విజయం దిశగా ఆసీస్‌ | ustralia vs Pakistan 1st Test Day 3 In Brisbane | Sakshi
Sakshi News home page

విజయం దిశగా ఆసీస్‌

Published Sun, Nov 24 2019 3:43 AM | Last Updated on Sun, Nov 24 2019 3:43 AM

ustralia vs Pakistan 1st Test Day 3 In Brisbane - Sakshi

బ్రిస్బేన్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆ్రస్టేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 312/1తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా 157.4 ఓవర్లలో 580 పరుగులకు ఆలౌటైంది. దీంతో 340 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. లబ్‌షేన్‌ టెస్టుల్లో తొలి శతకం (185; 20 ఫోర్లు) సాధించాడు. 340 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ ఆట ముగిసే సమయానికి పాక్‌ 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. మసూద్‌ (27 బ్యాటింగ్‌), ఆజమ్‌ (20 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. స్టార్క్‌కు రెండు వికెట్లు లభించాయి. మూడో రోజు ఆట ఆరంభమైన కాసేటపటికే వార్నర్‌ (154; 10 ఫోర్లు)ను 16 ఏళ్ల అరంగేట్రం బౌలర్‌ నసీమ్‌ షా అవుట్‌ చేయడం ద్వారా తొలి టెస్టు వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement