బ్రిస్బెన్: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్న సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా ల్యాండింగ్ అవడంతో పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొంది.
రాజధాని బ్రిస్బెన్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని గోల్డ్‌కోస్ట్ బీచ్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీకొట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఆ ప్రాంతం అత్యంత ప్రజాదరణ పొందిన పర్యటక ప్రాంతంగా ఉంది. ఆస్ట్రేలియాలో సెలవు దినాలు కావడంతో జనవరిలో భారీగా జనం తరలి వస్తారు. ప్రమాదం జరిగిన క్రమంలో బీచ్‌లోని సీ-వరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు అధికారులు. వైద్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీసు తెలిపింది.
#BREAKING: Emergency services are responding after a helicopter crash on the Gold Coast Broadwater at Southport.
— 9News Gold Coast (@9NewsGoldCoast) January 2, 2023
Three people are believed dead, with two more seriously injured.
More details to come. #9News pic.twitter.com/Mmtw1ENscL
ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..!
Comments
Please login to add a commentAdd a comment