troops
-
అమిత్ షా వరుస రివ్యూలు.. మణిపూర్‌కు అదనపు బలగాలు
న్యూఢిల్లీ:మణిపూర్‌లో ఇటీవల మళ్లీ హింస చెలరేగుతోంది. దీంతో అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రహోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. త్వరలో 50 కంపెనీల అదనపు బలగాలను కేంద్రం మణిపూర్‌కు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై హోం మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మణిపూర్‌లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
‘కిమ్’ సైనికులు కొందరు చనిపోయారు: జెలెన్స్కీ
కీవ్: రష్యా తరపున తమపై యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికుల్లో కొందరు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా పెద్దమొత్తంలో సైనికులను రష్యాకు పంపిన విషయం తెలిసిందే.తమపై యుద్ధానికి కుర్స్క్లో 11వేల మంది ఉత్తరకొరియా సైనికులను మోహరించినట్లు గతంలో జెలెన్స్కీ చెప్పారు. ఈనేపథ్యంలోనే తాజాగా అక్కడ జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆ సైనికుల్లో కొందరు ఉక్రెయిన్ దళాల చేతుల్లో మరణించినట్లు తెలిపారు. తాము ఈ తరహా కఠిన చర్యలు తీసుకోకపోతే ఉత్తరకొరియా మరిన్ని బలగాలను పంపే అవకాశం ఉందన్నారు. కాగా, రెండేళ్ల నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా తాజాగా ఎంటరైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్జోంగ్ఉన్కు సత్సంబంధాల వల్లే ఉత్తర కొరియా తమ సైనికులను రష్యాకు పంపిందని ఆరోపణలున్నాయి. యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామలుంటాయని ఉక్రెయిన్ ఇప్పటికే హెచ్చరించింది.ఇదీ చదవండి: కెనడాలో ఆ మీడియాపై నిషేధం -
అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియాకు చెందిన 3 వేల మంది సైనికులు రష్యాకు వెళ్లి డ్రోన్లు, ఇతర పరికరాలపై శిక్షణ పొందుతున్నారని దక్షిణ కొరియా వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉత్తర కొరియాకు సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో భాగంగా రష్యా ఆర్మీలో చేరితే సైనిక చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌తో పోరాటాని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్దతు పొందితే అది క్రెమ్లిన్ బలహీనతకు సంకేతమని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రష్యన్లు, ఉత్తర కొరియన్లు ఇక్కడ ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో మేము చూస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో చేరాలని నిర్ణయించుకుంటే చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం. సైనికులు ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు ఓడలో ప్రయాణించారు. రష్యన్ సైనిక శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాలు వెళ్లారు. అయితే.. ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీతో కలిసి యుద్ధంలోకి పాల్గొంటాయో లేదో స్పష్టత లేదు. ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉక్రేయిన్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పశ్చిమ రష్యాకు వెళ్లవచ్చ. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి గురించి తెలియజేశాం. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటే.. రష్యాలో పెరుగుతున్న నిరాశ, బలహీనతకు సంకేతం అవుతుంది’’ అని అన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు 3వేల మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా తెలుపుతోంది. ఇటీవల 1500 మంది సైనికులను ఉత్తర కొరియా రష్యాకు తరలించినట్లు దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. మరోవైపు.. రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించటం గమనార్హం.చదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
రష్యాకు ‘కిమ్’ బలగాలు.. ‘సియోల్’ ఆగ్రహం
సియోల్: ఉత్తర కొరియా తాజాగా మరో పదిహేను వందల మంది తమ సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యులకు ఎన్ఐఎస్ చీఫ్ యంగ్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసమే వారిని పంపిందని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి మరో 10 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని ఉత్తరకొరియా యోచిస్తోందన్నారు.ఇప్పటికే ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మంది సైనికులను పంపినట్లు ఎన్ఐఎస్ తేల్చిచెప్పింది. రష్యా యుద్ధ నౌకల్లో 1500 మందితో కూడిన ఉత్తరకొరియా ప్రత్యేక బలగాలు రష్యాలోని వ్లాదివోస్తోక్ పోర్టుకు చేరుకున్నాయని ఎన్ఐఎస్ తెలిపింది. తాజాగా రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించారు. ఉత్తర కొరియాతో తమ సంబంధాలు దక్షిణ కొరియా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని రష్యా రాయాబారి స్పష్టం చేశారు. అయితే ఉత్తర కొరియా చర్యలు ఇలానే ఉంటే తాము ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు పంపుతామని సౌత్ కొరియా హెచ్చరిస్తోంది. ఉత్తరకొరియా ఒక క్రిమినల్ దేశమని ఫైర్ అయింది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మధ్య మంచి సంబంధాలున్నాయి. కిమ్‌కు ఇటీవల పుతిన్ ఖరీదైన బహుమతులను కూడా ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్ -
శిథిలాల కుప్ప ‘ఖాన్ యూనిస్’.. తిరిగి వస్తున్న ‘గాజా’ వాసులు
జెరూసలెం:పాలస్తీనా దక్షిణ గాజాలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. భీకర యుద్ధం కారణంగా కొంత కాలంగా తమ ప్రాంతానికి దూరంగా తలదాచుకున్న ఖాన్ యూనిస్ వాసులు ఇంటిబాట పట్టారు. సైకిళ్లు వేసుకుని, కాలి నడకన తమ సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. అయితే వారికి అక్కడ ఏమీ మిగల లేదు. భవనాలన్నీ ధ్వంసమై శిథిలాల కుప్పలు మిగిలాయి. ఒకప్పుడు భారీ భవంతులతో కళకళలాడిన ఖాన్ యూనిస్ నగరం ప్రస్తుతం శిథిలాల కుప్పలతో నిండిపోవడాన్ని చూసిన వారు తమ నగరం ఇలా అయిపోయిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసిన బాంబులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఖాన్‌యూనిస్ జనాభా 14 లక్షలు. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా డిసెంబర్లో ఖాన్ యూనిస్ నగరంపైకి సేనలను ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పంపింది. హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన నగరాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల జాడ కోసం మొత్తం జల్లెడ పట్టారు. దాడులతో లక్షలాది మంది ఖాన్ యూనిస్ వాసులు నగరం విడిచి వెళ్లిపోయారు. మరో వైపు ఖాన్‌యూనిస్‌పై జరిపిన దాడుల్లో వేల మంది హమాస్ ఉగ్రవాదులను హత మార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇదీ చదవండి.. సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు -
మార్చి 15 కల్లా సైన్యాన్ని ఉపసంహరించుకోండి
మాలె: భారత్ తమ దేశంలోని సైన్యాన్ని మార్చి 15వ తేదీకల్లా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కోరారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు. ఈ పరిణామంపై కేంద్రం ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. గత నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయిజ్జుకు చైనా అనుకూల నేతగా పేరుంది. ప్రజాభీష్టం మేరకు భారత సేనలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిని ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంతగడ్డ మీద రష్యా మిసైళ్ళ దాడి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: సోమవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత ఊరు క్రైవీ రిహ్ పట్టణం మీద రష్యా మిసైళ్ళతో దాడి చేసింది. డెనిప్రో పెట్రోవ్స్క్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలపై జరిగిన ఈ దాడిలో ఆరుగురు మరణించగా కనీసం 25మంది తీవ్ర గాయాలు పాలై ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. మృతులు పెరగొచ్చు.. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తిరిగి సాధించుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది రష్యా. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ లో మిసైళ్ళతో జనావాసాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఒక ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగి నేలకూలింది. ఇదే భవనంలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా జరుగుతున్నాయని శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలిపారు స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్. దారుణమైన దృష్యాలు.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంఘటన తాలూకు ఫోటోలను కూడా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రష్యా తీవ్రవాదులు జనావాసాలపైన, సామాన్య నగరాల పైన దాడులకు తెగబడ్డారని రాసి ఫోటోలు జతచేశారు. శిధిలమైన ఐదంతస్తుల భవనం, ఛిద్రమైన వాహనాలతో కూడిన ఈ ఫోటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే.. -
ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్ అభినందనల వెల్లువ
యుద్ధానికి కేంద్రంగా ఉన్న తూర్ప ఉక్రెనియన్ నగరమైన బఖ్ముత్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం రష్యా బలగాలు ప్రకటించాయి. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దళాలకు, ప్రైవేట్ కిరాయి బృందం వాగ్నర్‌ను అభినందించారు. ఒకప్పుడూ దాదాపు 70 వేల మంది జనాభా కలిగిన ఉప్పు గనుల పట్టణం బఖ్ముత్ ఉక్రెయిన్‌పై ఏడాదిగా సాగిస్తున్న రష్యా సుదీర్ఘ పోరాటంలో రక్తపాత యుద్ధానికి వేదికగా మారింది. పలు అవమానకరమైన పరాజయాల తదనంతరం రష్యా బలగాలు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధంలో పెద్ద ఎదురుదాడి వస్తుందని, డాన్‌బాస్‌లోని మరిన్ని భూభాగాలను మాస్కో దళాలు స్వాధీనం చేసుకుంటాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముందుగానే ఊహించారు. బఖ్ముత్ పతనం అనంతర మాస్కో, ఉక్రెయిన్ ఇరు దేశాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇదిలా ఉండగా, వాగ్నర్ అటాల్ట్ యూనిట్ల ప్రమాదకర చర్యల ఫలితంగా ఫిరంగిదళం, సదరన్ యూనిట్ విమానయాన మద్దతుతో ఆరన్టెమోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాగ్నెర్ బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ టెలిగ్రామ్ పోస్ట్‌లో తన కిరాయి సైనికుల దాడికి బఖ్ముత్ నగరం హస్తగత మవ్వడంతో పలువురు యోధులు రష్యా జెండాలను ఎగరువేశారని పేర్కొన్నాడు. మే 20 మధ్యాహ్న సమయంలో బఖ్ముత్ పూర్తిగా హస్తగతమయ్యిందని ఆర్మీ అధికారి ప్రిగ్రోజిన్ చెప్పారు. అలాగే మే 25 నాటికల్లా తాము స్వయంగా ఫ్టీల్డ్ క్యాంపుల్లోకి వెళ్లి బఖ్ముత్ని పరిశీలించి అవసరమైన రక్షణ మార్గాలను అందించడం తోపాటు మిలటరీ సాయం కూడా అందజేస్తామని తెలిపారు. కాగా, జపాన్ వేదికగా జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో జెలెన్స్కీ ఆదివారం సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు బఖ్ముత్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించడం గమనార్హం. (చదవండి: సమ్మిళిత ఆహార వ్యవస్థ) -
అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే!
అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనలకు సంబంధించి సమీక్షను వైట్‌హౌస్ విడుదల చేసింది. సుదీర్థకాల నిరీక్షణల అనంతరం విడుదల చేసిన ఈ సమీక్షలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సరిగ్గా ఆగస్టు 2021 నాటి బలగాల ఉపసంహరణ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వైపల్యాలపై దర్యాప్తు చేపట్టింది అమెరికా భద్రతా మండలి. ఈ మేరకు జాదీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ నాటి నిష్క్రమణలో పొరపాట్లు జరిగాయిని అంగీకరించారు. అందువల్లే కొద్ది వారల్లోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని స్వాధీనం చేసుకుంది. చివరికి అమెరికన్ బలగాలు, దాని మిత్ర దేశాలు అప్పటికప్పుడూ అకస్మాత్తుగా నిష్క్రమించక తప్పలేదంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఏ యుద్ధమైన ముగించడం అనేది అంత తేలికైన పని కాదన్నారు. ఈ నిష్క్రమణలో దారితీసిన పరిస్థితులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని పేర్కొన్నారు. అలాగే అమెరికా గూఢచార్యం అఫ్ఘాన్‌లోని తాలిబాన్లు బలాన్ని, అక్కడి ప్రభుత్వ బలహీనతలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఇంటిలిజెన్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతోనే అలాంటి ఘటనలు తలెత్తాయని కిర్బీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన పరిపాలన హయాంలో 2020లో తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో పలు లోపాలున్నాయని , ఇది ఒకరకంగా బైడెన్ పాలనను ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో పడేసిందన్నారు. దీంతో బైడెన్‌కి నిష్క్రమణ అనే పదాన్ని వెనక్కి తీసుకోలేని విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆయన మరికొంత మంది యూఎస్ బలగాలను అఫ్ఘాన్ పంపించే సాహసం చేయలేకపోయినట్లు తెలిపారు. అలాగే ట్రంప్ తన పదవికాలం ముగింపు సమయంలోని చివరి 11 నెలలు నుంచి అఫ్ఘాన్‌లో యూఎస్ బలగాల ఉనికిని క్రమంగా తగ్గించారని, తదనంతరం జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా చేపట్టే సమయానికి కేవల 2500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది . కాగా, కాబుల్‌లో ఆగస్టు 26న యూఎస్ బలగాల నిష్క్రమణ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో సుమారు 13 యూఎస్ దళాలు, 170 మంది అఫ్ఘాన్లు మరణించిన సంగతి తెలిసింది. దీంతో యూఎస్ కొన్ని విమానాలను పంపించి బలగాలను వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో..అక్కడి అఫ్ఘాన్ పౌరుల తాలిబాన్లను నుంచి తప్పించుకునేందుకు విమానాలను చుట్టుమట్టిన దిగ్బ్రాంతికర దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి. (చదవండి: కిడ్నాప్ నాటకంతో డబ్బుల కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..) -
ఉక్రెయిన్‌లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన కీవ్‌కి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్‌గార్డెన్ సమీపంలో జరిగింది. వాస్తవానికి రష్యా దళాలు ఉపసంహరించుకునే వరకు ప్రారంభ దశల్లో రష్యా, ఉక్రెనియన్ దళాలు ఈ బ్రోవరీ పట్టణంపై నియంత్రణ కోసం తీవ్రంగా పోరు సలపడం గమనార్హం. ప్రస్తుతం ఘటనాస్థలంలో వైద్యులు, పోలీసులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో సంఘటనా స్థలంలో బాధితుల కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN — AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023 (చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!) -
రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావడమే గానీ వెనక్కి రాలేం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రోజుకో వ్యూహంతో యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తామే గానీ వెనక్కి తగ్గేదే లేదని ప్రగల్పాలు పలుకుతున్నారు. పైగా మా దళాలు వివిధ శక్తిమంతమైన క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్‌ని దద్ధరిల్లేలా చేస్తున్నారని కొద్దిరోజుల్లో విజయం సాధిస్తామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్‌లో రష్యా దళాల పరిస్థితి అందుకు చాలా విభిన్నంగా ఉందనడానికి సాక్ష్యం వారి ఫోన్ కాల్స్. రష్య బలగాలు తమ ఆవేదనను తమవారితో ఫోన్లో వెళ్లబోసుకుంటున్నారు. తమకు సరైన ఆహారం, నీరు లేదని వధించబడతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు పది నెలలుగా సాగుతున్న నిరవధిక యుద్ధంలో రష్యా గణనీయమైన నష్టాన్నే చవి చూసింది. అయినప్పటికీ రష్యా పెద్ద ఎత్తున సైనిక సమీకరణలతో సైనికులను రిక్రూట్ చేసుకుని యుద్ధం చేసేందకు సిద్ధమైంది. కానీ సైనికులు పోరాటం చేయలేక సరైన తిండిలేక నిసత్తువతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఒక సైనికుడు తన తల్లితో అమ్మ మాకు ఎవరూ సరైన ఆహారం అందించరని, నీటి కోసం గుమ్మడికాయాల నుంచి తీసిని నీటిని వడకట్టుకుని తాగుతున్నామని ఆవేదనగా చెబుతున్నాడు. అధ్యక్షుడు పుతిన్ గొప్పగా చెబుతున్న క్షిపణుల ఎక్కడ ఉన్నాయని కొందరూ సైనికులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదురుగా ఎత్తైన భవనం ఉందని, దానిని మన సైనికుల కొట్టలేరు ఎందుకంటే దాన్ని కూల్చడం కోసం కాలిబర్ క్రూయిజ్ క్షిపణి కావాలని చెప్పాడు. మరో రష్యా సైనికుడు తల్లి తన కొడుకు తనతో లేడని కన్నీళ్లు పెట్టుకుంది. మరోక పోన్ సంభాషణలో ఒక సైనికుడు తాము వెనక్కి వెళ్లేందుకు అనుమతి లేదని, పోరాడేందుకు సరైన ఆర్మీబలం, ఆయుధ బలం గానీ లేవని వాపోయాడు. ఇంకో రష్యా సైనికుడు తన భార్యతో ముగ్గురు సైనికులతో పారిపోయానని, లొంగిపోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. మరోక సైనికుడు మమ్మల్ని అందర్నీ చంపేస్తున్నారంటూ భయాందోళనతో చెప్పాడు. ఈ సుదర్ఘీ యుద్ధ రష్యన్ మిలటరీలో ధైర్యాన్నీ బలహీనపరిచింది. వారు కుటుంబాలకు చేసిన కాల్స్‌ని బట్టి వారంతా ఎంత నిస్సహాయ స్థితిలో పోరాడుతున్నారో అవగతమవుతోంది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 10 నెలలు కావస్తున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఉన్నప్పటికీ కాల్పులను తాత్కాలికంగా కూడా విరమించే ప్రసక్తే లేదని రష్యా తేల్చి చెప్పింది. కీవ్‌పై మరోసారి భీకర దాడులకు సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో 2,00,000 బలగాలతో తమపై విరుచుకుపడేందుకు రష్యా వ్యూహం పన్నుతోందని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వలేరియ్ జులుజ్నీ తెలిపారు. ది ఎకానమిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. తమకు మరిన్ని ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు కావాలన్నారు. రిజర్వ్ బలగాలను, అవసరమైతే పౌరులను కదన రంగంలోకి దించి రష్యా దాడులను తిప్పికొడతామని చెప్పారు. రష్యాపై ఆంక్షలు.. మరోవైపు రష్యా వెనక్కి తగ్గకపోవడంతో ఐరోపా సమాఖ్య మరోమారు ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఇలా చేయడం ఇది 9వ సారి కావడం గమనార్హం. అలాగే రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు 18 బిలియన్ యూరోల ప్యాకేజీని సాయంగా అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా అండ.. ఉక్రెయిన్‌కు యుద్ధంలో సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికాను రష్యా హెచ్చిరింది. అయితే అగ్రరాజ్యం మాత్రం మాస్కో వార్నింగ్‌ను లైట్ తీసుకుంది. ఉక్రెయిన్‌కు సాయం చేసి తీరతామని స్పష్టం చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. గురువారం కూడా కీవ్‌పై క్షిపణులతో భీకర దాడులు చేసింది. చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత! -
రష్యాను పూర్తిగా తరిమేస్తాం: జెలెన్స్కీ
మైకోలైవ్ (ఉక్రెయిన్): ఖెర్సన్ నుంచి రష్యా వైదొలగడాన్ని ఉక్రెయిన్ పండుగ చేసుకుంటోంది. ఆ ప్రాంత వాసులంతా తమ సైనికులను హర్షాతిరేకాల నడుమ స్వాగతిస్తూ వారిని ఆలింగనం చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఖెర్సన్‌లో నగరమంతా కలియదిరుగుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ‘‘రష్యా సేనలను దేశమంతటి నుంచీ తరిమేసి తీరతాం. అనేక ప్రాంతాల్లో మా సేనలకు సొంత పౌరుల నుంచి త్వరలో ఇలాంటి మరెన్నో స్వాగతాలు లభించనున్నాయి’’ అన్నారు. పడిపోయిన కరెంటు స్తంభాలు, ధ్వంసమైన తాగునీరు తదితర మౌలిక వసతులు. ఎక్కడ పడితే అక్కడ మృత్యుఘంటికలు విన్పిస్తున్న మందుపాతరలు. ఇవీ... ఖెర్సన్‌కు వెళ్లే ప్రాంతాల్లో దారి పొడవునా కన్పిస్తున్న దృశ్యాలు. రష్యా సేనల విధ్వంసకాండకు ఇవి అద్దం పడుతున్నాయి. నగరవాసులు తిండి, నీరు, మందులకు అల్లాడుతున్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉక్రెయిన్ అధికార వర్గాలు శాయశక్తులా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఖెర్సన్ బాటలోనే ఖఖోవా జిల్లా నుంచి కూడా రష్యా తప్పుకుంటోంది. అక్కడి నుంచి తమ అధికారులు తదితరులను మొత్తంగా వెనక్కు పిలిపిస్తున్నట్టు స్థానిక రష్యా పాలక వర్గం పేర్కొంది. ఉక్రెయిన్ దాడులకు లక్ష్యం కారాదనే ఈ చర్య తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. -
ఖెర్సన్.. గేమ్ చేంజర్?
ఎస్.రాజమహేంద్రారెడ్డి ఖెర్సన్. ఈ ఓడరేవు పట్టణం ఇక తమదేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆర్భాటంగా ప్రకటించి ఎన్నో రోజులు కాలేదు! ఉన్నట్టుండి ‘ఖెర్సన్‌ను వీడుతున్నాం. మా సేనలను అక్కణ్నుంచి వెనక్కు రప్పిస్తున్నాం’ అంటూ రష్యా అధికారులు ప్రకటించడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. రష్యా హఠాత్తుగా ఒక అడుగు వెనక్కు ఎందుకేసింది? నిజంగానే రష్యా సేనలు ఖెర్సన్‌పై పట్టు కోల్పోయాయా? లేదంటే ఈ వెనకడుగు వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమా...? జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుందంటారు. పుతిన్‌కు అది ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నట్టుంది. ఖెర్సన్ సహా ఉక్రెయిన్‌లోని నాలుగు పట్టణాలు తమ అధీనంలోకి వచ్చాయని దాదాపు నెలకింద చిరునవ్వులు చిందిస్తూ పుతిన్ కాస్త ఆర్భాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఖెర్సన్ నుంచి సేనల ఉపసంహరణ విషయాన్ని మాత్రం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు వెల్లడించారు. రష్యా ప్రజలకు రుచించని విషయాల వెల్లడికి వీలైనంత దూరంగా ఉండటం పుతిన్‌కు అలవాటే. అందుకే షరామామూలుగా ఖెర్సన్ నుంచి వెనకడగు ప్రకటనలోనూ ఆయన మొహం చాటేశారు. ఆ బాధ్యతను రక్షణ మంత్రికి, ఇతర సైనిక ఉన్నతాధికారులకు అప్పగించడం ద్వారా వారిని వ్యూహాత్మకంగా టీవీల ముందుకు తీసుకొచ్చారు. తద్వారా ఉక్రెయిన్‌తో యుద్ధంలో జరిగే అన్ని పరిణామాలకూ ఇకపై వాళ్లే బాధ్యులవుతారని పుతిన్ చెప్పినట్టయింది. కాకపోతే ఓటమిని రష్యా బహిరంగంగా అంగీకరించడమే చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఇలాంటి ఎదురుదెబ్బలను రష్యా అధికారికంగా అంగీకరించడం అత్యంత అరుదు. అదీ ప్రత్యక్ష ప్రసారంలో! యుద్ధగతినే మార్చే పరిణామం! ఖెర్సన్ నుంచి రష్యా సేనల ఉపసంహరణను ఉక్రెయిన్ తొలుత నమ్మలేదు. రష్యా వ్యూహాత్మకంగా వల విసిరిందని ఉక్రెయిన్ సైనికాధికారులు భావించారు. ఈ ప్రకటన పాచికేనని, రష్యా సైనికులు పౌరుల వేషంలో ఉక్రెయిన్ జనంతో కలిసిపోయి దొంగ దెబ్బ తీసేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నారని అనుమానించారు. ఆ ఆస్కారమూ లేకపోలేదన్నది పరిశీలకుల మాట. ‘‘ఖెర్సన్ నుంచి సేనలను ఉపసంహరించాలని రష్యా చాలా రోజులుగా ఆలోచిస్తోంది. సుశిక్షితులైన సైనికుల స్థానంలో బలవంతంగా ఆర్మీలో చేర్చుకున్న పౌరులను ఖెర్సన్‌లో మోహరించడమే ఇందుకు నిదర్శనం’’ అని వారంటున్నారు. ఉక్రెయిన్ దాడులను ముమ్మరం చేయడంతో ఖెర్సన్‌పై పట్టు బిగించడం తమకు దాదాపు అసాధ్యంగా మారిందని రష్యా సైనికాధికారి ఒకరన్నారు. ఖెర్సన్‌ను వదిలేసి నిప్రో నది పశ్చిమ తీరాన సేనలను మోహరిస్తే తమ స్వాధీనంలోని మిగతా ప్రాంతాలను కాపాడుకోవచ్చని రష్యా భావించినట్టు కన్పిస్తోంది. ఉధృతమైన నిప్రో ప్రవాహమే ఉక్రెయిన్ సేనలను నది దాటకుండా అడ్డుకుంటుందన్నది వారి ఆలోచన. మొత్తంమీద ఖెర్సన్ నుంచి రష్యా నిష్క్రమణ యుద్ధగతిని పూర్తిగా మార్చేయడం ఖాయంగా కన్పిస్తోంది. గెలుపోటముల భవిష్యత్తును శాసించేలా ఉంది. స్థూలంగా ఇది రష్యాకు మింగుడు పడని పరిణామమే. -
ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం
కీవ్: ఖేర్సన్ ప్రాంతంపై మళ్లీ ఉక్రెయిన్ సైన్యం పట్టు సాధిస్తుండటంతో అక్కడి నుంచి రష్యా సేనలు పలాయనం చిత్తగించాయి. ‘యుద్ధంలో గాయపడి ఖేర్సన్ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న తోటి సైనికులను రష్యా బలగాలు వెంట తీసుకెళ్తున్నాయి. వెళ్తూ వెళ్తూ ఖేర్సన్‌లోని ఆస్పత్రులను నిరుపయోగం చేస్తున్నాయి. ఔషధాలు, ఉపకరణాలు, చివరకు అంబులెన్స్‌లనూ తరలిస్తున్నాయి. స్థానిక వైద్యులను తమతోపాటు రష్యాకు రావాలని బెదిరిస్తున్నాయి’ అని ఉక్రెయిన్ సాయుధ దళాల విభాగం శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. మరోవైపు, 2014 నుంచి రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా ద్వీపకల్పంలోని రష్యా నౌకల్లో పేలుళ్లు సంభవించాయి. చదవండి: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా -
ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్!
కీవ్: ఉక్రెయిన్‌తో గత కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా బలగాల ఆధీనంలో ఉన్న ఖార్కీవ్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లైమన్‌ను ఉక్రెయిన్ దళాలు చుట్టుముట్టాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి మాస్కో తన బలగాలను వెనక్కి రప్పించాల్సి వచ్చింది. ఇది జెలెన్స్కీ సేనకు వ్యూహాత్మక విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను తమలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఇలా జరగటంతో రష్యాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో మాస్కో స్వల్ప శ్రేణి అణు బాంబులను పరిశీలించాలని సూచించారు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, చెచ్నియా నాయకుడు రామ్జాన్ కడిరోవ్. సరిహద్దు ప్రాంతంలో మార్షల్ చట్టాన్ని ప్రయోగించాలన్నారు. లైమన్ నగరం నుంచి బలగాలను ఉపసంహరించినట్లు రష్యా సైతం ప్రకటన చేసింది. అయితే, ఉక్రెయిన్ దళాలు తమను చుట్టుముట్టలేదని, తామే వ్యూహాత్మకంగా వదిలేసి వచ్చామని బుకాయించే ప్రయత్నం చేసింది. లైమన్ నగరంలో రష్యా దళాలు సుమారు 5000లకుపైగా ఉన్నాయని, శత్రు దేశ బలగాలు అంతకన్నా తక్కువేనని పేర్కొంది. ‘ఉక్రెయిన్ బలగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందన్న అంచనాలతో వ్యూహాత్మకంగా తమ బలగాలను ఉపసంహరించుకున్నాం.’ అని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. లైమన్ నగరాన్ని చుట్టుముట్టామని, తమ బలగాలు నగరంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: Russia-Ukraine War: ‘రష్యా రిఫరెండం’పై ఓటింగ్‌కు భారత్ దూరం -
ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్
Military mobilisation: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలపై పైచేయి సాధిస్తూ...రష్యా ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు బహిరంగంగా మరిన్ని సైనిక సమీకరణలను చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రష్యా తన భూభాగాలను రక్షించడానికి సుమారు రెండు మిలియన్ల బలమైన సైనిక దళాలను రంగంలోకి దింపనుందని అన్నారు. అలాగే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో శాంతి కోరుకోవడం లేదని, రష్యాను నాశనం చేయాలని చూస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. తాను తమ మాతృభూమిని రక్షించుకోవడానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సైనిక సమీకరణకై జనరల్ స్టాఫ్‌కి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నానని చెప్పారు. అంతేగాదు తూర్పు ఉక్రెయిన్‌లో డాన్బాస్ ఇండస్ట్రీయల్ హార్ట్‌ల్యాండ్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తన లక్ష్యం అని పుతిన్ పునరుద్ఘాటించారు. అలాగే పశ్చిమ దేశాలు రష్యాపై అణు బ్లాక్‌మెయిల్‌కి దిగుతున్నాయని, దీనికి తాము తమ ఆయుధాలతో సరైన విధంగా బదులివ్వగలమని అన్నారు. ఇవేమి ప్రగల్పాలు, బెదిరింపులు కాదని తెగేసి చెప్పారు. అయినా రష్యా 2014లో ఉక్రెయిన్‌లో డోన్బాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని లుహాన్స్క్, డోనెట్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధం మొదలైన ప్రాంభంలోనే దాదాపు 60 శాతం భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంది రష్యా. జులై నాటికి మొత్తం లుహాన్స్క్ని స్వాధీనం చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఖార్కివ్ ప్రావిన్స్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లేలా చేశాయి ఉక్రెయిన్ సేనలు. దాదాపు రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటిని కైవసం చేసుకుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షడు పుతిన్ మరిన్ని బలగాలను మోహరింప చేసే దిశగా పావుల కదుపుతున్నాడు. (చదవండి: ఔను మోదీ చెప్పింది కరెక్ట్! ప్రశంసించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు) -
రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందేందుకు శుత్రుదేశాన్ని చావుదెబ్బకొడుతూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాతో సరిహద్దు ప్రాంతమైన ఆగ్నేయ ఖార్కివ్‌ను ఉక్రెయిన్ దాదాపు తిరిగి తమ హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓస్కిల్ నది, స్వాతోవే మధ్య రష్యా సేనలు ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని ఉక్రెయిన్ దళాలు నిర్వీర్యం చేశాయి. ఆ ప్రాంతాన్ని దాటి ముందుకెళ్లాయి. దాదాపు తమ భూభాగంలో మెజారిటీ భాగాన్ని తిరిగి పొందాయి. ఉక్రెయిన్ సైన్యం ఇచ్చిన ఊహించని షాక్‌తో రష్యా సేనలు వెనక్కి తగ్గినట్లు బ్రిటన్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత్యంతరం లేక ఆ ప్రాంతానికి దూరంలో మరో రక్షణవలయాన్ని రష్యా సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాయి. ఒకవేళ దాన్ని కూడా ఉక్రెయిన్ దళాలు తిరిగి ఆక్రమించుకోగలిగితే యుద్ధంలో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాయి. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఇజియం నగరం నుంచి రష్యా దళాలు వెనుదిరిగిన తర్వాత ఉక్రెయిన్ అధికారులు అక్కడ శవాల దిబ్బను గుర్తించారు. అక్కడ దాదాపు 440 మృతదేహాలున్నట్లు చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని పేర్కొన్నారు. 440 మంది మృతుల్లో వందలాది మంది పౌరులు, పిల్లలు, ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. కొంతమందిని చిత్రహింసలు పెట్టి, మరొకొంతమందిని బాంబులతో చంపి ఉంటారని తెలిపారు. రష్యా మారణహోమానికి ఇదే నిలువెత్తు సాక్ష్యమన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందుతున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి.. -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్
US Says "Concerned: రష్యా చైనా వంటి ఇతర దేశాలతో సైనిక కసరత్తులు నిర్వహించనున్నట్లు ప్రకటించిందని అమెరికా పేర్కొంది. రష్యా నిర్వహించనున్న వోస్టాక్ 20200 డ్రిల్స్‌లో చైనా, భారత్‌తో సహా అనేక ఇతరదేశాల నుంచి సుమారు 50 వేల సైనిక బలగాలు పాల్గొంటాయని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. అంతేకాదు ఈ విన్యాసాలను సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు తూర్పు తీర ప్రాంతాల తోపాటు జపాన్ సముద్ర జలాలల్లోని వివిధ ప్రదేశాల్లో ఈ విన్యాసాలు నిర్వహించనుందని స్పష్టం చేసింది. అలాగే ఈ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు మొదటగా తూర్పు మిటలరీ డిస్ట్రిక్ట్స్‌లోని ఏడు శిక్షణ ప్రాంతాలో కసరత్తులు నిర్వహించిన తదనంతరం ఓఖోత్క్స్, జపాన్లలోని సముద్ర జలాల్లోనూ, తీరప్రాంతాల్లో రక్షణాత్మక్ష ప్రమాదకర విన్యాసాలకు అనుమతిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొందని వెల్లడించింది. ఈ కసరత్తుల్లో సుమారు 50 వేల మంది సైనికుల తోపాటు దాదాపు 140 విమానాలు, 60 యుద్ధ నౌకలు, గన్బోట్లు తోసహా సహాయక నౌకలు ఉంటాయని మాస్కో పేర్కొంది. ఈ సైనిక విన్యాసాల్లో చైనా, భారత్‌లో సహా లావోస్, మంగోలియా, నికరాగ్వా, సిరియా తోపాలు అనేక మాజీ సోవియట్ దేశాలు పాల్గొంటాయని రష్యా చెబుతోంది. ఈ విషయమై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగిన దేశంతో ఏయే దేశాలు జతగట్టి ఈ విన్యాసాల్లో పాల్గొంటాయోనని భయంగా ఉందని చెప్పారు. ఐతే ఈ విషయాన్ని ఆయా దేశాల స్వంత నిర్ణయానికి వదిలేస్తున్నామని తేల్చి చెప్పారు. ఐతే విన్యాసాలో భారత్ పాల్గొంటుందా లేదా అనే దానిపై న్యూఢిల్లీ నుంచి ఎటువంటి సమాచారం లేదని అన్నారు. కానీ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తూర్ప తీర ప్రాంతాల్లో సైనిక భద్రతను నిర్వహించడానికి, ఆయ ప్రాంతాల్లోని దురాక్రమణ చర్యను తిప్పికొట్టేందుకు ఈ సైనిక డ్రిల్స్ నిర్వహిస్తున్నట్ల చెబుతోంది. ఐతే గతేడాది రష్యాలో జరిగిన జెడ్‌ఏపీఏడీ 2021 సైనిక కసరత్తుల్లో చైనా పాకిస్తాన్ తోపాటు భారత్ కూడా పాల్గొంది. (చదవండి: ప్రపంచ పెద్దన్న అమెరికాకు షాక్ ఇచ్చిన ద్వీప దేశం.. చైనా అండతోనే?) -
'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన విషయమై చైనా అగ్గి మీద గుగ్గిలంలా మారిన సంగతి తెలిసిందే. దీంతో తైవాన్ చుట్టూత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గస్తీ కాసింది. తైవాన్ జలాల్లో చైనా దళాలు మోహరించడమే కాకుండా సైనిక విన్యాసలు చైసి తైవాన్‌ని భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ విన్యాసాలు కొద్ది రోజుల్లో ఆగిపోతాయని అంతా అనుకున్న సమయంలో తాజగా చైనా మరో బాంబు పేల్చింది. లైవ్ ఆర్మీ ఫైర్ డ్రిల్ పేరిట భూ వాయు గగన మార్గాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించి ఇప్పుడేమో అన్ని పనులు పూర్తి చేశామని ఇక ఏ సమయంలోనైనా యుద్ధం చేయడానికి రెడీ అని తెగేసి చెప్పేస్తోంది. దాదాపు వారం రోజుల సైనిక కసరత్తుల తదనంతరం తైవాన్ చుట్టుతా అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేశామని తన అధికారిక సోషల్ మీడియా వీబో అకౌంట్లో పేర్కొంది. ఈ మేరకు తమ దళాలు తైవాన్ జలసంధిలో ఎప్పటికప్పడూ పరిస్థితులను నిశితంగా గమనించడమే కాకుండా క్రమ తప్పకుండా పెట్రోలింగ్‌ని నిర్వహిస్తామని చెప్పింది. అలాగే ఏ సయమంలోనేనా పోరాడేందుకు సైనిక శిక్షణను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఒక పక్క యూఎస్ ఎంతలా హెచ్చరించినా.. తన దూకుడు తగ్గించుకోనని తెగేసి చెప్పడమే కాకుండా తైవాన్ చైనాలో భాగమని పదే పదే నొక్కి చెబుతుండటం గమనార్హం. (చదవండి: అమెరికాని ఆపడం అసాధ్యం...చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్) -
యుద్ధంలో ఒక్కసారిగా మారిన సీన్.. రష్యా బలగాల గజగజ
Ukraine War: రష్యా, తూర్పు ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా నిరాటంకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా బలగాలు డోనెట్స్ నదిపై ఉన్న మూడు బ్రిడ్జిలను కూల్చి ఉక్రెయిన్ బలాగాలను నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. పైగా లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటూ రష్యా బలగాలు నినాదాలు చేశాయి. ఈ తరుణంలో ఇవాళ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చేసింది. శత్రుదేశాన్ని మట్టికరిపించేలా మెదటి ప్రపంచ యుద్ధం తరహాలో ఆపరేషన్ చేపట్టింది. శత్రు దాడులనుంచి రక్షణకోసం ఏర్పాటు చేసుకునే కందకాలానే(దాడుల నుంచి రక్షణ కోసం భూమిలో ఏర్పాటు చేసుకునే ఇరుకైన గుంత) లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలు పెట్టాయి ఉక్రెయిన్ బలగాలు. ఈ మేరకు ఉక్రెయిన్ బలగాలు కందకంలో ఉంటున్న రష్యా బలగాలపై డ్రోన్లతో నేరుగా దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతం కావడంతో ఉక్రెయిన్ దళాలు జోష్‌తో ముందుకు వెళ్తున్నాయి. ఊహించని ఈ దాడులతో రష్యా బలగాలు అతలాకుతలం అవుతున్నాయి. కింగ్ డేనియల్ పేరుతో 24వ మెకనైజ్డ్ బ్రిగేడ్ ఉక్రెయిన్ సైనికులు ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తాం అంటూ... 'స్లేవ్ ఉక్రెయిన్'(ఉక్రెయిన్ బానిస)... 'గ్లోరి టూ ఉక్రెయిన్' (ఉక్రెయిన్ కీర్తీ) వంటి నినాదాలతో దాడులు చేశారు. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన పై దాడులకు తెగబడటంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. అతి చిన్న పోరుగు దేశం పై ఎందుకు యుద్ధం అన్నా వినలేదు. కానీ ఇప్పుడు ఆ చిన్నదేశం ఉక్రెయిన్‌తో ఊహించని ప్రతిఘటనను రష్యా ఎదుర్కొంటోంది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ వంటి ఆర్మీ అధికారుల నుంచి దిగ్గజ షూటర్ల వరకు పెద్ద సంఖ్యలో యుద్ధవీరులను కోల్పోయింది కూడా. ఈ మేరకు ఉక్రెయిన బలగాలు డ్రోన్లతో రష్యా కందకాలపై దాడుల నిర్వహిస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 24th Mechanized Brigade dropping the VOG-17 grenade straight in the Russian trench pic.twitter.com/kRsudUj7px — ТРУХА⚡️English (@TpyxaNews) June 11, 2022 (చదవండి: ఇంత దారుణమేంటి పుతిన్.. స్పెషల్ బాడీగార్డుతో అలాంటి పనేంటి..?) -
ఉక్రెయిన్ యుద్ధం: పట్టుబిగిస్తున్న రష్యా
కీవ్: రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా జరిపిన దాడుల్లో విఫలమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మాత్రం పట్టు సాధించగలిగింది. గత నెలలో రష్యా తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు హోరాహోరీగా సాగించి మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. రష్యా ఇప్పుడూ తూర్పు ఉక్రెయిన్‌లోని మరో నగరమైన సెవెరోడోనెట్స్క్ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు నిర్వహించింది. ఈ మేరకు రష్యా బలగాలు వందలాది మంది పౌరులు ఆశ్రయం పొందుతున్న అజోట్ కెమికల్ ప్లాంట్‌పై పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వందలాదిమంది పౌరులు, సైనికులు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా మద్ధతు గల వేర్పాటువాద ప్రాంతంలో చివరి వంతెన కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రష్యా సేనలు ఇప్పటి వరకు డోనెట్స్ నదిపై నిర్మించిన మూడు వంతెనలు ధ్వంసం చేశారని అన్నారు. ఈ చివరి వంతెన కూడా ధ్వంసం కావడంతో ఉక్రెయిన్ బలగాలు ఆ నగరంలోకి ప్రవేశించడం అసాధ్యంగా ఉందన్నారు. దీంతో రష్యా సేనలు మీకు వేరే మార్గంలేదు లొంగిపొండి లేదా చనిపోండి అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు సెవెరోడోనెట్స్క్లో దాదాపు 70 శాతం రష్యా నియంత్రణలోనే ఉందన్నారు. అదీగాక తూర్పు డాన్బాస్ ప్రాంతంపై నియంత్రణే ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుకు కీలకమని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడోనెట్స్క్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సేనలను చాలా వరకు నియంత్రించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సెవెరోడోనెట్స్క్ను రక్షించడంలో సహాయపడటానికి ఆయుధాలను పంపించండంటూ పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. (చదవండి: మరో 4 నెలలు?) -
ఉక్రెయిన్ విధ్వంసం... ఆవిరైపోతున్న రష్యా ఆశ: వీడియో వైరల్
Wagner Group Involved In Assisting Russia's War: 2014 నుంచి రష్యా ఆక్రమిత లుహాన్స్క్ మాస్కోకి సహకరిస్తున్న వాగ్నర్ గ్రూప్ స్థావరాన్ని ఉక్రెయిన్ బలగాలు ధ్యంసం చేశాయి. ఈ దాడిలో సుమారు 22 మంది చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేయడంలో వాగ్నర్ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. తూర్పు ఉక్రెయిన్‌లో బీకరమైన దాడులు జరిగినట్లు లుహాన్స్క్ గవర్నర్ సెర్హే హేడే తెలిపారు. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ఉక్రేనియన్ నియంత్రణలో ఉన్న సెవెరోడోనెట్స్క్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందన్నారు. రష్యా డోనెట్స్ నదికి సమీపంలోని ఉన్న జంట పారిశ్రామిక నగరాలైన సెవెరోడోనెట్స్క్, లైసిచాన్స్క్లను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా దాడులను తెగబడింది. ఐతే ఉక్రెయిన్ మాస్కో సైనిక ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రైవేట్ కంపెనీ వాగ్నర్ గ్రూప్ పై దృష్టిసారించి ధ్వసం చేయడమే కాకుండా రష్యా ఆశల పై నీళ్లు జల్లింది. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #Wagner base in occupied #Luhansk region was destroyed, only one racist survived. The enemy base is located at the local stadium in #Kadiivka, which the russians brazenly occupied in 2014 #UkraineRussiaWar pic.twitter.com/cWsIHIzXXd — Serhiy Hayday (@serhey_hayday) June 10, 2022 (చదవండి: రష్యా దాష్టీకం!... దాదాపు 287 మందికి పైగా ఉక్రెయిన్ చిన్నారులు..) -
Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా
కీవ్: ఇంతకాలం బాగా ఇబ్బంది పెట్టిన ఆయుధ, ఆహార సరఫరాలు భారీగా పుంజుకోవడంతో ఉక్రెయిన్‌లో రష్యా సైన్యాలు ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు పుతిన్ తాజా లక్ష్యంగా పేర్కొన్న తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను తీవ్రతరం చేశాయి. అక్కడ దాడుల తీవ్రతను బాగా పెంచుతున్నాయి. డోన్బాస్లో ఉక్రెయిన్ కదలికలకు కీలకమైన పలు బ్రిడ్జీలను రష్యా దళాలు శనివారం పేల్చేశాయి. అక్కడి లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న చివరి నగరాలైన సెవరోడొనెట్స్క్, లిసిషాన్స్క్పైనా క్రమంగా పట్టు బిగిస్తున్నాయి. పలు అపార్ట్మెంట్ భవనాలపై భారీగా కాల్పులకు దిగాయి. అక్కడ ఉక్రెయిన్ దళాలతో వీధి పోరాటం కూడా సాగుతోంది. సెవరోడొనెట్స్క్లో 90 శాతం రష్యా చేతుల్లోకి వచ్చినట్టు సమాచారం. డోన్బాస్లోని రెండో ప్రధాన ప్రాంతమైన డొనెట్స్క్లో బఖ్ముత్ నగరంపైనా రష్యా దాడుల తీవ్రత పెరిగింది. వీటి ధాటికి ఉక్రెయిన్ సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో ఓ వ్యవసాయ ప్రాంతంపై రష్యా క్షిపణి దాడిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. ఒడెసా నుంచి ఆహార ధాన్యాలఎగుమతులను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరిగాయి. ఒడిశా తీరప్రాంతంలో ఉక్రెయిన్ యుద్ధపరికరాల తరలింపు విమానాన్ని తాము కూల్చేశామని రష్యా వెల్లడించింది. డోన్బాస్ ప్రాంతంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నపుడు ఉక్రెయిన్ క్షిపణి దాడిలో రష్యా మేజర్ జనరల్ కనమత్ బొటషెవ్(63) మరణించారని రష్యా ధృవీకరించింది. రష్యా వైమానిక దళంలో మేజర్ జనరల్ స్థాయి అత్యున్నత ర్యాంక్ అధికారి మరణించడం ఇదే తొలిసారి. నాటోలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను వ్యతిరేకిస్తున్న తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఫోన్లో మాట్లాడారు. (చదవండి: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం) -
వంద రోజుల యుద్ధంలో దాదాపు 20% ఉక్రెయిన్ రష్యా హస్తగతం
100 Days Of War Russia Now Holds 20% Ukraine Territory: ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు దిగి నేటికి వంద రోజులైంది. ఈ వందరోజుల నిరవధిక దాడుల్లో రష్యా 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని అధీనంలో ఉంచుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు. 2014లో స్వాధీనం చేసుకున్న డాన్‌బాస్‌లోని కొన్ని భూభాగాలతో సహా ఉక్రెయిన్ భూభాగంలో ఐదవ వంతు మాస్కో నియంత్రణలో ఉందని కీవ్ ప్రకటించింది. అదీగాక ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలను రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరిమికొట్టడంతో తూర్పు ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకోవడం పై మాస్కో దృష్టి సారించింది. ఈ యుద్ధ భూమిలో ప్రతి రోజు సుమారు 100 మంది దాక ఉక్రెయిన్ సైనికులు నేలకొరుగుతున్నారని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన సమావేశ అనంతరం నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెయిన్ మిత్రదేశాలు ఈయుద్ధం క్షీణించేలా ఆయుధాలను అందించాలని పిలుపునిచ్చారు. తాము రష్యాతో నేరుగా యుద్ధానికి దిగాలనుకోవడంలేదని పునరద్ఘాటిస్తూ... ఈ యుద్ధంలో రష్యా బలగాలు ఊహించనిదానికంటే ఎక్కువగానే పురోగమిస్తున్నాయని అన్నారు. యూఎస్ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు సైతం ఉక్రెయిన్‌కి ఆయుధాలను, సైనిక సామాగ్రిని అందజేశాయి. అంతేగాదు ఉక్రెయిన్‌కి యూఎస్ రాయబారి బ్రిడ్జేట్ బ్రింక్ రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ విజయం సాధించేలా యూఎస్ సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే యూఎస్ ఉక్రెయిన్‌కి సుమారు 700 మిలియన్ డాలర్ల ఆయుధా సామాగ్రి ప్యాకేజిని ప్రకటించింది. దీంతో మాస్కో ఉక్రెయిన్ విషయంలో యూఎస్ అగ్నికి ఆద్యం పోస్తున్నట్లుగా వ్యవహరిస్తోందంటూ అమెరికా పై విరుచుకుపడుతోంది. ఈ మేరకు రష్యా ఆర్థిక పరిస్థితిని ఉక్కిబిక్కిర చేసేలా అమెరికా దాని మిత్రదేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు సరఫర పై కూడా యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఈ పాక్షిక చమురు నిషేధానికి భారీ మూల్య చెల్లిస్తారంటూ యూరప్ దేశాలను హెచ్చరించింది. ఐతే ప్రపంచంలోని ధాన్యాల ఉత్పత్తిదారుల్లో ఉక్రెయిన్ పాత్ర కీలకం కావడంతో ఈయుద్ధం ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే తృణధాన్యాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్ నుంచి మొక్కజోన్న వరకు అన్ని అధిక ధరలు పలుకుతుండటం గమనార్హం. (చదవండి: మరింత మద్దతు.. ‘రష్యా పని పట్టడానికి అత్యాధునిక ఆయుధాలిస్తాం’) -
రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలుగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ భీకరమైన యుద్ధం కారణంగా వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాది మంది వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక ఉక్రెయిన్ రష్యా దాడుల్లో తాను ఎదర్కొన్న భయంకరమైన చేదు అనుభవం గురించి వివరించాడు. ఈ మేరకు 33 ఏళ్ల మైకోలా కులిచెంకో తన భయానక అనుభవాన్ని వివరించాడు... "రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు తెగబడతూ దాడులు చేసి సరిగ్గా మూడువారాలైంది. మార్చి 18న అనుహ్యంగా ఒక రోజు రష్యా బలగాలు తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తమ ఇంటిని చుట్టుముట్టి రష్యన్ దళాలపై బాంబు దాడి చేస్తున్నవారి కోసం గాలించారు. తమ దళాలలపై దాడిచేసే వాళ్లతో సంబంధం ఉందనే అనుమానంతో మా ఇంటిని సోదా చేయడం మొదలు పెట్టారు. ఐతే మా తాతా పారామిలటరీకి సంబంధించినవాడు కావడంతో ఇంట్లో ఉండే మిలటరీ బ్యాగ్, పతకాలను చూసి ఆర్మీకి చెందిన వారిగా భావించి తమ పై కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నన్ను మా అన్నలిద్దరిని కళ్లకు గంతలు కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి మూడు రోజులపాలు హింసించారు. ఆ తర్వాత మమ్మల్ని వదిలేస్తారు అనుకున్నాం కానీ వారు కర్కసంగా మా తలల పై గన్‌పెట్టి కాల్పుల జరిపారు. మొదటగా మా పెద్ద అన్న, ఆ తర్వాత రెండో అన్న తదనంతరం నాపై కాల్పుల జరిపారు. ఆ తర్వాత మా ముగ్గుర్ని ఒక గొయ్యిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఐతే తానుఎంతసేపు ఆ గోతిలో ఉండిపోయానో గుర్తులేదు కానీ ఆ తర్వాత స్ప్రుహ వచ్చాక ఊపిరాడక పోవడంతో తన అన్నలను తనపైనే ఉండటం వల్ల బరువుగా ఉందని గమనించి నా చేతులు కాళ్ల సాయంతో వారిని పక్కకు తోసి ఏదో విధంగా ఆ గోయ్యి నుంచి బయటప్డడానని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి బుల్లెట్ తన చెంప మీద నుంచి కుడి చెవి వైపుకు రాసుకుంటూ వెళ్లిపోవడం వల్ల తాను లక్కీగా బతకగలిగానని చెప్పాడు. ఆ తర్వాత తాను పొలానికి సమీపంలోని ఇంటికి వెళ్లి ఆశ్రయం పోందినట్లు వివరించాడు. తాను ఆ విషాద ఘటన నుంచి బతికి బట్టగట్టగలుగుతానని కూడా అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి విషాద ఘటనలు ఉక్రెయిన్ అంతటా కోకొల్లలు అంటూ ఆవేదనగా చెబుతున్నాడు. (చదవండి: టిట్ ఫర్ టాట్: పుతిన్‌పై బ్యాన్ విధించిన కెనడా) -
గెలుపునకు చేరువలో ఉక్రెయిన్! రష్యా సరిహద్దుకు చేరుకున్న బలగాలు
Mr President, We Made It: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలకు పైగా దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ నేపథ్యంలో యూకే రక్షణ మంత్రిత్వ శాఖ నిరవధిక పోరును ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పరిస్థితి గురించి ఒక నివేదిక విడుదల చేసింది. భూ, గగన, జల మార్గాలలో దాడులు సాగించిన రష్యా బలగాలు ఈ యుద్ధంలో భారీ నష్టాన్నే చవిచూశాయని పేర్కొంది. ప్రస్తుతం యుద్ధంలో రష్యా కాస్త వెనకబడిందని తెలిపింది. రష్యా బలగాల పోరాట సామర్థ్యం తగ్గిందని, చాలామంది సైనికులు పట్టుబడుతున్నారని వెల్లడించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రానున్న రోజల్లో రష్యా దళాలు వేగవంతంగా దాడులు చేసే అవకాశం లేదని అంచనా వేసింది. అంతేగాదు ఖార్కివ్ ప్రాంతంలో కీవ్ దళాలు ఉక్రెయిన్-రష్యా సరిహద్దుకు చేరుకున్నట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహదారు వాడిమ్ డెనిసెంకో తెలిపారు. ఆస్ట్రియా ఉక్రెయిన్ మాజీ రాయబారి ఒలెగ్జాండర్ షెర్బా "మిస్టర్ పుతిన్ మేము సాధించాం". "శత్రు రాజ్య సరిహద్దుకు చేరుకున్నాం" అనే క్యాప్షన్ జోడించి మరీ ఉక్రెయిన్, రష్యా సరిహద్దుకు చేరుకున్న ఉక్రెయిన్ సైనికులను చూపించే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు బెర్లిన్‌లో జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో జర్మనీకి చెందిన అన్నలెనా బేర్బాక్ ఉక్రెయిన్‌కి తమ మాతృభూమి రక్షణ కోసం తమవంతు మద్దతుగా సైనిక సహాయం అందిస్తామని చెప్పారు. మరోవైపు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెనియన్లు తమ ధైర్య సాహసాలతో తమ మాతృభూమిని రక్షించుకోవడమే కాకుండా ఈ యుద్ధంలో తప్పక విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు. Latest Defence Intelligence update on the situation in Ukraine - 15 May 2022 Find out more about the UK government's response: https://t.co/VBPIqyrgA5 🇺🇦 #StandWithUkraine 🇺🇦 pic.twitter.com/n6dBVZHAos — Ministry of Defence 🇬🇧 (@DefenceHQ) May 15, 2022 “Mr. President, we reached Ukraine’s state border with the enemy state. Mr. President, we made it!” Glory to #Ukraine! Glory to Heroes!#StandWithUkraine️ #UkraineWillWin #RussiaUkraineWar pic.twitter.com/kdD6kD1w3x — olexander scherba🇺🇦 (@olex_scherba) May 15, 2022 (చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం) -
ఉక్రెయిన్ దళంలో చేరిన ఒలింపిక్ షూటర్
Olympic Star Shooter Joins Ukraine Forces: ఉక్రెనియన్ చాంపియన్ షూటర్ క్రిస్టినా డిమిత్రెంకో తన మాతృభూమి రక్షణ కోసం ఉక్రెయిన్ బలగంలో చేరింది. ఆమె 2016 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో బయాథ్లాన్‌లో స్వర్ణం గెలుచుకుందిలో స్వర్ణ పతకం గెలుచుకుంది. బయాథ్లాన్ అనేది స్కీయింగ్, రైఫిల్ షూటింగ్‌లను మిళితం చేసే క్రీడ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న కార్పాతియన్ పర్వతాలలో అంతర్జాతీయ పోటీ కోసం ప్రాక్టీసు చేస్తోంది. అంతేగాదు క్రిస్టినా ఫిబ్రవరి 27న స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఇటలీతో పోటీపడాల్సి ఉంది. ఆమె కీవ్, చెర్నిహివ్‌లలో రష్యా బలగాల విధ్వంసాన్ని తెలుసుకుని ఉక్రెనియన్ యుద్ధంలో చేరాలని నిర్ణయించుకుంది. అంతేగాదు యుద్ధంలో పాల్గొని ఆయుధాలను చేతపట్టడానికి కూడా అర్హత సాధించింది. క్రీస్టినా ఇలాంటి పరిస్థితి ఒకటి తన జీవితంలో ఎదరవుతుందని తాను ఊహించలేదని చెప్పింది. పైగా తనకు శత్రువంటే భయం లేదని, వాళ్లకసలు అవకాశం ఇవ్వకుండా దాడి చేస్తానని చెబుతోంది. అంతేగాదు ఆటలో ఉన్న యుద్ధంలో ఉన్నా చివరి వరకు ఉంటానిని విజయం మనదేనని విశ్వాసం వ్యక్తం చేసింది. అదీగాక ఉక్రేనియన్ దళాలు రష్యా దళాలను ఖార్కివ్ నుంచి వెనక్కి మళ్లేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా డాన్బాస్ ప్రాంతంలో పరిస్థితి చాలా కష్టంగా ఉందని, రష్యా దళాలు ఏదోరకంగా దురాక్రమణ చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది!: ఉక్రెయిన్
Ukrainian human rights group accused Russian troops: ఉక్రెయిన్ పై రష్యా నెలరోజలకు పైగా నిరవధిక యుద్ధం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని అధినంలోకి తెచ్చుకునే క్రమంలో రష్యా యుద్ధ నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతోంది. అంతేగాక యూఎన్ భద్రతా మండలిలో ఉక్రెయిన్ మానహక్కుల సంఘం ప్రస్తుతం రష్యా బలగాలు అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించాయి. అదీగాక ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వస్తున్నాయని యూఎన్ అధికారి భద్రతా మండలికి తెలిపారు. ఉక్రెయిన్ మానవహక్కుల సంఘం నాయకురాలు కాటెరినా చెరెపాఖా రష్యా సైనికులు తొమ్మిది మందిపై అత్యాచారం కేసులు ఉన్నాయని, సుమారు 12 మంది మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని భద్రతా మండలిలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ఇప్పుడూ హింస, అత్యాచారాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. తమ ఆవేదనను వినాలని అభ్యర్థించారు. గతవారమే ఐక్యరాజ్యసమితి రష్యన్ దళాల లైంగిక హింస ఆరోపణలను ధృవీకరించడానికి యూఎన్ మానవ హక్కుల పర్యవేక్షకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ దళాల పై కూడా లైంగిక ఆరోపణలు వస్తున్నట్లు యూఎన్ పేర్కొంది. కానీ దానిపై ఉక్రెయిన్ మానవ హక్కుల సంఘం ఇంకా స్పందించలేదు. మరోవైపు రష్యా ఎప్పటికీ పౌరుల పై దాడి చేయదని కేవలం రష్యన్ సైనికులను శాడిస్టులుగా చూపించాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని రష్యా యూఎన్ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మాట్లాడుతూ, న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అన్ని ఆరోపణలను స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. మేము ఎక్కువగా అత్యాచారం, లైంగిక హింస గురించి వింటున్నాము" అని ఆమె కౌన్సిల్లో అన్నారు. ఉక్రెయిన్ యూఎన్ రాయబారి సెర్గీ కిస్లిత్సా రష్యన్ సైనికుల అత్యాచార కేసులకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌కి ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రారంభించిందని భత్రతా మండలికి తెలిపారు. (చదవండి: రష్యా అరాచకం.. గుంతలు తవ్వి మృతదేహాల ఖననం..!) -
ఉక్రెయిన్ తల్లుల ఆవేదన.. ఒక్కసారి చూడనివ్వండి!
Ukrainian mother fell to her knees: ఉక్రెయిన్‌పై గత నెలరోజులకు పైగా రష్యా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా బలగాలు ఉపసంహరణ దిశగా వెళ్లినట్లే వెళ్లి.. మళ్లీ ఉక్రెయిన్‌కి ఉత్తరం వైపు నుంచి దాడులు జరిపాయి. దీంతో బుచా వంటి నగరాలు శవాల దిబ్బగా మారిపోయాయి. ప్రస్తుతం రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని స్వాధీనం చేసుకునేందుకు దాడులను విరమించుకుంది. దీంతో అధికారులు ఉత్తరాదిన ఉన్న బుచా వంటి నగరాల్లో జరిగిన నష్టాన్ని అంచన వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన విధ్వంసంలో మృతి చెందిన వారిని వెలికితీసి, గుర్తించే పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఒక తల్లి తన కొడుకు శవాన్ని గుర్తుపట్టింది. ఆమె కొడుకు మృతదేహం ఒక మ్యాన్‌హోల్‌లోని నీటిలో కనిపించింది. తన కొడుకు ధరించిన చెప్పుల ఆధారంగా గుర్తుపట్టగలిగింది. అంతేకాదు అక్కడ యుద్ధ ట్యాంకుల సమీపంలో ఉక్రెయిన్ సైనిక దుస్తులతో మరో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. వారు ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్‌కి చెందిన సభ్యులని అధికారులు తెలిపారు. అంతేకాదు అక్కడ పరిసర ప్రాంతాలను ఎటు నుంచి చూసిన విషాదంగానే కనిపిస్తున్నాయి. కుమారులను కోల్పోయిన తల్లులు బాధ వర్ణనాతీతం. ఒక్కసారి తమ కుమారులను చూడనివ్వండంటూ మృతదేహాలను తరలిస్తున్న అధికారులను అడుగుతున్న తీరు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. జెనీవా ఒప్పందాల ప్రకారం యుద్ధ ఖైదీలను ఉరితీయడం నిషేధించారు. మరీ రష్యా బలగాలు ఇలా ఏ విధంగా చేయగలిగారంటూ.. ఆక్రోశంతో ప్రశ్నిస్తున్నారు ఉక్రెయిన్ వాసులు. కానీ మాస్కో మాత్రం ఆ దాడులన్నింటినీ ఖండించడమే కాకుండా సమర్థించుకునేందకు యత్నిస్తోంది. (చదవండి: తగ్గేదేలే.. పుతిన్ సంచలన నిర్ణయం) -
ఉక్రెనియన్ తల్లుల ఆవేదన...తమ పిల్లలైన బతికి ఉండాలని..
Ukrainian families who fear they will be killed by Russian Forces: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజులకు దాడి కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని తలవంచకపోయేసరికి ఆగ్రహంతో రష్యా బలగాలు ఊహించని విధంగా పౌరులపై కాల్పుల జరిపి నరమేథానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే బుచా నగరాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. అదీగాక రష్యా బలగాలు ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన రాజధాని కైవ్‌కి సమీపంగా వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ కుటుంబాల్లో భయాలు మొదలయ్యాయి. తాము రష్యాన్ దళాల చేతిలో హతమైతే తమ పిల్లలు బతికి క్షేమంగా ఉండాలని వారి శరీరాలపై ఫోన్ నెంబర్లతో సహా కుటుంబ వివరాలను రాస్తున్నారు. ఆ ఘటనలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని ఒక బాలిక తల్లి సాషా మకోవియ్ ఇలానే తన కూతురు శరీరంపై కుటుంబ వివరాలను రాసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు తమకు ఏమైన అయితే తమ పాపను మంచిగా చూసుకోవాలనే ఆశతో ఇదంతా చేస్తున్నట్లు వివరించింది. అంతేగాదు గత నెలలో యుద్ధం మొదలైనప్పుడు వేలాది మంది పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు దాటి వెళ్లారు. ఈ క్రమంలో ఒక పదేళ్ల బాలుడు తన తల్లి ఇచ్చిన చిన్న కాగితం ముక్కతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్ సరిహద్దుకు చేరిన ఉదంతం తెలిసిందే. రష్యన్ బలగాల దాడులకు భయపడి పారిపోతున్న పిల్లలను, పౌరులను మావన కవచాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణ వెలువెత్తాయి. అంతేకాదు నోవీ బైకివ్ గ్రామంలో యుద్ధ ట్యాంకుల ముందు బస్సులలో పిల్లలను ఉంచుతున్నారని నివేదిక పేర్కొంది. పుతిన్ అరాచకాలకు అంతేలేకుండా పోతుందంటూ ప్రపంచ దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాదు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడులన ఖండించడమే కాకుండా పుతిన్‌ని యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj — Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022 (చదవండి: యజమాని కోసం నిరీక్షిస్తున్న కుక్క!) -
యుద్ధం ముగిసిపోలేదు.. ఉక్రెయిన్ కీలక వ్యాఖ్యలు
Russians are leaving as of now to rethink their strategy: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగిసిపోలేదా?. 38వ రోజు కూడా ఇంకా కొన్ని చోట్ల దాడులు కొనసాగుతున్నాయి మరి. కొన్ని నగరాల్లో బలగాలను మాత్రమే తగ్గిస్తామని చెప్పిన రష్యా.. ఆ మాటనూ నిలబెట్టుకుంటోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా దళాలు వెనక్కుమళ్లించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో యుద్ధం ముగిసిందని ఉక్రెయిన్ బలగాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ తరుణంలో.. ఉక్రెయిన్ సైన్యాధికారి ఒకరు.. కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగిసిపోలేదని, భవిష్యత్తుల్లో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చని భద్రతాధికారి ఒలెక్సీ డానీలోవ్ అంటున్నారు. యుద్ధం ముగిసిందని వేడుకలు చేసుకోవడానికి ఇది తరుణం కాదు. అది తొందరపాటు చర్యే అవుతుంది. యుద్ధం భయం ఇంకా పోలేదు. అలాగే భవిష్యత్తులో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చు అని పేర్కొన్నారాయన. ఉక్రెయిన్ను నాశనం చేయాలనే పుతిన్ ఆకాంక్ష ఇంకా పూర్తి కాలేదు. ఈ గ్యాప్‌లో సైన్యాన్ని పునఃసమీకరించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఎవరూ తొందరపడి సంబురాలు చేసుకోవద్దని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. కీవ్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్టోమెల్‌లోని ఆంటోనోవ్ విమానాశ్రయం నుంచి మాస్కో దళాలు వెనక్కిమళ్లాయని డానిలోవ్ ప్రకటించారు. వ్యూహం మారుతుందేమో!: జెలెన్స్కీ తమ వ్యూహాన్ని మార్చుకుని దాడి చేసేందుకే రష్యన్లు వెనక్కుమళ్లారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. వాళ్లకు విజయం కావాలి. మే 9వ తేదీ( నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది) వాళ్లకు ఎంతో కీలకం. అందుకు ఇంకా సమయం ఉంది. ఆలోపు ఏదైనా జరగొచ్చు. కాబట్టి మనం ముందు ముందు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చు అని జాతిని, సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు జెలెన్స్కీ. అంతేకాదు రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని వెలుపల భారీ విధ్వంసాన్ని సృష్టించాయన్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని శ్మశానంగా మార్చి వెళ్తున్నారని ఆవేదనగా చెప్పారు. మళ్లీ యథాతధంగా మన జీవితానికి రావడం దాదాపు అసాధ్యం. ఇక దాడులు జరగవు అనే భరోసా వచ్చేంతవరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు. (చదవండి: చెర్నోబిల్‌ను వీడిన రష్యా ఆర్మీ) -
అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్
Russian troops first sign of illness from radiation: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా దాడి సాగిస్తూనే ఉంది. రష్యా సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన పేరుతో ఉక్రెయిన్ పై మరిన్ని వైమానిక బాంబులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరవధిక దాడుల కారణంగా ఉక్రెయిన్ ఊహించనట్లుగానే యూరప్ దేశాలకు పెనుముప్పు వాటిల్లనుంది. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించినప్పుడే చెర్నోబిల్ని నియంత్రణలోకి తెచ్చుకోవడంలో భాగంగా అణుకర్మాగారంపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ సేనలు అణుకర్మాగారంలో వ్యాపించిన మంటలను అదుపు చేసి పర్యవేక్షించారు. అంతేకాదు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ అణుకర్మాగారం అతిపెద్దదని గతంలో అది ఎంత పెను విధ్వంసం సృష్టించిందో కూడా వివరించారు. అయితే ఇప్పుడూ ఆ అణుకర్మాగారం నుంచి రేడియేషన్లు వెలువుడుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అందులో భాగంగానే చెర్నోబిల్ వద్ద రష్యా దళాలు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం బెలారస్‌లోని ప్రత్యేక వైద్య సదుపాయానికి తరలి వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈమేరకు ఉక్రెనియన్ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్చుక్ కూడా రష్యన్లు రేడియేషన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. చెర్నోబిల్ వద్ద కార్మికులు నివసించే సమీపంలోని స్లావుటిచ్ పట్టణం నుంచి రష్యన్ దళాలు వెనక్కి వెళ్లాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయమై యూఎన్ న్యూక్లియర్ వాచ్డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో చెర్నోబిల్‌కు తన తొలి సహాయం అందించనున్నట్లు ఐఏఈఏ పేర్కొనడం విశేషం. (చదవండి: మా ఆంక్షలు నిర్వీర్యం చేయోద్దు!..హెచ్చరించిన యూఎస్) -
రష్యా విభజన దిశగా యోచన...టెన్షన్లో ఉక్రెయిన్!
Zelenskyy accused the West of cowardice: గత నెలరోజులకు పైగా రష్యా ఉక్రెయిన్‌పై పోరు సాగిస్తూనే ఉంది. రష్యా వేటిని లక్ష్యపెట్టక బాంబుల దాడులతో ఉక్రెయిన్‌ని అల్లకల్లోలం చేస్తోంది.ఈ నేపథ్యంలో యూఎస్ చట్ట సభ్యులతోనూ, యూరోపియన్ దేశాలకు తమకు మిలటరీ సాయం అందిచమని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థించారు. ఈ విషయమైన జెలెన్ స్కీ మాట్లాడుతూ తమకు మరిన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు కావాలని విజ్క్షప్తి చేశారు. అయితే పశ్చిమ దేశాలు తమకు మిలటరీ సాయం అందించెందుకు వెనకడుగు వేస్తున్నాయని, పిరికివని ఆరోపణలు చేశారు. అయితే యూఎస్, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి పెద్ధ ఎత్తన మిలటరీ సాయం అందిచాయి కూడా. కానీ జెలెన్స్కీ అది సరిపోదని మరింత సాయం కావాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైరిలో బుడనోవ్, ఉక్రెయిన్ను రెండుగా విభజించాలని రష్యా ప్రయత్నిస్తోందని, ఉత్తర దక్షిణ కొరియాల మాదిరిగానే చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతేకాదు ష్యా ఇప్పుడు తూర్పు డోన్బాస్ ప్రాంతాన్ని నియంత్రించడంపైనే ప్రధాన దృష్టి పెట్టిందని, దాని ప్రధాన లక్ష్యానికి చేరుకున్న తర్వాత బలగాలు ఉపహరించి విభజన దిశగా అడుగులు వేస్తోందేమోనని ఉక్రెయిన్ భయాందోళనలో ఉంది. అయితే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మాత్రం ఉక్రేనియన్ల గెరిల్లా యుద్ధం అటువంటి ప్రణాళికలను నిర్వీర్యం చేస్తుందని ధీమాగా చెబుతుండటం గమనార్హం. అంతేకాదు 2014 నుంచి రష్యా-మద్దతుగల వేర్పాటువాదులచే పాక్షికంగా నియంత్రణలో ఉన్న తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై మాస్కో తన దృష్టిని కేంద్రీకరించిందని ఉక్రెయిన్ పేర్కొంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దళాలను తూర్పు వైపుకు మళ్లిస్తున్నట్లు రష్యా ఉన్నత స్థాయి అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌తో చర్చల్లో, మాస్కో డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తోందని తెలపింది. అంతేగాక యుద్ధాన్ని ముగించడంపై రష్యాతో చర్చలు జరగనున్నట్లు ఉక్రేనియన్ ప్రతినిధి డేవిడ్ అరాఖమియా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సోమవారం టర్కీలో సమావేశమవుతాయని కూడా చెప్పారు. కానీ రష్యా మాత్రం చర్చలు మంగళవారం ప్రారంభముతాయని చెప్పడం గమనార్హం. ఇంతకముందు జరిగిన చర్చలు, ఒప్పందాల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ మేరకు జెలెన్ స్కీ కూడా తన పాత పాటనే పాడుత్నున్నారు. ఈ వారం టర్కీలో జరిగే ఉక్రేనియన్-రష్యన్ చర్చలలో ఉక్రెయిన్ ప్రాధాన్యతలు "సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత" అని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. తాను శాంతి కోసమే చూస్తున్నాని, ఈసారి టర్కీలో ముఖాముఖి సమావేశానికి అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. (చదవండి: అనూహ్యం.. వెనక్కి తగ్గిన జెలెన్స్కీ! పుతిన్ తగ్గట్లేదా?) -
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
-
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
Metro station in Kharkiv: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల తరబడి దాడి చేస్తూనే ఉంది. వైమానిక దాడులతో పౌరుల ఆవాసాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కైవ్, మారియుపోల్, ఖార్కివ్‌లను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖార్కివ్‌లోని పౌరులు బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్లోనే తలదాచుకుంటున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ..ఉక్రెనియన్లకు ఆ మెట్రో స్టేషనే బాంబు షెల్టర్‌గా మారిందని పేర్కొంది. ఆ స్టేషన్లో పౌరులు ఏవిధంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారో వివరిస్తూ..వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అక్కడే నివాసం ఉంటున్న ఉక్రెయిన్ల కోసం తాత్కాలిక పడకలను, సంగీత కచేరీలను ఏర్పాటు చేశారు. అంతేగాదు రష్యా బలగాలు ఖార్కివ్‌లోని అణుకేంద్రం పై కూడా దాడులు నిర్వహించింది. అంతేగాదు ఖార్కివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీలోని న్యూట్రాన్ సోర్స్ ప్రయోగాశాల అగ్నిప్రమాదానికి గురైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.. అంతేగాదు ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న నష్టాన్ని అంచనవేయడం కూడా కష్టమేనని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
రష్యా బలగాలను తరిమికొడుతున్న ఉక్రెనియన్లు! గోబ్యాక్ అంటూ నినాదాలు
Unarmed Ukranian People Are Ready To Do Anything: ఉక్రెయిన్‌పై గత మూడువారాలకు పైగా రష్యాయుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా సైన్యం ముందు ఏ మాత్రం సరితూగని చిన్న దేశం అయినప్పటికీ తమ గడ్డను దురాక్రమణకు గురవ్వనివ్వమంటూ ఉక్రెనియన్లు సాగిస్తున్న పోరు ప్రపంచదేశాల మన్ననలను పొందుతోంది. మహిళలు, వృద్ధుల, చిన్నపిల్లలు అని తేడా లేకుండా ఇది తమ భూమి.. దీన్ని రక్షించుకుంటామంటూ రైఫిల్స్ చేతబట్టారు. పైగా రష్యా బలగాలను చూసి ఏ మాత్రం జంకకుండా ఉత్త చేతులతో యుద్ధ ట్యాంకులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ల దేశభక్తిని చూసి.. రష్యా బలగాలు చలించడమే కాక వారు సైతం యుద్ధం చేసేందుకు వెనకడువేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో!. అయితే ఇప్పుడూ మరోసారి అలాంటి తాజా ఘటన ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉక్రెయిన్‌లోని ఎనర్‌గోదర్ అనే నగరంలోకి రష్యా ఆర్మీ వాహనం ఒకటి వచ్చింది. అందులోంచి సైనికులు దిగుతున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. ఇది తమ దేశమని.. ఈ దేశాన్ని వదిపోవాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సైనికులను చుట్టుముట్టారు. ముందుకు వెళ్లడానికి వీలు లేదు.. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ రష్యా ఆర్మీ వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. దీంతో రష్యన్ సైనికులు స్థానికులను భయపెట్టేందుకు గాల్లో గట్టిగా కాల్పుల కూడా జరిపారు. కానీ ఉక్రెనియన్ వాసులు ఏ మాత్రం భయపడకుండా కాల్పుల జరుపుతున్న సైనికుడిని తిడుతూ.. అతని మీదకి గుంపుగా నినాదాలు చేస్తూ వెళ్లారు. దీంతో రష్యాన్ సైనికులు చేసేదేమీ లేక వెంటనే అక్కడున్న వాహనం ఎక్కితిరిగి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In #Energodar, unarmed people are ready to do anything to defend their land They are not even frightened by gunfire. pic.twitter.com/ZOlIoSvg77 — NEXTA (@nexta_tv) March 20, 2022 (చదవండి: ఉక్రెయిన్: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు మాతృభూమి కోసం సై అంటోంది మరి!) -
ఉక్రెయిన్ వార్: తండ్రిని కోల్పోయినా నిందించని గొప్పగుణం
Russian Invasion Girl Lost Her Father and Arm: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న రోజుల తరబడి పోరులో వేలాదిమంది ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు మరణిస్తున్నారు. లక్షలాదిమంది ఉక్రెయిన్‌ని విడిచి వలస వెళ్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఉక్రెయిన్ వాసులు.. మిలటరీలో చేరి తమ దేశాన్ని కాపాడుకుంటామంటూ ముందుకువచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులనే భేదం లేకుండా తమ భూభాగంలో జరుగుతున్న పోరులో పాల్గొనేందుకు ఉత్సుకతను కనబర్చారు. అంతేకాదు ఉక్రెయిన్‌వాసుల దేశభక్తి స్ఫూర్తి ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటుంది. ఇందంతా ఒక ఎత్తు అయితే రష్యా దాడిలో సాషా అనే 9 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటమే కాక తండ్రిని కోల్పోయింది. అయినా ఇదంతా అనుకోకుండా జరిగిందని చెప్పిందే తప్ప రష్యన్లు ఒక మాట కూడా అనలేదు. ఆ దాడిలో ఆమె చేతికి ఒక బుల్లెట్ దిగింది. ఆ చిన్నారి కుటుంబం హాస్టమెల్ నుంచి బయలుదేరుతున్నప్పుడూ రష్యన్ దళాల కాల్పుల్లో చిక్కుకుంది. ఆ కాల్పుల్లో చిన్నారి తండ్రి అక్కడకక్కడే మరణించాడు. దీంతో చిన్నారి తల్లి, సోదరి సెల్లార్లోకి పారిపోతుండగా.. ఆ చిన్నారి ఎడమ చేతికి బుల్లెట్ దిగింది. దీంతో ఉక్రెయిన్ సైన్యం వారిని రక్షించి ఆ చిన్నారిని ఆసుపత్రిలో జాయిన్ చేసింది. అయితే వైద్యుల శస్త్ర చికిత్సలో భాగంగా ఆమె చేతిని తొలగించాల్సి వచ్చింది. కానీ ఆ చిన్నారి మాత్రం రష్యా దళలు మాపై కావాలని దాడి చేశారని అనుకోవడం లేదని చెప్పింది. పైగా ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పిందే తప్ప రష్యా బలగాలను నిందించలేదు. ఉక్రెయిన్ వాసుల మనసు చాలా విశాలమైనది అని నిరూపించింది. (చదవండి: విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి.. వీడియో వైరల్) -
యుద్ధకాంక్షలో దిగజారిపోతున్న రష్యా.. పిల్లలనే కనికరం లేకుండా!
Mariupol theatre sheltering children bombed: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నానాటికీ మరింత వికృతంగా మారిపోతుంది. మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నిరవధిక దాడిలో ఉక్రెయిన్‌ని నేలమట్టం చేసే దిశగా రష్యా ఘోరంగా దాడి చేస్తోంది. అందులో భాగంగా ఆసుపత్రులు, నిరాశ్రయులై మానవతా కారిడార్ సాయంతో ఆశ్రయం పొందుతన్న స్థావరాలను సైతం విడిచిపెట్టకుండా భయంకరమైన దాడులకు దిగుతోంది అంతేకాదు చిన్నారుల ఆశ్రయం పొందుతున్న మారియుపోల్ థియేటర్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ డ్రామా థియేటర్లో సుమారు వెయ్యి మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారని మారియుపోల్ స్థానిక కౌన్సిల్ పేర్కొంది. అభంశుభం తెలియని చిన్నారులని కనికరం లేకుండా అత్యంత క్రూరమైన దాడులకు దిగుతున్న రష్యాని తాము ఎప్పటికి క్షమించమని స్థానిక కౌన్సిల్ ఆవేదనగా వెల్లడించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్‌లోని థియేటర్‌పై రష్యా దళాలు శక్తివంతమైన బాంబులతో దాడి చేసినట్లు పేర్కొంది. అంతేకాదు ఆ భవనం శిథిలాల కింద దాదాపు వెయ్యి మంది వరకు చిక్కుకుని ఉండవచ్చునని తెలిపింది. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదంటూ ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించింది. దీంతో మీడియా అవుట్లెట్ నెక్స్టా ట్విట్టర్లో రష్యా దళాలచే బాంబు దాడికి ముందు డ్రామా థియేటర్ లోపల దృశ్యాలను చూపుతున్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భవనంలో చాలా మంది పిల్లలు కూర్చుని ఉన్నారు. మారియుపోల్‌లో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా పౌరులు మరణించినట్లు వెల్లడించింది. అదీగాక నగరంలో 13 రోజులుగా విద్యుత్, గ్యాస్ లేదా తాగు నీరు లేవు దీనికి తోడు రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతున్నాయని తెలిపింది. అంతేగాక రష్యా ఎందుకు మారియుపోల్నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందంటే మారియుపోల్ అజోవ్ సముద్రంలోని అతి ముఖ్యమైన ఉక్రెనియన్ ఓడరేవు మాత్రమే గాక ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే గనుక రష్యా చాలా కాలంగా కలలు కంటున్న క్రిమియాకు ల్యాండ్ కారిడార్ లభిస్తుందని మీడియా అవుట్లెట్ నెక్స్టా ట్విట్టర్ పేర్కొంది. ‼️This is all that remains of the Drama Theater in #Mariupol According to local media, up to 1,000 people could have been inside the building. All of them are now under the rubble of the building. The exact number of casualties is still unknown. pic.twitter.com/4L3D8lt39E — NEXTA (@nexta_tv) March 16, 2022 (చదవండి: మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన) -
యుద్ధానికి రష్యా గుడ్ బై చెప్పనుందా?.. అదే కారణమా?
Russia Forced To Stop War Due To Lck of Resource: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధాల కొరత ఏర్పడనుందా?, రష్యాకు యుద్ధం చేసే సామర్ధ్యం తగ్గిపోయిందా? అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. ఎలాగైనా ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న రష్యా.. అంత త్వరగా యుద్ధాన్ని ముగిస్తుందని ప్రస్తుతం ఎవరూ అనుకోకపోయినా, ఏమైనా బలమైన కారణాలు ఉంటే మాత్రం యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి రష్యాకు తప్పదనే విశ్లేషణలు కూడా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఐరోపా మాజీ యూఎస్ కమాండిగ్ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ స్పష్టం చేశాడు. ఈ మేరకు రష్యాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడు. రష్యన్లు త్వరలోనే వనరుల కొరత కారణంగా ఉక్రెయిన్ పై దాడిని ఆపే స్థితికి చేరుకోనుందని వెల్లడించారు. అంతేగాదు రష్యా బలగాలకు వనరుల కొరత తీవ్రంగా ఏర్పడునుందని నిపుణులు కూడా చెబుతున్నారని అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ మాట్లాడుతూ.. రష్యన్లు యావోరివ్లోని కర్ట్ వోల్కర్ శిక్షణా కేంద్రమైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాజీ రాయబారిని వెంబడించడమే కాక ఉక్రెయిన్‌కి పోలాండ్ నుంచి యుద్ధ సామాగ్రిని తరలించే సరిహద్దుల వద్ద రష్యన్లు గస్తీ కాసారని అన్నారు. అయితే నాటో భూభాగాలకు సమీపంలో జరిగిన దాడిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు. పైగా రష్యన్లు వనరుల కొరత కారణంగా దాడిని ఆపాల్సిన పరాకాష్టకు చేరుకున్నారని స్పష్టం చేశారు. రష్యాలో సుమారు 10 రోజుల్లో మానవ శక్తి, మందుగుండు సామాగ్రి కొరత ఏర్పడనుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు గానూ మాస్కోను శిక్షించేందుకు 27 దేశాల కూటమి కొత్త ఆంక్షలను ఆమోదించినట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. అంతేగాక ఈయూ ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఫ్రాన్స్, కూటమి "మా అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించి, ఉక్రెయిన్‌పై దురాక్రమణలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని, అలాగే రష్యన్ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలకు సంబంధించిన ప్యాకేజీని ఆమోదించింది" అని తెలిపింది". మొత్తంగా ఈయూ నియంత్రణ చర్యలు ఇప్పుడు సుమారు 862 మంది వ్యక్తలకు, 53 సంస్థలకు వర్తించనున్నాయి. (చదవండి: యుద్ధం వేళ ఆ మాత్రలకు ఎందుకంత డిమాండ్?) -
తల్లి మందుల కోసం వచ్చి...రష్యన్ దళాల దాడిలో హతం
Ukrainian woman ventured To find medicines: ఉక్రెయిన్ పై దురాక్రమణ చేసే క్రమంలో రష్యా రోజుకో రకమైన యుద్ధ వ్యూహాంతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంది. గత 18 రోజులుగా ఉక్రెయిన్ పై నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. యుద్ధోన్మాదంతో అమాయాక పౌరులను, మహిళలు, చిన్నారులను పొట్టన పెట్టకుంది. రోజులు గడుస్తున్న కొద్ది యుద్ధం తీవ్రతరం మవుతుందే గానీ ఆగే సూచనలు ఏ మాత్రం కనిపించడంలేదు. ఆ క్రమంలో ఒక ప్రముఖ వైద్యురాలు అనారోగ్యంగా ఉన్న తన తల్లి కోసం బయటకు రావడమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్)తో కలసి పనిచేసిన ప్రముఖ వైద్యురాలు వలేరియా మక్సేట్స్కా. నిజానికి 31 ఏళ్ల మక్సేట్స్కా ఆమె ఈ యుద్ధం మొదలైనప్పుడే వెళ్లిపోవాలి కానీ ఈ యుద్ధ సమయంలో గాయపడుతున్న వారికి సాయం చేసేందుకు ఆమె ఉండిపోయారు. ఎప్పుడైతే యుద్ధ తీవ్రతరమై ఆసుపత్రిలపై కూడా దాడి చేయడం మొదలైందో అప్పుడే తన తల్లి చికిత్స నిమిత్తం ఆమె దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. రష్యా బలగాలు ఆమె డోనెట్స్క్లోని షెల్లింగ్ పై దాడి చేసినప్పుడూ ఆమె తప్పించుకుని ఉక్రెయిన్ రాజధాని కైవకి వచ్చింది. కానీ ఇక్కడ ఆమె తప్పించుకోలేకపోయింది. 2014లో క్రిమియన్ ద్వీపకల్పంపై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఆమె మానవతావాద ప్రతిస్పందనలో భాగంగా పనిచేశారని యూఎస్ఎయిడ్ అడ్మినిస్ట్రేటర్ సమంతా పవర్ అన్నారు. ఆమె తన తల్లి మందుల కోసం డ్రైవర్ తీసుకుని తల్లితో సహా కైవ్ సమీపంలోని వచ్చనిప్పుడు రష్యాన్ యుద్ధ ట్యాంకుల దాడిలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దాడిలో మక్సేట్స్కా, ఆమె తల్లి, డ్రైవర్ అక్కడికక్కడే మరణించారని తెలిపారు. (చదవండి: రష్యా రాక్షస విధ్వంసం..చిన్నారులు, మహిళల పై కాల్పుల మోత) -
రష్యా రాక్షస విధ్వంసం..చిన్నారులు, మహిళల పై కాల్పుల మోత
Russian Forces Desroy Seven Civilians: ఉక్రెయిన్ రష్యా మధ్య గత 18 రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు రష్యా ప్రపంచ దేశాల విజ్ఞప్తి మేరకు మానవతా సాయం దృష్ట్యా నివాసితులను, విదేశీయులను తరలించేంత వరకు యద్దానికి విరమణ ప్రకటించింది. తొలుత రష్యా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించలేదు కూడా. రాను రాను మరింత విజృంభించింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో విద్యార్థులను, విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేంత వరకు యుద్ధానికి బ్రేక్ అంటూ తన జౌదార్యం అనే ముసుగు వేసుకుంది. కానీ ఆ తర్వాత రష్యా తన తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. అంతేకాదు రష్యా ఉక్రెయిన్ దురాక్రమణలో భాగంగా అనేక దుశ్చర్యలకు పాల్పడింది. నివాసితుల గృహాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. ఇక అంతటి ఆగకుండా ఇప్పుడు మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా వారిపై కర్కశంగా దాడులు చేస్తుంది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కి సుమారు 36 కి.మీ దూరంలో ఉన్న పెరెమోగా అనే చిన్న గ్రామంలోని ప్రజలను తరలిస్తున్న శరణార్థుల కాన్వాయ్ పై రష్యా బహిరంగంగా కాల్పుల జరిపింది. పైగా ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారని, వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తెలిపింది. నిజానికి పెరెమెగా అంటే ఉక్రెనియల్లో విజయం అని అర్థం. రష్యన్ యుద్ధ ట్యాంకులు ఈ గ్రామం మీదుకు రాజధాని కైవ్ వైపుకు దూసుకుపోతున్నాయి. ఆ క్రమంలోనే రష్యా ఈ క్రూరమైన చర్యలకు పాల్పడిందని పేర్కొంది. మిగిలిన నిర్వాసిత ప్రజలను బలవంతంగా తమ గ్రామానికి తిరిగి తీసుకువచ్చిందిని, పైగా ఎంతమంది ఈ ఘటనలో గాయపడ్డారో కూడా తెలియలేదని వెల్లడించింది. ప్రస్తుతం తాము వారి గురించి తెలుసుకోవడం, మానవతాసాయం అందించడం వంటివి దాదాపు అసాధ్యం అని ఆవేదనగా తెలిపింది.అంతేకాదు అమాయక పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోని రష్యా యుద్ధ నేరానికి పాల్పడిందని ఆక్రోశించింది. (చదవండి: రష్యాను మరింత రెచ్చగొడుతున్న జెలెన్స్కీ!) -
పీక్ స్టేజ్‌కు రష్యా వార్.. కాలిపోతున్న ఇళ్లలో ఉక్రేనియన్ల ఆర్తనాదాలు
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. భీకర దాడులతో రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేసేందుకు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం సైతం దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ పౌరులు తమ దేశానికి మద్దతు తెలుపుతూ వినూత్న పోరాటం చేస్తున్నారు. దూసుకువస్తున్న రష్యా బలగాలపై దాడి కోసం డ్రోన్ ద్వారా మొటటోవ్ కాక్టేల్ బాంబులను వదులుతున్నారు. బీరు బాటిళ్లలో నింపిన పెట్రోల్, ఇతర పదార్థాలకు నిప్పు అంటించిన తర్వాత వాటిని రష్యా ట్రూప్స్ టార్గెట్‌గా బ్లాస్ట్ చేస్తున్నారు. మరోవైపు రష్యా బలగాలు కీవ్‌ను ముట్టడించే ప్రయత్నంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. బాంబు దాడులతో విరుచుకుపడటంతో కీవ్‌కు సమీపంలో ఉన్న గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో స్థానికులు నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఖర్కీవ్ రీజియన్‌లో ఉన్న యాట్స్కోవా గ్రామంలో బాంబు దాడులు జరగడంతో ఇళ్లు కాలిపోయి మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా రష్యా బలగాల దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై బుల్లెట్ల వర్షం కురిసింది. దీంతో అంబులెన్స్ పూర్తిగా దెబ్బతిన్నది. The village of Yatskovka in the #Kharkiv region now looks like this. pic.twitter.com/LBS5wC8SvQ — NEXTA (@nexta_tv) March 12, 2022 -
ఉక్రెయిన్ నుంచి రష్య దళాలు వైదొలగేలా తీర్మానం!
Demanding Moscow Withdraws Its Troops: యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొగాలని డిమాండ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతవారం నుంచి ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్న రష్యా పై ప్రపంచదేశాల నుంచి తీవ్రమైన ఆగ్రహం వెల్లువెత్తుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్థం గురించి చర్చించేందుకు సుమారు 100కు పైగా దేశాలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మాస్కో తన దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరరూ దౌత్యవేత్తలచే ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్షలా సాగుతున్న నిరుకుశ ప్రభుత్వాలను సరైన మార్గంలో పెట్టేలా ఈ తీర్మానం ఉంటుందని యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం పేర్కొంది. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమన్ పుతిన్‌కి కనువిప్పు కలిగించేలా శక్తివంతమైన మందలింపు చర్యగా అభివర్ణించింది. అయితే ఈ తీర్మానం ఆమెదించాలంటే రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందాలి. అంతేకాదు భద్రతామండలిలో ఈ తీర్మానాన్ని సమర్పించక మునుపే రష్యా వీటో చేసే అవకాశం లేదు. అంతేకాదు ఈ తీర్మానానికి 193 మంది సభ్యులతో కూడిన బలమైన సంస్థల అత్యధిక మెజార్టీ మద్దతు ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉంచాలనే పుతిన్ నిర్ణయాన్ని యూఎన్ తీవ్రంగా ఖండించింది. ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఏమి లాభం ఉండదని చైనా కూడా నొక్కి చెబుతోంది. గతవారం రష్యాని కట్టడి చేసే దిశగా పశ్చిమ దేశాలు పలు కఠిన ఆంక్షలు విధించాయి. స్విఫ్ట్ నుంచి డిస్కనెక్టం చేయడం వంటి వాటిని సైతం రష్యా లక్ష్య పెట్టక పోగా ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు అడ్డుకట్టే వేసేందుకు ప్రపంచ దేశాలన్ని ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఓటింగ్ నిర్వహించే యోచన చేస్తోంది. -
అమెరికా వర్సెస్ రష్యా: కమ్ముకొంటున్న యుద్ధమేఘాలు!
వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రష్యా మొండి వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఉక్రెయిన్‌కు అండగా నేరుగా రంగంలోకి దిగుతోంది. పరిస్థితి చెయ్యి దాటితే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా అమెరికా సైన్యాన్ని యూరప్‌నకు తరలించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. నార్త్ కరోలినాలోని ఫోర్ట్‌బ్రాగ్ నుంచి 2,000 మంది సైనికులను పోలాండ్, జర్మనీకి తరలించాలని అధ్యక్షుడు జో బైడెన్ రక్షణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే జర్మనీలోని విల్సెక్లో ఉన్న 1,000 మందికి పైగా జవాన్లను రొమేనియా తరలించాలని చెప్పారు. వారం రోజుల్లోగా బలగాల తరలింపు పూర్తయ్యే అవకాశం ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో భాగస్వామి అయిన రొమేనియా రష్యాకు సమీపంలోనే ఉంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడితే వెంటనే ప్రతిదాడి చేసేలా తమ సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలన్నదే బైడెన్ ఆలోచన అని పెంటగాన్ వర్గాలు గురువారం వెల్లడించాయి. తమ సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు పంపించడం లేదని వైట్‌హౌజ్ మీడియా కార్యదర్శి జెన్‌సాకీ చెప్పారు. 2014లో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పటి నుంచి యూరప్ దేశాల్లో తన సైనిక బలగాల సంఖ్యను అమెరికా పెంచుకుంటూనే ఉంది. బోరిస్ జాన్సన్‌కు పుతిన్ ఫోన్ రష్యా సమీపంలోని యూరప్ దేశాలకు అమెరికా సైన్యాన్ని తరలించాలన్న జో బైడెన్ ఆదేశాల పట్ల రష్యా తీవ్రంగా స్పందించింది. అది విధ్వంసకర చర్య అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లభించలేదని సమాచారం. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది సైనికులను రష్యా మోహరించడం పట్ల బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దూకుడును తప్పుపట్టారు. అమెరికా అనాలోచిత చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయని రష్యా సీనియర్ అధికారులు ఒకరు వ్యాఖ్యానించారు. సైనికపరంగా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రయత్నాలను అమెరికా మానుకోవాలని రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఉపమంత్రి అలెగ్జాండర్ గ్రుస్కో సూచించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా నుంచి పోలాండ్‌కు సైన్యాన్ని తరలించాలన్న బైడెన్ నిర్ణయం పట్ల పోలాండ్ రక్షణ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మిత్ర దేశానికి అండగా... ఉక్రెయిన్‌కు బాసటగా పలు యూరప్ దేశాలు ముందుకొస్తున్నాయి. రొమేనియాకు సైన్యాన్ని పంపాలని ఫ్రాన్స్ సైతం నిర్ణయించింది. డెన్మార్క్ఇప్పటికే ఎఫ్–16 యుద్ధ విమానాలను లిథ్వేనియాకు తరలించింది. స్పెయిన్ 4 ఫైటర్ జెట్లను బల్గేరియాకు, 3 నౌకలను నల్ల సముద్రానికి పంపించింది. ఇక నెదర్లాండ్స్ సైతం 2 ఎఫ్–35 యుద్ధ విమానాలను బల్గేరియాకు తరలించేందుకు సన్నద్ధమవుతోంది. బెలారస్లో రష్యా సైన్యం, ఆయుధాలు ఉక్రెయిన్ చుట్టుపక్కల రష్యా సైనిక బలగాల కదలికల పట్ల ‘నాటో’ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. బెలారస్‌లోనూ కొన్ని రోజులుగా రష్యా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని, ఆయుధాలను మోహరిస్తోందని చెప్పారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా ఈ స్థాయిలో మరోదేశంలో తమ సైన్యాన్ని దింపడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. బెలారస్లో ప్రస్తుతం 30 వేల మంది రష్యా సైనికులు ఉన్నారని, అత్యాధునిక ఫైటర్ జెట్లు, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్, నేల నుంచి గాల్లోకి ప్రయోగించే ఎస్–400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని తెలిపారు. యూఎస్ యుద్ధ విమానంలో ఆయుధ సామాగ్రి -
మరోసారి చైనా దుస్సాహసం, తిప్పి కొట్టిన సైనికులు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మరోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.లడాఖ్‌లో భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న వివాదం ఇంకా సమపిపోక ముందే చైనా దళాలు మరో దుస్సాహసానికి పూనుకున్నాయి. హద్దు మీరి చొరబాటుకు ప్రయత్నించడంతో వారిని భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. సిక్కిం సెక్టార్‌లోని నాథూ లా సమీపంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి) మూడు రోజుల క్రితం ఈ ఉదంతం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) సైనికులకు భారతీయ జవాన్లు సరియైన రీతిలో బుద్ధి చెప్పారు. ఈ ఘర్షణలో ఇరువైపులా సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై భారత సైన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఉత్తర సిక్కింలోని నాకూలాలో చైనా సైనికులు ఇండియాలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన ఘటన గతవారం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో 20 మంది గాయపడినట్టు సమాచారం. గాయనపడిన వారిలో నలుగురు భారత జవాన్లు కూడా ఉన్నారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తూర్పు లడాఖ్‌లో చైనా దుశ్చర్య కారణంగా జూన్ 2020 లో, గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ ప్రతిష్టంభను తొలగింపునకు సంబంధించి భారత్, చైనా మధ్య ఈ రోజు (జనవరి,25) తొమ్మిదో రౌండ్ సైనిక చర్చలను నిర్వహించనున్నాయి. Troops of India and China involved in a physical brawl along the Line of Actual Control (LAC) last week near Naku La area in Sikkim. Soldiers from both sides are injured. More details awaited: Sources pic.twitter.com/Sff5eVDP1K — ANI (@ANI) January 25, 2021 -
మీ బలగాలను ఉపసంహరించుకోవాల్సిందే..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. ఇరు దేశాల మధ్య శుక్రవారం కమాండర్ స్థాయి అధికారుల చర్చలు జరిగాయి. సైనికుల ఉపసంహరణపై రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలోని చుషూల్‌లో ఉదయం 9.30 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 7 గంటలకు ముగిశాయి. సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న చర్చల పరంపరలో ఇవి ఎనిమిదో దఫా చర్చలు కావడం విశేషం. ఎనిమిదో దఫా చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్లు అధికారులు తెలిపారు. యుద్ధావకాశాలు తోసిపుచ్చలేం: రావత్ తూర్పులద్దాఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడుతోందని, అయితే భారత్ బలగాలు దాన్ని దీటుగా ఎదుర్కోవడంతో ఊహించని ఎదురుదెబ్బలు డ్రాగన్ దేశానికి తప్పడంలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని, యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన వెల్లడించారు. చైనా, పాకిస్తాన్ కుమ్మౖక్కై ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతు న్నాయని, ఇది భారత ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదంగా పరిణమించిందని తెలిపారు. -
‘సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఆదుకోగలరు’
కరోనా ఆడిన వింత ‘నాటకం’లో రంగస్థలం మూగబోయింది.. కోవిడ్–19 పోషించే విలన్ పాత్రకు ఎదురునిలవలేక కళాకారులంతా చిగురుటాకుల్లా వణుకుతున్నారు.. మహమ్మారి ధాటికి నిజ జీవిత పాత్రలుసైతం అర్ధంతరంగా ముగిసిపోతున్న తరుణంలో.. ఏం చేయాలో తెలియని ‘స్టేజి’లో కొట్టుమిట్టాడుతున్నారు.. వైద్యులు.. పోలీసులు వంటివారి ‘హీరో’చిత పోరాటం నెగ్గితేనే.. కళతప్పిన జీవితాల్లోకి మళ్లీ వెలుగులొస్తాయి.. ఈ యుద్ధంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు.. శానిటైజర్లు.. సామాజిక దూరం వంటి ఆయుధాలు ధరిస్తేనే.. కరోనాను అంతమొందించి ‘విశ్వ’విజేతలవుతాం.. అంతవరకూ రంగస్థలానికి ‘విశ్రాంతి’ తప్పేలా లేదు. సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళలకు పుట్టిల్లు వంటి జిల్లాలో నేడు కళారంగం వెలవెలబోతోంది. ఉత్సవాలు లేక, పరిషత్‌లు జరగక కళాకారులు, కళాభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసిన కరోనా మహమ్మారి కళారంగాన్ని కూడా తిరోగమన బాట పట్టించింది. గతంలో సమాచార సాంకేతిక విప్లవ ప్రభావంతో కళారంగం కొంత తత్తరపాటుకు గురికాగా ప్రభుత్వాలతో పాటు కళాకారులు, కళాపోషకులు ఈ రంగాన్ని పూర్వ వైభవం వైపు నడిపే దిశగా చర్యలు తీసుకున్నారు. దీనితో ఇప్పుడిప్పుడే నేటి యువతలో కళారంగంపై మక్కువ పెరగడం, కొంతమంది యువకులు సైతం రంగం వైపు ఆకర్షితులు కావడంతో ఈ రంగానికి పూర్వ వైభవం వస్తోంది అనుకునే లోపు మరో పెద్ద కుదుపు కరోనా రూపంలో రావడం దురదృష్టకరమని కళాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన పరిషత్‌లు, పోటీలు కళలపై సమాజ దృక్ఫథాన్ని మార్చే క్రమంలో వివిధ సంస్థలు కళారంగాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాయి. దీని కోసం పరిషత్‌లు, పోటీలు ఏర్పాటు చేసి ఈ రంగాన్ని సజీవంగా నిలపడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. దీనితో కళాకారులకు కూడా ఆదరాభిమానాలు దండిగానే అందేవి. జిల్లాలో ఏటా పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు ఏకపాత్రాభినయ పోటీలు ఎక్కడో ఒక చోట జరుగుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణం చందంగా ఉండేది. జిల్లాలోని ఏలూరులో హేలాపురి కల్చరల్ అసోసియేషన్, గరికపాటి ఆర్ట్స్ కళా పరిషత్, వైఎంహెచ్ఏ హాలు పరిషత్, భీమవరంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటిక పరిషత్, కళారంజని నాటక పరిషత్, పాలకొల్లులో పాలకొల్లు కళా పరిషత్, వీరవాసరం కళా పరిషత్, తోలేరు సుబ్రహ్మణ్య కళా పరిషత్, రాయకుదురు శ్రీ కృష్ణదేవరాయ నాటక కళా పరిషత్, కొంతేరు యూత్‌క్లబ్ కళా పరిషత్, తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాపరిషత్ తదితర సంస్థలు పోటీలు నిర్వహిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అలాగే నృత్య రంగానికి సంబంధించి ఏలూరు నగరంలోని అభినయ నృత్య భారతి వంటి సంస్థలు వివిధ శాస్త్రీయ నృత్య రీతుల్లో పోటీలు నిర్వహిస్తూ నృత్య రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు నిర్వహించే పోటీలు కరోనా కాలంలో రద్దు కాగా మరికొన్ని నిర్వహించే అవకాశం ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాయి. దీనితో పాటు గతంలో శ్రీరామనవమి, ఉగాది వేడుకలు నిస్సారంగా జరిగిపోగా త్వరలో వచ్చే వినాయక చవితి, దసరా ఉత్సవాల్లోనైనా అవకాశాలు అందివస్తాయని భావించిన కళాకారులకు కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా ఉత్సవాలను కూడా రద్దు చేసే అవకాశం ఉండడంతో ఉత్సవ కమిటీలు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ విధంగా ఆయా ఉత్సవాలు కూడా వారిని నిరుత్సాహానికి గురిచేశాయి. కళారంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు జిల్లాలో కళారంగంపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, హరికథలు, బుర్ర కథలు వంటి కళలు ప్రదర్శించే కళాకారులతో పాటు వాటికి అనుబంధంగా మేకప్, సంగీతం, రంగాలంకరణ, సౌండ్ సిస్టమ్, మైక్ అండ్ లైటింగ్, దుస్తులు అద్దెకిచ్చే వారు ఇలా అనేక వర్గాలు ఉపాధి పొందుతున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా కళారంగానికి అనుబంధంగా ఉపాధి పొందుతున్న అన్ని కుటుంబాలూ పూర్తిగా తమ ఆదాయ వనరులను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయాయి. పింఛన్ల మంజూరుతో కొద్దిగా ఊరట ఇదిలా ఉండగా ఐదు నెలలుగా పింఛన్లు లేక గోరుచుట్టపై రోకలిపోటు చందంగా ఇబ్బంది పడుతున్న వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఒకే సారి ఐదు నెలల బకాయి పింఛన్లు విడుదల చేయడంతో కొంత ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ఇది కేవలం వృద్ధ కళాకారులకు మాత్రమే రావడంతో 60 ఏళ్లలోపు వయసు కలిగిన కళాకారులు మాత్రం ఇప్పటికీ ఆకలిదప్పులతో అలమటిస్తూనే ఉన్నారు. సకల కళాకారుల సంఘం, మరికొన్ని కళా సంస్థలు, కొంతమంది దాతలు కళాకారులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు వంటివి పంపిణీ చేసినా అది తాత్కాలిక ఊరటగానే చెప్పుకోవాలి. కరోనా విలయ తాండవం నేపథ్యంలో కళాకారులను ఆదుకోవడానికి మరింత మంది కళాపోషకులు ముందుకు వస్తారనే ఆశతో కళాకారులు ఎదురు చూస్తున్నారు. ఆదాయం ఉన్నా లేకపోయినా ఆత్మగౌరవంతో జీవిస్తున్న వారి కుటుంబాలు పస్తులుంటున్న నేపథ్యంలో అభిమానాన్ని చంపుకుని కూలి పనులకు వెళ్లేందుకూ కొంతమంది కళాకారులు వెనుకడుగు వేయడం లేదు. అయితే వారికి పని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ దుర్బర పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారిని పలువురు దాతలు ఆదుకుంటున్నట్లుగానే కళాకారులను, కళారంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవాలని కొన్ని కళా సంస్థలు పిలుపునిచ్చాయి. దానిపై దాతలు స్పందించాల్సి ఉంది. సీఎం జగన్ మాత్రమే ఆదుకోగలరు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 లక్షల కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కేవలం కళను నమ్ముకునే జీవిస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు ఏడాది చివరి వరకూ ప్రదర్శనలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే మా కళాకారుల కుటుంబాలను ఆదుకోగలరు. –విజయ కుమార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రధారి కరోనా వైరస్ కళాకారులకు మైనస్ కరోనా వైరస్ కళాకారులను మైనస్‌లో పడేసింది. 55 ఏళ్ల వయసు కలిగిన నేను చిన్నప్పటి నుంచి రంగస్థలాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. తొలుత భజనలు, అనంతరం నాటకాల్లో పాత్రలు, సంగీతం, హార్మోనియం వంటి కళలు నేర్చుకుని బుర్రకథ కళాకారుడుగా స్థిరపడ్డాను. 45 ఏళ్లకు పైగా కళారంగంలో ఉంటున్న నేను ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. –యడవల్లి సుబ్బరాజు, బుర్రకథ కళాకారుడు ఆస్తులు లేవు, ఇతర పనులు చేతకాదు నా వయస్సు 46 సంవత్సరాలు. గత 30 ఏళ్లుగా హార్మోనిస్టుగా నాటక రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. పెద్దలు సంపాదించిన ఆస్తులు లేవు. వేరే ఏ పనీ చేతకాదు. ప్రదర్శనలు లేక ఆదాయం పోయింది. పెన్షన్‌కు సరిపడే వయసూ రాలేదు. అన్ని రంగాలనూ ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ కళాకారులకు కూడా ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలి. –యడవల్లి రమణ, హార్మోనిస్టు -
అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంట బలగాల ఉపసంహరణకు భారత్-చైనా ఇరు దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ అంశంపై చైనా మాటమారుస్తోంది. ఈ క్రమంలో ఎంతో ముఖ్యమైన పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కీలకమైన పాయింట్ల నుంచి ఇంతవరకు ఎలాంటి ఉపసంహరణ జరగలేదని విశ్వసనీయ సమాచారం. పాంగాంగ్త్సో ప్రాంతంలో పూర్తిగా ప్రతిష్టంభన ఏర్పడగా.. గోగ్రా పోస్ట్ ప్రాంతంలో ఉపసంహరణ తాజాగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా ఉందంటున్నారు అధికారులు. ఇదిలా ఉండగా చైనా కీలకంగా భావించిన హాట్‌స్ర్పింగ్ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ ఈ రోజు మొదలైనట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ ప్రాంతంలో చైనా అదనంగా 40 వేల మంది సైనికులను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. (వెనక్కి తగ్గిన చైనా) భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కొన్ని పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది. (చైనాపై ‘విసర్జికల్ స్ట్రైక్’) -
చైనా వక్ర బుద్ధి.. సరిహద్దుల్లో 40 వేల సైన్యం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్ కమాండర్ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సైనిక ఉపసంహరణ గురించి చర్చలు జరిగాయి. కానీ చైనా వీటిని ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. తాజాగా చైనా ఎల్ఏసీ వెంబడి 40 వేల మంది సైనికులను మోహరించింది. డ్రాగన్ దేశం చర్యలను చూస్తే.. ఉద్రిక్తతలను తగ్గించే ఆలోచన ఏమాత్రం లేనట్లు అర్థమవుతుంది అంటున్నారు అధికారులు. వాయు రక్షణ వ్యవస్థలు, సాయుధ సిబ్బంది, సుదూర ఫిరంగిదళాలు వంటి భారీ ఆయుధాల మద్దతు ఉన్న దాదాపు 40,000 మంది సైనికులను మోహరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.(బెదిరించైనా బహిష్కరించైనా గెలవగలమా?) గత వారం జరిగిన రెండు కార్ప్స్ కమాండర్ల మధ్య చివరి రౌండ్ చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదని అధికారులు భావిస్తున్నారు. ఎల్ఏసీ వెంబడి పరిస్థితుల్లో ఎలాంటి పురోగతి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలానే చైనా ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెళ్లడానికి సిద్దంగా లేదు. అంతేకాక ఇక్కడ ఒక పరిశీలన పోస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అందువల్ల చైనా తన శాశ్వత స్థానం సిర్జాప్‌కు వెళ్లడానికి సిద్ధంగా లేదు. అంతేకాక తూర్పు లద్దాఖ్‌లోని రెండు ప్రధాన ఉద్రిక్త ప్రాంతాలైన హాట్ స్ప్రింగర్స్, గోర్జా పోస్ట్ ప్రాంతాల్లో చైనా భారీ మొత్తంలో నిర్మాణాలు చేస్తోంది. ఈ రెండు ప్రాంతాల నుంచి తాము వెనక్కి వెళ్తే భారత్ సరిహద్దు వెంబడి తమ ప్రాంతాలను ఆక్రమించే అవకాశం ఉందనే సాకును ముందు పెడుతుంది చైనా. -
లద్దాఖ్‌లో పారాట్రూపర్ల విన్యాసాలు
లద్దాఖ్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించారు. భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు పర్యటన చేపట్టారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా ఉన్నారు. రాజ్‌నాథ్ పర్యటన సందర్భంగా భారతీయ పారాట్రూపర్లు లద్దాఖ్‌లోని గగనతలంలో సైనిక విన్యాసాలు చేశారు. ఆక్సిజన్ మాస్కులు ధరించిన పారాట్రూపర్లు అమెరికన్ సీ130జే సూపర్ హెర్క్యులస్ విమానంలో నుంచి ఒకరి వెంట మరొకరు దూకుతూ శక్తిసామర్థ్యాలను చాటుకున్నారు. (‘ఏ శక్తి అంగుళం భూమిని కూడా తీసుకోలేదు’) వీటిని వీక్షించిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. "భారత్ ప్రపంచానికి శాంతి సందేశాన్నిచ్చే ఏకైక దేశం భారత్. మేము ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు. ఏ దేశం భూమి కూడా మాదేనని గొడవకు దిగలేదు. వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే విషయాన్ని భారత్ ఎప్పుడూ విశ్వసిస్తుంది" అని పేర్కొన్నారు. కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం శ్రీనగర్‌లో పర్యటిస్తారు. నియంత్రణ రేఖ, శ్రీనగర్ లోయలో నెలకొన్న పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. (లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణశాఖ మంత్రి) -
‘అంతా బాగుంటే.. 38 వేల మంది ఎందుకు’
కశ్మీర్: నరేంద్ర మోదీ ప్రభుత్వం 38 వేల మంది అదనపు దళాలను జమ్మూకశ్మీర్‌కు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. 10 వేల మంది, 28 వేల మంది వారిగా రెండు బ్యాచులుగా బలగాలను కశ్మీర్ లోయలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. కశ్మీర్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కశ్మీర్ లోయలో శాంతి భద్రతలు మెరగు పడ్డాయని స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘2018తో పోలిస్తే.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు మెరుగు పడ్డాయి. ఉగ్ర చొరబాట్లు 43శాతం, ఉగ్రవాద సంఘటనలు 28 శాతం తగ్గాయి. భద్రతా దళాలు ప్రారంభించిన చర్యలు 59శాతం పెరగడంతో.. ఉగ్రవాదుల చర్యలను తటస్థీకరించడంలో మంచి అభివృద్ధి సాధించాం’ అంటూ కిషన్ రెడ్డి గత నెల 24న రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. భద్రతా దళాల కృషి వల్ల ఇప్పటి వరకూ 126 మంది ఉగ్రవాదులను అంతమోందించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా కశ్మీర్‌కు 38 వేల మంది దళాలను పంపాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు.. ‘కశ్మీర్లో ఉగ్రకార్యకలపాలు తగ్గాయి.. శాంతి భద్రతలు మెరుగుపడ్డాయంటూనే.. ఇంత భారీ ఎత్తున దళాలను ఎందుకు మోహరిస్తున్నారు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే రానున్న శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పాక్, కశ్మీర్లో భారీ ఎత్తున చొరబాట్లను ప్రోత్సాహిస్తూ.. లోయలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నింస్తుందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర భారీ ఎత్తున దళాలను కశ్మీర్లో మోహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతే కాక ఈ ఏడాదిలో కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. -
జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం
కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను జమ్మూకశ్మీర్‌కు పంపాలని కేంద్రం నిర్ణయించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను పంపనున్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనికులను విమానాల్లో జమ్మూ కశ్మీర్‌కు తరలించనున్నట్లు సమాచారం. కశ్మీర్ లోయలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల జమ్మూ కశ్మీర్లో పర్యటించి అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఆయన కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకే కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమర్నాథ్ యాత్రను విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 40 వేల అదనపు బలగాలను జమ్మూ కశ్మీర్‌కు పంపింది. అంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి తరలివెళ్లాయి. లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకే అదనపు బలగాలను పంపుతున్నట్టు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. భయబ్రాంతులకు గురిచేస్తున్నారు జమ్మూకశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను తరలించడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రజలకు భయబ్రాంతులకు గురి చేసేందుకే అదనపు బలగాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్లో శాంతి భద్రతలకు లోటు లేదని, అయినప్పటికీ బలగాలను తరలించి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సమస్యలు ఉన్నాయని, వాటిని బలగాలతో పరిష్కరించలేరన్నారు. అదనపు బలగాల తరలింపుపై కేంద్రం మరోసారి పురరాలోచించాల్సిన అవరసరం ఉందన్నారు. కాగా జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. Centre’s decision to deploy additional 10,000 troops to the valley has created fear psychosis amongst people. There is no dearth of security forces in Kashmir. J&K is a political problem which won’t be solved by military means. GOI needs to rethink & overhaul its policy. — Mehbooba Mufti (@MehboobaMufti) July 27, 2019 -
మోసగాళ్లు వచ్చేశారు..
► మహారాష్ట్ర నుంచి దళారుల రంగప్రవేశం ► అనుమతి లేని బీటీ–3 రకం పత్తి విత్తనాల విక్రయాలు ► కలుపు మందులు అవసరం లేదంటూ ప్రచారం ► ఒక్కో ప్యాకెట్ ధర రూ.1,600 ► మోసపోవద్దంటున్న వ్యవసాయశాఖ అధికారులు భూపాలపల్లి: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతన్నకు మోసగాళ్ల బెడద మొదలైంది. అమాయక రైతులే లక్ష్యంగా కొందరు అనుమతి లేని పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యక్తులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ బోల్‌గార్డ్(బీటీ) 3 విత్తనాలను విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలను నాటితే కలుపు మందులు అవసరం లేదంటూ ప్రచారం చేస్తూ రైతులను ముంచేందుకు యత్నిస్తున్నారు. బీటీ–2కే అనుమతి గత ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాల మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన కొందరు జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, కాటారం, మహదేవ్పూర్ మండలాలతో పాటు ములుగు డివిజన్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో బీటీ–2 రకం పత్తి విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. కాగా అనుమతి లేని బీటీ–3 విత్తనాలు మేలైనవని దళారులు రైతులను నమ్మబలుకుతున్నారు. ఈ విత్తనాలు నాటితే కలుపు మందులు కొట్టాల్సిన అవసరం లేదని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన బీటీ –2 పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.800 వరకు ఉండగా దళారులు నకిలీ విత్తనాలను రూ.1,200 నుంచి రూ.1,600 వరకు వి క్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. విత్తన ప్యాకెట్ల విక్రయాల కోసం దళారులు కమీషన్ పద్ధతిన స్థానికులను కొందరిని నియమించుకుని ఈ దందా సాగిస్తున్నట్లు తెలిసింది. లైసెన్స్ లేకుండానే.. బీటీ 3 పేరిట విత్తనాలు విక్రయించే వారితో పాటు మరికొందరు గ్రామాల్లో తిరుగుతూ ఇతర రకాల నకిలీ విత్తనాలు వి క్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్టిలైజర్, విత్తన విక్రయ దుకా ణాలు ఏర్పాటు చేసుకోకుండా, లైసెన్సులు పొందకుండా విత్తన విక్రయాలు జరుపుతున్నారు. పలువురు దళారులు తెల్ల సంచుల్లో విత్తనాలను విక్రయిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు విక్రయించే వారు రైతులకు రశీదులు ఇవ్వడం లేదు. కనీసం దుకాణాల అడ్రస్ కూడా సరిగా తెలియజేయడం లేదని తెలిసింది. లైసెన్స్ లేని వారి వద్ద, ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు కొనుగోలు చేయడం మూలంగా విత్తనం మొలకెత్తకపోయినా, పంట దిగుబడి రా కున్నా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మా దృష్టికి వచ్చింది.. భూపాలపల్లి డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు బీటీ–3 పేరిట పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. బీటీ–3కి ప్రభుత్వం అనుమతి లేదు. అలాంటి విత్తనాలను రైతులు కొనుగోలు చేసి మోసపోవద్దు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదు, విత్తన ప్యాకెట్ కవర్‌ను పంట దిగుబడి వచ్చే వరకు దాచి ఉంచాలి. బీటీ–3 విత్తనాలు విక్రయించే వారి సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటాం. – సత్యంబాబు, ఏడీఏ, భూపాలపల్లి -
గొర్రెల పథకంలో బోగస్ లీలలు
► లోకల్ పేరిట నగరవాసులకు అవకాశం ► తీగలగుట్టపల్లిలో ప్రజాప్రతినిధి అండతో అక్రమాలు ► స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి.. కరీంనగర్‌రూరల్: గొల్ల,కుర్మల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకంలో కొ ం దరు దళారులు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమాలకు తెరలేపారు. లోకల్ పేరిట నగరవా సులకు సంఘంలో సభ్యత్వం కల్పించి సబ్సిడీని కొట్టేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొందరు సభ్యులు పశుసంవర్ధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బోగస్ సభ్యుల బాగోతం వెలుగుచూసింది. స్థానికేతరులపై ఫిర్యాదు కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లిలో గొర్రెల కాపరుల ప్రాథమిక సహకార సంఘం లేకపోవడంతో అధి కారులు కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 69మంది గొల్ల, కుర్మలతో కలిసి సంఘాన్ని ప్రారంభిం చారు. ఈనెల 19న సబ్సిడీ గొర్రెల యూనిట్ల మంజూ రుకు గ్రామసభ నిర్వహించారు. 61మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 31మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అయితే స్థానికంగా ఉన్న కొందరి కి మొదటి విడతలో అవకాశం రాకపోవడంతో సంఘం లోని బోగస్ సభ్యులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరవాసులకు సభ్యత్వం! కరీంనగర్‌లోని గొల్ల, కుర్మలకు సబ్సిడీ గొర్రెల పథకంలో ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. శి వారు గ్రామమైన తీగలగుట్టపల్లి లో కొత్తగా గొర్రెలకాపరుల సం ఘాన్ని ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో నగరానికి చెందిన కొందరు యాదవులు సభ్యత్వం కోసం దళారులను ఆశ్రయించారు. స్థానిక ప్రజాప్రతినిధిని మచ్చిక చేసుకున్న వారు నగరవాసులకు తీగలగుట్టపల్లిలో ఉంటున్నట్లు లోకల్ సర్టిఫికెట్‌ను ఇప్పించి సభ్యత్వం కల్పించా రు. కిసాన్‌నగర్, శివాజీనగర్‌కు చెందిన దాదాపు పది హేనుమంది సభ్యత్వం పొందగా వీరిలో ఓ ప్రభుత్వ ఉ ద్యోగి భార్య సైతం ఉండటం గమనార్హం. అంతేకా కు ండా తీగలగుట్టపల్లికి చేరువలో ఉండడంతో జిల్లాలో ని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు జీవనోపాధికో సం వలస వచ్చారు. గొల్ల, కుర్మలు కానప్పటికీ స్థానిక ప్ర జాప్రతినిధి చొరవతో సభ్యత్వం పొందినట్లు తెలుస్తోంది. జాబితా ఖరారులో జాప్యం ! మండలంలోని అన్ని గ్రామాల లబ్ధిదారుల జాబితాను తయారు చేసిన అధికారులు తీగలగుట్టపల్లిలోని సంఘం సభ్యులపై ఫిర్యాదులు రావడంతో లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయలేదని తెలుస్తోంది. నగరవాసులతోపాటు వలసవాదులకు సభ్యత్వం కల్పించడంతో స్థానికులకు అన్యాయం జరిగిందని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల వివరాలపై సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఇరాక్ కు సహాయంగా అమెరికా దళాలు..
అమెరికాః ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడంలో ఇరాక్ కు సహకరించేందుకు అమెరికా మరింత ముందుకొచ్చింది. ఇరాక్ లో ఉగ్రవాదుల అధీనంలోకి వెళ్ళిన మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాక్ దళాలకు సహాయం అందించేందుకు మరో అడుగు వేసింది. ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ ని విడిపించేందుకు, ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాకీ దళాలకు సహాయంగా 560 అమెరికా దళాలను పంపింస్తున్నట్లు అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్ వెల్లడించారు. మతం పేరుతో మారణహోమం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాడేందకు అమెరికా తనవంతు కృషి చేస్తోంది. ఇరాక్ లో ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ దళాలకు మద్దతుగా దాదాపు 560 అమెరికా సైనిక దళాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అమెరికా ముందుంటుందని, ఇరాకీ సైనిక దళాలకు అమెరికా సైన్యం తగినంత సహకారం అందిస్తుందని అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్.. తన అప్రకటిత బాగ్దాద్ పర్యటనలో భాగంగా తెలిపారు. కార్టర్ తన పర్యటనలో అమెరికా కమాండర్లు, ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ, రక్షణ మంత్రి ఖలీద్ అల్ ఒబైదీ లను కలుసుకున్నారు. మరోవైపు కొత్తగా పంపిస్తున్న వారిలో ఇంజనీర్లు, లాజిస్టిక్స్ మరియు ఇతర సిబ్బంది కూడ ఉన్నట్లు కార్టర్ తెలిపారు. వారంతా మాసూల్ కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న కయారా ఎయిర్ బేస్ అభివృద్ధికి సైతం సహాయం అందిస్తాయన్నారు. -
'జవాన్లూ.. సోషల్ మీడియాతో జాగ్రత్త'
చండీగఢ్: ఆర్మీ జవాన్లు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని.. ఫేస్బుక్, ఇతర వెబ్సైట్లలో పోర్న్ వీడియోలు, చిత్రాలు చూడొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ యువతి హనీట్రాప్ చేసి.. భద్రతా సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో జవాన్లు చేయకూడని పది పనులను పేర్కొంటూ ఆర్మీ అధికారులు ఓ జాబితాను విడుదల చేశారు. దీనిలో.. ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోర్న్ చిత్రాలు చూడరాదు. యూనిఫామ్ ధరించిన ఫొటోను వాట్సప్, ఫేస్బుక్ వంటి వాటిల్లో ప్రొఫైల్ ఫొటోగా పెట్టరాదు. లాటరీలు, ప్రైజులు తగిలాయంటూ వచ్చిన మెసేజ్‌లను ఓపెన్ చేయరాదు. వ్యక్తిగత సమాచారం, హోదా లాంటి విషయాలను సోషల్ మీడియాలో ఉంచొద్దు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులను అనుమతించొద్దు. జవాన్ల కుటుంబ సభ్యులు సైతం వృత్తిని తెలిపే వివరాలను పోస్ట్ చేయరాదు. వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో మిలటరీకి సంబంధించిన సమాచారం ఉంచొద్దు. ఇలాంటి సూచనలు ఉన్నాయి. -
చైనాపై నిఘాకు 100 డ్రోన్లు!
వాషింగ్టన్: భారత్ కు అప్పుడప్పుడ తలనొప్పిగా మారుతున్న చైనా దుశ్చర్యల నుంచి బయటపడేందుకు భారత్ ఆలోచన చేస్తుంది. చైనా సైన్యం చేస్తున్న ఆగడాలను, సరిహద్దుల్లో చేస్తున్న నిర్వాహకాలను ఎప్పటికప్పుడు పసిగట్టి, అవసరం అయితే, గట్టి హెచ్చరికలు కూడా చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా నుంచి అత్యాధునిక మానవ రహిత విమానాలైన డ్రోన్ లను కొనుగోలుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలోని రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలను డ్రోన్ల కోసం వెచ్చించనున్నట్లు సమాచారం. ఆయుధ సహిత డ్రోన్లతోపాటు కేవలం నిఘాకు మాత్రమే ఉపయోగించే 100 డ్రోన్లను కొనుగోలుచేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. సమావేశాలు, సదస్సుల సమయంలో భారత్ కు అనుకూలంగానే ఉన్నట్లు కనిపించే చైనా అప్పుడప్పుడు మాత్రం సరిహద్దుల్లో చెలరేగిపోతూ ఉంటుంది. కవ్వింపు చర్యలకు దిగుతుంటుంది. భారత్ సరిహద్దులోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా అప్పుడప్పుడు భారత్ మిలటరీ క్యాంపులపై దాడులు చేసే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ చైనా సరిహద్దులో భారీ మొత్తంలో డ్రోన్లను భారత్ ఉపయోగించాలనుకుంటున్నట్లు సమాచారం. వీటితోపాటు ప్రిడేటర్ ఎక్స్ పీ డ్రోన్లను కూడా కొనుగోలు చేసి దేశ అంతర్గత భద్రతకు ఉపయోగించనుంది. ఇవి ఉగ్రవాదుల దాడుల వ్యూహాలను ముందే పసిగట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ కొనుగోళ్లకు సంబంధించి అమెరికా అధికారులతో చర్చలు కూడా ఇప్పటికే ప్రారంభం అయినట్లు సమాచారం. -
జపాన్ సేనలు దిగుతున్నాయ్..!
టోక్యో: తమ దేశ సముద్రతలాన్ని రక్షించుకునేందుకు జపాన్ సర్వత్రా సిద్ధమవుతోంది. చైనాతో వివాదం ఉన్న ఇషిగోకి ఐలాండ్‌లో తమ దేశానికి 500 మంది సైన్యాన్ని రంగంలోకి దించనుంది. ఈ సైన్యం ఆ ప్రాంతంలో గస్తీ దళంగా మారనుంది. 2019నాటికి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో తమ ప్రభావం ఉంటుందని జపాన్ రక్షణ వర్గాలు తెలిపాయి. సముద్రభాగం విషయంలో ఇప్పటికే చైనా జపాన్ ల మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే. దీంతో చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు జపాన్ ఇప్పటికే అక్కడి సముద్ర తలం క్షిపణి ప్రయోగాలు చేయడంతోపాటు సైనికపాటవాలు కూడా నిర్వహిస్తూ ఎలాంటి దాడినైనా, ఎవ్వరినైనా ఎదుర్కొంటాంమని పరోక్షంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి తమ సైన్యాన్ని అక్కడ దించాలనుకోవడం చైనాకు మింగుడుపడుతుందో లేదో. ఎందుకంటే ఇషిగోకి చాలా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. -
ఓం వరుణాయ నమః
సందర్భం వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి వరుణుడి కరుణే కారణం. భగవంతుడు చేసే సృష్టిని నిశితంగా వీక్షిస్తాడు వరుణుడు. న్యాయానికీ, నిజాయితీకి ఈయన మూల స్తంభం. పడమటి దిక్కుకు అధిపతి. నాగులు ఈయన సేనలు. ఈయనకు దక్షిణాన యముడు, ఉత్తరాన కుబేరుడు ఉంటారు. ఈయన వాహనం మొసలి. అలాగే వరుణుడికి ఒక పక్క వాయవ్యం, ఒకపక్క నైఋతి మూలలు ఉంటాయి. వరుణుడు... కోపం, దయ రెండురకాల స్వభావాలను ప్రదర్శించగలడు. ఆకాశంలో బంగారు భవంతిలో కూర్చుని... పాముతో తయారయిన ‘ఉచ్చు’ లేదా ‘పాశం’ ధరించి దర్శనమిస్తాడో దేవుడు. ఆయనే వరుణుడు. వేదకాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. అంతేకాక పాతాళానికి, న్యాయానికి, స్వర్గానికి, పృథివికి కూడా అధిదేవతగా పూజించారు. సూర్యుని లక్షణాలన్నీ వరుణుడిలో ఉన్నాయి. వరుణుడు ఆదిత్యులకు అధిపతిగా ఉన్నాడు. అయినప్పటికీ సూర్యుడితో విభేదించి రాత్రితో స్నేహం చేశాడు. సృష్టిని అభివృద్ధి చేసే అంశాలు వరుణుడిలో అధికం. న్యాయాధిపతి, శాంతికాముకుడు వరుణుడు ఆకాశరాజు, ఆకాశంలో ఉన్న చీకటి అనే సగ భాగానికి, మహాసముద్రాలకు అంటే రసాతలానికి అధిపతి. మిత్రుడు (సూర్యుడు) ఋతానికి అంటే న్యాయానికి, ధర్మానికి సర్వాధికారి. వరుణుడు, మిత్రుడు ఇద్దరూ... ప్రమాణాలతో కూడిన సాంఘిక కార్యకలాపాలకు దేవతలు. అందుకే వీరిద్దరినీ కలిపి ‘మిత్రా - వరుణ’ అన్నారు. ఋగ్వేదం వరుణుడిని ఇంద్రుడితో కలిపి చెబుతూ, ఇంద్రా - వరుణ (ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రపంచంలో శాంతిభద్రతలను చేకూరుస్తారు) అని వర్ణించింది. నీటిలో మునిగిపోయినవారిని సంరక్షించి, వారికి అమరత్వాన్ని ప్రసాదించేవానిగా వరుణుడు పూజలందుకున్నాడు. సర్వజ్ఞుడు, సర్వాధికారి తప్పు పనులు చేసేవారిని వరుణుడు ‘వల’ వేసి పట్టుకుంటాడని, ఆకాశంలో ఉండే నక్షత్రాలు వరుణుడికి ఉండే వెయ్యి కళ్లనీ, వీటి సహాయంతో వరుణుడు నిరంతరం మనుషుల ప్రతి కదలికను రహస్యంగా గమనిస్తూ ఉంటాడని వేదాలు చెబుతున్నాయి. సోముడు ఇంద్రుడికి అతి దగ్గర వాడు అయినప్పటికీ వరుణుడు తనకున్న సర్వజ్ఞత కారణంగా సర్వాధికారి అయ్యాడు. ద్విజులు సాయంసంధ్యలో చేసే సంధ్యావందనంలో వరుణుడిని ఉద్దేశించి, తాము చేసిన తప్పులను క్షమించమని కోరుకుంటారు. వానలు కురిపించమని ప్రజలందరూ యాగాలు, ప్రార్థనలు చేస్తారు. రాముడు- వరుణుడు సముద్రాన్ని దాటి లంకను చేరడం కోసం రాముడు మూడు రోజులపాటు వరుణుడిని కఠోరదీక్షతో ధ్యానం చేశాడు. వరుణుడు కనికరించకపోవడంతో, నాలుగవరోజు బాణం సంధించాడు రాముడు. వెంటనే వరుణుడు ప్రత్యక్షమై రాముడికి నమస్కరించి, బ్రహ్మాస్త్రాన్ని సముద్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగించవద్దని, సముద్రగర్భంలో ఉన్న రాక్షసశక్తులను సంహరించడానికి ఉపయోగించమని ప్రార్థించాడు. వరుణుడి ప్రార్థనను మన్నించాడు రాముడు. ప్రతిగా రామదండు సముద్రాన్ని దాటడానికి వీలుగా నిశ్చ లంగా ఉంటానని వరుణుడు ప్రమాణం చేశాడు. సంతాన, ఆయుష్కారకుడిగా... హరిశ్చంద్రుడు సంతానప్రాప్తి కోసం ఏం చేయాలో చెప్పమని వశిష్ఠుని అర్థించాడు. వరుణుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహిస్తాడని సూచించాడు వశిష్ఠుడు. హరిశ్చంద్రుడు వరుణుడిని ప్రార్థించగా, ఆయన ప్రత్యక్షమై, ‘‘నువ్వు వరుణయాగం చేసి, నీకు జన్మించిన పిల్లవాడిని బలి ఇస్తానని మాట ఇస్తే సంతానం ప్రసాదిస్తాను’’ అన్నాడు. సత్యవాక్కును పరీక్షించడమే వరుణుడి ఉద్దేశం. హరిశ్చంద్రుడు అంగీకరించాడు. హరిశ్చంద్రుడి భార్య శైబ్యకు రోహితుడు జన్మించాడు. అర్ధాయుష్కుడిగా పుట్టిన ఆ పిల్లవాడు విశ్వామిత్రుడి సలహా మేరకు వరుణ మంత్రం జపించాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించిన వరుణుడు ఆ పిల్లవాడికి పూర్ణాయుష్షు ప్రసాదించాడు. అందుకే వరుణ మంత్రం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయని చెబుతారు. వరుణుడి కరుణ ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. - రోహిణి వరుణుడు - యురేనస్ జార్జెస్ డుమెజిల్ అనే శాస్త్రవేత్త భారతీయ వరుణుడికి, గ్రీకు యురేనస్‌కి ఉన్న పోలికలు వివరించాడు. రెండు పేర్లను పరిశీలిస్తే ఉరేనస్, వరుణ అనే ఉచ్చారణ ఒకేలా కనిపిస్తుంది. రెండింటికీ మూలం అయిన ఉరు అనే పదానికి కట్టుబడి ఉండటం అని అర్థం. యురేనస్ చీకటిగా ఉండే ఆకాశంతో ముడిపడి ఉంటాడు. యురేనస్ అంటే ఆకా శం అని అర్థం. వరుణుడు ఆకాశానికి, పాలసముద్రానికి కూడా అధిదేవత. లక్షీ్ష్మదేవి ఇందులో నుంచే పుట్టిందని భాగవతం చెబుతోంది. అందువల్ల ఈయన లక్ష్మీదేవికి తండ్రి అని గ్రీకు పురాణాలు చెబుతున్నాయి. -
'ఇరాక్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం మాకు లేదు'
వాషింగ్టన్: ఇస్లామిక్ మిలటెంట్లపై పోరాడేందుకు తమ దళాలు ఇరాక్ తిరిగి వెళ్లబోవని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అయితే అవసరమైన పక్షంలో నిర్దిష్ట లక్ష్యంతో కూడిన స్పష్టమైన సైనిక చర్య చేపడతామని ఇరాక్‌కు హామీ ఇచ్చారు. ఇరాకీ ప్రజలు, దేశాన్ని, అదే సమయంలో అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తోన్న ఉగ్రవాదులపై పోరాటానికి సహాయం చేస్తామని ఒబామా శుక్రవారం నాడిక్కడ విలేకరులకు చెప్పారు. గతంలో మాదిరిగా వేలాది మంది సైనికులను ఇరాక్‌కు పంపి సమస్యను అంత సులువుగా పరిష్కరించగలిగే సామర్థ్యం తమకు లేదని గురువారం నాడు ఆయన అన్నారు. ఇదే ఇరాక్ పరిష్కరించుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న భద్రతా ఒప్పందం మేరకు తమకు సహాయం చేయూలని, మిలటెంట్లపై వైమానిక దాడులు నిర్వహించాలని అమెరికాకు ఇరాక్ విజ్ఞప్తి చేసింది.