాగ్స్, ఇతర ప్లాస్టిక్‌ను ఏరించింది. దొరికిన ఇతర ప్లాస్టిక్కులతో దొరికిన కోకాకోలా, ఇతర కూల్ డ్రింక్‌ల ప్లాస్టిక్ బాటిళ్లను లెక్కపెట్టిచ్చింది. సరాసరిన 4,75,000 ప్లాస్టిక్‌లను సేకరించగా, వాటిలో 11,732 కోకాకోలా ప్లాస్టిక్ బాటిల్లే ఉన్నాయి. వీటిలో ఎనిమిది వేల బ్రాండ్లకు చెందిన 50 రకాల ప్లాస్టిక్‌లను బయట పడ్డాయి. నెస్లే, పెప్సికో, మాండెలెజ్ల తర్వాత యూనిలివర్, మార్స్, పీఅండ్‌జీ, కాల్గేట్–పామోలివ్, ఫిలిప్ మోరీస్ బ్రాండ్లు ఉన్నాయి. ఆఫ్రికా, యూరప్‌లలో అత్యధిక వేస్టేజ్‌లో కోకాకోలా నెంబర్ వన్ స్థానంలో ఉండగా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో రెండో స్థానంలో ఉంది. నెస్టిల్ బ్రాండ్ ఉత్తర అమెరికాలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎరుపు రంగు కప్పులను తయారు చేసే సోలో కంపెనీ రెండో స్థానంలో ఉండగా, స్టార్ బక్స్ మూడో స్థానంలో ఉంది. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌కు బదులు రీసైక్లింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్‌ను వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, మొత్తంగానే ప్లాస్టిక్‌ను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు ఈ సందర్భంగా ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’ సంస్థ పిలుపునిచ్చింది. (చదవండి: రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ) -
యూపీ యాసలో...
సినిమాల్లో కథానుగుణంగా, ప్రాంతానుగుణంగా హీరోహీరోయిన్లు ప్రవర్తిస్తుంటారు, ఆయా ప్రాంత యాసలో డైలాగులు కొడుతుంటారు. తాజాగా సన్నీ లియోన్ యూపీ యాసలో డైలాగులు చెప్పడానికి రెడీ అయ్యారు. తాజా చిత్రం ‘కోకోకోలా’లో సన్నీ లియోన్ యూపీ మహిళగా కనిపిస్తారట. కొత్త యాస నేర్చుకోవడం గురించి సన్నీ మాట్లాడుతూ– ‘‘కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. యాక్టర్‌గా నేనింకా ఎదగడానికి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. సినిమాలో యూపీ యాస సరిగ్గా పలకడానికి చాలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు సన్నీ. -
కోక–కోలా చేతికి కోస్టా కాఫీ బ్రాండ్
లండన్: శీతల పానీయాల దిగ్గజ సంస్థ, కోక–కోలా కోస్టా కాఫీ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. ఇంగ్లాం డ్కు చెందిన విట్‌బ్రెడ్ కంపెనీ నుంచి ఈ కోస్టా కాఫీ బ్రాండ్‌ను 510 కోట్ల డాలర్లు(390 కోట్ల పౌండ్లు)కు కొనుగోలు చేశామని కోక–కోలా కంపెనీ తెలిపింది. బ్రిటన్‌లో అతి పెద్ద కాఫీ కంపెనీగా కోస్టా కాఫీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్‌లో 2,400కు పైగా, 30 దేశాల్లో 1,400 వరకూ కాఫీ షాప్స్ను నడుపుతోంది. మార్చితో ముగిసిన ఏడాదికి కంపెనీ 129 కోట్ల పౌండ్ల అమ్మకాలపై 12.3 కోట్ల పౌండ్ల లాభాన్ని సాధించింది. కోకకోలాకు పోటీ కష్టాలు: ఈ డీల్ వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తవుతుందని అంచనా. ఈ బ్రాండ్ కొనుగోలుతో కోకకోలాకు కష్టాలు తప్పవని నిపుణులంటున్నారు. కొత్తగా కాఫీ రంగంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, స్టార్‌బక్స్ వంటి ఇతర బ్రాండ్ల నుంచి గట్టి పోటీని కోకకోలా ఎదుర్కొనున్నది. కాఫీ వంటి వేడి పానీయాల సెగ్మెంట్లో తమకు అంతర్జాతీయ బ్రాండ్ ఏదీ ఇప్పటివరకూ లేదని కోక కోలా ప్రెసిడెంట్, సీఈఓ జేమ్స్ చెప్పారు. విట్బ్రెడ్కు భారీ లాభాలు.. కోస్టా కాఫీ బ్రాండ్ అమ్మకం వల్ల విట్‌బ్రెడ్ సంస్థకు భారీగా లాభాలు రానున్నాయి. 1995లో కోస్టా కాఫీ బ్రాండ్‌ను కేవలం 1.9 కోట్ల పౌండ్లకు మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏకంగా 390 కోట్ల పౌండ్లకు విక్రయిస్తోంది. అప్పుడు ఈ బ్రాండ్‌కు 39 షాప్‌లు ఉన్నాయి. అప్పటి నుంచి కోస్టా కాఫీ బ్రాండ్ విస్తరణ కోసం ఈ కంపెనీ భారీగానే పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఈ వ్యాపారంలో వచ్చిన లాభాలను బడ్జెట్ చెయిన్ హోటల్ ప్రీమియర్ ఇన్ విస్తరణ కోసం వినియోగించింది. తాము కాదనకుండా చెప్పలేని ఆఫర్‌ను కోకకోలా ఇచ్చిందని విట్‌బ్రెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలిసన్ బ్రిట్టెయిన్ చెప్పారు. అందుకే ఈ డీల్‌ను డైరెక్టర్ల బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. కాగా ఈ ఆఫర్ కారణంగా విట్‌బ్రెడ్ షేర్ 16 శాతం ఎగసింది. -
ఆ డ్రింక్స్ రేట్లు పెరుగుతున్నాయ్!
జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుండటంతో, ప్రముఖ శీతల పానియాల సంస్థ కోకా కోలా తన కార్బోనేటేడ్ పానీయాల పోర్ట్ ఫోలియోలో ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ కిన్లే రేట్లను తగ్గించనున్నట్టు పేర్కొంది. అయితే జ్యూస్ లు, జ్యూస్ ల ఆధారిత డ్రిక్ ల పోర్టు ఫోలియోలో ధరలు పెంచబోమని కంపెనీ స్పష్టంచేసింది. కొత్త పన్ను విధానం ప్రకారం ప్రస్తుతమున్న రేట్ల కంటే అత్యధిక మొత్తంలో శీతలపానీయాలపై పన్ను శ్లాబులను ప్రతిపాదించారు. శీతల పానీయాలపై పన్ను శ్లాబులు 40 శాతంగా ఉన్నాయి. దీంతో ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని, తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా ధరలు పెంచాల్సి వస్తుందని కోకా కోలా ఓ ప్రకటనలో పేర్కొంది. జీఎస్టీ విధానంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పన్ను రేట్లు తక్కువ ఉన్నందున వాటి ప్రయోజనాలను ప్రజలకు చేరవేస్తామని కంపెనీ చెప్పింది. ఈ మేరకు తన భాగస్వాములకు కిన్లే ధరలను తగ్గించాలని పేర్కొంది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను 18శాతం జీఎస్టీ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ అమలైనప్పటి నుంచి భారత వృద్ధి పెరుగుతుందని అంచనావేస్తున్నామని, పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని కోకా కోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా బిజినెస్ యూనిట్ టీ.క్రిష్ణకుమార్ చెప్పారు. తమ బెవరేజ్ పోర్టుఫోలియోలో కొన్ని కేటగిరీలో పన్ను ప్రభావం పడుతుందన్నారు. -
కోకాకోలా, పెప్సీలకు కోర్టులో ఊరట
శీతల పానీయాల కంపెనీలు కోకా కోలా, పెప్సీలను బహిష్కరించాలని అక్కడి వర్తకులు నిర్ణయించుకున్న మర్నాడే.. ఆ కంపెనీలకు మద్రాసు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కంపెనీలు తమిరపరని నది నుంచి నీళ్లను తీసుకుని వాడుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. స్థానికుల నిరసన కారణంగా గత నాలుగు నెలలుగా ఈ కంపెనీలు ఆ నది నీళ్లను వాడుకోలేకపోతున్న విషయం తెలిసిందే. నది నీళ్లను రసాయన అవసరాల కోసం ఈ కంపెనీలు వాడుకోవడం వల్ల వేలాది మంది రైతులు నష్టపోతున్నారని పిటిషనర్ వాదించారు. అయితే తాము కేవలం మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్లు కంపెనీలు తెలిపాయి. కూల్డ్రింకు కంపెనీలు నది నీళ్లను వాడుకోవడాన్ని నిరసిస్తూ 2015లో జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. అయితే తాము ప్రభుత్వ పారిశ్రామిక ఎస్టేటులోనే ప్లాంట్లు పెట్టుకున్నామని, అనవసరంగా తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కంపెనీలు వాదించాయి. ప్రతిరోజూ ఈ కంపెనీలు 9 లక్షల లీటర్ల నీళ్లను తీసుకోడానికి అనుమతి ఉన్నా, ఆ తర్వాత రెట్టింపు తీసుకుంటున్నాయని, వాటికి ప్రతి వెయ్యి లీటర్లకు రూ. 37.50 మాత్రమే తీసుకుంటున్నారని పిటిషనర్ డీఏ ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పుడు కోర్టు నుంచి ఆ కంపెనీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. ఈ మధ్యలోనే వాటిని బహిష్కరించాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న వర్తక సంఘాలు నిర్ణయించాయి. పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్! -
కూల్‌డ్రింక్ పెట్ బాటిల్స్‌లో విషపదార్థాలు?
బహుళ జాతి కంపెనీలు పెప్సీకో, కోకా-కోలా తయారుచేస్తున్న పలు సాఫ్ట్డ్రింకులలో ఐదు రకాల విష పదార్థాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరిశీలనలో తేలింది. అయితే తమ పెట్‌బాటిల్స్‌లో అలాంటివి ఏమీ లేవని రెండు కంపెనీలు ఖండించాయి. తమకు ప్రభుత్వం నుంచి అలాంటి నివేదిక ఏదీ రాలేదంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ) నిర్వహించిన పరీక్షలలో.. పెప్సీ, కోకా కోలా, మౌంటెన్ డ్యూ, స్ప్రైట్, 7అప్ లాంటి కూల్ డ్రింకుల బాటిల్స్‌లో యాంటిమోనీ, సీసీ, క్రోమియం, కాడ్మియంతో పాటు.. డీఈహెచ్‌పీ లేదా డైఫ్తాలేట్ కూడా ఉన్నాయని తేలింది. వీటిలో పెప్సీ, మౌంటెన్ డ్యూ, 7 అప్ బ్రాండ్లు పెప్సీకోవి కాగా, స్ప్రైట్ మాత్రం కోకా కోలా కంపెనీది. ఈ రెండు కంపెనీలు ఈ ఆరోపణలను ఖండించాయి. తమకు ఈ పరీక్షల నివేదికలకు సంబంధించిన సమాచారం ఏమీ ఇంతవరకు రాలేదని పెప్సికో ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. తకు ప్రభుత్వ శాఖల నుంచి నోటీసులు గానీ, సమాచారం గానీ కూడా ఏమీ లేదని కోకాకోలా ప్రతినిధి అన్నారు. భారతదేశంలోని ఆహార భద్రతా ప్రమాణాలు అనుమతించిన స్థాయిలో మాత్రమే తమ కూల్‌డ్రింకులలో భారలోహాలు ఉంటాయని పెప్సికో తెలిపింది. కానీ డీటీఏబీ వెబ్సైట్లో పేర్కొన్న వివరాలు చూస్తుంటే.. అసలు కూల్‌డ్రింకులలో భారలోహాలకు అనుమతించిన పరిమితి అంటూ ఏమీ లేదు. కాడ్మియం అనేది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. -
కోకాకోలా
పేరులోనేముంది? అంతర్జాతీయ అభిమాన శీతల పానీయం కోకాకోలాకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? కోకాకోలా ఫార్ములాకు రూపకల్పన చేసిన అమెరికన్ ఫార్మసిస్ట్ జాన్ ఎస్ పెంబర్టన్ దీని తయారీలో ప్రధానంగా కోకా ఆకులను, కోలా గింజలను ఉపయోగించాడు. అందువల్ల ఈ పానీయానికి ‘కోకాకోలా’ అని నామకరణం చేశాడు. ‘కోలా’ స్పెల్లింగ్ ‘కె’తో మొదలైనా, బ్రాండ్ లోగో రాసేటప్పుడు ‘సి’ అక్షరం ఉంటేనే బాగుంటుందని భావించాడు. అలా రూపొందిన ‘కోకాకోలా’ లోగోనే కాదు, పానీయం కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. -
కోక్ కోసం కోటీ యాభై ఆరు లక్షలు..!
ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ ఓన్లీ కోకాకోలా అంటూ ఒకప్పుడు అందర్నీ ఉర్రూతలూగించిన యాడ్ గుర్తుందా? ఈ ఫొటోలో కోక్ కేన్ల పక్కన నిలబడిన మహిళకు ఆ యాడ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈమె.. కోక్ తప్ప మరోటి అవసరం లేనంతగా ఆ శీతలపానీయానికి అంకితమైపోయింది. ఇంగ్లండ్‌లోని ఎల్లిస్మీర్ పోర్టు సమీపంలో ఉండే జక్కీ బల్లాన్కు డైట్ కోక్ అంటే పిచ్చి! రోజుకు కనీసం 10 లీటర్ల కోక్ ఉండాల్సిందే. ఇందులో ఏ మాత్రం తగ్గినా.. తల తిరగడం, కాళ్లూ చేతులూ వణకడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడిపోతుంది. ఈమె ఇంటి నిండా కోక్ బాటిళ్లే దర్శనమిస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు మనీ అయినా మర్చిపోతుందేమో కానీ, కోక్ బాటిళ్లను మాత్రం మర్చిపోదు. బల్లాన్ హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ కనీసం అరడజను బాటిళ్లు ఉండాల్సిందే. ఈమె తన 14వ ఏట తొలిసారిగా డైట్ కోక్ తాగిందట. ఇక అప్పటి నుంచి 30 ఏళ్లుగా తాగుతూనే ఉంది. ఓ దశలో అయితే రోజుకు ఏకంగా 16 లీటర్ల కోక్ పట్టించేసేదట. దానివల్ల కొన్ని దుష్ర్పభావాలు కలగడంతో వైద్యుల సూచన మేరకు ఈ మధ్యే దాన్ని 10 లీటర్లకు తగ్గించింది. మొత్తమ్మీద ఇప్పటివరకు కేవలం కోక్ కోసం ఏకంగా కోటీ యాభై ఆరు లక్షల రూపాయలు వెచ్చించింది..!