Brisbane
-
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లో అలీ మీట్ అండ్ గ్రీట్
-
జగన్‌ని మళ్లీ సీఎం చేద్దాం: ఎన్నారైలకు అలీ పిలుపు
బ్రిస్బేన్: వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకుని.. తద్వారా జరగబోయే రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ఎన్నారైలకు పిలుపు ఇచ్చారు నటుడు, వైఎస్సార్సీపీ నేత.. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అలీ. సీఎం జగన్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిదని.. మరోసారి ఆయన్ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలంతా భాగం కావాలని అలీ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. ఈ ఈవెంట్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి తోపాటు ఇరువూరి బ్రహ్మ రెడ్డి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి , కోట శ్రీనివాస్ రెడ్డి, రఘు రెడ్డి బిజివేముల మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
గంటలో 3,206 పుష్ అప్లు
సిడ్నీ: జిమ్ చేసే సిక్స్‌ప్యాక్ బాడీ అయినా రోజూ 100 పుష్అప్లు చేస్తేనే బాగా అలిసిపోతారు. అలాంటిది ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్అప్లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్ హెల్మెక్ పుష్ అప్లు చేయడం ద్వారా తనకున్న స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు. గంటకి 3,182 పుష్ అప్లు చేసి రికార్డు సా«ధించిన సాటి ఆస్ట్రేలియన్ డేనియల్ స్కాలి పేరు మీదున్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు. లుకాస్ నిమిషానికి 53 పుష్ అప్లు చేశాడని గిన్నిస్ వరల్డ్ అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు సాధించడానికి అనుభవజ్ఞులైన జిమర్ల దగ్గర రెండు మూడేళ్ల పాటు శిక్షణ కూడా తీసుకున్నట్టు లుకాస్ వెల్లడించాడు. -
బ్రిస్బేన్‌లో ల్యాండైన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. మరికొద్ది గంటల్లో మహా సంగ్రామం మొదలుకానుంది. వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఇవాళ బ్రిస్బేన్ నగరంలో ల్యాండయ్యింది. అక్టోబర్ 17, 19 తేదీల్లో రోహిత్ సేన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను ఢీకొట్టనుంది. భారత ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో హుషారుగా కనిపించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. Touchdown Brisbane 📍#TeamIndia pic.twitter.com/HHof4Le3mP— BCCI (@BCCI) October 15, 2022 ఇందులో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు నవ్వుతూ, ఫోటోలకు ఫోజులిస్తూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు మొత్తం బిస్బేన్‌కు చేరుకుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనే 16 జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యేందుకు రోహిత్ మెల్బోర్న్కు వెళ్లాడు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు రేపటి (అక్టోబర్ 16) నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. సూపర్-12 మ్యాచ్‌లు ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 23న భారత్.. తమ తొలి సమరంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆతర్వాత 27న గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో, నవంబర్ 6న గ్రూప్-బిలో తొలి స్థానంలో ఉన్న జట్లతో తలపడనుంది. -
Ashes Series: ఓవైపు మ్యాచ్.. మరోవైపు ప్రపోజల్.. ముద్దుల్లో ముంచెత్తి..
Ashes Series: A Fan Proposes To His Girlfriend During 1st Test Video Viral: మనసుకు నచ్చిన అమ్మాయి ముందు ప్రేమను వ్యక్తపరిచే అపురూప క్షణాలను కలకాలం పదిలం చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. యాషెస్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న గబ్బాను ఇందుకు వేదిక చేసుకున్నాడు. మోకాళ్లపై కూర్చుని గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి ఆమె అంగీకారం పొందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా... ఫ్యాన్స్ అంతా మ్యాచ్ వీక్షిస్తుండగా.. రాబ్ అనే వ్యక్తి మాత్రం తన పనిలో తాను తలమునకలైపోయాడు. ప్రేయసి నాట్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ హఠాత్పరిణామానికి తొలుత ఆశ్చర్యపోయిన నాట్.. వెంటనే తేరుకుని ఓకే అంది. రాబ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుల్లో ముంచెత్తింది. ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ వారి ప్రేమను ఆశీర్వదించారు. మరికొంత మంది సెల్ఫోన్లలో ఈ దృశ్యాలను బంధిస్తూ విషెస్ చెప్పారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి! She said yes! How good! pic.twitter.com/Mc7erNaeYO — 7Cricket (@7Cricket) December 10, 2021 Feeling the love 🥰@Holly_Ferling catches up with Rob & Nat, the newly engaged couple! pic.twitter.com/CkNvFnETbO — 7Cricket (@7Cricket) December 10, 2021 చదవండి: Ashes Series 2021: ‘శవాన్ని కాల్చేస్తారు.. బూడిదను తీసుకువెళ్తారు’.. బ్లిగ్ పెళ్లి.. అసలు బూడిద ఉన్న ట్రోఫీ ఎక్కడ? -
యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!
-
Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాల మధ్య నుంచి గురువారం ఓ పేద్ద యుద్ధ విమానం రయ్యిన దూసుకుపోయింది. ఆకాశాన్నంటే భవనాల మధ్య మెలికలు తిరుగుతూ ఆ విమానం చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ భవనాల్లో ఉన్న వారు ఒకింత ఆందోళన చెందారు. ఇంత ధైర్యమా..! ఏదైనా జరగరానిది జరిగితే... అంటూ ముక్కున వేలేసుకున్నారు. అయితే.. సుశిక్షితులైన పైలెట్లు నడిపిన ఆ విమానం సాదా సీదాది కాదు. ఆస్ట్రేలియా రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 కార్గో విమానం. రివర్ ఫ్రంట్ ఉత్సవాలకు ముందస్తుగా చేసిన రిహార్సల్లో భాగంగా ఆ విమానం ఇలా విన్యాసాలు చేసింది. స్థానికులు మాత్రం ఇదేమంత పెద్దగా పట్టించుకోవాల్సింది కాదని అంటున్నారు. ఆకాశహర్మ్యాల మధ్యన ఉన్న నదిపైనే ఆ విమానం ఎక్కువగా తిరిగిందని చెబుతున్నారు. అయినా.. ఇది చాలా సాహసోపేతమైన విన్యాసం అని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా దాడిని గుర్తు చేస్తూ ట్వీట్లు పెట్టారు. -
బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్స్
టోక్యో: 2032 విశ్వక్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) బుధవారం ప్రకటించింది. 2000 సంవత్సరంలో సిడ్నీలో ఒలింపిక్స్ జరిగిన తరువాత తిరిగి 32 ఏళ్ల విరామం తర్వాత.. ఆస్ట్రేలియాలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. 1956 ఒలింపిక్స్‌కు మెల్బోర్న్ నగరం ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందిస్తూ.. విశ్వక్రీడల ఆతిధ్య హక్కులు తమ దేశానికి దక్కడం గౌరవంగా భావిస్తామని అన్నారు. అలాగే ఈ క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం జరిగిన ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 ఓట్లు పోలయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ తర్వాత 2024 విశ్వక్రీడలకు పారిస్ నగరం ఆతిధ్యం ఇవ్వనుండగా, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజిల్స్ నగరంలో జరగనున్నాయి. -
రూ.5,850 కోట్లతో మేం రెడీ..!
బ్రిస్బేన్: త్వరలోనే ‘గాబా’ క్రికెట్ స్టేడియం కొత్త హంగులతో ముస్తాబు కానుంది. 2032 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు ఆస్ట్రేలియాకు లభిస్తే... బ్రిస్బేన్ ఈ విశ్వ క్రీడలకు వేదికగా నిలువనుంది. దాంతో ఒక బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లతో (దాదాపు రూ.5,850 కోట్లు) ‘గాబా’ను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా ‘గాబా’ స్టేడియం సామర్థ్యాన్ని 42 వేల నుంచి 50 వేలకు పెంచనున్నట్లు క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్ అనస్తాసియా పలాస్జుక్ పేర్కొన్నారు. కాగా, 2032 ఒలింపిక్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బిడ్లను ఆహ్వానించగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిస్బేన్ రేసులో నిలిచింది. ఈ ఏడాది జూలైలో 2032 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఐఓసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2032 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను కోరుతూ దక్షిణ కొరియా కూడా బిడ్ వేసింది. ఇదిలా ఉండగా, గత సంవత్సరం నుంచి ఈ ఏడాదికి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడమో... లేక మరోసారి వాయిదా వేయడమో చేయాలంటూ మెజారిటీ శాతం మంది జపాన్ వాసులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఎవరూ లేని ఒసాకాలో... ఏకాకిగా -
కొత్త దారిని ఎంచుకున్నందుకు...
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో ఆరుగురు కొత్త కుర్రాళ్లు కీలకపాత్ర పోషించారు. సిరాజ్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌లు ఇదే సిరీస్‌లో అరంగేట్రం చేయగా, శార్దుల్ ఠాకూర్‌కు కూడా బ్రిస్బేన్ మ్యాచ్ దాదాపు తొలి టెస్టులాంటిదే. వీరి ప్రదర్శనను అభినందిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన తరఫు నుంచి ప్రత్యేకంగా జీప్లను కానుకలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రికెటర్లకు కొత్త మోడల్ ‘థార్–ఎస్యూవీ’లు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రూ. 13 లక్షలు విలువ చేసే థార్–ఎస్యూవీ జీప్‌ను మహీంద్రా సంస్థ నుంచి కాకుండా తన సొంత డబ్బులతో వీటిని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘భవిష్యత్తులో భారత యువకులు పెద్ద కలలు కనవచ్చని, అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించవచ్చనే నమ్మకాన్ని వీరు కలిగించారు. ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లగలిగిన వీరి విజయ గాథల్లో ఎంతో వాస్తవం ఉంది. జీవితంలో అన్ని రంగాలకు ఇవి స్ఫూర్తినందిస్తాయి. ఈ ఆరుగురికి కంపెనీ సొమ్ము నుంచి కాకుండా నా సొంత డబ్బులతో కొత్త థార్ ఎస్యూవీ వాహనాలను కానుకగా అందించడం పట్ల ఎంతో ఆనందిస్తున్నా. వీరంతా తమపై తాము ఎంతో నమ్మకముంచి నలుగురు నడిచిన దారిలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకొనే సాహసం చేయడమే నేను బహుమతి ఇవ్వడానికి కారణం. వీరికి నా అభినందనలు. వీలైనంత తొందరగా తగిన ప్రాధాన్యత ఇస్తూ వారికి ‘థార్’లు అందజేయమని మహీంద్రా కంపెనీకి విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. -
బ్రిస్బేన్ నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం
-
ఆసక్తికర ఘట్టానికి టెస్టు సిరీస్
ఉత్కంఠభరిత, ఉద్విగ్న క్షణాలు... హోరాహోరీ సమరాలు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు... అన్ని కలగలిసిన టెస్టు సిరీస్‌లో అంతిమ ఫలితం కోసం ఆఖరి రోజు వరకు ఆగాల్సి రావడంకంటే మించిన ఆసక్తికర ముగింపు ఏముంటుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి ఉంది. రెండేళ్ల క్రితంనాటి ఓటమి జ్ఞాపకాలను మరిచేలా ఈసారైనా సొంతగడ్డపై సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న ఆసీస్ నాలుగో టెస్టులో 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచి సవాల్ విసిరింది. చివరి రోజు అందుబాటులో ఉన్న 98 ఓవర్లలో టీమిండియా 324 పరుగులు సాధించాల్సి ఉంది. దూకుడైన ఆటతో రహానే బృందం దీనిని అందుకునేందుకు ప్రయత్నిస్తుందా లేక ట్రోఫీ నిలబెట్టుకునే అవకాశం ఉండటంతో ‘డ్రా’వైపు మొగ్గు చూపుతుందా చూడాలి. బ్రిస్బేన్‌లో గత రికార్డులు చూస్తే ఇది అసాధ్యంగానే కనిపిస్తున్నా... మన జట్టుకు రికార్డులు తిరగరాయడం కొత్తేమీ కాదు. అయితే అన్నింటికి మించి ఆఖరి రోజు వర్షం కీలకంగా మారనుంది. ఎన్ని ఓవర్ల ఆట సాధ్యం అవుతుందనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. బ్రిస్బేన్: వరుసగా రెండో పర్యటనలోనూ భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించగలదా... లేక సిరీస్‌ను సమంగా ముగించి ట్రోఫీని నిలబెట్టుకోగలదా అనేది నేడు తేలనుంది. చివరి టెస్టులో ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (4 బ్యాటింగ్), గిల్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 1.5 ఓవర్ల తర్వాతే వాన రావడంతో ఆటను నిలిపివేయగా... వాన తగ్గే అవకాశం కనిపించకపోవడంతో నాలుగో రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు. రెండు సార్లు వర్షం అడ్డంకి కలిగించడంతో సోమవారం 71.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (74 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, వార్నర్ (75 బంతుల్లో 48; 6 ఫోర్లు) రాణించాడు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/73)తో చెలరేగాడు. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు 4 వికెట్లు దక్కాయి. శుభారంభం సాధ్యమైనంత వేగంగా బ్యాటింగ్ చేసి భారత్ ముందు కఠిన లక్ష్యాన్ని ఉంచాలనే ప్రణాళికతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు చాలా వరకు సఫలమైంది. 3.87 రన్‌రేట్‌తో ఆసీస్ పరుగులు సాధించింది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో విఫలమైన తర్వాత ఎట్టకేలకు వార్నర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చగా, మార్కస్ హారిస్ (82 బంతుల్లో 38; 8 ఫోర్లు) కూడా అండగా నిలిచాడు. వీరిద్దరు వరుస బౌండరీలతో చకచకా పరుగులు సాధించడంతో ఒక దశలో భారత్ అటాకింగ్ ఫీల్డింగ్‌ను మార్చేసి ఆత్మరక్షణలో పడింది. అయితే 89 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత శార్దుల్ షార్ట్ బంతితో హారిస్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా... తర్వాతి ఓవర్లో సుందర్ బౌలింగ్‌లో వార్నర్ ఎల్బీగా దొరికిపోయాడు. ఆసీస్ ఓపెనర్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు లబ్‌షేన్ (22 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీశాడు. స్లిప్‌లో రోహిత్ చక్కటి క్యాచ్‌కు లబ్‌షేన్ వెనుదిరగ్గా, మరో చక్కటి బంతికి వేడ్ (0) పెవిలియన్ చేరాడు. 123/4 వద్ద ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలుతున్నట్లు అనిపించింది. కీలక భాగస్వామ్యం టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ ఆసీస్‌ను మరోసారి ఆదుకున్నాడు. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన స్మిత్ ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. కామెరాన్ గ్రీన్ (90 బంతుల్లో 37; 3 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు స్మిత్ 73 పరుగులు జత చేశాడు. ఇలాంటి స్థితిలో మరోసారి సిరాజ్ తన విలువను ప్రదర్శించాడు. అతను వేసిన పదునైన బంతిని ఆడలేక స్మిత్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. బంతి తన గ్లవ్‌కు తాకిన సమయంలో బ్యాట్ ఆ చేతిలో లేదనే సందేహంతో స్మిత్ రివ్యూ కోరగా, ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ తర్వాత గ్రీన్‌ను శార్దుల్ అవుట్ చేశాడు. అయితే కెప్టెన్ పైన్ (37 బంతుల్లో 27; 3 ఫోర్లు), కమిన్స్ (51 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా చివర్లో కొన్ని పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా సంతృప్తికర స్కోరును సాధించగలిగింది. సిరాజ్ రెండు క్యాచ్‌లు మిస్ నాలుగో రోజు కూడా ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. సుందర్ బౌలింగ్‌లో 42 పరుగుల వద్ద స్మిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను సరిగా అంచనా వేయలేక సిరాజ్ వదిలేశాడు. అతను తన స్కోరుకు మరో 13 పరుగులు జోడించాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌లోనే గ్రీన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కూడా సిరాజ్ అందుకోలేకపోయాడు. ఈ సమయంలో 14 పరుగుల వద్ద ఉన్న గ్రీన్ మరో 23 పరుగులు సాధించాడు. వాన... వాన... ప్రఖ్యాత ‘అక్యువెదర్’ వెబ్సైట్ సహా ఆస్ట్రేలియాలోని వివిధ వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం మంగళవారం కూడా బ్రిస్బేన్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో కనీసం గంట పాటు వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారనుంది. సోమవారం రాత్రి కూడా వాన కురుస్తున్న కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. ఇదే జరిగితే 98 ఓవర్ల ఆట సాధ్యం కాకపోవచ్చు. సమయం వృథా అవుతున్నకొద్దీ ఆసీస్ విజయావకాశాలు తగ్గుతున్నట్లే. భారత్ మాత్రం మిగిలిన ఓవర్లలో గట్టిగా నిలబడి ‘డ్రా’ చేసుకున్నా సరిపోతుంది. వర్షం కారణంగా చివరి టెస్టులో రెండో రోజు, నాలుగో రోజు అంతరాయం కలగవచ్చని నిపుణులు వేసిన అంచనా కూడా నిజమైంది కాబట్టి ఇది కూడా తప్పకపోవచ్చు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369 భారత్ తొలి ఇన్నింగ్స్: 336 ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (సి) రిషభ్ పంత్ (బి) శార్దుల్ ఠాకూర్ 38; డేవిడ్ వార్నర్ (ఎల్బీ) (బి) వాషింగ్టన్ సుందర్ 48; లబ్‌షేన్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 25; స్టీవ్ స్మిత్ (సి) రహానే (బి) సిరాజ్ 55; వేడ్ (సి) రిషభ్ పంత్ (బి) సిరాజ్ 0; గ్రీన్ (సి) రోహిత్ శర్మ (బి) శార్దుల్ ఠాకూర్ 37; టిమ్ పైన్ (సి) రిషభ్ పంత్ (బి) శార్దుల్ ఠాకూర్ 27; కమిన్స్ (నాటౌట్) 28; స్టార్క్ (సి) నవదీప్ సైనీ (బి) సిరాజ్ 1; నాథన్ లయన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) శార్దుల్ ఠాకూర్ 13; హాజల్‌వుడ్ (సి) శార్దుల్ ఠాకూర్ (బి) సిరాజ్ 9; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (75.5 ఓవర్లలో ఆలౌట్) 294. వికెట్ల పతనం: 1–89, 2–91, 3–123, 4–123, 5–196, 6–227, 7–242, 8–247, 9–274, 10–294. బౌలింగ్: సిరాజ్ 19.5–5–73–5, నటరాజన్ 14–4–41–0, వాషింగ్టన్ సుందర్ 18–1– 80–1, శార్దుల్ ఠాకూర్ 19–2–61–4, నవదీప్ సైనీ 5–1–32–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 4; గిల్ (బ్యాటింగ్) 0; మొత్తం (1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 4. బౌలింగ్: స్టార్క్ 1–0–4–0, హాజల్‌వుడ్ 0.5–0–0–0. -
336 పరుగులకు టీమిండియా ఆలౌట్
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 336 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్ 67 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 62, రోహిత్ శర్మ 44, అగర్వాల్ 38 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లియోన్‌కు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 33 పరుగులు స్వల్ప ఆధిక్యత లభించింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 21/0తో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ 55 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా 62 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌ను ఆసీస్ బౌలర్లను బోల్తాకొట్టించారు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే సీనియర్ బ్యాట్స్‌మెన్ పుజారా (24)ను హెజిల్వుడ్ ఔట్ చేశాడు. ఆ తరువాత యువ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌తో జతకట్టిన కెప్టెన్ అజింక్యా రహానే జట్టును ముందుండి నడిపించాడు. 100 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన టీంను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా.. 144 పరుగుల వద్ద రహానే (37) వెనుదిరిగాడు. ఆ తరువాత అగర్వాల్ (38) సైతం పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 161 పరుగులకు టీమిండియా ఐదు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత పంత్ (23) కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తరువాత క్రిజ్‌లోకి వచ్చిన ఠాకూర్, సుందర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యంతో టీంను గట్టెక్కించారు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించి పెట్టారు. అప్డేట్స్.. వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62) ఔట్ 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శార్దూల్ ఠాకూర్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రిజ్‌లో నవదీప్ సైనీ, నటరాజన్ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత బౌలర్లు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నారు. 160 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ ఠాకూర్ హాఫ్ సెంచరీ (54) సాధించాడు. ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. సుందర్ సైతం హాఫ్ సెంచరీకి సాధించి.. టీంకు అండగా నిలిచాడు. కీలకమైన బ్యాట్స్‌మెన్స్ అంతా ఔట్ అయినా వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. 180 బంతుల్ని ఎదుర్కొన్న ఈ జోడీ 105 పరుగులతో అజేయంగా సాగుతోంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 290/6. (బ్రిస్బేన్ టెస్టుకు వర్షం దెబ్బ) తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కాగా రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు శనివారం మొత్తంగా 54.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మూడో సెషన్లో పట్టుదలగా నిలవాల్సిన పరిస్థితి... ఇన్నింగ్స్ కొనసాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ వర్షం రాకతో మ్యాచ్‌లో అనూహ్య విరామం వచ్చేసింది. మైదానం అనుకూలంగా లేకపోవడంతో మూడో సెషన్లో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. -
లంచ్‌కు ముందే ఆసీస్ ఆలౌట్
బ్రిస్బేన్ : భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. ఓవరనైట్ ఆటగాళ్లు పైన్, కామెరూన్ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు.(పంత్ మొత్తుకున్నా నమ్మలేదు..) ఈ జోడి 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్‌గా పైన్ ఔటైన తర్వాత ఆసీస్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్ 24 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్ దక్కింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సిరీస్ సమానంగా ఉన్నాయి.చివరి టెస్ట్‌లో ఎవరి గెలిస్తే వారికే సిరీస్ దక్కుతుంది. దీంతో నాలుగో టెస్టులో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది. -
ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయపడడం వెనుక ప్రధాన కారణం ఐపీఎల్ అని లాంగర్ పేర్కొన్నాడు. ఎప్పుడు సమయానికి జరిగే ఐపీఎల్ గతేడాది కరోనాతో ఆలస్యంగా ప్రారంభకావడంతోనే ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారని తెలిపాడు. అయితే తాను ఐపీఎల్‌ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. (చదవండి: పాపం పకోవ్‌స్కీ.. మళ్లీ ఔట్!) మూడో టెస్టు అనంతరం ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. 'ఈసారి ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న సిరీస్ నాకు కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. వన్డే సిరీస్‌తో మొదలైన గాయాల బెడద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదట మా జట్టు ఆటగాళ్లు గాయాల బారీన పడగా.. ఇప్పుడు టీమిండియా వంతు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వన్డే సిరీస్, టీ20 సందర్భంగా మా జట్టు తరపున డేవిడ్ వార్నర్, మార్కస్ స్టొయినిస్‌లు గాయపడగా.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే కామెరాన్ గ్రీన్, విల్ పకోవ్‌స్కీ లాంటి వారు గాయాలతో ఇబ్బంది పడ్డారు. (చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం') తాజాగా టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లలో షమీ మొదలుకొని ఉమేశ్, జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలు గాయపడ్డారు. దీంతో పాటు తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియా కీలక స్పిన్నర్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది. ఐపీఎల్ ఆలస్యంగా జరగడం వల్లే ఇలా జరిగిందనేది నా అభిప్రాయం. ఇలాంటి పెద్ద సిరీస్‌కు ముందు ఐపీఎల్ సరికాదు. ఐపీఎల్ అంటే నాకూ ఇష్టమే. ఇంగ్లిష్ కౌంటీ ఎలాగైతే ప్లేయర్స్‌కు ఉపయోగపడేదో.. ఇప్పుడు ఐపీఎల్ కూడా అంతే ' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరు జట్ల మధ్య జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. -
బ్రిస్బేన్‌లో టెస్టు ఆడతాం: బీసీసీఐ
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు వేదిక విషయంలో సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ సమాచారం అందించింది. అయితే మ్యాచ్ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్‌కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని కోరింది. ‘చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం. అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్లోనే పంపిస్తే మంచిది. వీలుంటే మ్యాచ్ ముగిసిన రాత్రి కూడా అక్కడ ఆగకుండా బయల్దేరాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదని బోర్డు స్పష్టం చేసింది. కఠిన బయో బబుల్ వాతావరణంలో క్రికెటర్లు ఉండబోతున్నారని, ఇలాంటి స్థితిలో తాము రిస్క్ తీసుకోలేం కాబట్టి అభిమానులను ఒక్క మ్యాచ్‌కూ అనుమతించమని వెల్లడించింది. -
బ్రిస్బేన్‌లో లాక్డౌన్: నాలుగో టెస్టు డౌటే!
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా క్వీన్స్లాండ్ రాజధాని బ్రిస్బేన్‌లో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ హోటల్లో పనిచేసే క్లీనర్‌కు యూకే కోవిడ్ స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా బ్రిస్బేన్‌లో అక్కడ మూడు రోజులపాటు కఠినతరమైన లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జనవరి 15న మొదలుకానున్న నాలుగో టెస్టు వేదికపై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం బ్రిస్బేన్‌లో ఆఖరి టెస్టును నిర్వహించాల్సి ఉంది. అయితే అక్కడ కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో.. మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కొంతమంది హెచ్చరించినట్లు కూడా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా గానీ, బీసీసీఐ గానీ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక తాజాగా బ్రిస్బేన్‌లో 3 రోజుల లాక్డౌన్ విధించడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. గబ్బాలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధంగాలేరని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ప్రకటన వెలువడటం గందరగోళానికి కారణమవుతోందంటూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. (చదవండి: నాలుగో టెస్టు: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్) అదే విధంగా సిడ్నీలోనే నాలుగో టెస్టు కూడా నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది. కాగా బ్రిస్బేన్ క్వారంటైన్ నిబంధనల సడలింపు గురించి బీసీసీఐ గురువారమే సీఏకు లేఖరాసిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన ఆతిథ్య క్రికెట్ బోర్డు.. హోటల్ రూం నుంచి బయటికి వచ్చి ఇతర ఆటగాళ్లతో సమయం గడిపేందుకు అవకాశం ఇస్తామని మౌఖిక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పర్యాటక జట్టు మాత్రం రాతపూర్వకంగా హామీ ఇస్తేనే బ్రిస్బేన్‌కు వెళ్లేందుకు అంగీకరిస్తామని షరతు విధించినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.(చదవండి: దెబ్బలే దెబ్బలు.. ఇంప్రెస్ అయ్యాను) -
ముంబైలో ఆడమన్నా ఆడతాం: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశతో సంబంధం లేకుండా కేవలం ఆటపై దృష్టి సారించడం మాత్రమే తమ నైజమని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జరిగినా, ముంబైలో జరిగినా తమకు తేడా ఉండదని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రపంచంలో శక్తిమంతమైన బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న టిమ్ పైన్.. ప్రత్యర్థి జట్టు శిబిరం నుంచి వస్తున్న వార్తలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్నాయన్నాడు. చివరి టెస్టు వేదిక ఎక్కడన్న విషయం గురించి తాము ఆలోచించడం లేదని, ప్రస్తుతం జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.(చదవండి: చిత్తుగా ఓడిన పాక్: నంబర్ 1 జట్టుగా కివీస్) కాగా ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఆసీస్- టీమిండియా మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు స్పష్టంగా చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కూడా కొంతమంది హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలో టిమ్ పైన్ మాట్లాడుతూ.. ప్రొటోకాల్ పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. (చదవండి: మళ్లీ ఆంక్షలా... మా వల్ల కాదు!) ‘‘సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇరు జట్లు వరుస సిరీస్‌లతో బిజీ అయ్యాయి. టెస్టు క్రికెట్ ఆడుతున్నాయి. రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవే. అంతేకాదు పరస్పర గౌరవంతో ముందుకు సాగుతాయి. అయితే కొన్ని రోజులుగా అవతలి వైపు శిబిరం నుంచి వినిపిస్తున్న మాటలు చిరాకైతే తెప్పించడం లేదు గానీ.. కాస్త అసాధారణంగా అనిపిన్నాయి. ఏదేమైనా మూడో టెస్టుపైనే ప్రస్తుతం మేం దృష్టి సారించాం’’ అని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. -
అలా అయితే నాల్గో టెస్టు వాకౌట్ చేస్తాం
అంతా సాఫీగా, ఆత్మీయంగా సాగిపోతే... ఏదో ఒక రచ్చ లేకపోతే అది భారత్–ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ఎలా అవుతుంది? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పర్యటనలో అనూహ్యంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోటల్లో భోజనం కారణంగా ‘ఐసోలేషన్’తో మొదలైన చర్చ తర్వాతి రోజు భారత జట్టు నాలుగో టెస్టును బాయ్‌కాట్ చేయడం వరకు చేరింది! కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాల్సి వస్తుండటం టీమిండియా అసంతృప్తికి కారణం. మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెటర్లు సుమారు రెండు నెలల పాటు బయో బబుల్‌లోనే ఐపీఎల్ ఆడారు. ఇక్కడికి చేరుకోగానే రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టారు. 3 వన్డేలు, 3 టి20లు, 2 టెస్టులు కూడా జరిగిపోయాయి. జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్టుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆపై మరో మ్యాచ్ ఆడితే స్వదేశం తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఒక్క మ్యాచ్ కోసమే మళ్లీ కఠిన కరోనా ఆంక్షలు పాటించాల్సి వస్తే..! ఇదే ఇప్పుడు జట్టు ఆటగాళ్లను అసహనానికి గురి చేస్తోంది. అవసరమైతే చివరి టెస్టు ఆడకుండానే వెళ్లిపోతామని కూడా వారు చెబుతున్నారు. హోటల్ గది... గ్రౌండ్... హోటల్... షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్లాండ్ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు. ‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి. ఐపీఎల్ నుంచి మేం బబుల్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్‌లో మరో బబుల్ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం’ అని భారత క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది. మేం బ్రిస్బేన్‌లోనే ఆడతాం... ఒకే వేదికపై వరుసగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధంగా లేము. సిరీస్ ఆరంభానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కట్టుబడి ఉంది. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదు. మేం బ్రిస్బేన్‌లో ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. అక్కడ కఠినమైన ఆంక్షలు, బయో బబుల్ ఉండవచ్చు కూడా. అయితే అన్నింటినీ మేం పాటిస్తాం. హోటల్ నుంచి మైదానానికి మాత్రమే వెళ్లి వచ్చే అనుమతి ఉంటే తప్పేముంది. అలాగే చేద్దాం. –మాథ్యూ వేడ్ భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దు. ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. –రాస్ బేట్స్, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు (షాడో మినిస్టర్) అంతా కలిసి సిడ్నీకి... మూడో టెస్టు కోసం భారత జట్టు మొత్తం నేడు ప్రత్యేక విమానంలో సిడ్నీకి వెళుతుంది. బయో సెక్యూరిటీ బబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘ఐసోలేషన్’లోకి వెళ్లిన ఐదుగురు ఆటగాళ్లు రోహిత్, పంత్, పృథ్వీ, గిల్, సైనీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జట్టుతో పాటే ప్రయాణిస్తారు. హోటల్ ఘటనపై సీఏ విచారణ కొనసాగిస్తున్నా... సహచరులతో వెళ్లే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాకు తెలిసి ఆటగాళ్లపై ఎలాంటి చర్యా ఉండదు. ఆ అభిమాని తనను పంత్ హత్తుకున్నాడని అబద్ధం చెప్పి ఉండకపోతే పరిస్థితి అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఏదో బయట వర్షం పడుతుంటే క్రికెటర్లంతా లోపలికి వెళ్లారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా అతను వీడియో తీశాడు. పైగా ఎవరూ అడగకపోయినా బిల్లు చెల్లించి ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెట్టాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సదరు ఘటన విషయంలో టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీశ్ డోంగ్రీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లు ఒక జాబితా పట్టుకొని తిరగరు. ఇవన్నీ చూసుకోవాల్సింది మేనేజర్ మాత్రమే. ఈ విషయంలో అతను తప్పు చేసినట్లు అనిపిస్తోంది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. -
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
-
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
బ్రిస్బేన్ : బీచ్‌లో సర్ఫింగ్ చేద్దామని వచ్చిన ఒక వ్యక్తిని దాదాపు మూడు మీటర్లు ఉన్న షార్క్(పెద్ద చేప) దాడి చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాలు.. బ్రిస్బేన్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్స్క్లిఫ్లోని బీచ్‌కు ఒక వ్యక్తి వచ్చాడు. బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాదాపు 3మీటర్లు ఉన్న పెద్ద సొరచేప అతనిపై హఠాత్తుగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో వ్యక్తి కాలు సొరచేపకు చిక్కడంతో దాని నుంచి బలంగా లాగే క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బీచ్‌కు వచ్చిన బోట్ రైడర్లు, ఇతరులు గాయపడిన వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స నిర్వహించారు. అయితే గాయం తీవ్రంగా కావడంతో కొద్దిసేపటికే ఆ వ్యక్తి మరణించాడు.(బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?) ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంకా ఆ వ్యక్తి ఎవరో తెలియదని.. వయసు మాత్రం 60 ఉంటుందని, బహుశా క్వీన్‌లాండ్స్ రాష్ట్రానికి చెందినవాడిగా అనుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియాలో షార్క్ దాడులు ఎక్కువగా ఉంటాయి. అయితే షార్క్ దాడిలో మరణాలు సంభవించడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. గతేడాది ఆస్ట్రేలియాలో 27 షార్క్ దాడులు జరిగాయి. -
టీఆర్పీల కోసం పిల్లాడిని చంపేయకండి
మరుగుజ్జు తనపాలిట శాపంగా భావించి ఆత్మహత్య చేసుకుంటానంటూ గుండెలవిసేలా రోదించిన పిల్లవాడు క్వాడెన్ బేల్స్ మీకు గుర్తుండే ఉంటుంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా అతను మూడు సంవత్సరాల కిత్రం ఆత్మహత్యాయత్నం చేశాడని ఆమె తల్లి చెప్పడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన క్వాడెన్ అచాన్రోప్లాసియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. శారీరక ఎదుగుదల లోపం కారణంగా తోటి విద్యార్థుల దగ్గర అవమానాలు ఎదుర్కొన్నాడు. అతన్ని హేళన చేస్తూ వేధింపులకు గురిచేయడం భరించలేకపోయాడు. తల్లి యర్రాకతో తన బాధను చెప్పుకుంటూ కుప్పకూలిపోయాడు. ‘నేను.. ఉరేసుకుంటా.. పోనీ ఎవరైనా నన్ను చంపేయండి’ అంటూ హృదయవిదారకంగా ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ బాలుడికి సోషల్ మీడియా అండగా నిలిచిన విషయం తెలిసిందే. (తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..) బీబీసీ పేరిట ప్రసారమవుతున్న తప్పుడు వార్త నాలుగు లక్షలకు పైగా డాలర్లు పోగు చేసి అతనికి అందించగా వారు దాన్ని ఓ చారిటీకి ఉపయోగించనున్నట్లు తెలిపారు. తాజాగా ఆ పిల్లవాడి గురించి గత కొద్ది రోజులుగా ఓ విషాద వార్త చక్కర్లు కొడుతోంది. అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఆ వార్త సారాంశం. దీనికి బీబీసీ చానల్ లోగోనుపయోగించి ఓ వీడియోను కూడా జత చేయగా ఆ వార్త వైరల్‌గా మారింది. దీంతో పలు వెబ్సైట్లు సైతం అతని ఆత్మహత్యపై వార్తాకథనాలు వెలువరించాయి. దీనిపై స్పందించిన బీబీసీ యాజమాన్యం తాము ఆ వార్తను ప్రసారం చేయలేదని, అది అసత్య ప్రచారమేనని స్పష్టం చేసింది. దీంతో బాలుడి ఆత్మహత్య వట్టి పుకారేనని తేలింది. ఇక అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు తప్పుడు ప్రచారం చేసినవారిని దుమ్మెత్తిపోస్తున్నారు. ‘మీ టీఆర్పీల కోసం ఆ పిల్లవాడిని చంపేయకండి’ అని ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు.(ఆ చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు.. ఏం చేస్తారంటే..) -
చచ్చిపోతా.. చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు!
