congratulate
-
ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు వైఎస్ జగన్ అభినందనలు
-
గుకేశ్... శభాష్...
న్యూఢిల్లీ: పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు పలువురు గుకేశ్ విజయాన్ని కొనియాడారు. అతిపిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు. నిన్ను చూసి యావత్ జాతి గర్వపడుతోంది. ప్రపంచ చెస్‌లో భారత్ కూడా ప్రచండ శక్తి అని నీ విజయం చాటింది. భారతీయులందరి తరఫున నీకు శుభాకాంక్షలు. భవిష్యత్తులోనూ నీవు ఇలాగే రాణించాలి. –రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఅభినందనలు గుకేశ్. కెరీర్ తొలినాళ్లలోనే సంచలన విజయం సాధించావు. ఆటలో నీ ప్రతిభ, చేసిన కఠోర కృషి, కనబరిచిన అంకితభావం అసాధారణం. ఈ విజయం భారత చెస్ పుటల్లో కేవలం నీ పేరును లిఖించడమే కాదు... కలల్ని సాకారం చేసుకోవాలనుకునే లక్షల మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్‌లో మరెన్నో ఘనతలు, ఘనవిజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. –ప్రధాని నరేంద్ర మోదీప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన గుకేశ్‌కు శుభాభినందనలు. నీవు సాధించిన టైటిల్ చెస్కే గర్వకారణం. భారత్ ఉప్పొంగిపోయే విజయం నీది. వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా) గరి్వంచే క్షణాలివి. మాజీ చాంపియన్ అయిన నాకూ ప్రత్యేక క్షణాలను మిగిల్చావు. ప్రతి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మెరుగ్గా ఆడినా... నీవు ఎదుర్కొన్న తీరు మాత్రం అద్భుతం. –విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ మాజీ చాంపియన్ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించిన గుకేశ్‌కు కంగ్రాట్స్. ఒత్తిడిని జయించిన తీరు... ప్రతీ రౌండ్లోనూ కనబరిచిన నీ ఆటతీరుకు హ్యాట్సాఫ్! నీ దృఢ సంకల్పంతో యావత్ దేశాన్ని గర్వించేలా చేశావ్. నీవు సాధించింది ఓ టైటిల్ మాత్రమే కాదు... యువతరం ప్రేరణ పొందే విజయగాథ నీది. ఇంకెన్నో విజయాలు, మరెన్నో సాఫల్యాలు నీ ముందుంటాయి. –బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ‘గుకేశ్... 64 గడుల్లో హద్దులెరుగని అవకాశాల్ని సృష్టించావు. ఆనంద్ అడుగు జాడల్లో భారత కొత్త చెస్ కెరటంగా అవతరించావు. –సచిన్ టెండూల్కర్మా ఆటలో మరో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. గుకేశ్... కంగ్రాట్స్. –ప్రపంచ చెస్ సమాఖ్య -
ఆదిత్య ఎల్-1 సక్సెస్‌పై సీఎం జగన్ హర్షం
సాక్షి, గుంటూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిపై చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించి.. ఆ వెంటనే సూర్యుడి మీద ప్రయోగంలో తొలి అడుగు వేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లారంటూ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారాయన. ఇదిలా ఉంటే.. సూర్యుడిపై పరిశోధనలకు గానూ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ఏపీలోని శ్రీహరికోట షార్ నుంచి ఇస్రో తన రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎల్-1 పాయింట్‌కు చేరుకున్నాక.. ఐదేళ్లపాటు సూర్యుడిపై పరిశోధనలు కొనసాగిస్తుంది. -
ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్ అభినందనల వెల్లువ
యుద్ధానికి కేంద్రంగా ఉన్న తూర్ప ఉక్రెనియన్ నగరమైన బఖ్ముత్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం రష్యా బలగాలు ప్రకటించాయి. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దళాలకు, ప్రైవేట్ కిరాయి బృందం వాగ్నర్‌ను అభినందించారు. ఒకప్పుడూ దాదాపు 70 వేల మంది జనాభా కలిగిన ఉప్పు గనుల పట్టణం బఖ్ముత్ ఉక్రెయిన్‌పై ఏడాదిగా సాగిస్తున్న రష్యా సుదీర్ఘ పోరాటంలో రక్తపాత యుద్ధానికి వేదికగా మారింది. పలు అవమానకరమైన పరాజయాల తదనంతరం రష్యా బలగాలు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధంలో పెద్ద ఎదురుదాడి వస్తుందని, డాన్‌బాస్‌లోని మరిన్ని భూభాగాలను మాస్కో దళాలు స్వాధీనం చేసుకుంటాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముందుగానే ఊహించారు. బఖ్ముత్ పతనం అనంతర మాస్కో, ఉక్రెయిన్ ఇరు దేశాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇదిలా ఉండగా, వాగ్నర్ అటాల్ట్ యూనిట్ల ప్రమాదకర చర్యల ఫలితంగా ఫిరంగిదళం, సదరన్ యూనిట్ విమానయాన మద్దతుతో ఆరన్టెమోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాగ్నెర్ బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ టెలిగ్రామ్ పోస్ట్‌లో తన కిరాయి సైనికుల దాడికి బఖ్ముత్ నగరం హస్తగత మవ్వడంతో పలువురు యోధులు రష్యా జెండాలను ఎగరువేశారని పేర్కొన్నాడు. మే 20 మధ్యాహ్న సమయంలో బఖ్ముత్ పూర్తిగా హస్తగతమయ్యిందని ఆర్మీ అధికారి ప్రిగ్రోజిన్ చెప్పారు. అలాగే మే 25 నాటికల్లా తాము స్వయంగా ఫ్టీల్డ్ క్యాంపుల్లోకి వెళ్లి బఖ్ముత్ని పరిశీలించి అవసరమైన రక్షణ మార్గాలను అందించడం తోపాటు మిలటరీ సాయం కూడా అందజేస్తామని తెలిపారు. కాగా, జపాన్ వేదికగా జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో జెలెన్స్కీ ఆదివారం సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు బఖ్ముత్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించడం గమనార్హం. (చదవండి: సమ్మిళిత ఆహార వ్యవస్థ) -
పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పద్మ అవార్డు గ్రహీతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విశేష ప్రతిభతో అవార్డులు గెలుచుకోవడం గర్వించదగిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 91 మందికి పద్మశ్రీ, 9 మందికి పద్మభూషణ్, ఆరుగురికి పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ఏడుగురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. చదవండి: (‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి) -
RRR చిత్ర బృందానికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు
-
హిమప్రియకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గెలుచుకున్న గురుగు హిమప్రియను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పొన్నం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక 2018 ఫిబ్రవరిలో జమ్మూలో జరిగిన ఉగ్రదాడిలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిందని, ఇది రాబోయే రోజుల్లో చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం అన్నారు. చదవండి: (జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్) -
ఓ మంచి వైరస్‌ను పట్టేశారు: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Congratulate Leena Nair: ఓవైపు కరోనా వేరియెంట్ల విజృంభణ కొనసాగుతుండగా.. మరోవైపు వరుసబెట్టి టాప్ కంపెనీల సీఈవోలు బాధ్యతల నుంచి వైదొలుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో వర్చువల్ స్పేస్‌కు భవిష్యత్తు ఉండడం, ట్యాక్స్ చెల్లింపుల నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే వాళ్లంతా వీడుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా భారతీయురాలు లీనా నాయర్ బాధ్యతలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదే విషయంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. ‘మొత్తానికి సిలికాన్ వ్యాలీలో మాత్రమే కాదు.. ప్యారిస్ గల్లీలో కూడా భారతీయ సీఈవో అనే మంచి వైరస్‌ను పట్టేశారు. శెభాష్ లీనా.. మమ్మల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేయండి’ అంటూ లీనా నాయర్‌ను అభినందిస్తూనే ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. So it’s not just Silicon Valley but also Fashion Alley that’s catching the ‘good virus’ of Indian CEOs. Bravo Leena! Keep making us proud. https://t.co/CN54EtMdVs — anand mahindra (@anandmahindra) December 17, 2021 లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్(52) ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా నాయర్ ప్రస్తుతం యూనిలీవర్ సంస్థలో చీఫ్ హుమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన యూనిలీవర్ గ్రూపులో ఈ స్థాయికి చేరుకున్న మొదటి భారతీయురాలు మాత్రమే కాదు.. ఆసియన్ మహిళ కూడా లీనా నాయర్ కావడం భారత్‌కు గర్వకారణం. ఇక ఇంతకు ముందు పరాగ్ ట్విటర్ సీఈవోగా ఎంపికైన సమయంలో ఐరీష్ బిలియనీర్, స్ట్రైప్ కో ఫౌండర్ ప్యాట్రిక్ కొలిసన్ చేసిన సెటైరిక్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘ఇది మరో రకమైన ప్యాండెమిక్. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్ సీఈవో వైరస్. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు’ అంటూ దీటుగా ఆనంద్ మహీంద్రా బదులిచ్చిన విషయం తెలిసిందే. లీనా నాయర్ నేపథ్యం.. ఆసక్తికర విషయాలు -
తొమ్మిదేళ్ల సర్వేశ్‌ని అభినందించిన సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: ప్రపంచంలోని పరిస్థితులు, మార్పు, సాధించాల్సిన లక్ష్యాలను వివరిస్తూ తొమ్మిదేళ్ల బాలుడి కన్యాకుమారి నుంచి చెన్నైకు నడక పయనం పూర్తి చేశాడు. ఆ బాలుడ్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం అభినందించారు. చెన్నై తాంబరం సమీపంలోని సాయిరాం పాఠశాలలో ఐదో తరగతి చదువుకుంటున్న సర్వేశ్(9) ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ కన్యాకుమారి నుంచి చెన్నైకు అవగాహన యాత్ర చేయాలని నిర్ణయించాడు. ఆ మేరకు గాంధీ జయంతి రోజు(అక్టోబరు 2)న కన్యాకుమారి లోని గాంధీ మండపం వద్ద తన నడక పయనాన్ని చేపట్టాడు. 750 కి.మీ దూరం 14 రోజుల పాటుగా నడిచాడు. శుక్రవారం సాయంత్రం చెన్నై శివారులోని వండలూరుకు చేరుకున్న ఈ బాలుడ్ని సహచర విద్యార్థులు ఆహ్వానించారు. శనివారం ఉదయం వళ్లువర్‌కోట్టంలో తన పయనాన్ని ఆ బాలుడు ముగించాడు. చదవండి: (ఆరవ తరగతి విద్యార్థినికి సీఎం స్టాలిన్ ఫోన్ కాల్) ఈ సందర్భంగా ఆ బాలుడ్ని సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఎం సుబ్రమణియన్‌తో పాటుగా, తాంబరం ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజా అభినందించారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం సీఎం స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పేదలకు రూ. 2 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అందజేశారు. -
జపాన్ కొత్త ప్రధాని కీలక ప్రకటన
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడాను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు సోమవారం ఎన్నుకున్నారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే వారంలో పార్లమెంటు దిగువ సభను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 31న ఎన్నికలకు వెళతామని చెప్పారు. కిషిడా గతంలో ఆయన దౌత్యవేత్తగా పని చేశారు. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం, చైనా–ఉత్తరకొరియాలను ఎదుర్కోవడం, రానున్న జాతీయ ఎన్నికలు వంటి అంశాలపై ఆయన తీవ్రంగా కృషి చేయాల్సి ఉంది. ఈ అంశాలపై సరిగ్గా పని చేయలేకపోయారన్న కారణాలతోనే మాజీ ప్రధాని యోషిహిడే సుగా రాజీనామా చేయాల్సి వచ్చింది. చదవండి: (మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయం) అన్ని చక్కదిద్దుతాను.. పదవిని చేపట్టాక తన మొదటి ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడమేనని గతంలో వ్యాఖ్యానించిన ప్రధాని ఫుమియో కిషిడా, కరోనాను ఎదుర్కోవడానికి భారీ ఆర్థిక ప్యాకేజ్ అవసరమని చెప్పారు. అందుకు స్పష్టమైన ప్రజా తీర్పు అవసరమని, ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనాపై తమ పోరు కొనసాగుతుందని, జీ–20, కాప్–26 వాతావరణ సదస్సులకు వ్యక్తిగతంగా హాజరై వాటిని ఆమోదింపజేస్తానని అన్నారు. సుగా కేబినెట్లో మొత్తం 20 మంత్రులు ఉండగా, కిషిడా కేబినెట్లో 13 మంది మాత్రమే ఉన్నారు. సుగా కేబినెట్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే తాజా కిషిడా కేబినెట్లో కూడా ఉన్నారు. 13 మంది కేబినెట్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అమెరికా, బ్రిటన్లతో పాటు ఆసియా,యూరోప్‌లలోని పలు ప్రజాస్వామ్య దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచాలన్నది కిషిడా ఆలోచన. చదవండి: (ఆ ఒక్క కారణంతో కోవిడ్ పరిహారాన్ని ఆపొద్దు) మోదీ శుభాకాంక్షలు.. జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలసి పని చేసేందుకు వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్‌కు షర్మిల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఈమేరకు ఆమె తన ట్విట్టర్ ఖా తాలో ట్వీట్‌చేశారు. ‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్‌వేవ్ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామని షర్మిల అన్నారు. -
దటీజ్ మంత్రి పేర్ని నాని!
మచిలీపట్నం: సమస్య అంటూ తన దృష్టికి వస్తే చాలు, వెంటనే పరిష్కారం చూపించటంలో రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తన మార్కును చూపిస్తారనేది నానుడి. ‘జగనన్న విద్యాకానుక’ పంపిణీకి సన్నద్ధం చేసే క్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలల ప్రధానోపధ్యాయులతో మంగళవారం సమావేశమయ్యారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలపై మాటా–మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో ఖాలేఖాన్‌పేట హైస్కూల్ హెచ్ఎం డి.శోభారాణి తమ పాఠశాల ప్రాంగణంలో ఇటీవల వరకు రైతు బజారు నిర్వహించటం వల్ల బురదంగా మారిందని, అవకాశం ఉంటే ప్రాంగణంలో నీరు నిల్వలేకుండా ఎత్తు చేయించాలని కోరారు. ఆమె చెప్పిన సమస్యను మంత్రి పేర్ని వినీ, విననట్లుగానే ఉండి, సరే చూద్దాం అని చెప్పారు. విధుల్లో భాగంగా ఉపా ధ్యాయులంతా బుధవారం పాఠశాలకు వెళ్లగా అప్పటికే ప్రాంగణంలో మట్టి కుప్పలు వేసి ఉండటం, మట్టి లోడ్లుతో ట్రాక్టర్లు చక్కర్లు కొడుతుండటం చూసి అవాక్కయ్యారు. ‘నానికి ఏదైనా సమస్య చెబితే ఇంతే’ అంటూ ఉపాధ్యాయులంతా గుసగుసలాడుకున్నారు. తమ సమస్యను మంత్రి నాని దృష్టికి తీసుకెళ్తే, మరుసటి రోజునే పరిష్కారం చూపించటంతో ఉపాధ్యాయ వర్గాలు బుధవారం ఇదే విషయమై మాట్లాడుకున్నారు. ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇదే విషయమై చర్చసాగింది. ‘దటీజ్ పేర్ని నాని’ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర మంత్రి పేర్ని నాని సకాలంలో స్పందించిన తీరుకు ఉపాధ్యాయ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. -
కోనేరు హంపికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. 2020 సంవత్సరాన్ని విజయంతో ఆరంభించిన హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పదిమంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నిలో హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. చదవండి: కెయిన్స్ కప్ క్వీన్ హంపి... -
ప్రణబ్, మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్‌కు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రపంచ దేశాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా కూడా అభినందించారు. ట్రంప్ ఎన్నిక భారత్-అమెరికా సంబంధాల్లో ‘కొత్త శకానికి నాంది’గా రాష్ట్రపతి ప్రణబ్ అభివర్ణించారు. ట్రంప్‌కు మోదీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాతో సంబంధాలను శిఖరస్థాయికి తీసుకెళ్తామని ట్వీట్ చేశారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భారత సంతతికి చెందిన అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రష్యా పార్లమెంటూ అభినందనలు తెలిపింది. ఇరుదేశాల సంబంధాలు అభివృద్ధి పథంలో సాగేందుకు మా వంతు కృషి మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్‌కు పంపిన టెలిగ్రామ్ సందేశంలో పుతిన్ పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే ట్రంప్‌కు శుభాకాంక్షలు చెబుతూ అమెరికా, బ్రిటన్ సంబంధాలు ప్రత్యేకమైనవని.. వ్యాపార, రక్షణ, నిఘా వ్యవహారాల్లో సన్నిహిత భాగస్వాములుగా వ్యవహరిస్తామని అన్నారు. తమ ఉద్యోగాలను చైనీయులు లాగేసుకుంటున్నారని ఆరోపించిన ట్రంప్ విజయంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆచితూచి స్పందించారు. ట్రంప్‌కు అభినందనలు చెబుతూ అతనితో కలసి పనిచేయడానికి సిద్ధమన్నారు. విశ్వశాంతికి సహకరించాల్సిందిగా కోరారు. ట్రంప్ విజయంతో అనిశ్చితి ఏర్పడుతుందన్న ఫ్రాన్స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కూడా ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ట్రంప్ మధ్య తూర్పు దేశాల్లో స్థిరత్వాన్ని తీసుకువస్తాడని ఆశిస్తున్నానని సౌదీ రాజు సాల్మన్ అభిప్రాయపడ్డారు. కాగా ట్రంప్ విజయం నేపథ్యంలో హిందూ సేన ఢిల్లీలో సంబరాలు చేసుకుంది. డమ్స్ వాయిస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. -
'నిన్ను చూసి దేశం గర్విస్తోంది'
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ను రెండోసారి సాధించిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. సైనా నెహ్వాల్ అద్భుత విజయం సొంతం చేసుకుందని, ఆమె సాధించినా క్రీడా విజయాలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అపూర్వ విజయం సాధించిన భారత్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ పై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అభినందనలు కురిపించారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్, ఆనందిబెన్ పటేల్, కేంద్ర మంత్రులు రాజ్యవర్థన్ రాథోడ్, రవిశంకర్ ప్రసాద్, ధర్మంద్ర ప్రధాన్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, హీరోయిన్ సొనాక్షి సిన్హా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, టీమిండియా బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ తదితరులు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. భారతీయులంతా గర్వించే విజయం సాధించినందుకు నైనాకు హ్యాట్సాఫ్ చెబుతూ అమితాబ్ ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. తనకు అభినందనలు తెలిపిన వారందరికీ సైనా నెహ్వాల్ ధన్యవాదాలు చెప్పింది. Congratulations @NSaina for the stupendous victory. The entire nation is very proud of your sporting accomplishments. — Narendra Modi (@narendramodi) 12 June 2016 T 2285 - @NSaina .. you continue to make us proud to be an Indian .. well done ..Champion at Australian Open ..!! pic.twitter.com/ldjUUsZSsb — Amitabh Bachchan (@SrBachchan) 12 June 2016 -
ఇస్రో శాస్త్రవేత్తలకి అభినందనలు తెలిపిన పార్లమెంట్
-
బీజేపీకి రాహుల్ అభినందనలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ ఓటమిని రాహుల్ అంగీకరించారు. -
సానియాకు మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఈ విజయం గర్వకారణమని మోడీ ప్రశంసించారు. ఇందుకు ప్రతిగా సానియా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా సానియాకు అభినందించారు. యూఎస్ ఓపెన్‌లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్‌తో జతకట్టిన సానియా మిక్స్డ్ డబుల్స్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ వచ్చిన సానియాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. -
సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలు
న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఈ విజయం ద్వారా సానియా దేశం గర్వించేలా చేసిందని కొనియాడారు. రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్లో ఈ మేరకు పేర్కొన్నారు. దీనికి ప్రతిగా సానియా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేశారు. యూఎస్ ఓపెన్‌లో సానియా.. బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్‌తో కలసి టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. -
పవన్‌కు మోడీ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా కృత జ్ఞతలు తెలిపారు. ‘ప్రచారంలో మీరు చూపిన చొరవ, ఉత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. దీనికి పవన్ స్పందించారు. ఉన్నతాశయాలు ఉన్న మోడీ ప్రధాని అయ్యేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, మోడీ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందన్నారు.