
శంషాబాద్ విమానాశ్రయంపై జీఎంఆర్ అంచనా
ప్రస్తుతం ఏటా 2.9 కోట్ల మంది రాకపోకలు
హైదరాబాద్: ఆరేళ్లలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఏటా 5 కోట్ల స్థాయికి చేరుతుందని జీఎంఆర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2.9 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ వెల్లడించారు.
‘2023–24లో 2.5 కోట్ల మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేశారు. కంపెనీ ప్రస్తుత కార్గో టెరి్మనల్ విస్తరణ కోసం రూ.370 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఉంది. ఏటా 4 లక్షల టన్నుల సామర్థ్యా న్ని చేరుకోవడానికి కొత్త టెరి్మనల్ ఏర్పా టు చేస్తోంది. విమానాశ్రయం ఇప్పటికే ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2008లో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఎయిర్‌పోర్టును నిర్మించారు’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment