
బ్రిస్బేన్ : బీచ్‌లో సర్ఫింగ్ చేద్దామని వచ్చిన ఒక వ్యక్తిని దాదాపు మూడు మీటర్లు ఉన్న షార్క్(పెద్ద చేప) దాడి చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాలు.. బ్రిస్బేన్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్స్‌క్లిఫ్‌లోని బీచ్‌కు ఒక వ్యక్తి వచ్చాడు. బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాదాపు 3మీటర్లు ఉన్న పెద్ద సొరచేప అతనిపై హఠాత్తుగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో వ్యక్తి కాలు సొరచేపకు చిక్కడంతో దాని నుంచి బలంగా లాగే క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బీచ్‌కు వచ్చిన బోట్ రైడర్లు, ఇతరులు గాయపడిన వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స నిర్వహించారు. అయితే గాయం తీవ్రంగా కావడంతో కొద్దిసేపటికే ఆ వ్యక్తి మరణించాడు.(బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?)
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంకా ఆ వ్యక్తి ఎవరో తెలియదని.. వయసు మాత్రం 60 ఉంటుందని, బహుశా క్వీన్‌లాండ్స్ రాష్ట్రానికి చెందినవాడిగా అనుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియాలో షార్క్ దాడులు ఎక్కువగా ఉంటాయి. అయితే షార్క్ దాడిలో మరణాలు సంభవించడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. గతేడాది ఆస్ట్రేలియాలో 27 షార్క్ దాడులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment