Helicopter crashes
-
ఉక్రెయిన్‌లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన కీవ్‌కి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్‌గార్డెన్ సమీపంలో జరిగింది. వాస్తవానికి రష్యా దళాలు ఉపసంహరించుకునే వరకు ప్రారంభ దశల్లో రష్యా, ఉక్రెనియన్ దళాలు ఈ బ్రోవరీ పట్టణంపై నియంత్రణ కోసం తీవ్రంగా పోరు సలపడం గమనార్హం. ప్రస్తుతం ఘటనాస్థలంలో వైద్యులు, పోలీసులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో సంఘటనా స్థలంలో బాధితుల కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN — AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023 (చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!) -
ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. అందులో ఒకటి..!
బ్రిస్బెన్: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్న సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా ల్యాండింగ్ అవడంతో పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొంది. రాజధాని బ్రిస్బెన్కు 45 కిలోమీటర్ల దూరంలోని గోల్డ్‌కోస్ట్ బీచ్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీకొట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఆ ప్రాంతం అత్యంత ప్రజాదరణ పొందిన పర్యటక ప్రాంతంగా ఉంది. ఆస్ట్రేలియాలో సెలవు దినాలు కావడంతో జనవరిలో భారీగా జనం తరలి వస్తారు. ప్రమాదం జరిగిన క్రమంలో బీచ్‌లోని సీ-వరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు అధికారులు. వైద్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీసు తెలిపింది. #BREAKING: Emergency services are responding after a helicopter crash on the Gold Coast Broadwater at Southport. Three people are believed dead, with two more seriously injured. More details to come. #9News pic.twitter.com/Mmtw1ENscL — 9News Gold Coast (@9NewsGoldCoast) January 2, 2023 ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐదుగురు యాత్రికులతో గుప్తకాశీలోని ఫటా హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ వెళ్లేందుకు బయలుదేరిన హెలికాప్టర్ కొద్దిసేపటికే కుప్పకూలింది. వెంటనే మంటలు అంటుకోవటంతో ఇద్దరు పైలట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సిందియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఆర్యాన్ విమానయాన సంస్థ బెల్ 407 హెలికాప్టర్ వీటీ-ఆర్పీఎన్ ప్రమాదానికి గురైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఇదీ చదవండి: కశ్మీర్లో మళ్లీ పౌరులపై దాడులు.. నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య -
కశ్మీర్ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్‌లోని గజ్రాన్ నల్లాహ్ వద్ద ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్‌కు అతి దగ్గర్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్, కో-పెలట్ ఉన్నట్లు తెలిపారు. An Indian Army Cheetah helicopter has crashed in the Baraum area of Gurez sector of Jammu and Kashmir. The search parties of the security forces are reaching the snow-bound area for the rescue of the chopper crew. More details awaited: Defence officials pic.twitter.com/LMFunz5c0a — ANI (@ANI) March 11, 2022 ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి మళ్లినట్లు ఓ అధికారి చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంలో పైలట్ మృతిచెందినట్లు, కో పైలట్ గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే -
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటన ఆందోళన రేపింది. పంజాబ్, జమ్మూ సరిహద్దుకు సమీపంలో కథువాలోని రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న భద్రతా దళాలు సంఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆర్మీ బృందం రెస్క్యూ టీమ్ ప్రమాద స్థలానికి చేరుకుని నిసహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. అయితే అయిదుగురితో ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలెట్లు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఆర్మీ హెలికాప్టర్ డ్యామ్‌లో కూలిపోయిన సమాచారం అందిందని రక్షణ బృందాలను ఘటనా స్థలానికి తరలించామని పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సురేంద్ర లంబా తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని, మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఆనకట్ట పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుండి 30 కి.మీ దూరంలో ఉంది. -
కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్...
బాగ్దాద్: ఇరాక్ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన బాగ్దాద్ దక్షిణ ప్రాంతంలో మంగళవారం సంభవించిందని అధికారులు వెల్లడించారు. బ్రిగేడియర్ జనరల్ యహ్య రసూల్ తెలిపిన వివరాల ప్రకారం... సోవియట్ యూనియన్ తయారుచేసిన హెలికాఫ్టర్ ఎమ్ఐ-17 సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇందులో వెళ్తోన్న ఇద్దరు ఆర్మీ అధికారులు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఇరాక్ దక్షిణాన ఉన్న బస్రా నుంచి కట్ పట్టణానికి ఆయుధాలతో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గతంలో బాగ్దాద్ తూర్పు ప్రాంతంలో 2014 అక్టోబర్ లో బెల్ 407 హెలికాఫ్టర్ లో వెళ్తుండగా మిలిటెంట్లు కుప్పకూల్చడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు కన్నుమూశారు. అదే ప్రాంతంలో కేవలం ఐదు రోజుల తర్వాత జరిగిన మరో హెలికాఫ్టర్ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. 2010 జూలైలో సంభవించిన తుఫాన్ కారణంగా ఎమ్ఐ-17 రకానికి చెందిన ఓ హెలికాఫ్టర్ క్రాష్ అవడంతో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. -
హెలికాప్టర్ కూలి నలుగురు మృతి
బ్రెజిల్: నిర్మాణంలో ఉన్న భవనంపై హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బ్రెజిల్‌లోని కర్పీక్యుబా పట్టణ శివారు ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని ద బ్రెజిలియన్ ఎయిర్ ఫోర్స్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. మృతులను గుర్తించవలసి ఉందని పేర్కొంది. -
పబ్‌పై కుప్పకూలిన హెలికాఫ్టర్
స్కాట్లాండ్లో అతిపెద్ద నగరమైన గ్లాస్గోలోని ఓ పబ్‌పై హెలికాఫ్టర్ గత రాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో పబ్‌లో హుషార్‌గా కేరింతలు కొడుతున్న వారిలో అత్యధికులు గాయపడ్డారు. దాంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు స్కాట్లాండ్లో స్థానిక వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. కుప్పకూలిన హెలికాఫ్టర్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులదని భావిస్తున్నట్లు చెప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్ అత్యంత వేగంతో అకాశంలో పయనిస్తుందని తెలిపింది. అయితే ఆ ఘటనలో మృతులు కూడా ఉండవచ్చని అలాగే క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో పబ్ పాక్షికంగా దెబ్బతిందని వివరించింది. ఆ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపింది.