GMR group
-
IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించి సంచలన మార్పు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి వచ్చింది. భారత వికెట్ కీపర్, హిట్టర్ రిషభ్ పంత్‌ను క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఐపీఎల్-2025లో క్యాపిటల్స్ యాజమాన్య ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్ గ్రూప్ టీమ్ నిర్వహణా బాధ్యతలు చూస్తుంది. జీఎంఆర్ ప్రతినిధులతో పలు అంశాల్లో పంత్ విభేదించడమే అందుకు కారణమని తెలిసింది. కోచ్ ఎంపికతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కూడా పంత్ పట్టుబట్టినట్లు... గత నెల రోజులుగా దీనిపై తీవ్ర చర్చలు జరిగిన తర్వాత పంత్ డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. ఆ నలుగురు జట్టుతోనేదాంతో తమ స్టార్ ఆటగాడినే వదులుకునేందుకు క్యాపిటల్స్ యాజమాన్యం సిద్ధమైంది. 2016 నుంచి 2024 సీజన్ వరకు ఢిల్లీ జట్టుతో ఉన్న పంత్... 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రయిక్ రేట్‌తో 3,284 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సారథిగా వ్యవహరించి జట్టును పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిపాడు. కాగా ఢిల్లీ ఈసారి నలుగురు ఆటగాళ్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్‌లను ఢిల్లీ అట్టి పెట్టుకుంది. ఏదేమైనా.. వేలంలో పంత్‌కు భారీ డిమాండ్ ఉండటం మాత్రం ఖాయం. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
ఇంగ్లండ్ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసుకుంది. కౌంటీ జట్టు హాంప్‌షైర్ క్లబ్లో 53 శాతం వాటా కొనుగోలు చేసినట్లు సోమవారం జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుదీంతో కౌంటీ జట్లలో విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుగా హాంప్‌షైర్ నిలిచింది. ప్రస్తుతానికి సగానికి పైగా వాటా కొనుగోలు చేసుకున్న జీఎంఆర్ గ్రూప్... వచ్చే రెండేళ్లలో హాంప్‌షైర్ జట్టును పూర్తిగా హస్తగతం చేసుకోనుంది. ప్రస్తుతం హాంప్‌షైర్ క్లబ్‌కు జీఎంఆర్ గ్రూప్ రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం.వచ్చే 24 నెలల్లో పూర్తి యాజమాన్య హక్కులు‘హాంప్‌షైర్ క్లబ్ యజమాని, జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే 24 నెలల్లో క్లబ్ పూర్తి యాజమాన్య హక్కులు జీఎంఆర్ గ్రూప్‌కు బదిలీ అవుతాయి’ అని సోమవారం హాంప్‌షైర్ క్లబ్ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యువతరంతో సంబంధాలు కొనసాగిస్తూ... నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు హాంప్‌షైర్ జట్టును కొనుగోలు చేసినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ తెలిపారు.మా లక్ష్యం అదే‘భారత్‌తో పాటు దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. యువతరం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. యువతను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. క్రీడలను సంస్కృతిలో భాగం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్ ప్రపంచ చాంపియన్లను సృష్టించడంపై దృష్టి పెడతాం’ అని కిరణ్ కుమార్ అన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతా వాటా ఉన్న జీఎంఆర్ గ్రూప్‌నకు ఐఎల్టి20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, ఎస్ఎ20లో ప్రిటోరియా క్యాపిటల్స్‌లో కూడా వాటా ఉంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లోనూ జీఎంఆర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జీఎంఆర్ వాటా పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (డీఐఏఎల్) మరో 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్) దక్కించుకుంది. డీఐఏఎల్‌లో తనకున్న 10 శాతం వాటాను ఫ్రాపోర్ట్ ఏజీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ వరల్డ్‌వైడ్ విక్రయించింది. డీల్ విలువ 126 మిలియన్ డాలర్లు. డీల్ తదనంతరం డీఐఏఎల్‌లో జీఐఎల్ వాటా 74 శాతానికి చేరింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. వాటా కొనుగోలు ప్రక్రియ 180 రోజుల్లో పూర్తి అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సోమవారం తెలిపింది. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మలేసియా సంస్థ వాటా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ సంస్థ జీఎంఆర్ గ్రూప్.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాను 74 శాతానికి పెంచుకోనుంది. మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ) నుంచి 11 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు జీఎంఆర్ 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 831 కోట్లు) వెచి్చంచనుంది. జీఎంఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కన్సార్షియం.. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)కు జీహెచ్ఐఏఎల్ అనుబంధ సంస్థకాగా.. ఎంఏహెచ్‌బీతో వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కీలక ఆస్తులను కన్సాలిడేట్ చేయడంలో భాగంగా తాజా వాటా కొనుగోలుకి తెరతీసినట్లు జీఎంఆర్ గ్రూప్ తెలియజేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఐఏఎల్‌లో జీఏఎల్‌కు 63 శాతం వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 13 శాతం చొప్పున వాటా ఉంది. -
గ్రీస్‌లో జీఎంఆర్ మరిన్ని పెట్టుబడులు
ముంబై: గ్రీస్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న దేశీ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. కెలమాటా ఎయిర్‌పోర్ట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జీఈకే టెర్నా సంస్థతో కలిసి గ్రీస్‌లోని క్రెటె ప్రాంతంలో హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. హెరాక్లియోన్ విమానాశ్రయ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇంధన, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధాన మంత్రి నిర్వహించిన విందులో శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. భారత్, గ్రీస్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడితే ఇరు దేశాల స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి, వ్యాపార అవకాశాల కల్పనకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రయాణ ‘వైభోగ’పురం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలోనే అందుబాటులోకి తేవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా దీన్ని నిర్మించనున్నారు. నిర్మాణ బాధ్యతలను పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన రికార్డు ఉన్న జీఎంఆర్ గ్రూప్ చేపట్టింది. ఇప్పటికే నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం సాధించింది. వాస్తవానికి అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించాక అందుబాటులోకి తేవడానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని కీలక అనుమతులు సాధించడంతో రెండేళ్లలోనే అందుబాటులోకి రానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతుండటంతోఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో.. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణించేలా రూ.5,000 కోట్లతో పనులు చేపడతారు. ఇక రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేస్తారు. మూడు దశల్లో ఒకేసారి 22 విమానాలు ఆగేలా 22 ఎయిర్‌బ్రిడ్జిలను నిర్మిస్తారు. ఇందులో భాగంగా తొలిదశలో ఏడు ఎయిర్‌బ్రిడ్జిలను అభివృద్ధి చేస్తారు. తొలి దశలో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్, విమానాల నిర్వహణ, మరమ్మతులకు ఎంఆర్వో యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే విశాఖ నగరం వైపు అభివృద్ధి చేయనున్నారు. భారీ విమానాలకు అనువుగా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమానాలు సురక్షితంగా దిగేలా 3.8 కి.మీ పొడవైన భారీ రన్‌వేను నిర్మించనున్నారు. తూర్పు తీరంలో విశాఖ చాలా వ్యూహాత్మక స్థానం కావడంతో రక్షణ అవసరాల కోసం ఎయిర్‌పోర్టులో 10 ఎకరాలను ప్రత్యేకంగా ప్రభుత్వం కేటాయించింది. ఇవి కాకుండా అంతర్జాతీయ విమాన సర్వి సులకు అవసరమైన కస్టమ్స్, ఇమిగ్రేషన్‌లతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎయిర్‌పోర్టుకు ఆనుకొని ఉన్న 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏరో సిటీని అభివృద్ధి చేయనుంది. అడ్డంకులన్నీ అధిగమించి.. కీలక అనుమతులు సాధించి.. గత ప్రభుత్వం భూసేకరణ కూడా పూర్తి చేయకుండానే ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసింది. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులను ప్రారంభిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల్లో నమోదైన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. అలాగే భూసేకరణకు సంబంధించిన అన్ని అడ్డంకులను అధిగమించింది. విమానాశ్రయం ప్రారంభించాక ప్రస్తుతం విశాఖలోని నేవీ విమానాశ్రయం నుంచి 30 ఏళ్లపాటు వాణిజ్య సేవలను నిలిపివేయడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందింది. అలాగే ఎయిర్‌పోర్టు భద్రతకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆమోదం, పలు సర్వి సు సేవలకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విదేశీ సర్వి సుల నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలతో పలు ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. నిర్వాసితులకు అండగా.. విమానాశ్రయ నిర్మాణం నేపథ్యంలో నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించారు. ఇందుకోసం పోలిపల్లి, గూడిపవలస వద్ద 50.3 ఎకరాల్లో సుమారు రూ.77 కోట్లతో రెండు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రైవేటు రియల్ ఎసేŠట్ట్ వెంచర్లకు దీటుగా కాలనీల్లో 30 అడుగుల సీసీ రోడ్లు, డ్రైనేజ్, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి, కమ్యూనిటీ హాళ్లు, చిల్డ్రన్ పార్క్, పాఠశాల, పోస్టాఫీసు, షాపింగ్ కాంప్లెక్స్, దేవాలయాలు వంటి అనేక సదుపాయాలను కల్పించడంతో ప్రజలు సంతోషంగా గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. 2025 నాటికి తొలి విమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. 2025 నాటికి ఇక్కడి నుంచి తొలి విమానం ఎగరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులతో పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా అన్ని అనుమతులు సాధించాకే నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాం. దీంతో రెండేళ్లలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం రానుంది. అలాగే స్థానిక కుటుంబాలకు సాధ్యమైనంత ఎక్కువ సాయం అందించడానికి సీఎం ఆదేశాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో పునరావాస గ్రామాలను అభివృద్ధి చేశాం. - వీఎన్ భరత్ రెడ్డి, ఎండీ, ఏపీఏడీసీఎల్ -
పేరు మార్చుకున్న బడా కంపెనీ.. కారణం ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణలో ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మారింది. ఇక నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తారు. విమానాశ్రయేతర వ్యాపారాలను విడదీసిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త పేరు కార్యరూపంలోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీతోపాటు ఫిలిప్పైన్స్‌లోని సెబు విమానాశ్రయాలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణలో ఉన్నాయి. ఇండోనేషియాలోని కౌలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ హక్కులను సంస్థ చేజిక్కించుకుంది. గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గ్రీస్‌లోని క్రీతి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్ట్రాగామ్‌లో కొత్త ఫీచర్: చూశారా మీరు?) -
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. కొత్తగా మరో టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సదుపాయాల విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టెర్మినల్ మొదటి దశలో భాగంగా తూర్పు వైపు కొత్తగా 15,742 చదరపు మీటర్ల టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. భద్రతా తనిఖీల అనంతరం మరో నెల రోజుల్లో దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అవకాశం ఉంది. తాజాగా పూర్తి చేసిన విస్తరణతో ఎయిర్‌పోర్టు టెర్మినల్ వైశాల్యం 3,79,370 చదరపు మీటర్లకు పెరిగింది. సాలీనా సుమారు 3.4 కోట్ల మంది ప్రయాణీకుల సామర్థ్యానికి వీలుగా ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా తొలి దశ టర్మినల్ విస్తరణలో కొంత భాగం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదనంగా పలు సౌకర్యాలు.. ఏటా కోటి 20 లక్షల మంది ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్‌పోర్టులో 2019 నాటికి ప్రయాణికుల సంఖ్య 2.1 కోట్లకు చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు విస్తరణపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ ఇంటెరిమ్ డిపార్చర్ టెర్మినల్, ఇంటెరిమ్ డొమెస్టిక్ అరైవల్ టెర్మినల్‌ను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. విస్తరించిన ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్‌తో 149 చెక్ఇన్ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషీన్లు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పయర్ భవనాల్లో మరిన్ని లాంజ్‌లు, రిటైల్ అవుట్లెట్లు ఉంటాయి. అలాగే 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపార్చర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. (క్లిక్: ఫలించిన పరి‘శ్రమ’.. టీఎస్ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు) రన్‌వే సామర్థ్యం పెంపు... రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా నాలుగు రాపిడ్ ఎగ్జిట్ టాక్సీ వేలను ఏర్పాటు చేశారు. దీంతో విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుంచి ట్యాక్సీ ఆఫ్ కావడానికి అవకాశం ఉంటుంది. రన్‌వే ఆక్యుపెన్సీ సమయం కూడా తగ్గి, సామర్థ్యం పెరుగనుంది. అలాగే సెకెండరీ రన్ వేను ఉపయోగించుకునే సందర్భంలో సమర్థవంతమైన ఆపరేషన్ కోసం మరో కొత్త సమాంతర ట్యాక్సీవేను కూడా అభివృద్ధి చేశారు. కొత్తగా మూడు ఎయిరోబ్రిడ్జిలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం 6 ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల కోసం అన్ని సదుపాయాలతో కూడిన రెండు బేబీ కేర్ రూములు, 2 ఫ్యామిలీ రూమ్‌లను నిర్మించారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా ఒక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. (క్లిక్: నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు!) -
విమానాశ్రయాలపై రూ.20,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.20,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్మాణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను ఏర్పరిచామని కంపెనీ వార్షిక నివేదికలో గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం మౌలిక వసతుల విస్తరణ, టెర్మినల్ వార్షిక సామర్థ్యం 10 కోట్ల ప్రయాణికుల స్థాయికి పెంపు పనులు జరుగుతున్నాయి. ఫేజ్ 3ఏ విస్తరణ 2023 జూన్ నాటికి పూర్తి కానుంది. 2022 సెప్టెంబర్ నాటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వార్షిక సామర్థ్యం 3.5 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుకుంటుంది’ అని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కర్ణాటకలోని బీదర్, ఫిలి ప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తోంది. నాగ్‌పూర్ విమానాశ్రయం..: నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో జీఎంఆర్‌కు అనుకూలంగా బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కంపెనీ తదుపరి ప్రణాళిక వెల్లడించింది. నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధిలో భాగంగా వార్షిక సామర్థ్యాన్ని రాబోయే కాలంలో 3 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేర్చనున్నారు. నాలుగేళ్లలో పూర్తి కానున్న తొలి దశలో 40 లక్షల ప్రయాణికులు, 20,000 మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించే స్థాయికి విమానాశ్రయం చేరనుంది. -
గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం తొలిరూపు గోల్కొండ.. భాగ్యనగరం అనగానే ముందుగా గుర్చొచ్చే చారిత్రక నిర్మాణం. కాకతీయులు పునాది వేయగా, కుతుబ్‌షాహీలు ఆక్రమించుకుని మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అసఫ్జాహీలు ఏలారు. ఇన్ని రాజవంశాల చేతులు మారినా.. పదిలంగా నిలిచిన ఆ మహా కోటకు ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. చాలా ఏళ్లు కావడంతో స్వతహాగా ఏర్పడుతున్న పగుళ్లు క్రమంగా పెరిగి మూలాలనే పెకిలిస్తున్నాయి. వాటికి వేగంగా మరమ్మతులు జరగక క్రమంగా కోటకు బీటలు వేస్తున్నాయి. ఇంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్న కోటకు ఇటీవలి భారీ వర్షాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి. రికార్డు స్థాయి వర్షంతో ఒక్కసారిగా గోడలన్నీ కదిలిపోయి నిట్టనిలువునా కూలిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఆ వర్షాల సమయంలోనే ఓ బురుజు, మరో మహా కోట ప్రాకారం, నవాబులు జలకాలాడిన కటోరా హౌస్ ప్రహరీ నేలమట్టమైంది. మరికొన్ని గోడలు కూడా కూలే ప్రమాదం ఉంది. వాన కాదు కదా బలంగా గాలివీచినా రాళ్లు జారిపడేలా మారింది ఈ మహా కట్టడం. కేంద్రం వెంటనే స్పందించకుంటే కోటలోని చాలాప్రాంతాలు మట్టిదిబ్బగా మారటం ఖాయం. రూ.6 నుంచి రూ.8 కోట్లు కావాలి ఇటీవలి వర్షాలకు కూలిన ప్రాంతాలను పునరుద్ధరించాలంటే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అవసరం అవుతాయని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు అంచనాలు రూపొందించి మరమ్మతు కోసం అనుమతి కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. దానికి సమ్మతిస్తూ సరిపడా నిధులు కేటాయిస్తేనే వీలైనంత తొందరలో పునరుద్ధరణ పూర్తవుతుంది. వచ్చే వానాకాలం లోపు ప్రధాన పనులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతు చేయకపోతే ఏడాదిలో మరిన్ని గోడలు కూలడం ఖాయం. నిధులేవి.. ఇంతపెద్ద గోల్కొండ నిర్వహణకు కేంద్ర పురాతత్వ సర్వేక్షణ విభాగం కేటాయిస్తున్న నిధులు సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే. శతాబ్దాల నాటి నిర్మాణం కావటంతో అడుగడుగునా మరమ్మతు చేస్తే తప్ప నిర్మాణం పదిలంగా ఉండని పరిస్థితిలో ఈ నిధులు ఏ మూలకూ చాలట్లేదు. మరోవైపు ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా ఢిల్లీకి అనుమతి కోసం పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. ఇక మరమ్మతు పనుల్లో నైపుణ్యం ఉన్న పనివారు దొరక్కపోవటం జాప్యానికి మరో కారణం. నిత్యం నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు మరమ్మతులు వేగంగా చేపడితేనే ఈ కట్టడం పదిలంగా ఉంటుంది. చారిత్రక కట్టడాలను దత్తత ఇచ్చేందుకు గతేడాది కేంద్రం శ్రీకారం చుట్టింది. గోల్కొండ బాధ్యత జీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే దత్తత ఇచ్చేందుకు ఏఎస్ఐ సిద్ధంగా ఉన్నా ఎవరూ స్పందిచట్లేదు. (చదవండి: టూరిస్టుల గోల్కొండ) జారిపోయిన బండరాళ్లు.. గోల్కొండ కోట పైభాగంలో జగదాంబ దేవాలయం వైపు వెళ్లే దారిలో 50 అడుగుల ఎత్తయిన కోట గోడ నిలువునా జారిపోయింది. గతంలో ఇక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి మరమ్మతు చేయటంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కూడా పైభాగంలోనే పనులు చేపట్టారు. బలహీనంగా ఉన్న కింది భాగానికి పూర్తిస్థాయి మరమ్మతు జరగలేదు. దీంతో భారీ వర్షాలకు కిందిభాగం మరింత బలహీనపడి కూలింది. దీంతో పైనుంచి రాళ్లు జారి పడిపోయాయి. ఫలితంగా గోడ వెనుక ఉండే మట్టి పూర్తిగా జారిపోయింది. మజ్నూ బురుజు.. దాదాపు కనుమరుగు మజ్నూ బురుజు. నయాఖిల్లాలో ఉంది. ప్రస్తుతం దీని చుట్టూ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి అయి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సరిగ్గా 20 రోజుల ముందు దీనికి పైభాగంలో భారీ పగులు ఏర్పడింది. బురుజు పైభాగంలో 18 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది ఔరంగజేబు సైన్యం ఏర్పాటు చేసింది. దాని వెనుకవైపు పిట్టగోడ తరహాలో ఓ గోడ అప్పట్లోనే కట్టారు. ఆ గోడ నుంచి పగులు మొదలైంది. భారీ వర్షాల సమయంలో ఆ పగులు నుంచి నీరు లోపలికి చేరటంతో మట్టి జారి పైనుంచి దిగువ వరకు సగం బురుజు కూలిపోయింది. సగం బురుజు కూలగా, మిగతా సగం కూడా బలహీనపడింది. దానిపై టన్నుల బరువుండే ఫిరంగి ఉంది. ప్రస్తుతం అది కొంత భాగం గాలిలో వేళ్లాడుతోంది. క్రేన్‌తో దాన్ని పదిలంగా తీసి పనులు చేపట్టాలి. (చదవండి: గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?) ఇలా అయితే కష్టమే.. జగదాంబ దేవాలయానికి మరోవైపు వెళ్లే మార్గం. ఆ పక్కన కూలిన గోడ లాగానే ఇక్కడ కూడా ప్రధాన కట్టడానికి పైనుంచి దిగువ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీనికి అత్యవసరంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు అవసరం. లేకుంటే, సాధారణ వర్షాలకు కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన స్థాయి భారీ వర్షం భవిష్యత్తులో కురిస్తే ఈ గోడ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణంలో లోపం? కుతుబ్‌షాహీ నవాబుల కుటుంబం జలకాలాడేందుకు 460 ఏళ్ల కింద రూపుదిద్దుకున్న భారీ జలాశయాన్ని కటోరా హౌస్ అంటారు. దీన్ని ఆనుకునే రోడ్డు ఉంది. దానివైపు దాదాపు 5 అడుగుల ఎత్తుతో 60 మీటర్ల పొడవైన గోడ ఉంది. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మరమ్మతులు చేసినప్పుడు వరద నీటి ప్రవాహ మార్గం చెదిరిపోయింది. వర్షాల వరద ప్రవాహం గతి తప్పి, గోడను ఆనుకుని ఉన్న మట్టి జారింది. ఇటీవలి వర్షాలకు ఆ గోడ దాదాపు 40 మీటర్ల మేర కటోరా హౌస్‌లోకి పడిపోయింది. ఇక్కడ నిర్వహణలో శాస్త్రీయత లోపించటం వల్లే ఈ గోడ కూలిందని స్పష్టమవుతోంది. -
ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంలో 49 శాతం వాటా విక్రయం:జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో గతంలో నిర్ణయించిన 44.44 శాతానికి బదులు 49 శాతం వాటా విక్రయించనున్నట్టు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురువారం ప్రకటించింది. జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి టాటా గ్రూప్, సింగపూర్ సావెరీన్ వెల్త్ ఫండ్ జీఐసీతోపాటు ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఈ వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కొక్కరికి ఎంత వాటా దక్కనుందీ, డీల్ విలువలో ఏవైనా మార్పు ఉందా అన్న విషయాలను జీఎంఆర్ వెల్లడించలేదు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్, జీఐసీ, ఎస్ఎస్జీ క్యాపిటల్ సంయుక్తంగా రూ.8,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు గతేడాది జీఎంఆర్ ప్రకటించింది. పాత ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ 19.7 శాతం, జీఐసీ 14.8, ఎస్ఎస్జీ 9.9 శాతం వాటా కొనుగోలు చేయాల్సి ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విలువను రూ.18,000 కోట్లుగా లెక్కించారు. ఇక తాజా డీల్‌తో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్ ఇన్ఫ్రా 48.9 శాతం, ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్ 2.1 శాతం వాటా కలిగి ఉంటాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా విక్రయం విషయమై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ఇండియా 2019 అక్టోబరులో ఆమోదం తెలిపింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో టాటా గ్రూప్ ఎంట్రీకి ఈ డీల్ దోహదం చేస్తోంది. మరోవైపు రుణ భారం తగ్గించుకోవడానికి జీఎంఆర్‌కు తోడ్పడనుంది. ఢిల్లీతోపాటు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తోంది. -
2 బిలియన్ డాలర్ల సమీకరణలో యస్ బ్యాంక్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా 2 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. శుక్రవారం బోర్డు సమావేశం అనంతరం స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ (ఇంకా చర్చలు జరుగుతున్నాయి) 1,200 మిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థ 120 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఇతరత్రా కార్పొరేట్ల కుటుంబ కార్యాలయాలకు సంబంధించి సిటాక్స్ హోల్డింగ్స్ ఫ్యామిలీ ఆఫీస్ 500 మిలియన్ డాలర్లు, జీఎంఆర్ గ్రూప్ అండ్ అసోసియేట్స్ 50 మిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా ఫ్యామిలీ ఆఫీస్ 25 మిలియన్ డాలర్లు, ప్రముఖ ఇన్వెస్టరు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా 25 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశారు. 2 వారాలు లేదా 26 వారాల స్టాక్ సగటు ధర (ఏది ఎక్కువైతే అది) ప్రాతిపదికన షేర్ల కేటాయింపు ఉండనుంది. దీనిపై డిసెంబర్ 10న యస్ బ్యాంక్ బోర్డు మరోసారి భేటీ కానుంది. శుక్రవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు.. 2.5% క్షీణించి రూ. 68.30 వద్ద ముగిసింది. -
రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంతో కుంగిపోతున్న జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్ (జీఆర్‌ఈఎల్), అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. ఈ ప్రణాళికకు కంపెనీ రుణదాతలు ఆమోదం తెలిపారని పేర్కొంది. జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీకి రూ.2,353 కోట్ల రుణ భారం ఉంది. తొలుత దీన్లో రూ.1,412 కోట్లను చెల్లించేందుకు ఒక విధానాన్ని రూపొందించారు. రూ. 1,412కోట్లలో 20% చెల్లించేందుకు, ఇంకా తొలి ఏడాది వడ్డీల కోసం జీఎంఆర్ గ్రూప్ రూ.395 కోట్లు కేటాయిస్తుంది. మిగిలిన రూ. 1,130 కోట్ల రుణాన్ని 9% ఫ్లోటింగ్ వడ్డీతో వచ్చే 20 ఏళ్లలో చెల్లించనుంది. మొత్తం రూ. 2353 కోట్లలో రూ. 1,412 కోట్లు పోగా మిగిలిన రూ. 941 కోట్ల రుణాన్ని భవిష్యత్‌లో చెల్లుబడయ్యే సీఆర్‌పీఎస్‌గా (క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు) మార్చింది. ఈ షేర్లకు ఇప్పటినుంచి 17–20 ఏళ్ల మధ్య 0.1% వడ్డీతో చెల్లింపులు చేస్తారు. ఈ ప్రణాళిక కంపెనీకి, రుణదాతలకు మేలు చేస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎండీ గ్రంధి కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తమ గ్రూప్ మొత్తం రుణాలు తగ్గేందుకు ఈ ప్రణాళిక ఉపకరిస్తుందన్నారు. రాజమండ్రి ప్లాంట్ పనిచేసేందుకు తగిన గ్యాస్ లభిస్తుందనే నమ్మకాన్ని జీఎంఆర్ వ్యక్తంచేస్తోంది. తద్వారా జీఆర్‌ఈఎల్ నిర్వహణ కొనసాగి సీఆర్‌పీఎస్‌లు డిఫాల్ట్ కాకుండా ఉంటాయని భావిస్తోంది. 2016లో జీఆర్‌ఈఎల్ వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణకు(ఎస్డీఆర్) వెళ్లింది. 2012లో ఈ ప్లాంట్ పూర్తయింది. కానీ గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. దీంతో వ్యయాలు పెరిగి రుణభారం ఎక్కువైంది. 2015లో సంస్థ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. -
జీఎంఆర్‌కు ‘మలేసియా’ షాక్
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్‌నకు మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హడ్ (ఎంఏహెచ్‌బీ) షాక్ ఇచ్చింది. జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌తో కుదిరిన షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు తేల్చిచెప్పింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తమకున్న 11 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు విక్రయించేందుకు ఎంఏహెచ్‌బీ గతేడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ సుమారు రూ.530 కోట్లు. అయితే నిబంధనల ప్రకారం 2018 డిసెంబర్ 31లోగా ఒప్పందాన్ని సక్రమంగా అమలుపరచని కారణంగా డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ఎంఏహెచ్‌బీ ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఐఏఎల్‌లో ఎంఏహెచ్‌బీ, ఎంఏహెచ్‌బీ (మారిషస్) వాటాదారుగా ఉంటాయని వెల్లడించింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (జీహెచ్ఐఏఎల్) జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు 63%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%, తెలంగాణ ప్రభుత్వానికి 13% వాటా ఉంది. గురువారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర 1.88 శాతం తగ్గి రూ.15.65 వద్ద స్థిరపడింది. -
జీఎంఆర్ చేతికి నాగ్‌పూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టుకు అత్యధిక మొత్తాన్ని కోట్ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి, కార్యకలాపాలు, నిర్వహణను అత్యధిక మొత్తం కోట్ చేసిన కంపెనీ చేపడుతుంది. 30 ఏళ్ల నిర్వహణతో పాటు ప్రాజెక్టులో భాగంగా కొత్తగా టెర్మినల్‌ను నిర్మించాల్సి ఉంటుంది. జీవీకే సైతం నాగ్‌పూర్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి పోటీ పడింది. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరించేందుకు మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాల సంయుక్త భాగస్వామ్య కంపెనీ మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ హబ్ ఎయిర్పోర్ట్ ఎట్ నాగ్‌పూర్ (మిహాన్ ఇండియా) ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియను 2018 మార్చిలో ప్రారంభించింది. నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి 2017–18లో 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 7,800 టన్నుల కార్గో రవాణా జరిగింది. ఇక్కడి ఎయిర్‌పోర్టులో అయిదేళ్లుగా ప్రయాణికుల సంఖ్య ఏటా 11% పెరుగుతూ వస్తోంది. కార్గో రవాణా పరంగా దేశంలో 17వ స్థానంలో ఉంది. -
జీఎంఆర్‌కు మాల్దీవుల ప్రభుత్వం పన్ను నోటీసులు
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూపు కంపెనీ అయిన జీఎంఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ 20.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.130 కోట్లు) చెల్లించాలంటూ మాల్దీవుల ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్టును ముందస్తుగా రద్దు చేసుకున్నందున 271 మిలియన్ డాలర్ల పరిహారాన్ని జీఎంఆర్ గ్రూప్ కంపెనీ అయిన జీఎంఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఆర్బిట్రేషన్ మార్గంలో గెలుచుకుంది. దీంతో వ్యాపార లాభంపై పన్ను 14.4 మిలియన్ డాలర్లు, మరో 2.8 మిలియన్ డాలర్ల మేర విత్‌హోల్డింగ్ పన్ను, 3.3 మిలియన్ డాలర్ల మేర జరిమానాలు కలసి మొత్తంగా 20.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని మాల్దీవుల ఇన్‌ల్యాండ్ రెవెన్యూ విభాగం నోటీసుల్లో పేర్కొంది. -
ఆధార్‌తో నేరుగావిమానంలోకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: త్వరలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, తనిఖీల వంటివేవీ లేకుండా నేరుగా విమానం ఎక్కేయొచ్చు. టికెట్ బుకింగ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకోగానే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, బ్యాగేజ్ వంటివి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలియజేసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఫేస్ రికగ్నిషన్, వేలిముద్ర, ఐరిస్ వంటి వాటిని పరిశీలించామని, వీటిల్లో ఆధార్ అనుసంధానం ద్వారా ముఖ గుర్తింపు వ్యవస్థను ఎంచుకున్నామని ఎయిర్‌పోర్టు సీఈఓ కిశోర్ వెల్లడించారు. 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఆరంభిస్తామని, ఫలితాలు పరిశీలించాక, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకున్నాక ఈ సేవల్ని ఆరంభిస్తామని తెలియజేశారు. దశల వారీగా బెంగళూరుతో పాటూ ఇతర విమానాశ్రయాలకూ దీన్ని విస్తరిస్తామని, ఆధార్ లేని వారి కోసం బోర్డింగ్ పాస్‌లు, సెల్ఫ్ చెకిన్స్ ఉంటాయని తెలియజేశారు. జనవరిలో విస్తరణ పనులు షురూ.. ఇటీవలే జీఎంఆర్ సంస్థ 4.5 శాతం వడ్డీకి అంతర్జాతీయ మార్కెట్లో రూ.2,250 కోట్ల రుణం తీసుకుంది. దీన్లో రూ.450 కోట్లు (70 మిలియన్ డాలర్లు) హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణ పనుల కోసం వెచ్చిస్తారు. రన్‌వే–2, టెర్మినల్–2 నిర్మాణ పనులను జనవరిలో ప్రారంభించి.. ఏడాదిన్నరలో అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ తెలియజేసింది.ప్రస్తుతం ఒకే రన్‌వే ఉండగా గంటకు 32 విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. విమానాశ్రయ విస్తరణ తర్వాత వీటి సంఖ్య 50కి చేరుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రానున్న ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్ వంటి వాటి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించిందని, మెట్రో రైల్‌ను విమానాశ్రయం వరకూ విస్తరించడం, బెంగళూరు జాతీయ రహదారిలోని అరాంఘడ్ నుంచి విమానాశ్రయం వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రహదారిని 6 లైన్లకు విస్తరించనుండటం దీన్లో భాగమేనని జీఎంఆర్ తెలియజేసింది. జీఎంఆర్, ఎంఏహెచ్‌బీ సంయుక్తంగా 1.5 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు.. జీఎంఆర్ గ్రూప్‌తో తమకు పదేళ్లకు పైగా భాగస్వామ్యం ఉందని మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ) ఎండీ దతుక్ మహ్మద్ బాదిల్షామ్ ఘాజిల్ చెప్పారు. ప్రస్తుతం జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంస్థకు 11 శాతం వాటా ఉంది. గతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తమకు 10 శాతం వాటాలుండేదని, సరైన ఫలితాలు రాలేదని విరమించుకున్నామని, మళ్లీ అందులో వాటా కొనే ఆలోచన లేదని ఘాజిల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టును కూడా జీఎంఆర్ సంస్థే నిర్వహిస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. ‘‘ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల విభాగంలో అపారమైన అవకాశాలున్నాయి. అందుకే జీఎంఆర్‌తో కలసి 1.5 బిలియన్ డాలర్లతో స్పెషల్ పర్పస్ ఫండ్‌ను (ఎస్పీఎఫ్) ఏర్పాటు చేశాం. కొన్ని కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కన్సాలిడేషన్ గురించి చర్చిస్తున్నాం. ఈక్విటీ లేదా జాయింట్ వెంచర్‌గా ఆయా ప్రాజెక్ట్‌లను చేపడతాం’’ అని చెప్పారాయన. హైదరాబాద్ నుంచి 10 లక్షల పర్యాటకులు లక్ష్యం జీహెచ్ఐఏఎల్, ఎంఏహెచ్‌బీ, ఎంటీపీబీ మధ్య ఒప్పందం ఏటా హైదరాబాద్ నుంచి మలేషియాకు లక్ష మంది పర్యాటకులు వస్తున్నారని మలేషియా టూరిజం బోర్డ్ (ప్రమోషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖనీదౌద్ చెప్పారు. గతేడాది దేశం నుంచి 6.38 లక్షల మంది పర్యాటకులు వచ్చారని తెలియజేశారాయన. తెలంగాణలో మలేషియా టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి తొలిసారిగా జీఎంఆర్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్), మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ), మలేషియా టూరిజం ప్రమోషన్స్ బోర్డ్ (ఎంటీపీబీ) ఒప్పందం చేసుకున్నాయి. మూడేళ్ల కాలపరిమితి ఉండే ఈ ఎంవోయూపై ఆయా సంస్థల అధికారులు గురువారమిక్కడ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా దేశంలో మలేషియా టూరిజం ప్రమోషన్‌కు రూ.16 కోట్లు వెచ్చించనున్నట్లు ఖనీద్ తెలిపారు. చైనా, టర్కీ దేశాల్లోని పలు విమానాశ్రయాలతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. -
సెర్బియా, జమైకా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై జీఎంఆర్ ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ గ్రూప్ విదేశీ గడ్డపై మరో రెండు విమానాశ్రయ ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేయనుంది. వీటిలో సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ సమీపంలోని నికోలా టెస్లాతోపాటు, జమైకాలోని కింగ్స్టన్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటి విస్తరణ, ఆధునీకరణ పనులకు బిడ్లను దాఖలు చేయనున్నట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ తెలిపారు. బిడ్ల దాఖలు చేయడానికి కావాల్సిన అర్హతలను కంపెనీ సాధించింది. గతేడాది నికోలా టెస్లా విమానాశ్రయం నుంచి 49 లక్షలకుపైచిలుకు, కింగ్స్టన్ ఎయిర్పోర్ట్ నుంచి 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. విశాఖపట్నంలోని కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుకు సైతం బిడ్ దాఖలు చేయనున్నట్టు సిద్ధార్థ్ వెల్లడించారు. -
జీఎంఆర్ చేతికి గ్రీస్ ఎయిర్పోర్ట్
టెర్నా కన్సార్షియంతో కలసి నిర్మాణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇన్ఫ్రా దిగ్గజం టెర్నా భాగస్వామ్యంతో గ్రీస్‌లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్మాణం పూర్తయ్యాక ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ చేపడుతుంది. కన్సెషన్ పీరియడ్ 35 ఏళ్లు. హిరాక్లియో గ్రీస్‌లో రెండో అతిపెద్ద విమాశ్రయం. నాలుగేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఏటా 60 లక్షల మందికిపైగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని, ఇంత మంది ప్రయాణికులకు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోవడం లేదని కంపెనీ వెల్లడించింది. అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రం అయిన గ్రీస్‌కు ఏటా 2.4 కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారు. క్రీతి అతిపెద్ద ద్వీపమే కాదు, అత్యధిక పర్యాటకులు ఆకర్శిస్తున్న కేంద్రం కూడా. నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయంతో పర్యాటక రంగం మరింత వృద్ధి చెందుతుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల ఈ సందర్భంగా తెలిపారు. -
గ్రీస్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రేసులో జీఎంఆర్
• ప్రాజెక్టు విలువ సుమారు • 850 మిలియన్ యూరోలు • గ్రీస్ సంస్థతో కలసి బిడ్డింగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ తాజాగా గ్రీస్‌లోని క్రీట్లో కొత్త విమానాశ్రయ ప్రాజెక్టు దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రీస్‌కు చెందిన జీఈకే టెర్నా సంస్థతో కలసి కన్సార్షియంగా ఏర్పడి బిడ్ వేసినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. గ్రీస్ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ప్రాజెక్టు విలువ సుమారు 850 మిలియన్ యూరోలని (దాదాపు రూ. 6,120 కోట్లు) వివరించింది. కాంట్రాక్టు కింద క్రీట్లోని హెరాక్లియోన్ నగరంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయ డిజైన్, అభివృద్ధి, నిర్వహణ, తత్సంబంధిత రహదారుల ఏర్పాటు మొదలైన అంశాలు ఉంటాయి. ఒప్పందం 35 ఏళ్ల పాటు ఉంటుంది. దీనికి దాఖలైన ఏకైక బిడ్ తమదేనని భావిస్తున్నట్లు జీఎంఆర్ తెలిపింది. ప్రాజెక్టు దక్కిన పక్షంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ విమానాశ్రయ ఆపరేటరుగా ఉంటుంది. ఏటా 2.4 కోట్ల మంది టూరిస్టులు గ్రీస్‌ను సందర్శిస్తారని అంచనా. గ్రీస్‌లోనే అతి పెద్ద దీవి అయిన క్రీట్‌ను సందర్శించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఇక్కడి హెరాక్లియోన్ విమానాశ్రయం గ్రీస్‌లో రెండో పెద్ద ఎయిర్‌పోర్టు. అయితే, సామర్థ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నందున ప్రభుత్వం మరో విమానాశ్రయాన్ని తలపెట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత విమానాశ్రయాన్ని మూసివేయనున్నారని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. జీఎంఆర్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. ఇటీవలే గోవాలోని మోపా ఎయిరోడ్రోమ్ అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టు దక్కించుకుంది. అఉట మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో కలసి ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, గ్రీస్‌లోని రెండు దిగ్గజ నిర్మాణ కంపెనీలైన జీఈకే, టెర్నాల విలీనంతో జీఈకే టెర్నా గ్రూప్ ఏర్పడింది. నిర్మాణం, ఇంధన ఉత్పత్తి, మైనింగ్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. -
అమ్మకానికి జిఎంఆర్ చత్తీస్గడ్ ఎనర్జీ
-
వాటాల విక్రయాలపై జీఎంఆర్ కసరత్తు
• చత్తీస్‌గఢ్ విద్యుత్ ప్లాంటుపై చర్చలు • హైదరాబాద్ ఎయిర్‌పోర్టుపై సీడీపీక్యూ ఆసక్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారీ రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టిన మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ మరికొన్ని వ్యాపారాల్లో వాటాలను విక్రయించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో బాగంగా జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్) అనుబంధ సంస్థ జీఎంర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీలో (జీసీఈఎల్) వాటాల విక్రయంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్‌తో పాటు అమెరికాకు చెందిన లోన్ స్టార్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జీసీఈఎల్కు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మొత్తం 1,370 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రెండు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. సంస్థకు దాదాపు రూ. 8,290 కోట్ల రుణభారం ఉంది. దీన్ని 2017 నుంచి తిరిగి చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ. 750 కోట్ల విలువ చేసే రెండు క్యాప్టివ్ గనులు కూడా ఉన్న జీసీఈఎల్ విలువ సుమారు రూ. 12,500 కోట్ల మేర ఉండొచ్చని అంచనా. అయితే, జీసీఈఎల్కు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లేకపోవడం డీల్‌కు అడ్డంకిగా మారొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం స్వల్పకాలిక పీపీఏలే ఉన్న జీసీఈఎల్.. తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదరవచ్చని భావిస్తోంది. సెంబ్‌కార్ప్, లోన్ స్టార్ ఫండ్స్.. రెండూ కూడా ఇటీవల సన్ఎడిసన్కి చెందిన భారత వ్యాపార విభాగం కొనుగోలు కోసం షార్ట్‌లిస్ట్ అయిన సంస్థలే. అయితే, దీన్ని అంతిమంగా హైదరాబాద్‌కి చెందిన గ్రీన్కో ఎనర్జీ కొనుగోలు చేసింది. విమానాశ్రయంలో 30 శాతం వాటాలు.. జీఎంఆర్‌కి చెందిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో వాటాలు తీసుకోవడంపై కెనడా ఫండ్ సంస్థ సీడీపీక్యూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 25-30 శాతం వాటా కొనుగోలు చేయాలని సీడీపీక్యూ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 350-400 మిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. సీడీపీక్యూ సంస్థ.. టీవీఎస్ గ్రూప్‌లో భాగమైన టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌లో దాదాపు రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అటు అబూ ధాబి ఇన్వెస్ట్మెంట్ సంస్థ కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. విద్యుత్, విమానాశ్రయాలు తదితర రంగాల్లో విస్తరించిన జీఎంఆర్ గ్రూప్ రుణభారం దాదాపు రూ. 43,000 కోట్ల మేర ఉంది. దీన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా కొన్నాళ్ల క్రితమే జీఎంఆర్ ఎనర్జీ సంస్థలో 30 శాతం వాటాను దాదాపు 300 మిలియన్ డాలర్లకు మలేషియా సంస్థ టెనగా నేషనల్ బెర్హాద్‌కి విక్రయించింది. ఆ తర్వాత మారు ట్రాన్స్మిషన్ సర్వీసెస్‌లో 74 శాతం, అరావళి ట్రాన్స్మిషన్ సర్వీసెస్‌లో 49 శాతం వాటాలను అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించింది. -
అదానీ చేతికి జీఎంఆర్ విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ రుణభారాలను తగ్గించుకునే దిశగా వివిధ అసెట్స్‌ను విక్రయిస్తోంది. గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్) తాజాగా రెండు విద్యుత్ పంపిణీ ప్రాజెక్టుల్లో వాటాలను అదానీ ట్రాన్స్మిషన్కు (ఏటీఎల్) విక్రయిస్తోంది. మరు ట్రాన్స్మిషన్ సర్వీసెస్ (ఎంటీఎస్ఎల్), అరావళి ట్రాన్స్మిషన్ సర్వీసెస్ (ఏటీఎస్ఎల్)లో వాటాల విక్రయానికి ఏటీఎల్తో జీఈఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 100 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ పేర్కొంది. అదనంగా మిగతా వాటాలను కూడా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రస్తుతానికి ఎంటీఎస్ఎల్లో 74 శాతం, ఏటీఎస్ఎల్లో 49 శాతం వాటాలను ఏటీఎల్కి బదలాయించనున్నట్లు తెలిపింది. ఈ అసెట్స్‌కు సంబంధించి ఏపీటీఈఎల్ ముందున్న వివిధ అప్పీళ్ల ద్వారా రావాల్సిన రూ. 120 కోట్లు కూడా వస్తే జీఈఎల్కు మొత్తం రూ. 220 కోట్లు లభించగలవని జీఎంఆర్ పేర్కొంది. 2010లో బిల్డ్, ఓన్, ఆపరేట్, మెయింటెయిన్ (బూమ్) ప్రాతిపదికన జీఎంఆర్ ఎనర్జీ ఈ రెండు ప్రాజెక్టులను దక్కించుకుంది. రాజస్తాన్‌లో ఎంటీఎస్ఎల్ 270 కి.మీ. మేర, ఏటీఎస్ఎల్ 96 కి.మీ. మేర పంపిణీ లైన్లను నిర్వహిస్తున్నాయి. మార్చి ఆఖరు నాటికి ఈ రెండు ప్రాజెక్టుల రుణం రూ. 324 కోట్ల మేర ఉంది. విక్రయ లావాదేవీ పూర్తయ్యాక...జీఎంఆర్ గ్రూప్ కన్సాలిడేటెడ్ రుణం తగ్గనుంది. ఈ డీల్‌తో ఆర్థికంగా కంపెనీ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడగలదని జీఎంఆర్ గ్రూప్ విద్యుత్ విభాగం బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. -
ఏవియేషన్ వృద్ధిలో విమానాశ్రయాలే కీలకం
న్యూఢిల్లీ: ఏ దేశంలోనైనా పౌర విమానయాన రంగం వృద్ధికి మెరుగైన మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలే కీలకమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు. జీఎంఆర్ గ్రూప్ సారథ్యంలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(డీఐఏఎల్) వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. మెరుగైన నిర్వహణ, సాంకేతికంగా అత్యాధునిక సేవలు మొదలైన వాటికి భవిష్యత్‌లోనూ డీఐఏఎల్ పెద్ద పీట వేయాలన్నారు. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితర కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏటా 6.2 కోట్ల మంది ప్రయాణికులు, 1.5 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్ధ్యంతో ఢిల్లీ విమానాశ్రయం సేవలందిస్తోందని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. -
కాకినాడ వద్ద జీఎంఆర్ ఎల్ఎన్జీ టెర్మినల్
హైదరాబాద్: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ గ్రూప్ కాకినాడ వద్ద ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) టెర్మినల్ ఏర్పాటు యత్నాల్లో ఉంది. తొలుత 17.5 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటు రూ.471 కోట్లతో ఏర్పాటుకానున్నట్లు ఇటీవల జరిగిన పర్యావరణ శాఖ కమిటీ సమావేశపు మినిట్స్‌లో పేర్కొన్నారు. సామర్థ్యంలో 8.5 లక్షల టన్నుల గ్యాస్‌ను జీఎంఆర్ ఎనర్జీ సొంత అవసరాలకు వాడుకుంటుంది. మిగిలినది 450 కిలోమీటర్ల పరిధిలో పైపుల ద్వారా గృహావసరాలకు, ఇతర వినియోగదార్లకు సరఫరా చేస్తారు.