
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ‘హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వంతో కలసి పనిచేయాలన్నది మా ఆలోచన! ఈ–వీసాలను మరింత పెంచాలి’ అని మీడియాతో చెప్పారు.
పొరుగు దేశాలైన థాయిలాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్, సింగపూర్ దేశాలు ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తున్నాయని, దేశంలోకి వచ్చిన వెంటనే వీసా జారీ విధానాన్ని అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. భారత్‌లో అధిక నాణ్యమైన హెల్త్‌కేర్ వసతులు ఉన్నాయంటూ.. ప్రపంచ సగటు ధరల్లో పదో వంతుకే అందిస్తున్నట్టు చెప్పారు. కాబట్టి విదేశీ రోగుల రాకను సులభతరం చేయాలని, మెడికల్ వీసాలను వేగంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య పర్యాటకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంతో కీలకంగా చూస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
‘వీసా ప్రక్రియలను మెరుగ్గా మార్చాలి. భారత్‌లోకి ప్రవేశ అనుభవం మెరుగ్గా ఉండాలి. మనకు చాలా పట్టణాల్లో అద్భుతమైన విమానాశ్రయ వసతులు ఉన్నాయి’ అని అమె గుర్తు చేశారు. ఐఐటీ, ఇతర సంస్థలతో కలసి ఆవిష్కరణల కోసం అపోలో హాస్పిటల్స్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.3,000 పడకలు పెంచుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment