Koneru Humpy
-
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కోనేరు హంపి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. న్యూయార్క్‌లో జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసలు కురిపించిన మోదీ... హంపి క్రీడా దిగ్గజమని కొనియాడారు. ‘హంపిలాంటి స్పోరి్టంగ్ ఐకాన్‌ను కలవడం ఆనందంగా ఉంది. చెస్ప్లేయర్లకు ఆమె ఒక స్ఫూర్తి. చురుకైన ఆలోచన, అచంచల సంకల్పం, నిబద్ధత వల్లే ఆమె ఈ స్థాయికి చేరుకుంది. దేశానికే ఆమె గర్వకారణం’ అని ప్రధాని ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. మోదీతో భేటీ కావడం, ఆయన కురిపించిన ప్రశంసలు, ప్రోత్సహించిన తీరు తనలో నూతనోత్సహాన్ని నింపిందని హంపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
వెల్డన్ వైశాలి
న్యూయార్క్: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో 23 ఏళ్ల వైశాలి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన ఈ మెగా ఈవెంట్లో వైశాలి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్జున్తో జరిగిన సెమీఫైనల్లో తమిళనాడుకు చెందిన వైశాలి 0.5–2.5తో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో లె టింగ్జీ (చైనా) 3.5–2.5తో కాటరీనా లాగ్నో (రష్యా)పై గెలిచింది. జు వెన్జున్తో జరిగిన సెమీఫైనల్ తొలి గేమ్‌ను వైశాలి 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో గేమ్‌లో జు వెన్జున్ 86 ఎత్తుల్లో... మూడో గేమ్‌లో 36 ఎత్తుల్లో వైశాలిని ఓడించి 2.5–0.5తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో వీరిద్దరి మధ్య నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్లో ఓడిన వైశాలి, కాటరీనా లాగ్నోలకు కాంస్య పతకాలు లభించాయి. ఫైనల్లో వెన్జున్ 3.5–.2.5తో లె టింగ్జీపై గెలిచి తొలిసారి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌గా అవతరించింది. 3 ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందింది. 2017లో విశ్వనాథన్ ఆనంద్ కాంస్య పతకం... 2022లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రజత పతకం గెలిచారు. -
Rewind 2024: విండీస్‌లో ‘విన్’.. మనూ సూపర్... చెస్‌లో పసిడి కాంతులు
ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!చాంపియన్‌కు, టైటిల్‌కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ విజయం. ‘పారిస్’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్‌లో అయితే పతకాల తోరణం!చెస్‌లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్‌లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం! పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం... మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. విండీస్‌లో ‘విన్ ఇండియా’ కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్ గడ్డపై రెండో టీ20 కప్‌ను అందించింది.ప్రతీ మ్యాచ్‌లో భారత్ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్ అప్పటికే ఐపీఎల్‌తో దంచికొట్టిన ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్‌ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్‌ను హార్దిక్ అవుట్ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బుమ్రా, యువ పేసర్ అర్ష్‌దీప్ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్ చరిత్రలో నిలిచే క్యాచ్... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.మను భాకర్... సూపర్పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్‌లో పసిడి పట్టేదేమో! షూటర్ మను భాకర్(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్ ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకుంది.ఒకే ఒలింపిక్స్‌లో ‘హ్యట్రిక్’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్ కుసాలే (షూటింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) కాంస్యాలు నెగ్గారు.హాకీ ఆటకు ఒలింపిక్స్‌లో పునర్వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్‌లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్ లక్ష్యసేన్, లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్‌గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్‌ను ముగించింది. ‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్‌కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.అవని లెఖరా, సుమిత్ అంటిల్, మరియప్పన్ తంగవేలు, శీతల్ దేవి, నితీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవ్‌దీప్ సింగ్, హర్విందర్ సింగ్, ధరంవీర్ తదితరులు పతకాల పంట పండించారు. చదరంగంలో ‘పసిడి ఎత్తులు’భారత్‌లో చెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.చెస్ ఒలింపియాడ్, క్యాండిడేట్స్ టోర్నీ (ప్రపంచ చాంపియన్‌తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్), ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ వీటన్నింటా మనదే జేగంట! ఓ రకంగా 2024 భారత చెస్ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్(D Gukesh) ఇటీవల క్లాసికల్ ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్ కొత్త రాత రాశాడు. న్యూయార్క్‌లో తెలుగుతేజం, వెటరన్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగం -
స్ఫూర్తిదాయక విజయాలు
చదరంగంలో భారత దేశానికి ఇది స్వర్ణయుగం. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఫిడే’ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత క్రీడాకారిణి కోనేరు హంపీ ఆదివారం సాధించిన ఘన విజయం అందుకు మరో తాజా నిదర్శనం. న్యూయార్క్‌లో మొత్తం 110 మంది పాల్గొన్న ర్యాపిడ్ చెస్ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, ఛాంపియన్ అయ్యారు. అంతకు ముందు సింగపూర్‌లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ విజయం, అంతకన్నా ముందు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బుడాపెస్ట్‌లోని చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, ఉమెన్స్ కేటగిరీలు రెంటిలోనూ కనివిని ఎరు గని రీతిలో భారత్ రెండు స్వర్ణాలు సాధించడం... ఇవన్నీ ఈ 2024ను భారత చదరంగానికి చిరస్మరణీయ వత్సరంగా నిలిపాయి. మంగళవారం నుంచి జరగనున్న ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపి యన్షిప్ పైనా కన్నేసి, గ్రాండ్డబుల్ సాధించాలని హంపీ అడుగులేస్తుండడం విశేషం. గతంలో 2019లో జార్జియాలో తొలిసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన కోనేరు హంపీకి తాజా విజయం రెండో ప్రపంచ టైటిల్. చైనాకు చెందిన జూ వెన్జున్ తర్వాత ఈ టైటిల్‌ను ఒకటికి రెండుసార్లు గెలిచింది హంపీయే! నిరుడు పెళ్ళి తరువాత మాతృత్వం కోసం కొన్నాళ్ళు ఆటకు దూరం జరిగిన హంపీ 2018లో చదరంగపు పోటీలకు తిరిగి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. 2019లో టైటిల్ సాధించారు. గత ఏడాది కూడా ఆమె గెలవాల్సింది. టై బ్రేక్‌లో త్రుటిలో ప్రపంచ టైటిల్‌ను కోల్పోయారు. అయితేనేం, పట్టుదలతో కృషిని కొనసాగించి మళ్ళీ ఇప్పుడు ఆటలో కిరీటం గెల్చుకొని, తనలో సత్తా చెక్కుచెదరలేదని నిరూపించారు. సామాన్యులతో పాటు ఆటలోని వర్ధిష్ణువులకు సైతం ఇది స్ఫూర్తి మంత్రం. నిజానికి, ఈ భారత నంబర్ 1 చదరంగ క్రీడాకారిణే అన్నట్టు, కచ్చితంగా సరికొత్త టైటిల్ విజయం మన దేశంలోని యువతరాన్ని చదరంగ క్రీడ వైపు మరింతగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో పలువురు చెస్ ప్రొఫెషనల్స్‌గా తయారవడానికి ప్రేరణ కూడా అవుతుంది. ఫస్ట్ రౌండ్లో ఓటమి పాలైనా, 11వ, ఆఖరి రౌండ్లో గెలవడంతో 8.5 పాయింట్లతో పట్టికలో హంపీ అగ్రస్థానానికి చేరారు. ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందర్‌ను ఓడించి, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపుతో 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. చెస్‌లో ఆరితేరిన గ్రాండ్ మాస్టర్ అయినా బిడ్డకు తల్లి అయ్యాక, ఎన్నో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, 37 ఏళ్ళ వయసులో హంపీ ఈ అరుదైన విన్యాసం సాధించడం అబ్బురం. అంతేకాదు... అభినందించాల్సిన అంశం. వయసు, బాధ్యతలు మీద పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా, నిత్య కృషితో ముందుకు సాగడం, ఆటలో అదే నైశిత్యాన్ని ప్రదర్శించడం ఆషామాషీ కాదు. ఈ 2024 అంతా ఆశించిన ఆటతీరు కనబరచలేక, ఆత్మవిశ్వాసం కుంటుబడిన హంపీ ఒక దశలో అసలీ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడకూడదనీ అనుకున్నారట. ఆట నుంచి రిటైరవుతారన్న అనుమానాల నుంచి ఆఖరికి అగ్రపీఠాన్ని అధిష్ఠించే దాకా ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. అందుకే, హంపీ గెలిచిన ఈ కొత్త కిరీటం మునుపటి విజయాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారి కూతురును చూసుకోవడంలో ఆమె తల్లితండ్రులు, భర్త పోషించిన పాత్ర మరెందరికో స్ఫూర్తిపాత్రమైనది. అంతర్జాయ యవనికపై భారత క్రీడాకారులు, అందులోనూ తెలుగువాళ్ళు కొన్నాళ్ళుగా సాధి స్తున్న ఘనతలు అనేకం. తాజా ఘటనలే తీసుకుంటే, తెలుగు మూలాలున్న చెన్నై కుర్రాడు గుకేశ్ ఇటీవల ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకన్నా ముందు ఆ వెంటనే ఇప్పుడు హంపీ ర్యాపిడ్ చెస్‌లో రెండోసారి వరల్డ్ టైటిల్ సాధించారు. మరోపక్క భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన 22 ఏళ్ళ నవ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో సంచలనం రేపాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 4వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి, అద్భుత మైన తొలి శతకం సాధించి, జట్టు పరువు నిలిపాడు. విదేశీగడ్డపై తొలి టెస్ట్ సిరీస్ ఆడుతూ, 8వ నంబర్ ఆటగాడిగా బరిలో దిగి సెంచరీ చేసిన తీరు యువతరంలోని క్రీడాకౌశలానికి నిదర్శనం. ఇవన్నీ భారత జాతి, మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళు గర్వించాల్సిన క్షణాలు. అయితే, ఇవి సరి పోవు. మన 140 కోట్ల జనాభాలో ఇంతకు మించి శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారినీ సరైన రీతిలో ప్రోత్సహించి, ప్రాథమిక వసతి సౌకర్యాలు అందిస్తే ఇలాంటి విజయాలు అనునిత్యం మన సొంతమవుతాయి. తాజా ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా క్రీడల్లో కెరీర్‌ను నిర్మించుకోవడం ఇప్పటికీ కష్టసాధ్యంగానే ఉందన్నది నిష్ఠురసత్యం. ఆటల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న పలువురు ఆనక కూలీనాలీ చేసుకుంటూ, కష్టంగా బతుకీడుస్తున్న ఉదంతాలు నేటికీ కళ్ళ ముందుకొస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది, క్రీడల మీద ఆసక్తిని పెంచాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఆ పని చేయకుండా... పతకాలు, టైటిళ్ళ మీదే ధ్యాసతో, ఆటగాళ్ళను నిందించి ప్రయోజనం లేదు. ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో అధ్యాపకుల స్థాయి నుంచి అందుకు తగ్గట్టు వాతావరణం కల్పించడం ముఖ్యం. అదే సమయంలో క్రీడా సంఘాలు, ప్రభుత్వ ప్రాధికార సంస్థల లాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా నడపడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే క్రీడాకారుల కలలు ఫలిస్తాయి. క్రీడాభిమాన లోకం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒలింపిక్స్‌కు సైతం ఆతిథ్య మివ్వాలని ఆశపడుతున్న మన పాలకులు అంత కన్నా ముందు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. -
హంపి అ‘ద్వితీయం’
గెలవాలన్న సంకల్పం... సరైన సన్నద్ధత ఉంటే... వయసు అనేది ఒక అంకె మాత్రమేనని... గొప్ప విజయాలు వాటంతట అవే వస్తాయని... రెండున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ మహిళల చెస్‌లో భారత ముఖచిత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం కోనేరు హంపి మరోసారి నిరూపించింది. సెకన్ల వ్యవధిలో చకచకా ఎత్తులు వేయాల్సిన ర్యాపిడ్ ఫార్మాట్లో 37 ఏళ్ల హంపి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2019లో తొలిసారి జగజ్జేతగా నిలిచిన హంపి గత ఏడాది టైబ్రేక్‌లో త్రుటిలో ప్రపంచ టైటిల్‌ను కోల్పోయింది. ఈసారి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా... ఒకదశలో టైటిల్ నెగ్గే అవకాశాలు కనిపించకపోయినా... తన అనుభవాన్నంతా రంగరించి... రౌండ్ రౌండ్‌కూ ముందుకు దూసుకొచ్చి చివరి రౌండ్లో నల్ల పావులతో ఆడుతూ ప్రత్యర్థిని ఓడించి దర్జాగా విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 110 మంది క్రీడాకారిణుల మధ్య స్విస్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (2003, 2017) తర్వాత ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను రెండుసార్లు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా... జు వెన్జున్ (చైనా) తర్వాత రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన రెండో మహిళా క్రీడాకారిణిగా హంపి గుర్తింపు పొందింది. న్యూయార్క్: ఈ ఏడాది విశ్వ చదరంగ వేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ముగిసిన ర్యాపిడ్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల హంపి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 110 మంది క్రీడాకారిణల మధ్య స్విస్ ఫార్మాట్లో 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను దక్కించుకుంది. విజేతగా నిలిచిన హంపికి 60 వేల డాలర్ల (రూ. 51 లక్షల 23 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 10వ రౌండ్ ముగిశాక హంపితోపాటు మరో ఆరుగురు క్రీడాకారిణులు జు వెన్జున్ (చైనా), కాటరీనా లాగ్నో (రష్యా), టాన్ జోంగి (చైనా), ఇరినె ఖరిస్మా సుకందర్ (ఇండోనేసియా), ద్రోణవల్లి హారిక (భారత్), అఫ్రూజా ఖమ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి టైటిల్ రేసులో నిలిచారు. అయితే చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 67 ఎత్తుల్లో ఖరిస్మా సుకందర్పై గెలుపొందడం... జు వెన్జున్, కాటరీనా లాగ్నో, హారిక, టాన్ జోంగి, అఫ్రూజా తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో హంపికి టైటిల్ ఖరారైంది. 8 పాయింట్లతో జు వెన్జున్, కాటరీనా లాగ్నో, టాన్ జోంగి, హారిక, అఫ్రూజా, అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్) ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఈ ఆరుగురి ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. జు వెన్‌జున్‌కు రెండో స్థానం, కాటరీనాకు మూడో స్థానం లభించాయి. టాన్ జోంగి నాలుగో స్థానంలో, హారిక ఐదో స్థానంలో, కొస్టెనిక్ ఆరో స్థానంలో, అఫ్రూజా ఏడో స్థానంలో నిలిచారు. ఓటమితో మొదలు... గెలుపుతో ముగింపు ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హంపి 10వ సీడ్‌గా బరిలోకి దిగింది. తొలి రౌండ్లో అమీనా కైర్బెకోవా (కజకిస్తాన్) చేతిలో హంపి ఓడిపోయింది. ఆ తర్వాత రెండో రౌండ్లో జేనాబ్ (అజర్బైజాన్)పై, మూడో రౌండ్లో సలోమి మెలియా (జార్జియా)పై గెలిచి... అల్మీరా (ఫ్రాన్స్)తో నాలుగో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలి రోజు నాలుగు రౌండ్లు ముగిశాక హంపి 2.5 పాయింట్లతో 38వ స్థానంలో ఉంది. రెండో రోజు హంపి అద్భుతంగా ఆడింది. ఆడిన నాలుగు రౌండ్లలోనూ గెలిచింది. జెన్నిఫర్ యు (అమెరికా)పై, వంతిక అగర్వాల్ (భారత్)పై, తుర్ముంక్ ముంఖ్జుల్ (మంగోలియా)పై, నినో బత్సియాష్విలి (జార్జియా)పై హంపి విజయం సాధించింది. ఎనిమిది రౌండ్లు ముగిశాక హంపి 6.5 పాయింట్లతో జు వెన్జున్, హారికలతో కలిసి సంయక్తంగా అగ్రస్థానానికి చేరుకుంది. చివరిరోజు జు వెన్జున్, కాటరీనాలతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి చివరి గేమ్‌లో ఖరిస్మాపై గెలిచి టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం నుంచి ఈ టోర్నీలో మహిళల విభాగంలో భారత్ నుంచి ఎనిమిది మంది పోటీపడ్డారు. 7 పాయింట్లతో దివ్య దేశ్‌ముఖ్ 21వ ర్యాంక్‌లో, 6.5 పాయింట్లతో పద్మిని రౌత్ 26వ ర్యాంక్‌లో, 5.5 పాయింట్లతో వైశాలి 52వ ర్యాంక్‌లో, 5 పాయింట్లతో వంతిక అగర్వాల్ 67వ ర్యాంక్‌లో, 5 పాయింట్లతో నూతక్కి ప్రియాంక 71వ ర్యాంక్‌లో, 5 పాయింట్లతో సాహితి వర్షిణి 77వ ర్యాంక్‌లో నిలిచారు. ఓవరాల్‌గా ఈ ఏడాది భారత చెస్ కొత్త శిఖరాలను అందుకుంది. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... గత నెలలో పురుషుల క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. 4 ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ చరిత్రలో హంపి సాధించిన పతకాలు. 2012లో కాంస్య పతకం నెగ్గిన హంపి... 2019లో స్వర్ణం, 2023లో రజతం, 2024లో స్వర్ణం గెలిచింది. అర్జున్‌కు ఐదో స్థానం ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ విభాగంలో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. రెండో రోజు గేమ్‌లు ముగిశాక టైటిల్ రేసులో నిలిచిన భారత నంబర్‌వన్ ఇరిగేశి అర్జున్ ఆఖరి రోజు తడబడ్డాడు. పదో గేమ్‌లో అలెగ్జాండర్ గ్రిష్చుక్ (రష్యా) చేతిలో అర్జున్ ఓడిపోవడం అతని టైటిల్ అవకాశాలను దెబ్బ తీసింది. నిర్ణీత 13 రౌండ్ల తర్వాత అర్జున్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ వొలోడార్ ముర్జిన్ 10 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. రష్యాకే చెందిన గ్రిష్చుక్, నిపోమ్‌నిషి 9.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి క్లీన్‌స్వీప్ చేశారు.ఈ విజయం ఎంతో ప్రత్యేకం‘సాక్షి’తో హంపి ప్రపంచ టైటిల్స్ సాధించడం కోనేరు హంపికి కొత్తేమీ కాదు. 26 ఏళ్ల క్రితం తొలిసారి ప్రపంచ అండర్–10 విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన హంపి ఆ తర్వాత 1998లో అండర్–12 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2000లో అండర్–14 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2001లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జగజ్జేతగా నిలిచింది. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి టోర్నీ టైటిల్స్ సాధించిన హంపి 2019లో ర్యాపిడ్ ఫార్మాట్లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఐదేళ్ల క్రితం సాధించిన తొలి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్‌తో పోలిస్తే ఈసారి విజయం ఎంతో ప్రత్యేకమని న్యూయార్క్ నుంచి ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరించింది. హంపి అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... » ఈ ఏడాది వ్యక్తిగతంగా అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేదు. అందుకే ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ ర్యాపిడ్ టోర్నీలో బరిలోకి దిగాను. తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశాను. అయినప్పటికీ ఆశ వదులుకోలేదు. రెండో గేమ్ నుంచి గెలుపు బాట పట్టి చివరకు టైటిల్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. ఎప్పటిలాగే నాన్న గైడెన్స్ ఇచ్చారు. చెస్‌కు సంబంధించి చాలా గేమ్స్ ప్రాక్టీస్ చేశాను. » 2017లో బిడ్డకు జన్మనిచ్చాక కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉన్నా. ఇప్పుడు నేను టోర్నీలు ఆడేందుకు బయట వెళ్లినపుడు పాప నా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నా విజయాల వెనుక భర్త దాసరి అన్వేష్, తల్లిదండ్రులు లత, అశోక్ పాత్ర, సహకారం ఎంతో ఉంది. ఈ ప్రపంచ టైటిల్ వారికే అంకితం ఇస్తున్నాను. » చివరి గేమ్ ఒకదశలో ‘డ్రా’ అవుతుందని భావించా. టైబ్రేక్‌కు సిద్ధంగా ఉన్నా. అయితే నా ప్రత్యర్థి చేసిన తప్పిదాన్ని సది్వనియోగం చేసుకొని విజయాన్ని దక్కించుకున్నా. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ టోర్నీలో నిలకడగా రాణించాను. అయితే టైబ్రేక్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచినందుకు చాలా నిరాశ చెందాను. ఈసారి గెలిచినందుకు ఆనందంగా ఉన్నా. నేటి నుంచి మొదలయ్యే ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లోనూ మళ్లీ పతకం సాధించేందుకు కృషి చేస్తా. 2022లో ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాను. హంపికి వైఎస్ జగన్ అభినందనలుసాక్షి, అమరావతి: భారత గ్రాండ్‌మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతో పాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా తన ఖాతాలో పోస్టు చేశారు. ‘ప్రతిష్టాత్మకమైన 2024 ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించడం అందరికీ గర్వకారణం. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపి నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచింది. భవిష్యత్తులో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ వైఎస్ జగన్ పోస్టు చేశారు. -
