
సాక్షి, అమరావతి: అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. 2020 సంవత్సరాన్ని విజయంతో ఆరంభించిన హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పదిమంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నిలో హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది.
చదవండి: కెయిన్స్ కప్ క్వీన్ హంపి...
Comments
Please login to add a commentAdd a comment