సిడ్నీ: శారీరక ఎదుగుదల లోపం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన చిన్నారి క్వాడెన్ బేల్స్కు సోషల్ మీడియా అండగా నిలిచింది. క్వాడెన్ కోసం అమెరికా కమెడియన్ బ్రాడ్ విలియమ్సన్ ప్రారంభించిన గోఫండ్‌మీ పేజ్ ద్వారా దాదాపు 4 లక్షల డెబ్బై ఐదువేల డాలర్లు పోగయ్యాయి. ఈ భారీ మొత్తాన్ని క్వాడెన్ తల్లికి పంపిన పేజీ నిర్వాహకులు.. చిన్నారిని డిస్నీల్యాండ్ ట్రిప్ కోసం ఈ నగదును సేకరించినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన క్వాడెన్ బేల్స్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు అచాన్రోప్లాసియాతో బాధపడుతున్నాడు. దీంతో మరుగుజ్జుగా ఉన్నావంటూ తోటి విద్యార్థులు అతడిని అవమానించేవారు. ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో ఓరోజు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని తన తల్లికి చెబుతూ.. ‘‘నేను చనిపోవాలని అనుకుంటున్నా.. లేదంటే ఎవరైనా నన్ను చంపేయండి’’ అంటూ హృదయ విదారకంగా ఏడ్వసాగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్వాడెన్ తల్లి యర్రాక తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేయగా వైరలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాడెన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ఆస్ట్రేలియా నటుడు హుగ్ జాక్మాన్తో పాటు ఎన్బీఏ ఆటగాడు ఎన్స్ కాంటెర్ క్వాడెన్ వంటి సెలబ్రిటీలు సైతం అతడికి అండగా నిలిచారు. ఈ క్రమంలో క్వాడెన్ సంతోషపెట్టడం కోసం అతడి డిస్నీల్యాండ్ ట్రిప్ కోసమని నెటిజన్లు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. అయితే క్వాడెన్ తల్లి ఈ విరాళాన్ని... క్వాడెన్ కోసం కాకుండా చారిటీ కోసం ఉపయోగిస్తున్నట్లు ఆమె సోదరి మీడియాకు తెలిపారు.(తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..) ‘‘ఏ పిల్లాడైనా డిస్నీల్యాండ్ వెళ్లాలని ఆశపడతాడు. క్వాడెన్ కూడా అంతే. అయితే తనను వాస్తవానికి దూరంగా తీసుకువెళ్లి సంతోష పెట్టడం మాకు ఇష్టం లేదు. ప్రతీ సవాలును ధీటుగా ఎదుర్కొనేలా తనను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకే నా సోదరి మంచి నిర్ణయం తీసుకుంది. అవమానాలు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇందుకోసం పనిచేస్తున్న సంస్థకు క్వాడెన్ డబ్బును వినియోగించాలని భావిస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు. -
గెలుచుకున్నదంతా కార్చిచ్చు బాధితులకే
బ్రిస్బేన్ టెన్నిస్ టోర్నీ ఆడటం ద్వారా తనకు రానున్న మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకే అందజేస్తానని ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ ప్రకటించింది. ఆసీస్‌కు చెందిన ఈ 23 ఏళ్ల క్రీడాకారిణి గత నవంబర్‌లో ‘జంతువులపై క్రూరత్వ నివారణ’కు పాటుపడుతోన్న రాయల్ సొసైటీకి 30 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు అందజేశానని తెలిపింది. తాజాగా ఆస్ట్రేలియాను చుట్టుముట్టిన దావానలం బాధితుల కోసం రెడ్‌క్రాస్‌కు మరింత ఎక్కువగా విరాళమివ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. నేటి నుంచి ఈనెల 12 వరకు జరుగనున్న ఈ టోర్నీ ఆడటం ద్వారా దాదాపు 2,50,000 అమెరికా డాలర్లు (రూ. కోటీ 79 లక్షలు) ఆమె రెడ్‌క్రాస్‌కు ఇచ్చే వీలుంది.