కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
థమ్స్ అప్, మ్కా, ఫాంటా, స్ర్పైట్, మాజా, కోకా కోలా జీరో షుగర్, డైట్ కోక్, ష్వెప్స్, ఛార్జ్‌డ్, కిన్లే, మినిట్ మెయిడ్, స్మార్ట్ వాటర్, రిమ్ జిమ్, హానెస్ట్ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది.
కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే..
2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment