Shark Attack
-
టూరిస్టును సొర మింగేసింది.. కన్న తండ్రి కళ్లముందే.. క్షణాల్లోనే..
ఈజిప్టు: ఈజిప్టులోని హుర్ఘదా రీసార్ట్ సమీపంలో ఓ భయానక ఘటన జరిగింది. ఎర్రసముద్రం ఒడ్డున ఈతకొడుతున్న రష్యా పర్యాటకున్ని షార్క్ చేప మింగేసింది. దీంతో స్థానిక పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వ్లాదిమిర్ పొపోవ్(23) తన కుటుంబంతో సహా విహారానికి హుర్ఘదాలో బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో వ్లాదిమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సముద్ర ఒడ్డున ఈత కొడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఓ సొరచేప ప్రత్యక్షమయింది. భయంతో వారు వేగంగా ఈదినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వ్లాదిమిర్‌ను సొర మింగేసింది. అయితే.. అతని గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తప్పించుకోగలిగింది. రెస్క్యూ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అంతా అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు. Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort 23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X — Nabila Jamal (@nabilajamal_) June 9, 2023 బాధితుడు సొర నుంచి తప్పించుకునే క్రమంలో రక్షించమని తన తండ్రి కోసం ఆర్తనాదాలు చేశాడు. ఒడ్డున ఉన్న అతని తండ్రి చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో బాధితుని తండ్రి విలపించారు. రక్షించమని స్థానికులను వేడుకున్నారు. కానీ నిమిషాల్లోనే అతని కుమారున్ని సొర మింగేసింది. దీంతో అంతా షాక్‌కు గురయ్యామని స్థానిక పర్యాటకులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదీ చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు
ఆయుష్షు మిగిలి ఉందంటే ఇదేనేమో. అమెరికాకు అల్లంత దూరంలో ఉండే హవాయి ద్వీపం సమీపంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఆయుష్షు అంటే ఏంటో తెలిసివచ్చింది. ఎందుకంటే, మృత్యుఘంటికల శబ్దం విని మరీ వెనక్కొచ్చాడు ఘనుడు. స్కాట్ హరగుచ్చి అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో చాన్నాళ్లుగా చేపలు పడుతుంటాడు. "అప్పుడే ఓ చేపను పట్టుకున్నాను. ఇంతలోనే ఓ భయానక శబ్దం వినిపించింది. ఎంతలా అంటే నా గుండె జారిపోయేంత. తిరిగి చూస్తే.. ఓ గోధుమ రంగు టైగర్ షార్క్ నా బోటుపై దాడి చేసింది. నేను ఇవతలివైపు ఉన్నాను కాబట్టి తృటిలో తప్పించుకోగలిగాను." - స్కాట్ హరగుచ్చి, కయాకర్, ఫిషర్ మన్ పసిఫిక్ మహా సముద్రంలో అమెరికాకు పశ్చిమాన 3200 కిలోమీటర్ల దూరంలో ఉండే 137 దీవులను కలిపి హవాయి ఐలాండ్స్ అంటారు. దాదాపు 1200 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉండే ఈ దీవుల సమీపంలో నీళ్లు చాలా శుభ్రంగా కనిపిస్తాయి. ఈ నీటిలో ఇలాంటి సంఘటనలు అంతగా జరగవు. ఏడాది మొత్తమ్మీద నాలుగయిదు ఘటనలు కూడా ఉండవు. అయితే అప్పుడప్పుడు దారి తప్పి వచ్చే టైగర్ షార్క్‌లు మాత్రం ఇలాంటి దాడులకు దిగుతాయి. సాధారణంగా షార్క్‌లు బోటుపై దాడి చేయవు. అయితే స్కాట్ హరగుచ్చి దానికి కొద్దిసేపటి ముందు ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని వల నుంచి విడదీసే సమయంలో బ్లీడింగ్ జరిగింది. బహుశా రక్తం వాసనను పసిగట్టిన షార్క్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. A kayaker was fishing over a mile offshore in Windward Oahu, Hawaii, when a tiger shark slammed into his boat. https://t.co/d0QzzJODZT pic.twitter.com/P7GStEQvRx — CNN (@CNN) May 16, 2023 -
షార్క్‌తో ఓవరాక్షన్.. చావు తప్పి కన్ను లొట్టబోవడమంటే ఇదే!
ప్రకృతిలో కొన్ని జీవరాశులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచింది. ఓవరాక్షన్‌కు పోయి ఎక్స్‌ట్రాలు చేస్తే ప్రాణాలు పోవచ్చు లేకపోతే గాయాలైనా కావచ్చు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, సముద్రంలోని ఓ పడవలో ఒక ఫ్యామిలీ పర్యటిస్తోంది. ఈ క్రమంలో సముద్రంలో ఓ చిన్న సొరచేప(షార్క్)ను నీటిలో వదిలే క్రమంలో అతను ఓవర్‌గా బిహేవ్ చేశాడు. చేపను గట్టిగా నీటిలో అటు ఇటు తిప్పాడు. దీంతో, తిక్కరేగిన సోర చేపకు.. కోపం వచ్చి అతడిని నోటితో గాయపరిచింది. అతడి చేతిని షార్క్ కొరికే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అతడి వేలుకు తీవ్రగాయమైంది. చేతి నుంచి రక్తం కారడం వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్చేస్తున్నారు. ఓ నెటిజన్.. అతడు మరోసారి ఈ తప్పు చేయడు అని కామెంట్ చేశాడు. we would’ve had shark steaks the same night 😅 pic.twitter.com/GDKZCCUgTC — SourPatchB🪬 (@ButtahCuupB) July 20, 2022 -
షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు
Shark Jumping Unbelievably High To Grab The Chopper: ప్రముఖులు, సెలబ్రెటీలు వైరల్ వీడియోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్త ఉండాలి. లేదంటే నెటిజన్ల ట్రోలింగ్కి గురవ్వాల్సిందే. అచ్చం అలానే ఒక సినిమాలో సీన్‌ని వైరల్ వీడియో పోస్ట్ చేసి నెటజన్ల ఆగ్రహానికి గురయ్యారు మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ. అసలేం జరిగిందంటే...ఒక షార్క్ చేప సముద్రంలోంచి పైకి ఎగిరి హెలికాప్టర్ పై దాడి చేస్తున్న వైరల్ వీడియోని మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఈ వీడియోకి నేషనల్ జియోగ్రాఫిక్ ఒక మిలియన్ డాలర్లు చెల్లించిందని కూడా ట్వీట్ చేశారు. నిజానికి ఇది 2017లో వచ్చిన ఫైవ్ హెడ్డ్ షార్క్ ఎటాడ్ చిత్రంలోని సన్నివేశం. దీంతో నెటిజన్లు ఈ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురై ఆమెను దారుణంగా ట్రోల్ చేయడవ మొదలుపెట్టారు. అంతేకాదు అత్యంత మేధావులైన ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ఫేక్ వీడియోని పోస్ట్ చేయడం ఏంటని ఒకరు, అయినా అసలు అదేలా సాధ్యం అని కూడా ఆలోచించకుండా ఈ వీడియోని పోస్ట్ చేశారంటు మరోకరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో కిరణ్ బేడి స్పందించడమే కాకుండా మళ్లీ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సన్నివేశం ఎక్కడ నుంచి వచ్చింది అనేదానికంటే అసలు అలా చేయాలనే ఊహ రావడం గ్రేట్ అని అన్నారు. అయినా ఇలాంటి సాహసోపేతమైన సన్నివేశాన్ని తీయాలనే ఆలోచన తట్టినందుకు మనం ప్రశంసించాలి అంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. ఐతే ఆమె గతంలో కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోలింగ్కి గురయ్యారు. Watch this 🥹🥺🙄😳😲 pic.twitter.com/Io0PQb567U — Kiran Bedi (@thekiranbedi) May 11, 2022 (చదవండి: వైరల్ వీడియో: సింహాన్ని తరిమిన శునకం) -
చావుతో భీకర పోరాటం.. చివరికి ఏమైందంటే!
Shark Attack On Woman: షార్క్ చేపలను సముద్రంలో దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం! కానీ షార్క్ చేప తన కాలును పట్టేసినా భయపడకుండా ఓ మహిళ అత్యంత చాకచక్యంతో దాన్నుంచి తప్పించుకుంది. హీదర్ వెస్ట్ అనే మహిళ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సముద్రంలోకి ఈత కొట్టడానికి దిగింది. ఆమె సముద్రంలోకి దిగగానే.. క్షణాల్లో ఓ షార్క్ చేప ఆమె కాలును గట్టిగా పట్టేసి సముద్రంలోకి లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆమె షార్క్ చేప నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాళ్లు, చేతులు గట్టిగా ఆడిస్తూ.. దాని తలపై బలంతో కొడుతూ దాడి చేసి తప్పించుకుంది. ఈ విషయాన్ని హీదర్ వెస్ట్ స్వయంగా వెల్లడించారు. షార్క్ చేపతో దాదాపు 35 సెకన్ల పాటు భీకరంగా పోరాడినట్లు తెలిపారు. బలంగా కొట్టడంతో షార్క్ చేప తనను వదిలేసిందని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by 🌵 Heather West 🌵 (@wildwitchofthew3st) -
ట్రక్కు ఢీ కొట్టినట్లుంది: ఆ షార్క్ నాపై..
అడిలైడ్ : ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్న గ్రేట్ వైట్ షార్క్‌తో ఒట్టి చేతుల్తో పోరాటం చేశాడో వ్యక్తి. దాన్ని భయపెట్టి తోక ముడిచేలా చేసి, ప్రాణాలు నిలుపుకున్నాడు. షార్క్ దాడి నుంచి ప్రాణాలను రక్షించుకున్న తన అనుభవాలను లేఖ రాశాడు. వివరాల్లోకి వెళితే.. సౌత్ అస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి ఆదివారం అక్కడి కంగారూ ఐలాండ్‌లోని సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో గ్రేట్ వైట్ షార్క్ అతడిపై దాడి చేసింది. ఒట్టి చేతుల్తో పోరాటం చేసి దాన్ని తరిమేశాడు. అనంతరం సర్ఫింగ్ బోర్డుతో సముద్రంలోనుండి బయటకు వచ్చేశాడు. షార్క్ దాడిలో వీపు కింద బాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. అయినప్పటికి ఓ 300 మీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వచ్చాడు. గాయాలతో ఉన్న అతడ్ని చూసిన ఓ పారామెడిక్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో గాయాలకు చికిత్స చేయించుకున్న తర్వాత షార్క్‌తో పోరాడిన అనుభవాలను ఓ లేఖ రాశాడు. ( ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం! ) ఆ లేఖలో.. ‘‘ ఎప్పటిలాగే ఆ రోజు కూడా సర్ఫింగ్ చేయటానికి వెళ్లాను. సముద్రంలో సర్ఫింగ్ బోర్డుపై ఉన్నాను. హఠాత్తుగా నా బోర్డు ఎడమ వైపు ఏదో తగిలినట్లు అనిపించింది. అది ఓ ట్రక్కు ఢీ కొట్టినట్లుగా ఉంది. అనంతరం ఆ షార్క్ నాపై దాడి చేయటం మొదలుపెట్టింది. మోకాళ్లు, తొడలను తీవ్రంగా గాయపర్చింది. నేను దానితో పోరాడాను అది అక్కడినుంచి కనిపించకుండా పోయింద’’ని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( రైతు జీవితం మార్చేసిన ఖరీదైన వజ్రం ) -
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
-
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
బ్రిస్బేన్ : బీచ్‌లో సర్ఫింగ్ చేద్దామని వచ్చిన ఒక వ్యక్తిని దాదాపు మూడు మీటర్లు ఉన్న షార్క్(పెద్ద చేప) దాడి చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాలు.. బ్రిస్బేన్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్స్క్లిఫ్లోని బీచ్‌కు ఒక వ్యక్తి వచ్చాడు. బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాదాపు 3మీటర్లు ఉన్న పెద్ద సొరచేప అతనిపై హఠాత్తుగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో వ్యక్తి కాలు సొరచేపకు చిక్కడంతో దాని నుంచి బలంగా లాగే క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బీచ్‌కు వచ్చిన బోట్ రైడర్లు, ఇతరులు గాయపడిన వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స నిర్వహించారు. అయితే గాయం తీవ్రంగా కావడంతో కొద్దిసేపటికే ఆ వ్యక్తి మరణించాడు.(బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?) ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంకా ఆ వ్యక్తి ఎవరో తెలియదని.. వయసు మాత్రం 60 ఉంటుందని, బహుశా క్వీన్‌లాండ్స్ రాష్ట్రానికి చెందినవాడిగా అనుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియాలో షార్క్ దాడులు ఎక్కువగా ఉంటాయి. అయితే షార్క్ దాడిలో మరణాలు సంభవించడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. గతేడాది ఆస్ట్రేలియాలో 27 షార్క్ దాడులు జరిగాయి. -
విషాదం : ఉంగరంతో తన భర్తను గుర్తుపట్టింది
లండన్ : హిందూ మహాసముద్రంలోని ఓ దీవికి విహారయాత్రకని వెళ్లిన దంపతులకు విషాదమే మిగిలింది. ఈతకు వెళ్లిన వ్యక్తిని ఏకంగా ఒక సొరచాప మింగేసింది. వివరాల్లోకి వెళితే.. ఎడిన్‌బర్గ్‌కు చెందిన రిచర్డ్ మార్టిన్ టర్నర్ అనే వ్యక్తి ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. తన భార్య 40వ పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకోవాలని నవంబర్ 2న హిందూ మహాసముద్రంలోని రీ యూనియన్ దీవికి వచ్చారు.అయితే అక్కడి నుంచి లాగూన్ బీచ్ ప్రాంతానికి వెళ్లిన రిచర్డ్ 6 అడుగుల లోతు ఉన్న సముద్రంలోకి ఈతకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అప్రమత్తమై భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పడవలు, హెలికాప్టర్, గజ ఈతగాళ్లను రప్పించి దీవి మొత్తం వెతికించినా ఎలాంటి ఫలితం రాలేదు. అయితే లాగూన్ బీచ్‌లో షార్క్ చేపలు తిరుగుతున్నాయని తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లను అక్కడికి పంపించి నాలుగు షార్క్ చేపలను బంధించారు. వాటిని చంపి షార్క్ అవశేషాలను పరిశీలించగా ఒక షార్క్ కడుపులో చేయితో పాటు ఉంగరం కూడా దొరికింది. ఆ ఉంగరాన్ని పరిశీలించిన రిచర్డ్ భార్య అది తన భర్తదేనని తెలిపారు. అలాగే అధికారులు చేయిని, ఇతర అవశేషాలను డీఎన్ఏ టెస్ట్‌కు పంపిచంగా అది రిచర్డ్‌దేనని స్పష్టం చేశారు. అయితే రిచర్డ్‌ను మింగిన షార్క్ 13 అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఓ మోడల్‌కు.. భయానక అనుభవం
-
మోడల్‌ను నోట కరుచుకుపోయింది
ఫోటో షూట్ కోసం వెళ్లిన ఓ మోడల్‌కు.. భయానక అనుభవం ఎదురైంది. నీటిలో ఫోటోలు దిగుతున్న సమయంలో ఓ షార్క్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆమెను నోట కరుచుకుని లోపలికి లాక్కెళ్లేందుకు యత్నించగా.. చివరకు ఎలాగోలా ఆమె ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాకు చెందిన 19 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ మోడల్ కటరినా ఎల్లె జరుట్స్కీ, తన బోయ్‌ఫ్రెండ్ ఫ్యామిలీతో సరదాగా బహమాస్‌కు షికారు వెళ్లింది. అక్కడ సముద్రంలో ఫోటో షూట్‌కు సిద్ధమైంది. అయితే కాస్త వెరైటీ ఉండాలన్న ఉద్దేశంతో షార్క్‌లను పెంచే ఎన్‌క్లోజర్‌లోకి దిగింది. ఆమె ప్రియుడి తండ్రి ఆమెను ఫోటోలు తీయటం ప్రారంభించాడు. ఇంతలో ఐదడుగుల షార్క్ ఒకటి ఆమె చేతిని నోట కరిచి నీటి అడుగు భాగానికి లాక్కెల్లింది. ఆ దెబ్బకు వణికిపోయిన పెద్దాయన సాయం కోసం కేకలు వేశాడు. అయితే దానిని విడిపించుకుని బయటపడ్డ కటరినా.. వెంటనే ఒడ్డుకు పరిగెత్తింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె భుజంలో షార్ట్ పళ్లు బలంగా దిగినట్లు వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఆమె ప్రత్యేక చికిత్స తీసుకుంటోంది. -
వైరల్: మహిళ వేలుకొరికేసిన షార్క్!
పెర్త్ : సముద్రంలో స్నేహితులతో బోటులో విహరిస్తూ ఆస్వాదిస్తున్న ఓ మహిళకు అనుకోకుండా ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. పడవ వెనుకాల నిల్చోని సముద్రపు అలలతో ఆడుకుంటుండగా.. ఓ షార్క్ ఆమెపై దాడి చేసింది. అయితే ఆమె, బోటులోని సహచరులు అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కింబెర్లీ సముద్ర తీరంలో గత మే నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే బోటులో ప్రయాణిస్తుండగా ఓ నాలుగు షార్క్‌లు తమ పడవ చుట్టూ చేరాయని, అందులో ఒకటి తనపై దాడి చేసి వేలు కొరికేసిందని బాధితురాలు మెలిస్సా బర్నింగ్ తెలిపింది. షార్క్ పదునైన పళ్లతో కొరకడంతో తన వేలును కోల్పోవాల్సి వచ్చిందని, కిందపడిపోయిన తనను సహచరులు లేపారని చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో ఆ షార్క్ తప్పేమి లేదని, తప్పంతా తనదేనని కూడా చెప్పుకొచ్చింది. సముద్రపు జీవులను తాను ప్రేమిస్తానని, వాటికి స్వేచ్చనివ్వాలని కూడా చెప్పింది. అది షార్క్ కాబట్టి బతికి బయపడ్డా కానీ ఏ మొసలో అయితే అంతే సంగతంటూ భయపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన మొబైల్ ఫుటేజీని ఓ చానల్ ప్రసారం చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. -
భయానక దాడి; ప్రపంచ స్థాయి టోర్నీ రద్దు
పెర్త్: రంపంలాంటి పళ్లతో మనుషుల్ని నమిలిమింగే సొర చేపలు(షార్క్‌లు) బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సర్ఫర్లపై భయకరంగా దాడిచేశాయి. దీంతో అట్టహాసంగా జరగాల్సిన ప్రపంచ స్థాయి సర్ఫింగ్ పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. వరల్డ్ సర్ఫ్ లీగ్(డబ్ల్యూఎస్‌ఎల్) ఈ మేరకు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది. మనిషి నెత్తురు కోసం ఆరాటంగా: ఔత్సాహిక సర్ఫర్లను ప్రోత్సహిస్తూ, సాహసక్రీడను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో వరల్ట్ సర్ఫ్ లీగ్ ప్రపంచ స్థాయి టోర్నీలను నిర్వహిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ‘మార్గరేట్ రివర్ ప్రో’ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడి గ్రేస్ టౌన్ చుట్టుపక్క తీరాల్లో సర్ఫర్లు తమ విన్యాసాలు చేశారు. ఏప్రిల్ 22 వరకు జరుగనున్న ఈ ఈవెంట్ సొర చేపల దాడితో అర్ధాంతరంగా రద్దైపోయింది. సర్ఫింగ్ చేస్తోన్న క్రీడాకారులపై వరుసగా సోమ, మంగళవారాల్లో దాడులు జరిగాయి. మనిషి నెత్తురు కోసం ఆరాటపడే షార్క్‌లు చాకచక్యంగా దాడులు చేస్తాయన్న సంగతి తెలిసిందే. షార్క్‌ల దాడిలో తృటిలో ప్రాణాలను దక్కించుకున్న సర్ఫర్లను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. వెరీ సారీ: ‘‘సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సొర చేపలు దాడిని అడ్డుకోలేకపోయాం. క్రీడాకారుల భద్రత దృష్ట్యా ఈ దఫా పోటీలను రద్దు చేస్తున్నాం. గాయపడ్డ ఇద్దరిలో ఒకరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నీని రద్దు చేయడం బాధాకరమే అయినా, తప్పడంలేదు. క్రీడాకారులందరికీ సారీ.’’ అని డబ్ల్యూఎస్‌ఎల్ అధికారిక ప్రతినిధి సోఫీ మీడియాకు వివరించారు. -
సొర చేపలు బీభత్సం సృష్టించాయి
-
షార్క్ దాడిలో భారత సంతతి మహిళ మృతి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన 49 ఏళ్ల ఓ మహిళ షార్క్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కోస్టారికా పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్టారికాలోని కోకస్ ద్వీపంలో స్క్యూబా డైవింగ్ చేయడానికి 18 మంది వెళ్లారు. వీరంతా డైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా షార్క్వచ్చి వారిపై దాడిచేసింది. వారిలో రోహినా భండారీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆమెకు చికిత్స అందించినా కాళ్లకు అయిన గాయాలు తీవ్రంగా ఉండడంతో ఆమె మరణించారు. రోహినాతోపాటు స్కూబా డైవింగ్ మాస్టర్ కూడా షార్క్ వల్ల స్వల్ప గాయలపాలయ్యారు. అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. షార్క్ మామీద దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి షార్క్ నుంచి దూరంగా ప్రయాణించేందుకు ఎంత ప్రయత్నించినా అది వేగంగా వచ్చి దాడిచేసిందని తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థలో భండారీ ఈక్విటీలో మేనేజరుగా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కోకస్ ద్వీపం రకరకాల షార్క్ జాతులకు ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు పొందడంతోపాటు, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి కూడా గుర్తింపు పొందింది. -
డైవర్‌కు చుక్కలు చూపిన షార్క్..
ఓ ఆస్ట్రేలియన్ డైవర్‌కు ఓ భారీ రాకాసి షార్క్ చుక్కలు చూపించింది. వేటాడి వేటాడి తీవ్రంగా గాయపరిచింది. ఏదోలా చావు నుంచి బయటపడిన అతడు మాత్రం దాదాపు ఎనిమిది గంటల పాటు చావు కంటే నరకాన్ని అనుభవించాడు. ఆ తర్వాతే అతడికి వైద్యం అందింది. క్వీన్స్లాండ్ తీరంలోని ఏజెన్సీ ప్రాంతంగా ఉండే గ్రేట్ బారియర్ రీఫ్లో స్కూబాకు చెందిన డైవర్ ఓ మరబోటులో వెళ్లి సముద్రంలోకి దిగాడు. అనంతరం ప్రశాంతంగా నీటి అడుగుభాగంలోకి వెళ్లి ఈదుతున్నాడు. దాదాపు 50 అడుగుల లోతుగా వెళ్లి ముందుకు వెళుతున్న సమయంలో అనూహ్యంగా వెనుక నుంచి అతడిపై షార్క్ దాడి చేసింది. అతడి చేతిని పలుమార్లు గట్టిగా కొరికింది. అలాగే కడుపులో కూడా గాయం చేసింది. దాదాపు 8 చోట్ల గాయాలపాలయినప్పటికీ ఎంతో ధైర్యంగా ఈది తన మరబోటును చేరుకున్న అతడు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకున్నాడు. రక్తస్రావం తీవ్రంగా అవ్వడంతో దాదాపు 8 గంటలపాటు నొప్పులు అనుభవించాడు. కానీ ఎట్టకేలకు ప్రాణాలు దక్కించుకోగలిగాడు. -
కోల్పోయింది చెయ్యిని మాత్రమే.. ధైర్యాన్ని కాదు
బెథానీ హామిల్టన్ కు అప్పుడు 13 ఏళ్లు .. షార్క్ దాడి చేసిన ఘటనలో ఎడమ చేతిని కోల్పోయింది. అయితే తాను కోల్పోయింది చెయ్యిని మాత్రమే అని, తన ధైర్యాన్ని, సాహసాన్ని కాదని నిరూపించింది. ప్రస్తుతం ఆమె వయసు 26 ఏళ్లు. సరిగ్గా ఆ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచాయి. సర్ఫింగ్ గేమ్ లో మకుటం లేని మహరాణిలా దూసుకుకోతోంది. సర్ఫింగ్ అంటేనే రాకాసి అలలు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా అలలపై అలా దుసుకెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ, ఒక్క చేతితోనే అద్భుతాలను చేస్తోంది హామిల్టన్. గత నెలలో వరల్డ్ సర్ఫింగ్ లీగ్ లో సంచలనమే చేసింది. సర్ఫింగ్ లీగ్ కమిషనర్ జెస్సీ మిలీ డైయర్ ఫిజీలో జరిగిన ఈవెంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హామిల్టన్ కు అవకాశాన్ని కల్పించింది. మూడో స్థానంలో నిలిచి తోటి సర్ఫర్స్ కు ప్రేరణగా నిలిచింది. కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకున్నట్లు చెప్పిన హామిల్టన్, తన జీవితాన్ని కథాంశంగా చేసుకుని డాక్యుమెంటరీ తీస్తానంటోంది. తాను ఒక చేతితో సర్ఫింగ్ చేయడాన్ని మాత్రమే కాదు, తల్లి అయిన తర్వాత కాంపిటీషన్స్ లో పాల్గొనడాన్ని కూడా ప్రస్తావిస్తానని చెప్పింది. వచ్చే సీజన్లో 'సర్ఫ్ లైక్ ఏ గర్ల్' విడుదల చేస్తానని, ఏ వ్యక్తిని తక్కువగా అంచనా వేయరాదని.. ఒకసారి మనం మాస్టర్ అయితే అందరూ గౌరవిస్తారని అభిప్రాయపడింది. చేతిని కోల్పోయిన 13 వారాలకే సర్ఫింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.హామిల్టన్ సర్ఫింగ్ స్కిల్స్ ను 11 సార్లు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన కెల్లీ స్లేటర్ ప్రశంసించాడు. ఆమె తెగువను నిజంగానే మెచ్చుకోవాలన్నాడు. తనలాగే ఒక చెయ్యి ఉన్నవారు సర్ఫింగ్ ట్రై చేయాలని, తాను కూడా మొదట్లో ఎంతో భయపడ్డా చివరికి సాధించానంటూ హామిల్టన్ పిలుపునిచ్చింది. -
కాంపిటేషన్ మధ్యలో షార్క్ ఈడ్చుకెళ్లింది
-
కాంపిటేషన్ మధ్యలో షార్క్ ఈడ్చుకెళ్లింది
దక్షిణాఫ్రికా: అది దక్షిణాఫ్రికాలోని ఓ సముద్రం. భారీగా ఎగిసి పడుతున్న అలలు. ఒడ్డున ఆనందంతో ఎగిరి గంతులేస్తున్న భారీ జనం.. చుట్టూ కెమెరాలు. సముద్రపు అలలపై సర్ఫర్లు(చిన్న తెప్పలాంటిదానిపై నిల్చునిగానీ, పడుకొని గానీ సముద్రపు అలలపై రైడింగ్ చేసేవాళ్లు). వేగంగా వారు దూసుకెళుతుండగా వారికి రక్షణగా మరపడవలు. ఇందులో మిక్ ఫ్యానింగ్ అనే ఆస్ట్రేలియా సర్ఫర్ వాయువేగంతో లక్షిత ప్రాంతానికి దూసుకొస్తున్నాడు. మరికొద్ది సేపటిలో ఒడ్డుకు చేరుకుంటాడనంగా అతడిపై సడెన్‌గా ఓ షార్క్ దాడి చేసి నీటిలో అమాంతం ముంచివేసి గాయపరిచింది. ఎట్టకేలకు అతడిని అక్కడి సిబ్బంది రక్షించారు. మిక్ ఫ్యానింగ్ ఇప్పటికే సర్ఫింగ్‌లో మూడు టైటిళ్లు సాధించి లెజెండ్ అని నిరూపించుకున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాలో 'జే బే సర్ఫ్ ఓపెన్' నిర్వహించగా అందులో పాల్గొన్నాడు. షార్క్ దాడి ఘటన గురించి ఆయన మాటల్లో చూస్తే 'లక్ష్యం మరికొద్ది దూరంలో ఉండగానే ఎవరో నా కాలు లాగుతున్నట్లు అనిపించింది. మొదటి సారి కాలు విదిలించాను. కొద్ది సేపటి తర్వాత మళ్లీ అలాగే అని పించింది. నేను మళ్లీ అలాగే చేశాను. కొంచెం సేపయ్యాక నా వెనుక ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. తిరగి చూసేవరకు భయంకరమైన షార్క్ కోరపళ్లతో ఒక్కసారిగా నాపై విరుచుపడింది. భయంతో కేకలు వేయడం మొదలు పెట్టాను. చాలాసార్లు నన్ను నీటిలో ముంచి లోపలికి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. నా అరుపులు విని సిబ్బంది వచ్చి రక్షించారు. స్వల్పంగా నాకు గాయమైంది' అని వణికిపోతూ చెప్పాడు. జేబే సర్ఫ్ ఓపెన్ నిర్వాహకులు కూడా విక్ ఫ్యానింగ్ బతికి బయటపడ్డాడు మాకు అదే చాలు అని ఆనందం వ్యక్తం చేశారు. -
కాళ్లు చేతులు పీక్కు తిన్న సొరచేప
వాషింగ్టన్: ఉత్తర కరోలినా సముద్ర తీర ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో షార్క్ (సొర చేప) దాడిలో ఓ యువతి తన చేతిని, కాలిని కోల్పోగా.. మరో యువకుడు దారుణంగా గాయపడ్డాడు. అతడి కుడిచేయిని కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే నావికా దళం వారిని శరవేగంగా ఆస్పత్రికి తరలించింది. పోలీసుల వివరాల ప్రకారం ప్రశాంతంగా ఉండే ఓక్ ఐలాండ్ దీవి సముద్ర తీరంలోకి విహారం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి.. పదహారేళ్ల అబ్బాయి వచ్చారు. అనంతరం వారు సముద్రంలో ఆడుకుంటుండగా తొలుత అమ్మాయిపై దాడి చేసిన షార్క్ ఆమె ఎడమ చేతిని, ఎడమ కాలిని నుజ్జునుజ్జు చేసింది. అరగంట తర్వాత పదహారేళ్ల బాలుడిపై దాడి చేయి అతడి కుడి చేతిని తినేసింది. అప్రమత్తమైన గస్తీ దళం వారిని రక్షించి ఆస్పత్రికి తరలించింది.