Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..! | RAAF C-17 Cargo Iet Weaves Through Skyscrapers In Australia | Sakshi
Sakshi News home page

Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!

Published Sun, Sep 26 2021 8:40 AM | Last Updated on Sun, Sep 26 2021 9:05 AM

RAAF C-17 Cargo Iet Weaves Through Skyscrapers In Australia - Sakshi

ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌ నగరంలోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాల  మధ్య నుంచి గురువారం ఓ పేద్ద యుద్ధ విమానం రయ్యిన దూసుకుపోయింది. ఆకాశాన్నంటే భవనాల మధ్య మెలికలు తిరుగుతూ ఆ విమానం చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ భవనాల్లో ఉన్న వారు ఒకింత ఆందోళన చెందారు. ఇంత ధైర్యమా..! ఏదైనా జరగరానిది జరిగితే... అంటూ ముక్కున వేలేసుకున్నారు. అయితే.. సుశిక్షితులైన పైలెట్లు నడిపిన ఆ విమానం సాదా సీదాది కాదు. ఆస్ట్రేలియా రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 కార్గో విమానం.

రివర్‌ ఫ్రంట్‌ ఉత్సవాలకు ముందస్తుగా చేసిన రిహార్సల్‌లో భాగంగా ఆ విమానం ఇలా విన్యాసాలు చేసింది. స్థానికులు మాత్రం ఇదేమంత పెద్దగా పట్టించుకోవాల్సింది కాదని అంటున్నారు. ఆకాశహర్మ్యాల మధ్యన ఉన్న నదిపైనే ఆ విమానం ఎక్కువగా తిరిగిందని చెబుతున్నారు. అయినా.. ఇది చాలా సాహసోపేతమైన విన్యాసం అని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆమెరికా ట్విన్‌ టవర్స్‌పై అల్‌ఖైదా దాడిని గుర్తు చేస్తూ ట్వీట్లు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement