Realme 10 Pro 5G Coca-Cola Edition India Launch Confirmed, Know More Details - Sakshi
Sakshi News home page

రియల్‌మీ కోకా-కోలా 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. అదిరే కలర్స్‌లో

Published Thu, Feb 2 2023 7:28 PM | Last Updated on Thu, Feb 2 2023 8:51 PM

Realme 10 Pro 5G Coca-Cola edition is launching on February 10 - Sakshi

సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కోకా-కోలాకంపెనీ భాగస్వామ్యంతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్‌ చేయనుంది.  రియల్‌మీ 10 ప్రో 5జీ  స్మార్ట్‌ఫోన్‌   కోకా -కోలా ఎడిషన్‌ను ఫిబ్రవరి 10న  చేయబోతున్నట్టు ప్రకటించింది. సరికొత్త కలర్స్‌లో, యూజర్ ఇంటర్‌ఫేస్‌లో (UI) కీలక మార్పులతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.  దీనికి సంబంధించిన  ప్రీ బుకింగ్స్‌ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. స్టోరేజ్‌ మార్పు తప్ప, మిగిలిన ఫీచర్లు గత ఏడాది నవంబర్‌లో లాంచ్‌ చేసిన మోడల్‌ మాదిరిగానే ఉండబోతున్నాయి.  

గతేడాది మార్వెల్ భాగస్వామ్యంతో రియల్‌మీ జీటీ నియో3 థోర్ ఎడిషన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.   తాజా కోకా కోలాతో జతకట్టింది. పరిమిత-ఎడిషన్ ఫోన్‌ను కోకాకోలా లోగోతో బ్లాక్‌ అండ్‌ రెడ్‌ డ్యుయల్‌ టోన్‌ కలర్స్‌లో ఆకర్షణీయంగా లాంచ్‌  చేస్తోంది. 

రియల్‌మీ 10 ప్రో కోకా-కోలా ఎడిషన్ ఫీచర్లు (అంచనా)
6.7 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 13, స్నాప్‌ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ 
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ 
108  ఎంపీ ప్రోలైట్ కెమెరా 
16 ఎంపీ సెల్ఫీ కెమరా  
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ ఫోన్ ధర భారత్‌లో రూ.20 వేల లోపే ఉండొచ్చని అంచనా.  కాగా రియల్‌మీ 10 ప్రో  6జీబీ  ర్యామ్‌,  128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.18,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.19,999.  అలాగే రియల్‌మీ 10 ప్రో ప్లస్  6జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.24,999గాను, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ ధర రూ.27,999గా ఉన్నాయి.<

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement