
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (డీఐఏఎల్) మరో 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్) దక్కించుకుంది. డీఐఏఎల్‌లో తనకున్న 10 శాతం వాటాను ఫ్రాపోర్ట్ ఏజీ ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్ సరీ్వసెస్ వరల్డ్‌వైడ్ విక్రయించింది.
డీల్ విలువ 126 మిలియన్ డాలర్లు. డీల్ తదనంతరం డీఐఏఎల్‌లో జీఐఎల్ వాటా 74 శాతానికి చేరింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. వాటా కొనుగోలు ప్రక్రియ 180 రోజుల్లో పూర్తి అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సోమవారం తెలిపింది.