యుద్ధానికి కేంద్రంగా ఉన్న తూర్ప ఉక్రెనియన్ నగరమైన బఖ్ముత్‌ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం రష్యా బలగాలు ప్రకటించాయి. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దళాలకు, ప్రైవేట్ కిరాయి బృందం వాగ్నర్‌ను అభినందించారు. ఒకప్పుడూ దాదాపు 70 వేల మంది జనాభా కలిగిన ఉప్పు గనుల పట్టణం బఖ్ముత్ ఉక్రెయిన్‌పై ఏడాదిగా సాగిస్తున్న రష్యా సుదీర్ఘ పోరాటంలో రక్తపాత యుద్ధానికి వేదికగా మారింది.
పలు అవమానకరమైన పరాజయాల తదనంతరం రష్యా బలగాలు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధంలో పెద్ద ఎదురుదాడి వస్తుందని, డాన్‌బాస్‌లోని మరిన్ని భూభాగాలను మాస్కో దళాలు స్వాధీనం చేసుకుంటాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముందుగానే ఊహించారు.
బఖ్ముత్ పతనం అనంతర మాస్కో, ఉక్రెయిన్ ఇరు దేశాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇదిలా ఉండగా, వాగ్నర్ అటాల్ట్ యూనిట్ల ప్రమాదకర చర్యల ఫలితంగా ఫిరంగిదళం, సదరన్ యూనిట్ విమానయాన మద్దతుతో ఆరన్టెమోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వాగ్నెర్ బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ టెలిగ్రామ్ పోస్ట్‌లో తన కిరాయి సైనికుల దాడికి బఖ్ముత్ నగరం హస్తగత మవ్వడంతో పలువురు యోధులు రష్యా జెండాలను ఎగరువేశారని పేర్కొన్నాడు. మే 20 మధ్యాహ్న సమయంలో బఖ్ముత్ పూర్తిగా హస్తగతమయ్యిందని ఆర్మీ అధికారి ప్రిగ్రోజిన్ చెప్పారు. అలాగే మే 25 నాటికల్లా తాము స్వయంగా ఫ్టీల్డ్ క్యాంపుల్లోకి వెళ్లి బఖ్ముత్‌ని పరిశీలించి అవసరమైన రక్షణ మార్గాలను అందించడం తోపాటు మిలటరీ సాయం కూడా అందజేస్తామని తెలిపారు. కాగా, జపాన్ వేదికగా జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో జెలెన్స్కీ ఆదివారం సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు బఖ్ముత్‌ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించడం గమనార్హం.
(చదవండి: సమ్మిళిత ఆహార వ్యవస్థ)
Comments
Please login to add a commentAdd a comment