శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేట్ విమానాల యజమానులు, సెలబ్రిటీలు, ఇతర వ్యాపారులు వారి అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపింది. వీరి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని చెప్పింది. వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌ను ప్రారంభించినట్లు ఎయిర్‌పోర్ట్ నిర్వహణ సంస్థ జీఎంఆర్ పేర్కొంది.
ఈ సందర్భంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ..‘వ్యాపారం లేదా వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా తరచూ ప్రయాణించే ప్రీమియం ప్యాసింజర్లకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించాం. దేశంలో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతోంది. వీరు ప్రయాణ సమయాల్లో సాధారణ ప్రజలకంటే భిన్నంగా ప్రత్యేక సేవలు కోరుకుంటున్నారు. చాలామంది వ్యాపార కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తోపాటు దాని చుట్టు పక్కన ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. దాంతో ధనవంతుల రాకపోకలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారికి అవసరాలు తీర్చేలా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ టెర్మినల్‌ను ప్రారంభించాం. దాంతో జీఎంఆర్ గ్రూప్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.
ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధి
హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా రంగంలో దూసుకుపోతుంది. ఇక్కడ తయారైన ఫార్మా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళజాతి సంస్థలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ రంగంలో నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. దాంతో వారి ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment