
సాక్షి, హైదరాబాద్ : ఓ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.... అర్థరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయం దగ్గర క్యాబ్‌లో ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా పోలీసులు రావడంతో డ్రైవర్ హడావిడిగా అక్కడి నుంచి కారును పోనిచ్చాడు. అయితే క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించిన యాదయ్య అనే ప్రయాణికుడి షర్టు కారులోపల ఇరుక్కోంది. ఇది గమనించని క్యాబ్ డ్రైవర్ ఎనిమిది కిలోమీటర్లపాటు కారు పోనిచ్చాడు. యాదయ్యను కారు లాక్కెడంతో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కారు బయట మృతదేహం వేలాడుతుండటంతో... శంషాబాద్ టోల్‌గేట్ వద్ద వాహనదారులు గమనించి..కేకేలు వేయడంతో క్యాబ్ వదిలి డ్రైవర్ అక్కడ నుంచి పరారైయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతుడి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.