జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023కు గాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ‘హైదరాబాద్’ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఏడాదికి 1.5-2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 400 విమానాశ్రయాలు ఈ పురస్కారం కోసం పోటీ పడ్డాయి. 30కి పైగా పనితీరు సూచికల ఆధారంగా అంతిమ విజేతను నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్..
ఈ పురస్కారం సాధించడంపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్వహణలో భాగం పంచుకుంటున్న అందరికీ దీన్ని అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ విస్తరణ ప్రణాళికలు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. టెర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment