ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఉన్నారని వెల్లడించారు.
ఈ ఘటన కీవ్‌కి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్‌గార్డెన్ సమీపంలో జరిగింది. వాస్తవానికి రష్యా దళాలు ఉపసంహరించుకునే వరకు ప్రారంభ దశల్లో రష్యా, ఉక్రెనియన్ దళాలు ఈ బ్రోవరీ పట్టణంపై నియంత్రణ కోసం తీవ్రంగా పోరు సలపడం గమనార్హం. ప్రస్తుతం ఘటనాస్థలంలో వైద్యులు, పోలీసులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో సంఘటనా స్థలంలో బాధితుల కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023
(చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!)
Comments
Please login to add a commentAdd a comment