హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణలో ఉన్న జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరు మారింది. ఇక నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తారు. విమానాశ్రయేతర వ్యాపారాలను విడదీసిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త పేరు కార్యరూపంలోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీతోపాటు ఫిలిప్పైన్స్‌లోని సెబు విమానాశ్రయాలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణలో ఉన్నాయి. ఇండోనేషియాలోని కౌలనాము ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ హక్కులను సంస్థ చేజిక్కించుకుంది. గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గ్రీస్‌లోని క్రీతి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్ట్రాగామ్‌లో కొత్త ఫీచర్: చూశారా మీరు?)
Comments
Please login to add a commentAdd a comment