beach accident
-
ఆస్ట్రేలియా బీచ్‌లో ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ బీచ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్ దీవిలోని ఎటువంటి కాపలా ఉండని ఈ బీచ్‌లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు చెప్పారు. మృతులను జగ్జీత్ సింగ్ ఆనంద్(23), సుహానీ ఆనంద్(20), కీర్తి బేడి(20), రీమా సోంధి(43)గా గుర్తించారు. పంజాబ్‌కు చెందిన రీమా సోంధి రెండు వారాల క్రితం క్లైడ్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు ఫిలిప్ దీవికి వచ్చి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. -
ఆర్కే బీచ్: దీపక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఆర్కే బీచ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సరదా కోసం సముద్రంలో ఈతకు దిగిన యువకుడు అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టికుపోయాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన బీచ్ లైఫ్ గార్డ్స్ అతడిని రక్షించారు. వివరాల ప్రకారం.. ఈరోజు ఆదివారం కావడంతో ఆర్కే చీచ్ వద్దకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక, పలు పక్క రాష్ట్రం ఒడిషా నుంచి కూడా కొందరు పర్యాటకులు అక్కడికి వచ్చారు. కాగా, వీరిలో దీపక్(26) అనే వ్యక్తి ఈత కోసం సముద్రంలోకి దిగాడు. సరదాగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సముద్ర అలలు ఎక్కువయ్యాయి. అలల తాకిడికి దీపక్ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన బీచ్ లైఫ్ గార్డ్స్ దీపక్‌ను రక్షించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఇది కూడా చదవండి: నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో.. -
టూరిస్టును సొర మింగేసింది.. కన్న తండ్రి కళ్లముందే.. క్షణాల్లోనే..
ఈజిప్టు: ఈజిప్టులోని హుర్ఘదా రీసార్ట్ సమీపంలో ఓ భయానక ఘటన జరిగింది. ఎర్రసముద్రం ఒడ్డున ఈతకొడుతున్న రష్యా పర్యాటకున్ని షార్క్ చేప మింగేసింది. దీంతో స్థానిక పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వ్లాదిమిర్ పొపోవ్(23) తన కుటుంబంతో సహా విహారానికి హుర్ఘదాలో బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో వ్లాదిమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సముద్ర ఒడ్డున ఈత కొడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఓ సొరచేప ప్రత్యక్షమయింది. భయంతో వారు వేగంగా ఈదినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వ్లాదిమిర్‌ను సొర మింగేసింది. అయితే.. అతని గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తప్పించుకోగలిగింది. రెస్క్యూ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అంతా అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు. Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort 23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X — Nabila Jamal (@nabilajamal_) June 9, 2023 బాధితుడు సొర నుంచి తప్పించుకునే క్రమంలో రక్షించమని తన తండ్రి కోసం ఆర్తనాదాలు చేశాడు. ఒడ్డున ఉన్న అతని తండ్రి చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో బాధితుని తండ్రి విలపించారు. రక్షించమని స్థానికులను వేడుకున్నారు. కానీ నిమిషాల్లోనే అతని కుమారున్ని సొర మింగేసింది. దీంతో అంతా షాక్‌కు గురయ్యామని స్థానిక పర్యాటకులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదీ చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. అందులో ఒకటి..!
బ్రిస్బెన్: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్న సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా ల్యాండింగ్ అవడంతో పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొంది. రాజధాని బ్రిస్బెన్కు 45 కిలోమీటర్ల దూరంలోని గోల్డ్‌కోస్ట్ బీచ్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీకొట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఆ ప్రాంతం అత్యంత ప్రజాదరణ పొందిన పర్యటక ప్రాంతంగా ఉంది. ఆస్ట్రేలియాలో సెలవు దినాలు కావడంతో జనవరిలో భారీగా జనం తరలి వస్తారు. ప్రమాదం జరిగిన క్రమంలో బీచ్‌లోని సీ-వరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు అధికారులు. వైద్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీసు తెలిపింది. #BREAKING: Emergency services are responding after a helicopter crash on the Gold Coast Broadwater at Southport. Three people are believed dead, with two more seriously injured. More details to come. #9News pic.twitter.com/Mmtw1ENscL — 9News Gold Coast (@9NewsGoldCoast) January 2, 2023 ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
Fact Check: బైక్‌పై బాలుడి మృతదేహం వార్తల్లో అసలు వాస్తవం ఇదీ..
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం బీచ్‌లో మృతి చెందిన బాలుడిని ద్విచక్రవాహనంపై తరలించారని, పోలీసులు సరిగా స్పందించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వాహనం ఏర్పాటు చేయలేదని చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు బాలుడి మృతిపై కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి మంగినపూడికి ఆదివారం వెళ్ళాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. తనతో కలిసి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకుని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న స్థానిక రాబర్ట్ సన్ పేట ఇన్స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియపరిచారు. చీకటి పడే వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపును తిరిగి కొనసాగించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాలుడు మృతదేహం పెదపట్నం బీచ్ వద్ద లభ్యమైందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో పోలీసు వారు సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని, మృతదేహాన్ని తరలించడానికి సైతం వాహనం ఏర్పాటు చేయలేదని, సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది అసత్యాలను ప్రచారం చేశారు. గాలింపు చర్యలు వేరు వేరు ప్రాంతంలో జరగటం వలన పెదపట్నం బీచ్ వద్దకు చేరుకునే సరికి సమయం పట్టింది గాని, ఇందులో పోలీసు వారు సరిగా స్పందించలేదన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి వివరణ తీసుకోకుండా తమప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించాలని చూస్తే చర్యలు తప్పవని బందరు డీఎస్పీ మాసుం భాష హెచ్చరించారు. ఇదీ చదవండి: Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం' -
తల్లడిల్లిన మాతృ హృదయాలు
విశాఖపట్నం: తీరంలో గల్లంతైన విద్యార్థుల్లో మండలంలోని చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ ఉన్నారు. వీరిలో గణేష్ మృతిచెందాడు. ఈ రోజు(శనివారం) ఉదయం గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఇక ప్రాణాలతో బయటపడిన తేజ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.చూచుకొండ గ్రామానికి చెందిన పెంటకోట ఆదినారాయణ, నాగమణి దంపతులకు కుమార్తె, కుమారుడు గణేష్ ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నారు. కుమారుడు గణేష్ అనకాపల్లిలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గణేశ్ మృతి వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఈత రావడంతో.. మునగపాక పల్లపు వీధిలో నివాసం ఉంటున్న సూరిశెట్టి కన్నబాబు,హేమ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు తేజ. వీళ్లది కూడా రైతు కుటుంబమే. తేజ అనకాపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి పూడిమడక సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ఈత రావడంతో ఏదొలా ఒడ్డుకు చేరుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని స్థానికులు అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. తేజ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యలమంచిలి: తీరంలో గల్లంతైన విద్యార్థుల్లో పట్టణ పరిధి ఎర్రవరం గ్రామానికి చెందిన పూడి రామచంద్రశేఖర్ ఉన్నాడు. గ్రామానికి చెందిన పూడి శ్రీను, సుజాత దంపతులకు రామచంద్రశేఖర్, పూజ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను వడ్రంగి పని చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాడు. కుమార్తె విజయవాడలో నర్సింగ్, రామచంద్ర శేఖర్ అనకాపల్లి డైట్ కళాశాలలో ఈసీఈ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తన స్నేహితులతో కలిసి పూడిమడక బీచ్‌కు స్నానానికి వెళ్లాడు. తీరంలో కుమారుడు గల్లంతయ్యాడన్న వార్తలో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని అదుపుచేయడం ఎవరితరం కావడం లేదు. తల్లడిల్లిన మాతృ హృదయాలు రోలుగుంట: రోలుగుంటకు చెందిన విద్యార్థి జశ్వంత్‌కుమార్ తీరంలో గల్లంతు వార్త తెలుసుకున్న మాతృహృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇదే గ్రామానికి చెందిన సుర్ల గిరిగోవర్దనరావు, అమ్మాజీకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిని కష్టపడి శక్తిమేర చదివిస్తున్నారు. వీరిలో కుమారుడు జశ్వంత్‌కుమార్ ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు నర్సీపట్నం శారదా ఇంగ్లీష్ మీడియంలో, ఇంటర్ విశాఖ శ్రీచైతన్యం చదివించారు. ప్రస్తుతం అనకాపల్లి దాడి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అనకాపల్లిలో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. తీరంలో గల్లంతైన విషయం తల్లిదండ్రులకు చేరడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. -
డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్
రాకాసి అలలు.. ఎన్నో కుటుంబాల్లో మరణ శాసనం రాసి సముద్రమంత దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునేలోపు పర్యాటకుల జీవితాల్లో తీరం విషాదాన్ని నింపుతున్నాయి. గజ ఈతగాళ్లు ఉన్నా.. మునిగిపోతున్నవారిని చేరేలోపే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ చెప్పేందుకు విశాఖ వాసులు సరికొత్త డ్రోన్‌ను ఆవిష్కరించారు. సైఫ్‌సీస్ పేరుతో రూపొందించిన ఈ పరికరం మృత్యు అలలను ఎదిరించి మునిగిపోతున్న వారి ప్రాణాలు కాపాడగలదు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను పర్యాటక శాఖ నిర్వహించింది. సాక్షి, విశాఖపట్నం: సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎవరికైనా ఈత కొట్టాలనిపిస్తుంటుంది. కానీ రాకాసి అలలు మింగేస్తాయని భయం అందరిలోనూ ఆందోళన రేకెత్తించినా.. అక్కడి పరిస్థితులు వాటిని లెక్కచెయ్యనీయవు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పుష్కర కాలంలో సుమారు 600 మంది అలలకు బలయ్యారు. ఇందులో 60 శాతం మంది 15 నుంచి 30 ఏళ్లలోపువారే ఉండటం బాధాకరమైన విషయం. నగర పరిధిలోని అన్ని బీచ్పాయింట్లలో ఉండే లైఫ్‌గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్‌గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యువాతపడుతున్నారు. ఇటువంటి వారిని కాపాడేందుకు విశాఖకు చెందిన ఓ బృందం సైఫ్‌సీస్ పేరుతో డ్రోన్‌ను తయారు చేసింది. దగ్గరలోనే లోతు.. వదులుగా ఇసుక మిగిలిన సముద్ర తీరాలతో పోలిస్తే విశాఖ తీరం రూపురేఖలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తే గానీ లోతుండదు. గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకూ నడిచి వెళ్లొచ్చు. కానీ విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఆర్కే బీచ్‌కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు మరింతగా పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్‌నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సముద్రంలో ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఈ సైఫ్‌సీస్ డ్రోన్లు ఉపయోగపడతాయి. సైఫ్ సీస్.. ఇలా రక్షిస్తుంది.. సాధారణంగా లైఫ్‌గార్డ్ సెకనుకు మీటరు నుంచి మీటరున్నర దూరం ఈదుతూ వెళ్లగలరు. 30 మీటర్ల దూరంలో పర్యాటకుడు మునిగిపోతుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 25 సెకన్ల సమయం లైఫ్గార్డుకు పడుతుంది. కానీ.. గజఈతగాడి కంటే ఐదు రెట్లు వేగంగా ఈ మానవ రహిత డ్రోన్లు దూసుకెళ్తుంది. 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకన్ల వ్యవధిలోనే చేరుకొని బాధితుడిని రక్షించగలదు. అంటే లైఫ్గార్డు కంటే 7 రెట్లు వేగంగా స్పందిస్తుంది. లైఫ్గార్డు ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే రక్షించగలరు. కానీ.. సైఫ్‌సీస్ 200 కిలోల బరువు వరకూ ఎంత మంది ఉంటే అందర్ని ఒడ్డుకు తీసుకురాగలదు. గంటకు 15 కిలో మీటర్ల వేగంతో అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. పూర్తిగా రిమోట్ ద్వారా ఒడ్డున నిలబడే ఆపరేట్ చేస్తూ.. మునిగిపోతున్న వారి వద్దకు ఈ డ్రోన్లను క్షణాల్లో పంపించవచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల వరకూ దీన్ని పంపించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీలు 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంట పాటు పనిచేస్తాయి. స్టాండ్ బై మోడ్ 5 నుంచి 6 గంటల వరకూ ఉంటుంది. 22 కేజీల బరువుండే ఈ డ్రోన్‌ను పట్టుకుంటే మళ్లీ జారిపోకుండా గ్రిప్ ఉంటుంది. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.6 లక్షల వరకూ ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం వరకూ దీనిని కంట్రోల్డ్‌గా ఆపరేట్ చెయ్యవచ్చు. భారత ప్రభుత్వ ప్రశంసలు విశాఖ బృందం చేసిన ఈ సైఫ్‌సీస్ డ్రోన్‌కు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పోలో సైఫ్సీస్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ దీని పనితీరుని తెలుసుకొని బృంద సభ్యులను అభినందించారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పర్యాటక అవసరాల కోసం వీటిని కొనుగోలు చేసుకున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ.. కొద్ది నెలల క్రితం సైఫ్‌సీస్ డ్రోన్ ట్రయల్ రన్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రోత్సహిస్తే.. ప్రాణాలు కాపాడతాం.. మూడేళ్ల పాటు శ్రమించి సైఫ్‌సీస్ డ్రోన్‌ని ఇండియన్ నేవీ స్పెసిఫికేషన్స్‌తో తయారు చేశాం. సైఫ్సీస్ని డీఆర్డీవో–ఎన్ఎస్టీఎల్ అప్రూవ్ డిజైన్‌తో రూపుదిద్దుకుంది. లైఫ్‌గార్డుల కంటే వేగంగా చేరుకోవడం వల్ల సముద్రంలో మునిగిపోతున్న వారిని కాపాడగలం. 100 శాతం ఆటోమేటిక్‌గా రోబోటిక్ ప్రోబ్స్తో దీన్ని తయారు చేశాం. పలు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుతోంది. ఏపీలో ప్రోత్సహిస్తే వైజాగ్ బీచ్‌లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలమన్న విశ్వాసం మాకు ఉంది. – అలీఅస్గర్ కలకత్తావాలా, సైఫ్‌సీస్ కో–ఫౌండర్ (చదవండి: సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి') -
మృత్యు కెరటాలు! నాలుగేళ్లలో 233 మంది పర్యాటకులు బలి..
Unimaginable death rate in Vizag beach These are reasons బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సుందర సాగర తీరం... ఒక్కోసారి వారిపైనే ఉగ్రరూపం చూపిస్తోంది. అనూహ్యంగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి కాటేస్తున్నాయి. మరోవైపు అత్యుత్సాహంతో కొందరు కెరటాలకు బలైపోతున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులు, లైఫ్‌గార్డ్స్ నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ తీరంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, ఒడిశా నుంచి నగరానికి వచ్చి తీరంలో సేద తీరుతున్న నలుగురిని రాకాసి కెరటాలు ఆదివారం కాటేసిన విషయం తెలిసిందే. 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృతిచెందారు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో 233 మంది కెరటాలకు బలైపోయారు. రిప్ కరెంట్‌తో భారీ కెరటాలు విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగరనగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో... అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్‌గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం. యువకుడి మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న సిబ్బంది చదవండి: ఆర్కే బీచ్‌లో ఇద్దరి మృతి లైఫ్‌గార్డ్స్‌తో కొంత రక్షణ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న బీచ్‌లలో ఎవరైనా ప్రమాదాలకు గురైతే రక్షించేందుకు 38 మంది లైఫ్ గార్డ్స్‌ను జీవీఎంసీ నియమించింది. తీరంలో ఎవరైనా అలలకు చిక్కినప్పుడు వీరు సకాలంలో స్పందించడం వల్లే సుమారు 95 శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారు. ఆర్కే బీచ్‌లో 20 మంది, యారాడ, రుషికొండలో ఆరుగురేసి, తెన్నేటిపార్కు బీచ్, సాగర్‌నగర్, ఐటీ హిల్స్ బీచ్‌లలో ఇద్దరేసి చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. అయితే తీరంలో ప్రమాదానికి గురై సముద్రంలో కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వారిని రక్షించగలుగుతున్నప్పటికీ... రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కే వారిని సరైన పరికరాలు లేకపోవడంతో రక్షించడం కష్టతరంగా మారుతోందని లైఫ్‌గార్డ్స్ అంటున్నారు. విదేశాల్లో లైఫ్‌గార్డ్స్‌కు తోడుగా స్పీడ్ బోట్లు అందుబాటులో ఉంటాయని... వాటి సాయంతో బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒడిశా యువతిని, హైదరాబాద్ అబ్బాయిని లైఫ్‌గార్డ్స్ పట్టుకున్నప్పటికీ... అప్పటికే కెరటంలో ఎక్కువ సేపు ఇరుక్కుపోవడం వల్ల మరణించారు. అదే స్పీడ్ బోట్లు అందుబాటులో ఉంటే వేగంగా వెళ్లి బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పండగల వేళ విషాదాలు సాధారణంగా బీచ్‌లో ఎక్కువగా అక్టోబర్ నుంచి జనవరి నెల మధ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. దసరా, దీపావళి, కార్తీకమాసం, నూతన సంవత్సర వేడుకలకు ఎక్కువగా పర్యాటకులు రావడంతో తీరంలో రద్దీ ఉంటుంది. ఆ సమయాల్లో దేశ, విదేశాల నుంచి సందర్శకులు కూడా నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్‌లో రోజూ సుమారు 20 మంది పోలీసులు, మరో 20 మంది లైఫ్‌గార్డ్స్ అందుబాటులో ఉంటూ పర్యాటకులను హెచ్చరిస్తుంటారు. మరోవైపు మెరైన్ పోలీసులు తీరం వెంబడి గాస్తీ కాస్తుంటారు. అయినప్పటికీ సందర్శకుల అత్యుత్సాహం, కొందరు యువకులు మద్యం మత్తులో స్నానాలకు దిగడంతో ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. నిరంతరం హెచ్చరిస్తుంటాం సముద్రంలోకి స్నానాలకు దిగవద్దని సందర్శకులను లైఫ్ గార్డ్స్, పోలీసులు నిరంతరం తీరంలో హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. చాలా ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడిగలిగాం. పర్యాటకులు సముద్రం లోపలకు వెళ్తుంటే లైఫ్‌గార్డులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రమాదాలు జరగడం బాధాకరం. – జి.మురళీ కృష్ణ, మెరైన్ ఎస్ఐ క్షణాల్లో స్పందిస్తున్నాం కెరటాలకు సందర్శకులు చిక్కుకున్నారని తెలిసిన క్షణాల్లోనే స్పందిస్తున్నాం. బాధితులను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అయితే రిప్ కరెంట్ అలల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కష్టమవుతోంది. సరైన పరికరాలు సమకూరిస్తే బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అనేకసార్లు ఉన్నాతాధికారులకు చెప్పాం. మాకు 9 నెలలుగా జీతాలు చెల్లించకపోయినా పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. – దేవుడు, లైఫ్గార్డు చదవండి: కరకట్టపై పల్టీకొట్టిన ఆటో.. -
తీరంలో విషాదం! ముగ్గురి మృతదేహాలు లభ్యం, కొనసాగుతున్న గాలింపు
Update: విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మరొక మృతదేహం కోసం నేవీ హెలిక్యాప్టర్‌తో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సముద్రపు అంతర్భాగంలో రాళ్ళ మధ్య చిక్కుకునే అవకాశాలు ఉండడంతో అక్కడ కూడా గాలింపు కొనసాగించారు. నిన్న సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. పెదవాల్తేరు/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఆర్.కె.బీచ్‌లో ఘోరం జరిగింది. విశాఖలో సరదాగా గడుపుదామని వచ్చిన వారి కుటుంబాల్లో సముద్రస్నానం తీవ్ర విషాదం నింపింది. పెద్దగా వచ్చిన కెరటాలకు నలుగురు గల్లంతవగా.. ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారిలో ఓ యువతి ఉంది. రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మూడవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ.. ►నూతన సంవత్సర వేడుకులు జరుపుకునేందుకు హైదరాబాద్ బేగంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి శివకుమార్ (24), డిగ్రీ విద్యార్థులు కోట శివ (20), ఎండీ అజిష్ (20) సహా ఎనిమిది మంది స్నేహితులు గత నెల 30న విశాఖ వచ్చారు. వీరు ఆదివారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్.కె.బీచ్‌లో స్నానాలకు దిగారు. ఇంతలో పెద్ద కెరటం రావడంతో బ్యాంక్ ఉద్యోగి శివ కుమార్, శివ, అజిష్ గల్లంతయ్యారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. కొంతసేపటికి శివకుమార్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కోట శివ, అజిష్‌ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు కోస్టుగార్డు, నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్ మృతదేహం వద్ద సహచరులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ►ఒడిశాలోని కటక్‌కు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఆదివారం మధ్యాహ్నం ఆర్.కె.బీచ్‌లోని పాండురంగాపురం వద్ద స్నానాలకు దిగారు. వీరిలో సుమిత్ర త్రిపాఠి (21) సముద్రంలో కొట్టుకుపోవడంతో కమ్యూనిటీ గార్డులు రక్షించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సంఘటన స్థలానికి ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర, త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు చేరుకుని.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీఐ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ హరీష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే.. -
రెండు కుటుంబాల్లో విషాదం
తొండంగి మండలం వేమవరంలో శివరాత్రికి ముందు వచ్చే తీర్థానికి గురువారం రాత్రి ఆరుగురు యువకులు వెళ్లారు. ఆ రాత్రంతా ఆ జాతరలో సందడి చేశారు ... తీర్థం ముగిసిన వెంటనే అమావాస్య రావడంతో జి.ముసలయ్యపేట గ్రామ సమీపంలోని తీరంలో ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలనుకున్నారు. ఇసుక తిన్నెలపై కాసేపు ఆడుకున్నారు...సెల్ఫీలు తీసుకున్నారు. ఆ వెంటనే ఎగసి వస్తున్న అలలకు ఎదురీది చేపపిల్లల్లా ఈతకొట్టారు. ఉప్పొంగిన వారిలోని ఉత్సాహాన్ని చూసిన ఆ సంద్రానికి కన్నుకుట్టిందేమో! ఇద్దరిని తనలోకి లాగేసుకుంది. కెరటాల మధ్య ఆర్తనాదాలు చేస్తున్న వారిద్దర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో దగ్గర్లో ఉన్న జాలర్లను ఆశ్రయించారు. వలలతో గాలించినా ఫలితం లేకపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కేరింతలతో ఉత్సాహం ఉరకలేసిన ఆ తీరప్రాంతం క్షణాల్లోనే విషాదం అలముకుంది. తూర్పుగోదావరి, తొండంగి: వారికి సముద్రం కొత్తేమీ కాదు.. ఇంటి ముంగిట ఉన్న సముద్రంలో నిత్యం వారు ఆటలాడుకుంటూనే ఉంటారు. అయితే విధి అల రూపంలో వచ్చి స్నానానికి వచ్చిన ఇద్దరు మిత్రులను కడలిగర్భంలోకి లాక్కుపోయింది. అలా ఇద్దరు గల్లంతవడం రెండు కుటుంబాల్లో తీరని వి«షాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. తొండంగి మండలం జి.ముసలయ్యపేట గ్రామానికి అతి సమీపంలో సముద్రం ఉంది. ఏటా మహాశివరాత్రికి ముందువచ్చే అమావాస్య నాడు వేమవరంలో తీర్థం జరుగుతుంది. గురువారంరాత్రి తీర్థం ముగిశాక శుక్రవారం సముద్ర స్నానం చేయడం సంప్రదాయం. ఆ విధంగానే శుక్రవారం ఉదయం నుంచి పలువురు సముద్రస్నానాలు చేశారు. జి.ముసలయ్యపేటకు చెందిన తాటిపర్తి మణికంఠ (20), అతని తమ్ముడు కుమారస్వామితోపాటు తాటిపర్తి శ్రీను (19), బద్ది మణికంఠ, శివ, రాజు గురువారం వేమవరంలో తీర్థానికి వెళ్లి వచ్చారు. శుక్రవారం ఉదయం సముద్రతీరంలో చలిమంట కాగారు. వారందరూ కలిసి సెల్ఫోన్లతో సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. తీరంలో కొంత సేపు ఆటలాడుకున్నారు. ఇళ్లకు వెళ్లి బట్టలు మార్చుకుని తిరిగి సముద్రతీరానికి స్నానానికి వచ్చారు. పెద్ద ఎత్తున వచ్చిన రాకాసి అలలు తాటిపర్తి మణికంఠ, అతని తమ్ముడు కుమారస్వామి, తాటిపర్తి శ్రీనులను లోపలికి లాక్కెళ్లాయి. శ్రీను దూరంగా గల్లంతవ్వగా మణికంఠ, కుమారస్వామి ఒకేచోట సముద్రంలో తీరానికి దూరంగా కొట్టుకెళ్లారు. దాదాపు అరంగట సేపు అన్న మణికంఠను రక్షించేందుకుప్రయత్నించినా తన చేతకాకపోవడంతో తీరానికి ఈతకొట్టుకుని వచ్చి ప్రాణాలతో బయటపడ్డానని కుమారస్వామి వెల్లడించారు. సముద్రంలో ఇద్దరు గల్లంతైన సమాచారం అందడంతో రెండు కుటుంబాలకు చెందిన వారితోపాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రతీరానికి చేరుకున్నారు. తాటిపర్తి మణికంఠకు తండ్రి సత్తిబాబు, తల్లి మంగ, అన్న శ్రీను, అక్క రమణమ్మ, తమ్ముడు మణికంఠ ఉన్నారు. కాగా తాటిపర్తి శ్రీనుకు తల్లినాగరాజు (నాగేశ్వరరావు), తల్లి చంటమ్మ, అక్క శివ దుర్గ ఉన్నారు. వారి రోదనలతో సముద్రతీరంలోని వారు విషాదసాగరంలో మునిగిపోయారు. తొండంగి ఎస్సై విద్యాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన ఇద్దరూ చదువులో రాణించినవారే గల్లంతైనవారిలో తాటిపర్తి మణికంఠ విశాఖపట్నంలో హోటల్‌మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. సెలవులు ముగిసిన అనంతరం కాలేజీకి వెళ్లాల్సి ఉండగా వేమవరం తీర్థంలో సందడి చేసి శుక్రవారం సముద్ర స్నానం చేసి ఆదివారం వెళ్తానని తెలిపాడని స్నేహితుడు శివ కన్నీటిపర్యంతమై చెప్పాడు. తాటిపర్తి శ్రీను తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విచారం జి.ముసలయ్యపేటలో యువకులు గల్లంతైన సంగతి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తెలియడంతో ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారికి భరోసా కల్పించాలని పార్టీనాయకులను ఆదేశించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొయ్యా మురళి, జిల్లా కమిటి సభ్యుడు నాగం గంగబాబు, యాదాల జోగిరాజు, మత్స్యకార నాయకులు చొక్కా కోదండ, మేరుగు ఆనందహరి, మడదా హేమంత్, చొక్కా రామచంద్రరావు తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. గల్లంతైనవారి కోసంవెతుకులాట ఉదయం గల్లంతైన యువకుల కోసం ఎల్లయ్యపేట, ఇతర మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు సుమారు వందమందికి పైగా సముద్రతీరంలో బోట్లుపై వలలు వేసి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు పదిగంటల పాటు సముద్రతీరంలో గాలించారు. రాత్రి సమయానికి కూడా వారి జాడ తెలియరాలేదు. అన్నను రక్షించుకునేందుకు విశ్వప్రయత్నం చేశా నాతోపాటు నా అన్న మణికంఠ మరో నలుగురం స్నానానికి దిగాం. పెద్ద కెరటాలు రావడంతో శ్రీనుతోపాటు మా అన్న మణికంఠ నేను నీటిలో మునిగిపోయాం. అన్నను వదలకుండా ఉండడంతో ఇద్దరం లోపలికి వెళ్లిపోయాం. దాదాపుగా అరగంటసేపు ఈత కొడుతూ ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించాం. అన్న నీళ్లలో మునిగిపోయాడు. రక్షించుకునేందుకు చాలా ప్రయత్నించాను. కానీ దక్కించుకోలేకపోయాను. – తాటిపర్తి కుమారస్వామి -
బీచ్‌లో యువకుడిని రక్షించిన లైఫ్‌గార్డులు
సాక్షి, విశాఖపట్టణం : రుషికొండ బీచ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న ఓ యువకుడిని అక్కడే ఉన్న లైఫ్‌గార్డులు రక్షించారు. అనంతరం అరిలోవ బీచ్ మొబైల్ వాహనం ద్వారా యువకుడిని గీతం ఆసుపత్రికి తరలించారు. యువకుడిని విజయనగరం జిల్లా కొత్త అగ్రహారానికి చెందిన జల్లెపల్లి జగదీష్గా గుర్తించారు. కాగా, బాధితుడు జగదీష్ సహా 25 మంది మెడికల్ దుకాణాల సిబ్బంది సరదాగా ఎంజాయ్ చేద్దామని మంగళవారం బీచ్‌కు రాగా, ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. బాధితుడిన రక్షించిన వారిలో పోలీస్ కానిస్టేబుళ్లు వాసు, మధు లైఫ్‌గార్డులు అప్పన్న, రమేశ్, రాజేశ్, రాజ్‌కుమార్ బివిజి గార్డులు దుర్గ, ఎల్లాజిలు ఉన్నారు. -
కడలి కెరటాలకు యువకుడి బలి
సాక్షి, కొత్తపట్నం: కడలి కెరటాలకు యువకుడు బలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని కె.పల్లెపాలెం బీచ్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. ఒంగోలు నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన గోదా మధుసూదన్‌రెడ్డి (25) స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చాడు. అతడి స్నేహితులు సముద్రం ఒడ్డున కొద్దిసేపు కబడ్డీ ఆడారు. మధుసూదన్‌రెడ్డి ఒక్కడే సముద్ర స్నానం చేస్తున్నాడు. ఒక్క సారిగా అలలు ఉధృతంగా రావడంతో గల్లంతయ్యాడు. అతడిని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఆచూకీ లభించలేదు. సాయంత్రానికి శవమై బయటకు కొట్టుకొచ్చాడు. మిత్రులు మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన బీచ్‌కు తరలి వచ్చారు. చేతికొచ్చిన కుమారుడు నిర్జీవంగా ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు తన సిబ్బందితో తీరానికి వచ్చి వివరాలు సేకరించారు. తండ్రి మాలకొండారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శివరాత్రి స్నానాల్లో అపశ్రుతి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): స్నేహితులతో సరదాగా శివరాత్రి జాగరణ చేశాడు... అనంతరం సముద్రంలో స్నానానికి వెళ్లాడు... ఇంతలో మృత్యుదేవత బలమైన కెరటం రూపంలో సముద్రంలోకి లాక్కుపోవడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు... కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చిన దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 17వ వార్డులోని పెదజాలారిపేట బాపూజీనగర్‌కి చెందిన వాడమోదుల సత్యసాయి ప్రసన్న (30) పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి సుందరరావు గతంలో చనిపోయారు. దీంతో తల్లి పద్మాదేవితో కలిసి బాపూజీనగర్‌లో నివసిస్తున్నాడు. పెదజాలారిపేటకు చెందిన సాయిలక్ష్మితో గత ఏడాది నవంబర్ 10న వివాహం జరిగింది. సోమవారం శివరాత్రి జాగరణ చేసిన సాయిప్రసన్న ఆరుగురు స్నేహితులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కిర్లంపూడి లే అవుట్‌లోని వైఎంసీఏ ఎదురుగా గల బీచ్‌లో స్నానానికి దిగాడు. ఇంతలో బలమైన కెరటాలు ఒక్కసారిగా యువకులందరినీ లాక్కుపోయాయి. వారంతా హాహాకారాలు చేయడంతో సమీపంలోని గజ ఈతగాళ్లు ఆరుగురు యువకులనూ రక్షించి ఒడ్డుకి చేర్చారు. అయితే అప్పటికే సాయిప్రసన్న మరణించడంతో తోటి స్నేహితులు బోరున విలపించారు. అప్పటివరకు తమతో ఆడిపాడిన స్నేహితుడు విగతజీవిగా మారడంతో కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. సాయిప్రసన్న మరణంతో బాపూజీనగర్‌లో విషాదం నెలకొంది. పెళ్లైన నాలుగు నెలలకే సాయిప్రసన్నకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. పెదజాలారిపేటకు చెందిన సాయిలక్ష్మితో గత ఏడాది నవంబర్‌లో వివాహం జరిగింది. సాయిలక్ష్మి ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. భర్త చనిపోయాడని తెలియడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడిపెట్టించింది. సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు, ఆమె బంధువులు బాపూజీనగర్‌లో గల సాయిప్రసన్న ఇంటికి చేరుకున్నారు. ఎప్పుడూ అందరితో కలుపుగోలుగా ఉండే సాయిప్రసన్న మరణించాడంటే నమ్మలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఆర్.అప్పలనాయుడు పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కబళించిన సముద్రం
నెల్లూరు, తోటపల్లిగూడూరు: కోడూరు బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానాలు చేస్తూ అలల్లో చిక్కుకున్న నలుగురు సందర్శకులను దుగరాజపట్నం మెరైన్ పోలీసులు ప్రాణాలతో రక్షించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోడూరు సాగరతీరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నగరానికి చెందిన చంద్రశేఖర్, అతని కుమారుడు, మరో ఇద్దరు యువకులు సముద్రంలో అలల తాకిడికి గురై చిక్కుకుపోయారు. ప్రాణభయంతో కేకలు వేయడంతో బీచ్‌లో గస్తీలో ఉన్న దుగరాజపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్ సీఐ చెంచురామయ్య, హెడ్‌కానిస్టేబుల్ మోహన్, కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి అలల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు రక్షణ కవచాలతో సముద్రంలోకి దూకి ముందుగా గుర్తుతెలియని ఇద్దరు యువకులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం నెల్లూరు నగరానికి చెందిన చంద్రశేఖర్, అతని కుమారుడ్ని రక్షించారు. అయితే చంద్రశేఖర్ ఉప్పు నీళ్లు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం పోలీసులు వెంటనే ఓ ప్రత్యేక వాహనంలో నెల్లూరు తరలించారు. సందర్శకుల ప్రాణాలను కాపాడిన మెరైన్ పోలీసులను స్థానికులు అభినందించారు. -
రుషికొండ తీరంలో మృత్యుఘోష
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): సహజ అందాలకు నిలయమైన రుషికొండ తీరంలో మృత్యఘోష వినిపిస్తోంది. అమాయకులైన విద్యార్థులు, పర్యాటకులను రాకాసి అలలు కాటేస్తున్నాయి. పోలీసుల వైఫల్యం... అధికారులు నిర్లక్ష్యం కారణంగా గడిచిన ఆరేళ్లలో పది మంది దుర్మరణం పాలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో విహార యాత్రకై వచ్చి సముద్రంలోకి దిగి భీకర అలల తాకిడితో మృత్యు ఒడికి చేరుతున్నారు. సముద్రంలో స్నానాలు చేయరాదంటూ పోలీసులు నామమాత్రంగా హెచ్చరిస్తుండడం ప్రమదాలకు కారణమవుతోంది. ప్రమాదాల నివారణకు పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు శాశ్వత చర్యలు నేటికీ చేపట్టకపోవడం శోచనీయం. తాజాగా ఆదివారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులను అలలు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం సముద్రంలోకి దిగి స్నానాలు చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు పవన్‌కుమార్, హరికుమార్, వంశీని రాకాసి అలలు లాగేయగా... వీరిలో వంశీని లైఫ్‌గార్డులు జి.రాజేష్, కె.రాజు, జి.రాజ్‌కుమార్, సీహెచ్.మురళీ సకాలంలో కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాకాసి అలలకు బలైపోయిన పవన్‌కుమార్ మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలిస్తున్నట్టు పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. హరికుమార్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన స్థలానికి ఆరిలోవ సీఐ తిరుపతిరావు చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే 2012లో సాయిప్రియ రిస్సార్ట్స్ వెనుక తీరంలో గీతం వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. 2014లో ఆరిలోవకు చెందిన ఇద్దరు విద్యార్థులు మునిగిపోయారు. 2016లో ద్వారకానగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్న ముగ్గురు యువకులు స్నానాలు చేస్తూ భీకర అలలకు గురై గల్లంతయ్యారు. అనంతరం మూడు రోజుల తర్వాత వీరి మృతదేహాలు తీరానికి చేరాయి. ఇలా ఏడాదికి కనీసం ఇద్దరు లేక ముగ్గురి ప్రాణాలు పోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూరని మృతుల తల్లిదండ్రులు, పర్యాటకులు విమర్శిస్తున్నారు. గతంలో నగర పోలీస్ కమిషనర్‌గా జె.పూర్ణచంద్రరావు ఉన్న సమయంలో ఇక్కడ హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం పోలీసులు, మెరైన్ పోలీసులు, మరోవైపు లైఫగార్డుల పర్యవేక్షణ ఉండేది. ముఖ్యంగా సముద్రంలో దిగి స్నానం చేసే పర్యాటకులను పరిశీలిస్తూ లైఫ్‌గార్డులు హెచ్చరించేవారు. అనంతరకాలంలో వారికి నెలనెలా జీతాలు చెల్లించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాగే ఆరిలోవ, పీఎంపాలెం పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్క కానిస్టేబుల్ కూడా తీరంలో పహారా కాయడం లేదు. నామమాత్రంగా మెరైన్ పోలీస్‌లు ఒకరిద్దరు వాచ్ టవర్ వద్ద కాలక్షేపంగా కూర్చుంటున్నారు. తీరంలో స్నానాలు చేసే పర్యాటకులను హెచ్చరించేవారే లేకుండాపోయారు. ఈ కారణంగానే విహారయాత్రకని వచ్చి రుషికొండ తీరానికి బలైపోతున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బిడ్డలా చూసుకుంటానన్నారు..!
కాజేజిలో చేర్పించేటప్పుడు కన్నబిడ్డలా చూసుకుంటామని ప్రిన్సిపాల్ చెప్పాడయ్యా.. నిన్ననగా చనిపోతే ఇంత వరకూ యాజమాన్యం వారు వచ్చిన పాపాన లేదు. ఐదొందల కిలోమీటర్ల నుంచి వచ్చి కాలేజీలో చేర్పిస్తే విగత జీవిగా తీసుకెళ్లాల్సి వస్తుందని సాగరసంగమం వద్ద విద్యార్థి అఖిల్ కుమార్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అవనిగడ్డ: శ్రీకాకుళం జిల్లా రాగోలుకు చెందిన ముగడ అఖిల్‌కుమార్(16)ని నాగాయలంకలోని అంజని వెటర్నరరీ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు నెలల క్రితం చేర్పించారు. 16 మంది మిత్రులతో సాగరసంగమానికి ఆదివారం వెళ్లారు. బీచ్‌లో స్నానం చేస్తూ గల్లంతవ్వగా, సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కనకరత్నం, సూర్యారావు ఉద యం 11 గంటలకు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 5.30 వరకు కాలేజీ యాజమాన్యం ఎవరూ ప్రమాద వివరాలు తెలుసుకునేందుకుగానీ, పరామర్శించేందుకు గా నీ రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చేర్చుకునేటప్పుడు మీ పిల్లాడిని నా సొంత బిడ్డలా చూసుకుంటానని ప్రిన్సిపాల్ చెప్పారని, బిడ్డ శవాన్ని అప్పగించారని తల్లి కనకరత్నం కన్నీటి పర్యాంతమైంది. మా పిల్లాడిని చేర్పించేటప్పుడు మా ఫోన్ నంబర్లు తీసుకున్నారని, ఈ ఘటన జరిగాక ఇంతవరకూ కాలేజీ నుంచి ఎవరూ ఫోన్ చేయలేదని, అడగడానికి మేము ఫోన్ చేస్తే వస్తున్నామని చెబుతున్నారే గానీ రాలేదని మృతుని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అంజిని వెటర్నరీ కళాశాల అని చెబితే చేర్పించామని, అక్కడ కాలేజీకి ఆ పేరే లేదని, మారుతి పాలిటెక్నిక్ కళాశాల అని ఉందని, ఈ కాలేజికి గుర్తింపు ఉందోలేదో కూడా అర్థం కావడం లేదని, ఇక్కడ కూడా మమ్మల్ని మోసం చేశారని మృతుడి మేనమామ తాలాబత్తుల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేస్తే మాకేమీ తెలియదు, చెప్పకుండా వెళ్లారని సమాధానం చెబుతున్నారని, హెచ్ఓడీతో కలసి వెళ్లినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారని చెప్పారు. కళాశాలలో చదివే విద్యార్థి చనిపోతే కనీసం చూడటానికి రాలేదని, మమ్మల్ని మోసం చేసి మా బిడ్డ ఉసురు తీసిన కళాశాల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి కనకరత్నం డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు రాయపూడి వేణుగోపాలరావు, సిద్దినేని అశోక్, లేబాక శ్యాం, పద్యాల వెంకట ప్రసాద్, బండ్రెడ్డి హరి, మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దోవా గోవర్ధనరావు, సీపీఐ మండల కన్వీనర్ నారేపాలెం శంకరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు గాజుల రాంబాబు (రాముడు) వైద్యశాలకు చేరుకుని మృతుడి తల్లిదండ్రులను పరామర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగమం వద్ద లభ్యమైనఅఖిల్ మృతదేహం కోడూరు : హంసలదీవిలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం గల్లంతైన ముడుగ అఖిల్‌కుమార్ మృతదేహం సోమవారం సంగమం వద్ద లభ్యమైంది. సోమవారం తెల్లవారుజామునే 5.30 గంటల సమయంలో అఖిల్ మృతిచెంది సంగమానికి కొట్టుకువచ్చాడని ఎస్ఐ ఎస్ఐ వై.సుధాకర్ తెలిపారు. తండ్రి సూర్యారావు పిర్యాధు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
కాటేసిన కడలి
సూర్యారావుపేట బీచ్‌లో ముగ్గురి మృతి ఇద్దరు గల్లంతు, ముగ్గురికి తీవ్ర అస్వస్థత అమ్మవారి దర్శనానికి వెళ్లిన కుటుంబాల్లో ఆవేదన కాకినాడ రూరల్ : కాంట్రాకోట నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో మొక్కుబడులు చెల్లించుకొని సముద్రస్నానం కోసం వెళితే సముద్రుడు తమ కుటుంబాలను తీసుకెళ్లిపోయాడంటూ ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు, చెల్లెల కుటుంబాల్లో విషాదం నెలకొంది. లేకలేక పుట్టిన కుమారుడు, కుమారైలను సముద్రుడు తీసుకుపోయాడని, ఇక బతకడం అనవసరంటూ పితాని గోవిందు, పద్మ విలపిస్తున్న తీరు సంఘటనా స్థలంలోని వారందరినీ కంటతడి పెట్టించింది. సముద్రానికి వెళ్లిన కుటుంబం ప్రమాదం జరిగిందని టీవీల్లోనూ, పేపర్లోనూ చూశామని, ఇప్పుడు తమ కుటుంబమే ఇలా అయిపోతుందని కలలో కూడా ఊహించలేదంటూ వారు బోరున విలపించారు. ఇలా జరుగుతుందని తెలిస్తే అమ్మవారి ఆలయానికి వెళ్లేవారమే కాదని, ఎండ తీవ్రత వల్ల సముద్రస్నానం చేసిన తరువాత తింటామని చెప్పిన కుటుంబ సభ్యులు సముద్రుడికి భోజనం అయిపోయారంటూ గుండెలవిసేలా రోదించారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం (కాపులపాలెం) పితానివారిపేటకు చెందిన అన్నదమ్ములు పితాని గోవిందు, పితాని శ్రీను కుటుంబాలు, వారి చెల్లెలు శీలం తనుకులమ్మ కుటుంబం మొత్తం 18 మంది సభ్యులు టాటా ఏసు గూడ్స్ ఆటోలో పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అమ్మవారి మొక్కులు తీర్చుకొని తిరుగు ప్రయాణంలో సముద్రస్నానం కోసం సూర్యారావుపేట బీచ్‌కు 3.30 గంటల సమయంలో వచ్చారు. పిల్లలకు పరీక్షలు అవ్వడం, పొంగు చూపితే నూకాలమ్మకు మొక్కు చెల్లించుకోవడం వారికి ఆనవాయితీ. ఈ ప్రమాదంలో పితాని గోవిందు కుటుంబానికి చెందిన పితాని అనిత (16), పితాని రమ్య (18), పితాని వీరవంశీ (14), పితాని శ్రీను కుటుంబానికి చెందిన పితాని జయకృష్ణ (20), శీలం తనుకులమ్మ (30), శీలం దేవి (16) సముద్రంలోకి దిగిన వెంటనే ఓ రాకాసి అల వీరిని లోపలికి లాగేసుకుంది. సముద్రం ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు చూస్తుండగానే వీరంతా మునిగిపోయారు. వారిని రక్షించేందుకు పితాని శ్రీను (36) సముద్రంలోకి దిగి సముద్రంలో కొట్టుకుపోయాడు. రక్షించేందుకు పర్యాటకుల ప్రయత్నం బీచ్‌కు వచ్చిన పర్యాటకులకు ఫొటోలు తీసే ఉప్పాడకు చెందిన యువకులు.. కొట్టుకుపోతున్న ఆరుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఇద్దరు దొరకలేదు. సముద్రంలో ముగినిపోయిన వ్యక్తులు అప్పటికే పూర్తిగా నీరు తాగేయడంతో మత్స్యకారులు ప్రాథమిక చికిత్స చేస్తుంటే పితాని శ్రీను, పితాని అనిత, శీలం దేవి మరణించారు. శీలం తనుకులమ్మ, రమ్య, శ్రీనులను హుటాహుటీన కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పితాని జయకృష్ణ (20), పితాని వీరవంశీ (14) సముద్రంలో గల్లంతయ్యారు. సంఘటన స్థలానికి చేరిన అధికారులు ఐదుగురు వ్యక్తులు సముద్రంలో గల్లంతయ్యారన్న సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, ఎస్పీ రవి ప్రకాష్, ఆర్డీఓ రఘుబాబు, తహసీల్దార్ జె.సింహాద్రి, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రూరల్ సీఐ వి.పవన్ కిశోర్, కోస్టుగార్డు సిబ్బంది, మెరైన్ పోలీసులు, డిజార్డ్ మేనేజ్మెంట్ సంస్థ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 6 గంటల వరకు గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడంతో మత్స్యకారులను రప్పించి అలివి వలను వేయించి గాలింపు చర్యలను చేపట్టారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ దగ్గరుండీ పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : కన్నబాబు బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పరామర్శించారు. బీచ్‌ను తన హయాంలోనే అభివృద్ధి చేశామని, బీచ్‌కు వచ్చే పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమైందన్నారు. బీచ్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. సముద్రంలో డెజ్జింగ్ చేయడం వల్ల సముద్రతీరం కోతకు గురైందని, ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టాలి్సన అవసరం ఉంది. మూడేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 21 మంది మృత్యవాత పడినట్టు రికార్డులున్నాయన్నారు. బీచ్‌లో చనిపోయిన కుటుంబాలు పేద కుటుంబాలు కావడంతో వారికి ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగురిని రక్షించి తీసుకొచ్చా.. సముద్రంలో మునిగిపోతున్న ఆరుగురు వ్యక్తులను రక్షించి బయటకు తీసుకొచ్చాను. వారికి వైద్యం అందడంలో ఆలస్యం అవ్వడంతో వారిలో ముగ్గురు వ్యక్తులు బయటకు తెచ్చిన అర్థగంట సమయంలోనే చనిపోవడం తనను కలచివేసింది. ఆరుగురు వ్యక్తులను రక్షించానన్న ఆనందం ఆవిరైపోయింది. గల్లంతైన ఇద్దరు యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశాను. చేతిని అందుకునే లోపే మరో రాకాసి అల వచ్చి అతనితో పాటు నన్ను లోపలికి తీసుకుపోయింది. అతికష్టం మీద బయటకు వచ్చారు. తనతో పాటు ఐస్ అమ్ముకునే గొర్ల సూరిబాబు, సూర్యారావుపేటకు చెందిన ఫొటోగ్రాఫర్లు ఎస్ నూకరాజు, సునీల్ కూడా సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తులను రక్షించే ప్రయత్నం చేశారు. – చోడిపల్లి దేవుడు, పర్యాటకుల ఫొటోలు తీసే వ్యక్తి