Jet aircraft
-
శంషాబాద్‌లో ప్రైవేట్ జెట్ టెర్మినల్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేట్ విమానాల యజమానులు, సెలబ్రిటీలు, ఇతర వ్యాపారులు వారి అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపింది. వీరి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని చెప్పింది. వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌ను ప్రారంభించినట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ జీఎంఆర్ పేర్కొంది.ఈ సందర్భంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ..‘వ్యాపారం లేదా వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా తరచూ ప్రయాణించే ప్రీమియం ప్యాసింజర్లకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించాం. దేశంలో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతోంది. వీరు ప్రయాణ సమయాల్లో సాధారణ ప్రజలకంటే భిన్నంగా ప్రత్యేక సేవలు కోరుకుంటున్నారు. చాలామంది వ్యాపార కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తోపాటు దాని చుట్టు పక్కన ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. దాంతో ధనవంతుల రాకపోకలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారికి అవసరాలు తీర్చేలా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ టెర్మినల్‌ను ప్రారంభించాం. దాంతో జీఎంఆర్ గ్రూప్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధిహైదరాబాద్ ఇప్పటికే ఫార్మా రంగంలో దూసుకుపోతుంది. ఇక్కడ తయారైన ఫార్మా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళజాతి సంస్థలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ రంగంలో నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. దాంతో వారి ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది. -
200 వైడ్‌బాడీ జెట్లు కొనుగోలు చేయనున్న ప్రముఖ సంస్థ
మిడిల్ ఈస్ట్ ఎయిర్ క్యారియర్ ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా ఎయిర్‌బస్ ఏ350ఎస్, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.జులై నెల చివరినాటికి బ్రిటన్‌లో జరగబోయే ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’లో విమానాల కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. బ్లూమ్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం..ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. వైడ్‌బాడీ జెట్లుగా పేరున్న ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తుంది. దీనిపై ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’ నిర్ణయం వెలువడనుంది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే వైడ్‌బాడీ జెట్లపై విమానకంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి సంస్థ వీటిని కొనుగోలు చేయనుంది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావంఈ డీల్ వివరాలకోసం ఎయిర్‌బస్‌ను సంప్రదించినపుడు విమానాల అవసరాల గురించి కస్టమర్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపింది. అయితే ఈ డీల్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఖతార్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను విస్తరించడానికి 100 నుంచి 150 వైడ్‌బాడీ జెట్లను ఆర్డర్ చేయనుందని బ్లూమ్‌బర్గ్ మార్చిలోనే నివేదించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌లతో ముందస్తు చర్చలు జరుపుతోందని గతంలో తెలిపింది. -
నల్ల సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్.. రష్యా పనే..
కీవ్: రష్యా యుద్ధ విమానం నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను ఢీకొట్టింది. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో అమెరికా సైన్యం తమ డ్రోన్‌ను కిందకు దించింది. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్‌ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. తాజా సంఘటన గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షుడు జో బైడెన్‌కు తెలియజేశారు. నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్‌లో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ–27 ఫైటర్ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయని, అందులో ఒక విమానం అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను ఢీకొట్టిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు -
యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!
-
Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాల మధ్య నుంచి గురువారం ఓ పేద్ద యుద్ధ విమానం రయ్యిన దూసుకుపోయింది. ఆకాశాన్నంటే భవనాల మధ్య మెలికలు తిరుగుతూ ఆ విమానం చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ భవనాల్లో ఉన్న వారు ఒకింత ఆందోళన చెందారు. ఇంత ధైర్యమా..! ఏదైనా జరగరానిది జరిగితే... అంటూ ముక్కున వేలేసుకున్నారు. అయితే.. సుశిక్షితులైన పైలెట్లు నడిపిన ఆ విమానం సాదా సీదాది కాదు. ఆస్ట్రేలియా రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 కార్గో విమానం. రివర్ ఫ్రంట్ ఉత్సవాలకు ముందస్తుగా చేసిన రిహార్సల్లో భాగంగా ఆ విమానం ఇలా విన్యాసాలు చేసింది. స్థానికులు మాత్రం ఇదేమంత పెద్దగా పట్టించుకోవాల్సింది కాదని అంటున్నారు. ఆకాశహర్మ్యాల మధ్యన ఉన్న నదిపైనే ఆ విమానం ఎక్కువగా తిరిగిందని చెబుతున్నారు. అయినా.. ఇది చాలా సాహసోపేతమైన విన్యాసం అని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా దాడిని గుర్తు చేస్తూ ట్వీట్లు పెట్టారు. -
‘ఎంఐ 17 వీ5 హెలికాఫ్టర్ కూల్చివేత తప్పిదమే’
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం ఫిబ్రవరి 27న ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్‌ను కూల్చడం భారీ తప్పిదమని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అన్నారు. ఎల్ఓసీ వద్ద భారత్, పాకిస్తాన్ యుద్ధ విమానాలు కాల్పులు జరిపిన రోజు జరిగిన ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బంది, ఓ పౌరుడు మరణించిన సంగతి తెలిసిందే. ఇది తమ పొరపాటేనని, దీన్ని తాము అంగీకరించామని ఎయిర్ చీఫ్ స్పష్టం చేశారు. మన క్షిపణే యుద్ధ విమానాన్ని ఢీ కొందని, ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారులపై చర్యలు చేపడతామని చెప్పారు. గత వారంలో ఈ ఘటనపై విచారణ జరిగిందని, దీనిపై నిర్వహణపరమైన క్రమశిక్షనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. బాలాకోట్‌లో ఐఎఎఫ్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించిన మరుసటి రోజు శ్రీనగర్ సమీపంలోని బుద్గాం వద్ద ఎంఐ17 వీ5 హెలికాఫ్టర్ కూలిన సంగతి తెలిసిందే. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పర్యవేక్షించిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన పది నిమిషాలకే కుప్పకూలింది. రెండు ముక్కలైన ఎంఐ-17 హెలికాఫ్టర్ వెనువెంటనే మంటల్లో చిక్కుకుంది. కాగా, బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడి దృశ్యాల వీడియోను ఎయిర్ చీప్ భదౌరియా విడుదల చేశారు. -
జెట్ ఉద్యోగులకు జీతాల్లేవ్..!
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,300 కోట్ల నష్టాలను ప్రకటించి, వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదుచేసిన ఈ సంస్థ.. కనీసం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. రూ.75వేలకు మించి జీతాలు ఉన్నటువంటి ఏ1–ఏ5, ఓ2, ఓ3 గ్రేడ్ ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన జీతాలు అందగా.. ఎం1, ఎం2, ఈ1, ఇతర గ్రేడ్ల వారికి ఇంకా వేతనాలు అందలేదని వెల్లడైంది. ఈ అంశంపై సంస్థ ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ప్రతినెలా 1వ తేదీన జీతాలు వస్తాయి. గతనెలలో మాత్రం సీనియర్ మేనేజ్మెంట్, పైలెట్లు, ఇంజనీర్లను మినహాయించి.. మిగిలిన ఉద్యోగులందరికీ వేతనాన్ని సరియైన సమయానికే చెల్లించారు. అయితే, ఈసారి సెప్టెంబర్ వేతనాన్ని మాకు ఇప్పటికీ చెల్లించలేదు.’ అని వ్యాఖ్యానించారు. -
బిజినెస్ జెట్.. రయ్ రయ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయానంలో బిజినెస్ జెట్లు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు బడా కార్పొరేట్లకే పరిమితమైన ప్రైవేటు విమానాలు... ఇప్పుడు చిన్న వ్యాపారవేత్తలకూ అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో నాన్– షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్ల హవా నడుస్తోంది. బిజినెస్/జనరల్ ఏవియేషన్‌లో ఉన్న నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు ఏకంగా 200 ఎయిర్‌పోర్టుల్లో అడుగుపెట్టడం వీటి జోరుకు నిదర్శనం. ప్రధానంగా వ్యాపారవేత్తల కారణంగానే ఈ స్థాయిలో కొత్త కొత్త ఎయిర్‌స్ట్రిప్స్‌లో చిన్న ఫ్లయిట్స్ ల్యాండ్ అవుతున్నాయి. వ్యాపారులు తమ అవసరాలకు విమానాలను అద్దెకు తీసుకోవడం లేదా సొంత విమానాల్లో ప్రయాణించడం గణనీయంగా పెరుగుతోందని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏఓఏ) చెబుతోంది. మౌలిక వసతులు మెరుగైతే దేశం లో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు బిజీగా ఉం డటం ఖాయమని అసోసియేషన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇవీ గణాంకాలు.. ప్రస్తుతం దేశంలో బిజినెస్/జనరల్ ఏవియేషన్ రంగంలో నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్లు 120, ప్రైవేటు ఆపరేటర్లు 60 మంది ఉన్నారు. వీరి వద్ద 275 హెలికాప్టర్లు, 125 బిజినెస్ జెట్లు, 100 దాకా టర్బో ప్రాప్ ఎయిర్‌క్రాఫ్టులు ఉన్నాయి. 2018లో మరో 20 విమానాలు కొత్తగా అడుగు పెట్టనున్నాయి. పరిశ్రమ ఏటా 8 శాతం వృద్ధి చెందుతోందని బీఏఓఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రంగం లగ్జరీ అన్న భావన నుంచి ప్రభుత్వం బయటకు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ‘విమానాలపై దిగుమతి సుంకం 3% వసూలు చేస్తున్నారు. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లకు జీఎస్టీ 5 శాతంగా ఉంది. ప్రైవేటు వినియోగానికి కొనుగోలు చేస్తే 28 శాతం జీఎస్టీ, 3 శాతం సెస్ అమలవుతోంది. ఈ పన్నులు తగ్గితే మరింత మంది విమానాల కొనుగోలుకు ముందుకు వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, టికెట్లు విక్రయించి సర్వీసులు అందించే సంస్థలను షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ అంటారు. వ్యాపార విస్తరణకు..: అనుకూలమైన సమయంలో, కోరుకున్న విమానాశ్రయానికి వెళ్లే అవకాశంతోపాటు భద్రత, ప్రైవసీ ఉండటంతో వ్యాపారులు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ దేశంలో కేవలం 75 విమానాశ్రయాలకే సర్వీసులు అందిస్తున్నాయి. నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు 200ల విమానాశ్రయాలకు సేవలను విస్తరించారు. బిజినెస్ వర్గాలకు తాము ప్రత్యక్షంగానే సాయపడుతున్నామని రోహిత్కపూర్ అన్నారు. ‘విదేశాల్లోనూ వ్యాపార అవకాశా లను భారతీయులు వెతుక్కుంటున్నారు. అనుకూల ప్రాం తాలకు వెళ్లేందుకు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై ఆధారపడుతున్నారు. వ్యాపారులు భారత ఎకానమీకి వెన్నెముక’ అని చెప్పారు. ప్రైవేట్ జెట్స్‌లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ నాల్గవ స్థానంలో ఉందని ‘జెట్ సెట్ గో’ ఫౌండర్ కనిక టేక్రివాల్ తెలిపారు. ఏడాదిన్నరలో టాప్–1 స్థానానికి భాగ్యనగరం చేరుతుందనేది ఆమె అంచనా. అడ్డంకులు తొలగితే... దేశంలో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు అన్నీ మౌలిక వసతుల పరంగా మెరుగైతే విమానయాన రంగం అనూహ్యంగా వృద్ధి చెందడం ఖాయం. న్యూయార్క్, పారిస్, సింగపూర్ మాదిరిగా భారత్‌లోని ప్రధాన నగరాల్లో బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం ప్రత్యేక రన్‌వే ఉండాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు షెడ్యూల్డ్ ఆపరేటర్ల ఫ్లయిట్స్‌తో బిజీగా ఉంటున్నాయి. బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం స్లాట్స్ పరిమితంగా ఉంటున్నాయి. దీనిని అధిగమించాలంటే ఇక్కడా ప్రత్యేక రన్వేలు ఉండాలని పరిశ్రమ కోరుతోంది. అన్ని జిల్లాల్లోనూ హెలిపోర్టులు ఏర్పాటు కావాలి. ఇదే జరిగితే కొత్త విమానాలు వస్తాయి. చార్జీలు తగ్గుతాయి. ఒక్కో విమానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 మందికి ఉపాధి లభిస్తుందని బీఏఓఏ చెబుతోంది. -
త్వరలో ఇంటికో జెట్ విమానం!
బెర్లిన్: ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈరోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్ల్లైట్ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది. నలుగురు మ్యూనిచ్ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీగా ఉండి, తక్కువ శబ్దంతో, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఈ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది. వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. గంటకు 400 కి.మీ. వేగంతో 500 కి.మీ. ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే ధర ను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. -
‘ఎగిరే’ టెలిస్కోపు!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఈ బోయింగ్ 747 జెట్ విమానం ఎగిరే టెలిస్కోపులాంటిది. దీనిలో అమర్చిన 17 టన్నుల బరువు, 8 అడుగుల సైజున్న ఓ టెలిస్కోపు అంతరిక్షంపై నిఘా వేసి.. నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన రహస్యాలను అన్వేషించనుంది. అధికారికంగా ‘సోఫియా(స్ట్రాటోస్పెరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రోనమీ)’గా నామకరణం చేసిన ఈ విమానం భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో తొలి పొర ట్రోపోస్ఫియర్ అంచులదాకా ప్రయాణించగలదు. అందుకు తగ్గట్టుగా దీనిలో అధునాతన మార్పులు చేశారు. అంతరిక్షం నుంచి వచ్చే కాంతిపై వాతావరణంలోని నీటి ఆవిరి, ఏరోసాల్స్ ప్రభావం ఉంటుంది కాబట్టి.. భూమిపై నుంచి అబ్జర్వేటరీలు దానిని స్పష్టంగా చూడలేవు. అందుకే నక్షత్రాల నుంచి వచ్చే కాంతిని ట్రోపోస్ఫియర్ చివరి నుంచి మరింత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చని తొలిసారిగా ఇలా ఈ పరారుణ టెలిస్కోపును విమానంలో అమర్చి పంపుతున్నారు. ఈ విమానాన్ని అత్యధిక ఎత్తులో, వేగంగా ప్రయాణించేలా బోయింగ్ కంపెనీ 1970లలో రూపొందించింది. ఇది 12 గంటలకు పైగా నిరంతరాయంగా ఎగరగలదు. ప్రస్తుతం జర్మనీలో తుది మెరుగులు దిద్దుకుంటున్న సోఫియా వచ్చే ఏడాది వంద సార్లు నింగికి ఎగరనుంది. చుక్కల గుట్టు విప్పేపనిలో 20 ఏళ్లపాటు సేవలు అందించనుంది.