shamshabad airport
-
రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు కుప్పకూలారు. గోవా నుంచి వచ్చిన ప్రయాణికుడు నితిషా, జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికురాలు సకీనా అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.ఇదీ చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు -
శంషాబాద్‌లో ప్రైవేట్ జెట్ టెర్మినల్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేట్ విమానాల యజమానులు, సెలబ్రిటీలు, ఇతర వ్యాపారులు వారి అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపింది. వీరి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని చెప్పింది. వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌ను ప్రారంభించినట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ జీఎంఆర్ పేర్కొంది.ఈ సందర్భంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ..‘వ్యాపారం లేదా వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా తరచూ ప్రయాణించే ప్రీమియం ప్యాసింజర్లకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించాం. దేశంలో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతోంది. వీరు ప్రయాణ సమయాల్లో సాధారణ ప్రజలకంటే భిన్నంగా ప్రత్యేక సేవలు కోరుకుంటున్నారు. చాలామంది వ్యాపార కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తోపాటు దాని చుట్టు పక్కన ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. దాంతో ధనవంతుల రాకపోకలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారికి అవసరాలు తీర్చేలా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ టెర్మినల్‌ను ప్రారంభించాం. దాంతో జీఎంఆర్ గ్రూప్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధిహైదరాబాద్ ఇప్పటికే ఫార్మా రంగంలో దూసుకుపోతుంది. ఇక్కడ తయారైన ఫార్మా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళజాతి సంస్థలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ రంగంలో నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. దాంతో వారి ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది. -
పఠాన్ చెరువుకు మెట్రో విస్తరణ..
-
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్‌పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ పురస్కారం
జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023కు గాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ‘హైదరాబాద్’ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఏడాదికి 1.5-2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 400 విమానాశ్రయాలు ఈ పురస్కారం కోసం పోటీ పడ్డాయి. 30కి పైగా పనితీరు సూచికల ఆధారంగా అంతిమ విజేతను నిర్ణయించారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఈ పురస్కారం సాధించడంపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్వహణలో భాగం పంచుకుంటున్న అందరికీ దీన్ని అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళికలు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. టెర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు జాతీయ పురస్కారం
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం దక్కింది. దీన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ప్రతినిధులు అందుకున్నారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. 2030 నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిదుసార్లు నేషనల్ ఎనర్జీ లీడర్, తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలు వరించాయని తెలిపారు. -
ఈ రూట్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్లపై అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్‌పోర్టును నిలిపివేస్తూ కొత్తగా ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు రెండు రూట్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కొత్త మార్గాలపై కసరత్తుకు సన్నద్ధమైంది. ఈ రెండు రూట్లలో మెట్రో నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైల్ అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అవసరమైన భూసేకరణ, అలైన్మెంట్ మార్గం, అంచనా వ్యయం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. తక్కువ భూసేకరణతో.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పి–7 రోడ్ రూట్లో, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా, బార్కాస్, పహాడీషరీఫ్ రూట్లో మెట్రో నిర్మాణాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 20 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 12 కి.మీ ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం– శంషాబాద్ రూట్ 31 కి.మీ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రూట్లలో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూరం తక్కువగా ఉండడంతో పాటు పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టవచ్చు. అలాగే ఎయిర్‌పోర్టు రూట్‌ను పొడిగించి ఫార్మాసిటీ స్థానంలో ప్రతిపాదించిన మెగా టౌన్షిప్ వరకు భవిష్యత్‌లో పెద్దగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. నిర్మాణంపై ముందుకు సాగేదెలా..? రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని గత ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ మెట్రోగా నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్ రూట్లను ఎల్అండ్టీ సంస్థ పీపీపీ మోడల్లో నిర్మించగా ఎయిర్‌పోర్టు మెట్రోను సుమారు రూ.6,250 కోట్లతో సొంతంగా చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పాత అలైన్‌మెంట్‌ను నిలిపివేసి కొత్త అలైన్మెంట్లను ప్రతిపాదించిన నేపథ్యంలో సొంతంగా నిర్మిస్తుందా? లేక ఏదైనా నిర్మాణ సంస్థకు పీపీపీ తరహాలోనే అప్పగిస్తుందా? అనే అంశం స్పష్టం కావాల్సి ఉంది. 31 కి.మీ రాయదుర్గం– శంషాబాద్ రూట్‌ను రూ.5,888 కోట్లతో నిర్మించేందుకు ఎల్అండ్టీ, ఎన్సీసీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే తక్కువ నిధులతోనే ఎల్బీనగర్– ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో నిర్మించాల్సిన బాధ్యత ఎల్‌అండ్‌టీపై ఉంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు కేవలం 12 కి.మీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు విస్తరించినా రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చే అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లలోనే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపడితే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓల్డ్‌సిటీ మెట్రో నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలి. ఈ రెండు రూట్లు పూర్తయితే గానీ ఎయిర్‌పోర్టు వరకు విస్తరణ సాధ్యం కాదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులను సకాలంలో చేపట్టినా ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని అంచనా. రియల్ ఎస్టేట్ డీలా పడే ప్రమాదం.. రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్‌ను నిలిపివేయడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఐటీ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రతిరోజూ ఎయిర్‌పోర్టు నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి రానుండడంతోనే ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ భూముల ధరలు పెరిగాయి. కోకాపేట్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో అనూహ్యమైన రియల్ భూమ్ కనిపించింది. తాజాగా ఈ రూట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డీలా పడుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
తొలిసారి హైదరాబాద్ గడ్డపై సీడబ్ల్యుసీ సమావేశం
-
Shamshabad Airport: సారీ.. ఎయిర్‌పోర్టుకు రాలేం
హైదరాబాద్: క్యాబ్‌వాలాలు సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సేవలను నిలిపివేస్తూ ‘లో ఫేర్..నో ఎయిర్’ ప్రచారం చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి నడిపే క్యాబ్‌డ్రైవర్లకు సరైన ఆదాయం లభించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సకాలంలో క్యాబ్‌లు లభించక.. ఒకవేళ సర్వీసులు బుక్ అయినప్పటికీ డ్రైవర్లు నిరాకరించడం వల్ల ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో క్యాబ్‌లు లభించక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ పుష్పక్ బస్సులు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, సొంత వాహనాలు మినహాయించి మరో 5 వేల క్యాబ్‌లు ఇటీవల వరకు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉండేవి. కానీ కొంతకాలంగా ఎయిర్‌పోర్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికి వెళ్లినా తమకు రూ.500 నుంచి రూ.700 వరకు మాత్రమే లభిస్తున్నాయని. దీంతో ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. ఇది మరింత భారంగా మారిందని తెలంగాణ గ్రిగ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీపెయిడ్ ట్యాక్సీలకు ఒక ట్రిప్పుపైన రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా తమకు మాత్రం అతి తక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. దీంతో ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు నడిపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఎయిర్‌పోర్టుకు నడిచే క్యాబ్‌లకు ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున ఇవ్వాలని, అగ్రిగేటర్ సంస్థలకు ఇచ్చే కమిషన్‌ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.21 లక్షల బంగారం పట్టివేత
హైదరాబద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు. ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. Based on pax profiling & efficient surveillance, @hydcus officers at RGIA intercepted one pax arriving from Sharjah by Indigo 6E 1422 on 21.8.23 and seized #gold weighing 397 gm valued at Rs 20.59 lakhs. @cbic_india @DDNewslive pic.twitter.com/jkM9Q5BT97 — CGST & Customs Hyderabad Zone (@cgstcushyd) August 21, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ -
శంషాబాద్: అండర్వేర్లో బంగారం పట్టివేత
సాక్షి, క్రైమ్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అండర్వేర్లో బంగారం తరలిస్తుండగా.. ఆ ముఠాను అధికారులు పట్టేసుకున్నారు. దాదాపు రూ. కోటి 37లక్షలు విలువ చేసే.. 2.279 కిలోలు బంగారం సీజ్ చేశారు అధికారులు. అలాగే.. లక్షకుపైగా విదేశీ సిగిరెట్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మొదటి బంగారం కేసు.. 1196 గ్రాముల బంగారం 72 లక్షల బంగారాన్ని ఎయిర్ క్రాఫ్ట్ సీట్ వద్ద పేస్టు రూపంలో అమర్చి తీసుకొని హైదరాబాద్ వచ్చిన రసల్ కైమా ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. రెండో కేసులో 752 గ్రాముల బంగారాన్ని కట్ పీస్ గోల్డ్ బార్ గా పెట్టుకొని కువైట్ వయా దుబాయ్ మీదిగా హైదరాబాద్ వస్తూ పట్టుపడ్డాడు విలువ 45 లక్షలు. మూడో కేసులో 331 గ్రాముల స్మగ్ల్డ్ గోల్డ్ విలువ 20 లక్షలు ప్రయాణికుడు షార్జా వయా దుబాయ్ నుండి వస్తూ పట్టుబడ్డాడు మరో కేసులో 1,10,000 సిగరెట్ ప్యాక్స్ ని ముగ్గురు ప్రయాణికులు కంబోడియా బ్యాంకాక్ నుండి వస్తు పట్టుబడిన ముగ్గురు వద్ద విదేశీ సిగరెట్లు. ఇదీ చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. పోలీసులే షాకయ్యారు -
కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలుగు విద్యార్థులు
-
మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు
మణిపూర్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 157 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో మణిపూర్ నుంచి ఏపీ, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తొలి విమానంలో 108 విద్యార్థులు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విద్యార్థలను తమ స్వస్థలాలకు చేరేవేసేందుకు రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మరో ప్రత్యేక విమానంలో 49 విద్యార్థులు కోల్‌కత్తాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా ఏపీ అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కోల్‌కతాకు ప్రత్యేకంగా ఇద్దరు అధికారులు పంపింది. అంతేగాక విద్యార్థులకు విమాన టికెట్లను ప్రభుత్వమే బుక్ చేసింది. విద్యార్థుల భోజన, రవాణా సదుపాయలన్ని ప్రభుత్వం సొంత ఖర్చుతో అందిస్తుంది. చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం సీఎంకు ధన్యవాదాలు మణిపూర్ చదువుతున్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకువస్తున్న నేపథ్యంలో వారి తలిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ ఎన్ఐటీలో కార్తీక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తిరుపతి కొర్లగుంటకు చెందిన కార్తీక్ తల్లిదండ్రులు రెడ్డప్ప, మాధవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ ఘటనతో తమ కొడుక్కి ఏం జరుగుతుందో అని ఆందోళన చెందామని, ఎయిర్‌పోర్టు నుంచి కార్తీక్ ఫోన్ చేశాడని పేర్కొన్నారు. సీఎం జగన్ దయవల్ల ఏపీ విద్యార్థులు అందరూ వెనక్కి వస్తున్నారని, ఈ మేరకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది: అమిత్ షా
Updates.. - శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమిత్ షా. అమిత్ షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఇది ట్రైలర్ మాత్రమే.. 2024లో ఫుల్ పిక్చర్ కనిపిస్తోంది ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు ప్రధాని కుర్చీ ఖాళీ లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది అవినీతి పరులను బీజేపీ జైళ్లకు పంపించడం ఖాయం కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉంది తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు ఎంఐఎంకు భయపడేది లేదు తెలంగాణలో అవినీతి గంగలా ప్రవహిస్తోంది ఎంఐఎం కోసమే విమోచన దినం జరపడం లేదు ఉద్యోగాల భర్తీ పేరుతో దోచుకుంటున్నారు 9 ఏళ్లుగా టీచర్ల నియామకాలు చేపట్టలేదు తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తాం బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు కేసీఆర్‌ను గద్దె దింపేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది బండి సంజయ్ ఏం తప్పు చేశారు పేపర్ లీకేజీపై బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అందుకే సంజయ్‌ను కేసీఆర్ సర్కార్ జైల్లో వేసింది బండి సంజయ్ అరెస్ట్‌ను మీరు సమర్థిస్తారా? పేపర్ లీకేజ్‌తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. - బండి సంజయ్ మాట్లాడుతూ.. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నన్ను ఎనిమిది గంటల పాటు రోడ్లపై తిప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే బీజేపీ ధృడ సంకల్పం. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తాం. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా చేవెళ్ల వచ్చారు. - చేవెళ్ల చేరుకున్న అమిత్ షా - చివరి నిమిషంలో అమిత్ షా టూర్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవాటెల్‌కు అమిత్ షా వెళ్లారు. - ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితలపై చర్చించారు. - అమిత్ షా.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై మరింత దూకుడు పెంచాలి. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అధికారమే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలి. బీఆర్ఎస్ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. - శంషాబాద్ నుంచి చేవెళ్ల సభకు బయలుదేరిన అమిత్ షా. - అమిత్ షాకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు. - కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్ చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. - వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు.. వాహనాలను లోపలికి అనుమతిస్తున్నారు. లిస్టులో పేరు ఉన్న వాళ్లని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. - ఏటీసీ సెంటర్ నుంచి అమిత్ షా నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్నారు. - అమిత్ షా సుమారు రెండు గంటల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. - సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. - రాత్రి 7 గంటలకు అమిత్ షా తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. - రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నుంచి అమిత్ షా ఢిల్లీకి బయలుదేరుతారు. -
శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు
శంషాబాద్ (హైదరాబాద్): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ సిద్ధమైంది. ప్రధాన టెరి్మనల్‌కు అనుసంధానంగా నిర్మించిన ఈ డిపార్చర్ కేంద్ర భవనంలో ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రయాణికులు కొత్త టెరి్మనల్‌లోని డిపార్చర్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎయిర్‌పోర్టు వర్గాలు సూచించాయి. సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంతో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపాయి. చదవండి: Group 4 Notification: ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్టు
సాక్షి, మల్లాపూర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం సావర్కర్‌నగర్ అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో మగ్దూం అలీఖాన్ (44), మల్లికార్జున్ (55) ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నాచారం పోలీసులు సోమవారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ విటుడిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! ఏసీ ఓల్టేజీ కన్వర్టర్‌లో బంగారం స్మగ్లింగ్ శంషాబాద్: అక్రమంగా తరలించిన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎఫ్‌జెడ్–439 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న ఏసీ వోల్టేజీ కన్వర్టర్‌ను పరిశీలించగా అందులో 316 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.15.71 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వక్రమార్గంలో బంగారం బిస్కెట్లు, 9 ఐఫోన్లు, ధిరామ్‌లు.. డాలర్లు.
సాక్షి, శంషాబాద్: ఒకే రోజు మూడు వేర్వేరు కేసులో అక్రమంగా రవాణా జరుగుతున్న బంగారం, విదేశీకరెన్సీ, ఐఫోన్లను శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అక్రమంగా తీసుకొచ్చిన 9 ఐఫోన్లు బయటపడ్డాయి. వీటి విలువ 8.37 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం ఇలా.. ఓ మహిళా ప్రయాణికురాలు దుబాయ్ నుంచి సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తనిఖీల్లో భాగంగా ఆమె వద్ద ఉన్న చేతి సంచిలో మూడు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. 350 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 17.69 లక్షలు ఉంటుందని అధికారులు నిర్దారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధిరామ్‌లు..డాలర్లు.. ఇద్దరు మహిళా ప్రయాణికులు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి షార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఐఎస్ఎఫ్ చేపట్టిన తనిఖీల్లో వారి వద్ద 55000 యుఏఈ ధిరామ్‌లు, 970 యూఎస్ డాలర్లు బయటపడ్డాయి. సీఐఎస్ఎస్ అధికారులకు నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ విలువ భారత కరెన్సీలో 11.49 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నట్లు.. పక్కా సమాచారం ప్రకారం అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, అధికారులు రూ. 34 లక్షల విలువైన బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రియాద్ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మరో నెలరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు.. అంతలోనే.. -
‘శంషాబాద్’ విస్తరణకు సహకరిస్తా
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సింధియా శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సింధియా గౌరవార్థం సీఎం కేసీఆర్ ఆయన్ను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్నందున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందన్నారు. వైద్య, వాణిజ్య, ఐటీ, పర్యాటక రంగాల హబ్‌గా హైదరాబాద్ మారిందని, దీంతో నగరానికి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి పెరిగిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్నేయాసియా, ఐరోపా, అమెరికాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి పౌర విమానయాన శాఖ నుంచి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలును అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మామునూరు ఎయిర్‌పోర్టులో త్వరలో ఏటీఆర్ కార్యకలాపాలు.. రాష్ట్రం ప్రతిపాదించిన 6 విమానాశ్రయాల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టులో ఏటీఆర్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని సింధియా తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్‌పల్లి)లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాంకేతిక అనుమతి ఇస్తామమన్నారు. అలాగే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును వైమానిక దళం ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్‌నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలను పున:పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌కు సింధియా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రు లు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, పౌర విమానయాన శాఖ సెక్రటరీ ప్రదీప్ కరోలా, జాయింట్ సెక్రటరీ దూబే, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. చదవండి: యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం -
చిక్కుల్లో పడ్డ పరిటాల సిద్దార్థ
-
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌తో పట్టుబడ్డ సిద్ధార్థ్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్‌పోర్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధార్థ్ లైసెన్స్డ్ గన్‌కు బ్యాగులో దొరికిన బులెట్‌కు వ్యత్యాసం ఉంది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్ పొందిన సిద్ధార్థ్ బ్యాగులో.. 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయ్యింది. (చదవండి: పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?) అయితే సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గుర్తించారు పోలీసులు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్‌కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అనంతపూర్‌కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్‌తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పరిటాల సునీత కుమారుడి బ్యాగ్‌లో బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్ధ్‌పై శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత నిబంధనలకు విరుద్ధంగా బ్యాగ్‌లో బుల్లెట్‌తో విమానం ఎక్కడానికి ప్రయతి్నంచిన నేపథ్యంలో ఆయనపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పారీ్టలో యువ నాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఉదయం 5.26కి ఇండిగో విమానం ఎక్కడానికి వచి్చన ఆయన తన బ్యాగేజ్‌ను కౌంటర్లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్‌ను స్కానింగ్ చేసిన నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదుచేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇన్చార్జ్ ఎ.సన్యాసినాయుడు బుల్లెట్‌తో పాటు సిద్ధార్థ్‌ను వారికి అప్పగించారు. పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్డ్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ తెలిపారు. బ్యాగ్‌లో ఉందన్న విషయం తెలియకే విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు. చదవండి: నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ -
ఎయిర్‌పోర్టులో రూ. కోటి విలువైన ఐఫోన్లు పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ సుంకం చెల్లించకుండా వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చిన 80 ఐఫోన్లను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి షార్జా నుంచి జి9458 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లగేజీ బెల్టు వద్ద ఓ బ్యాగును వదిలేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానించి బ్యాగును తెరిచి చూడగా అందులో సుమారు రూ. 1,00,65,000 విలువ చేసే 80 ఐఫోన్లను గుర్తించారు. బ్యాగును తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు దాన్ని తరలించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్‌లో భాగంగా ఐఫోన్లను తీసుకొచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌లో క్యూ మేనేజ్మెంట్
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎంట్రీ, చెకిన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ ప్రదేశాల్లో రద్దీ నివారణ కోసం ఆల్గో విజన్ టెక్నాలజీ సంస్థ గెయిల్ సహకా రంతో క్యూ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ కెమెరాల ద్వారా కృత్రిమ మేధ, వీడియో అనలిటిక్స్ కలిపి క్యూ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేసింది. ఈ విధానంతో ప్రయాణికులు నిరీక్షించే సమయాన్ని నిర్ధారించి ఏయే ప్రాంతాల్లో ఎంత రద్దీ ఉంది? ఎంత సమయం వేచి ఉండాలనే సమాచారాన్ని డిస్ప్లే ద్వారా తెలుపుతుంది. దీంతో ప్రయాణికులు రద్దీలేని మార్గాలు ఎంచు కుని ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లొచ్చు. కెమెరా ట్యాంపరింగ్, పార్కింగ్ ఉల్లంఘన తదితర వాటిని కూడా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.