ఈజిప్టు: ఈజిప్టులోని హుర్ఘదా రీసార్ట్ సమీపంలో ఓ భయానక ఘటన జరిగింది. ఎర్రసముద్రం ఒడ్డున ఈతకొడుతున్న రష్యా పర్యాటకున్ని షార్క్ చేప మింగేసింది. దీంతో స్థానిక పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది.
వ్లాదిమిర్ పొపోవ్(23) తన కుటుంబంతో సహా విహారానికి హుర్ఘదాలో బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో వ్లాదిమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సముద్ర ఒడ్డున ఈత కొడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఓ సొరచేప ప్రత్యక్షమయింది. భయంతో వారు వేగంగా ఈదినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వ్లాదిమిర్‌ను సొర మింగేసింది. అయితే.. అతని గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తప్పించుకోగలిగింది. రెస్క్యూ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అంతా అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort
— Nabila Jamal (@nabilajamal_) June 9, 2023
23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X
బాధితుడు సొర నుంచి తప్పించుకునే క్రమంలో రక్షించమని తన తండ్రి కోసం ఆర్తనాదాలు చేశాడు. ఒడ్డున ఉన్న అతని తండ్రి చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో బాధితుని తండ్రి విలపించారు. రక్షించమని స్థానికులను వేడుకున్నారు. కానీ నిమిషాల్లోనే అతని కుమారున్ని సొర మింగేసింది. దీంతో అంతా షాక్‌కు గురయ్యామని స్థానిక పర్యాటకులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఇదీ చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!
Comments
Please login to add a commentAdd a comment