
కాళ్లు చేతులు పీక్కు తిన్న సొరచేప
వాషింగ్టన్: ఉత్తర కరోలినా సముద్ర తీర ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో షార్క్ (సొర చేప) దాడిలో ఓ యువతి తన చేతిని, కాలిని కోల్పోగా.. మరో యువకుడు దారుణంగా గాయపడ్డాడు. అతడి కుడిచేయిని కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే నావికా దళం వారిని శరవేగంగా ఆస్పత్రికి తరలించింది.
పోలీసుల వివరాల ప్రకారం ప్రశాంతంగా ఉండే ఓక్ ఐలాండ్ దీవి సముద్ర తీరంలోకి విహారం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి.. పదహారేళ్ల అబ్బాయి వచ్చారు. అనంతరం వారు సముద్రంలో ఆడుకుంటుండగా తొలుత అమ్మాయిపై దాడి చేసిన షార్క్ ఆమె ఎడమ చేతిని, ఎడమ కాలిని నుజ్జునుజ్జు చేసింది. అరగంట తర్వాత పదహారేళ్ల బాలుడిపై దాడి చేయి అతడి కుడి చేతిని తినేసింది. అప్రమత్తమైన గస్తీ దళం వారిని రక్షించి ఆస్పత్రికి తరలించింది.