కోనేరు హంపికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.తెలుగు తేజం కోనేరు హంపి విజయంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ అభినందనలు తెలిపారు. The pride of India, @humpy_koneru, has won the 2024 FIDE Women's World Rapid Championship for the second time! She is an inspiration to many, particularly those balancing professional and personal life. Wishing her many more victories! pic.twitter.com/v0sv5eE5qM— YS Jagan Mohan Reddy (@ysjagan) December 29, 2024 -
వరల్డ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి
-
వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం
భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్‌లో ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన 11వ రౌండ్లో హంపి ఐరీన్ సుకందర్‌ను ఓడించింది. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.👏 Congratulations to 🇮🇳 Humpy Koneru, the 2024 FIDE Women’s World Rapid Champion! 🏆#RapidBlitz #WomenInChess pic.twitter.com/CCg3nrtZAV— International Chess Federation (@FIDE_chess) December 28, 2024హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019లో హంపి తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను నెగ్గింది. హంపికి ముందు చైనాకు చెందిన జు వెంజున్ మాత్రమే వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిళ్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు నెగ్గింది.పురుషుల విభాగం విజేతగా..వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పురుషుల విభాగం విజేతగా రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ వోలోదర్ ముర్జిన్ నిలిచాడు. ముర్జిన్ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అగ్రస్థానంలో నిలిచిన అర్జున్.. చివరి రౌండ్లలో వెనుకపడిపోయాడు. -
రెండో స్థానంలో కోనేరు హంపి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో రోజూ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. తొలి రోజు నాలుగు రౌండ్ల తర్వాత మూడు పాయింట్లతో 15వ ర్యాంక్‌లో ఉన్న హంపి... రెండో రోజు రెండో స్థానానికి ఎగబాకింది. బుధవారం హంపి మూడు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 8 రౌండ్ల తర్వాత 6.5 పాయింట్లతో మో జై (చైనా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకుంది. 7 పాయింట్లతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యువతార నూతక్కి ప్రియాంక కూడా అద్భుతంగా ఆడింది. తొలి రోజు 2 పాయింట్లతో 61వ ర్యాంక్‌లో ఉన్న ప్రియాంక బుధవారం ఆడిన నాలుగు గేముల్లోనూ గెలిచి 6 పాయింట్లతో 10వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. భారత్‌కే చెందిన వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ 5 పాయింట్లతో వరుసగా 23, 31వ ర్యాంక్‌లో... ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో 40వ ర్యాంక్‌లో ఉన్నారు. -
Asian Games 2023 chess: శుభారంభం చేసిన కోనేరు హంపి, హారిక
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్లో ఇరాన్‌కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్ రౌండ్లో వియత్నాం గ్రాండ్ మాస్టర్ ఫామ్ లే థావో న్గుయెన్‌ను చిత్తు చేసింది. దీంతో మూడో రౌండ్‌కు హంపి అర్హత సాధించింది. అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్లో సింగపూర్ గ్రాండ్‌మాస్టర్ కియాన్యున్ గాంగ్‌ను ఓడించింది. అయితే పురుషల చెస్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్లో విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్లో కజికిస్తాన్‌కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. తొలిరౌండ్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్.. రెండవ రౌండ్ గేమ్‌ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్ పోటోలు జరగనున్నాయి. భారత ఖాతాలో తొలి గోల్డ్‌మెడల్ ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్ గేమ్స్‌లో భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. -
స్పాన్సర్లు లేరన్న బాధ! 2 కోట్ల 50 లక్షల నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆమెకు..
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి 82వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీత్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభినందించారు. ప్రణీత్ తన తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మిలతో కలిసి సోమవారం సచివాలయంలో సీఎంను కలిశాడు. ప్రణీత్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్...అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారీ నజరానా భవిష్యత్తులో ప్రణీత్ ఇతర టోర్నీల కోసం సన్నద్ధమయ్యేందుకు, మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ. 2 కోట్ల 50 లక్షలను తెలంగాణ సీఎం ప్రకటించారు. రాష్ట్రం తరఫున గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ఐదో ఆటగాడిగా ప్రణీత్ గుర్తింపు పొందాడు. ఆమెకు 50 లక్షలు మరోవైపు మహిళా క్యాండిడేట్ మాస్టర్ (డబ్ల్యూసీఎం) హోదా పొందిన చెస్ ప్లేయర్ వీర్లపల్లి నందినికి రూ. 50 లక్షల ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం ఆదేశించారు. చదవండి: రన్నరప్ హంపి బెర్లిన్: వరల్డ్ చెస్ అర్మగెడాన్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ మహిళల టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. బిబిసారా అసాబయేవా (కజకిస్తాన్)తో జరిగిన ఐదు గేమ్‌ల ఫైనల్లో హంపి 1.5–3.5తో ఓడిపోయింది. తొలి గేమ్‌లో హంపి 33 ఎత్తుల్లో ఓడిపోగా.. రెండో గేమ్‌లో హంపి 41 ఎత్తుల్లో గెలిచింది. మూడో గేమ్‌లో 61 ఎత్తుల్లో, నాలుగో గేమ్‌లో 27 ఎత్తుల్లో బిబిసారా విజయం సాధించింది. ఐదో గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఎనిమిది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య ఈ టోర్నీ జరిగింది. మహిళల టోర్నీ విన్నర్, రన్నరప్ హోదాలో బిబిసారా, హంపి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అర్మగెడాన్ గ్రాండ్ ఫైనల్ టోర్నీకి అర్హత సాధించారు. గ్రాండ్ ఫైనల్ టోర్నీకి ఇప్పటికే సో వెస్లీ, సామ్ షాంక్లాండ్ (అమెరికా), దొమ్మరాజు గుకేశ్ (భారత్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) కూడా అర్హత పొందారు. త్వరలో యూరోప్, ఆఫ్రికా రీజియన్ మధ్య జరిగే టోర్నీ ద్వారా మరో ఇద్దరికి గ్రాండ్ ఫైనల్ టోర్నీకి బెర్త్‌లు లభిస్తాయి. చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే! -
హంపికి ఆరో స్థానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంతో ముగించింది. గొర్యాక్చినా (రష్యా)తో బుధవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా హంపి 4.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచింది. షువలోవా (రష్యా)తో జరిగిన చివరి గేమ్‌లో హారిక 66 ఎత్తుల్లో ఓటమి చవిచూసింది. భారత్‌కే చెందిన వైశాలి రెండు పాయింట్లతో పదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. -
హంపికి గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం
-
రెండో స్థానంలో హంపి, హారిక, అర్జున్
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తొలి రోజు మూడో రౌండ్ గేమ్‌లు ముగిశాక మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక... ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తొలి రౌండ్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై 30 ఎత్తుల్లో నెగ్గిన హంపి... అనా ఉషెనినా (ఉక్రెయిన్), మరియా (ఉక్రెయిన్)లతో జరిగిన తదుపరి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వైశాలితో తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... రెండో గేమ్‌లో ఒలివియా (పోలాండ్)పై గెలిచి, మూడో గేమ్‌ను ఉషెనినాతో ‘డ్రా’గా ముగించింది. అర్జున్ తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి, విదిత్, గుకేశ్ (భారత్)లతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. బుధవారం మరో మూడు రౌండ్లు, గురువారం మరో మూడు రౌండ్లు జరుగుతాయి. తొలిసారి ఈ టోర్నీలో ఓపెన్, మహిళల విభాగాల్లో సమాన ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. -
Chess Olympiad: ఎదురులేని భారత్
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు వరుసగా ఆరో విజయంతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. జార్జియాతో బుధవారం జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 3–1తో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌లో హంపి 42 ఎత్తుల్లో...లెలా జావఖిష్‌విలితో గేమ్‌లో వైశాలి 36 ఎత్తుల్లో గెలిచారు. నినో బాత్సియాష్‌విలితో గేమ్‌ను హారిక 33 ఎత్తుల్లో... సలోమితో జరిగిన గేమ్‌ను తానియా 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘బి’ 3–1తో నెగ్గగా... చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను భారత్ ‘బి’ 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’–ఉజ్బెకిస్తాన్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’కాగా... భారత్ ‘బి’ 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోయింది. భారత్ ‘సి’ 3.5–0.5తో లిథువేనియాపై గెలిచింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం ఏడో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
Chess Olympiad 2022: భారత జట్ల జోరు
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ 3.5–0.5తో మాల్డోవాపై, భారత్ ‘బి’ 4–0తో ఎస్తోనియాపై, భారత్ ‘సి’ 3.5–0.5తో మెక్సికోపై గెలుపొందాయి. మహిళల విభాగం రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కోనేరు హంపి, తానియా సచ్దేవ్, వైశాలి, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్ ‘ఎ’ 3.5–0.5తో అర్జెంటీనాపై, భారత్ ‘బి’ 3.5–0.5తో లాత్వియాపై, భారత్ ‘సి’ 3–1తో సింగపూర్‌పై విజయం సాధించాయి. మరీసా (అర్జెంటీనా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో అనాపవోలాపై, వైశాలి 90 ఎత్తుల్లో మరియా జోస్పై, భక్తి కులకర్ణి 44 ఎత్తుల్లో మరియా బెలెన్‌పై గెలిచారు. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన ప్రత్యర్థి ఇవాన్ షిట్కోపై నెగ్గగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన ప్రత్యర్థి మెకోవరితో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. -
ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హంపికి ఐదో స్థానం
వార్సా (పోలాండ్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఐదో స్థానం దక్కింది. గురువారం ముగిసిన మహిళల ఈవెంట్లో ఆమె 11.5 పాయింట్లతో టాప్–5లో నిలిచింది. 17 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 16వ రౌండ్ ముగిసే సరికి రెండో స్థానంలో నిలిచిన హంపికి ఆఖరి రౌండ్ ఫలితం నిరాశను మిగిల్చింది. చివరి రౌండ్లో నల్లపావులతో బరిలోకి దిగిన తెలుగమ్మాయికి రష్యాకు చెందిన పొలిన షువలొనా చేతిలో ఓటమి ఎదురైంది. ఈ బ్లిట్జ్ ఈవెంట్లో హంపి 10 గేముల్లో గెలిచి నాలుగు పోటీల్లో ఓడింది. మరో మూడు గేముల్ని డ్రా చేసుకుంది. టోర్నీలో కజకిస్తాన్ టీనేజర్ బిబిసర అసాబయెవా విజేతగా నిలిచింది. 17 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ బిబిసర 13 గేముల్ని గెలిచి, రెండు డ్రా చేసుకోవడం ద్వారా 14 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
హంపి ఖాతాలో నాలుగో విజయం
పోలాండ్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన ఐదో గేమ్‌లో హంపి 24 ఎత్తుల్లో జూలియా (చెక్ రిప బ్లిక్)పై, ఆరో గేమ్‌లో 29 ఎత్తుల్లో మార్టా మిచ్నా (జర్మనీ)పై, ఏడో గేమ్‌లో 45 ఎత్తుల్లో పావ్లీడు (గ్రీస్)పై నెగ్గింది. ఏడో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్ల తో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. -
Sakshi Excellence Awards: థ్యాంక్యూ సాక్షి: కోనేరు హంపి
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో సెప్టెంబర్ 17న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ముఖ్య అతిథులుగా... ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా... ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’(స్పోర్ట్స్- ఫిమేల్) అవార్డును కోనేరు హంపి అందుకున్నారు. ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కోనేరు హంపి(స్పోర్ట్స్- ఫిమేల్) చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. 15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించిన ఘనత కోనేరు హంపికి ఉంది! హంపీ అకౌంట్లో బంగారు పతకాలూ ఉన్నాయి. అండర్ 10, అండర్ 12, అండర్ 14 ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్నాయి. అర్జున ఉంది. పద్మశ్రీ ఉంది. ఇప్పుడు సాక్షి ఎక్స్‌లెన్స్ ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కూడా హంపి విజయాలకు జత కలిసింది. హంపీ ఏపీ చెస్ క్రీడాకారిణి. మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్. ఆమె కనని కల ఒకటి సాకారం అయింది! అది.. అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడం. హంపి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ. మరిన్ని విజయాలకు స్ఫూర్తి... క్రీడల్లో నాకు పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు విభిన్న కేటగిరీల్లో అవార్డులు తీసుకుంటున్న అందరికీ అభినందనలు. జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏది సాధించినా దానికి ప్రతిగా వచ్చే ఇటువంటి పురస్కారాలు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్యూ సాక్షి. ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. –కోనేరు హంపి, చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి గురించి సంక్షిప్తంగా.. ►కోనేరు హంపి 31 మార్చి 1987లో కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. ►తండ్రి కోనేరు అశోక్ ఆమె మొదటి కోచ్ ►15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా కోనేరు హంపి చరిత్ర సాధించిన విజయాలు- వరల్డ్ చాంపియన్‌షిప్స్ ►అండర్-10 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1997, ఫ్రాన్స్- స్వర్ణ పతకం ►అండర్-12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1998, స్పెయిన్- స్వర్ణ పతకం ►అండర్- 12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1999, స్పెయిన్- రజత పతకం ►అండర్-14 వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2000, స్పెయిన్- స్వర్ణ పతకం ►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్ 2001, ఏథెన్స్, గ్రీస్- స్వర్ణ పతకం ►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్ 2002, గోవా, ఇండియా- రజత పతకం ►వరల్డ్ కప్ 2002, హైదరాబాద్, ఇండియా- సెమీ ఫైనలిస్ట్ ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2004, ఎలిస్తా, రష్యా- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2008, నల్చిక్, రష్యా- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, 2010 టర్కీ- కాంస్య పతకం ►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్- 2011- రజత పతకం చదవండి: స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు -
చెస్ ఒలింపియాడ్: అగ్ర స్థానంలో భారత్
చెన్నై: ‘ఫిడే’ ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ గురువారం ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్ర స్థానంలోకి దూసుకెళ్లింది. మాజీ ప్రపంచ చాంపియన్, గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నేతృత్వంలోని భారత్ నాలుగో రౌండ్లో 5–1తో చైనాపై, ఐదో రౌండ్లో 4–2తో అజర్‌బైజాన్‌పై, ఆరో రౌండ్లో 3.5–2.5తో బెలారస్‌పై విజయం సాధించింది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి ఓడిపోగా... పెంటేల హరికృష్ణ సహా మరో నలుగురు గెలుపొందారు. అజర్‌బైజాన్‌తో జరిగిన పోరులో హంపి గెలుపొందగా, ఆనంద్, ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకున్నారు. బెలారస్‌తో మ్యాచ్‌లో ఆనంద్, భక్తి కులకర్ణి విజయం సాధించారు. చదవండి: సౌరవ్ గంగూలీపై ‘బయోపిక్’ -
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ నయా చరిత్ర
చెన్నై: తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు నయా చరిత్ర సృష్టించింది. తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డును లిఖించింది. ఈ మెగా టోర్నీలో రష్యాతో కలిసి భారత్ సంయుక్తంగా పసిడి గెలుచుకుంది. ఇది చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన . గతంలో వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత్.. ఈసారి స్వర్ణాన్ని ఒడిసి పట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు తొలిసారి స్వర్ణం వచ్చినట్లయ్యింది. భారత్ పైనల్‌కు చేరడంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్ కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. పోలాండ్ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ టైబ్రేక్‌లో 1–0తో గెలవడంతో ఫైనల్‌కు చేరింది. మరొక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికాపై రష్యా గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్-రష్యా జట్ల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్లో పూర్తిగా జరగలేదు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఫైనల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌తో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్-రష్యాలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అంతకుముందు చెస్ ఒలింపియాడ్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం. 2014లో భారత్ కాంస్య పతకం సాధించగా, ఆరేళ్ల తర్వాత స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుని భారత్ నయా చరిత్ర సృష్టించింది. -
గెలిపించిన హంపి
చెన్నై: తొలి మ్యాచ్‌లో పరాజయంపాలై ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్... విజేతను నిర్ణయించే టైబ్రేక్ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్ కోనేరు హంపి అద్భుత ఆటతీరుతో సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. ‘అర్మగెడాన్’ పద్ధతిలో జరిగిన ఈ గేమ్‌లో హంపి 73 ఎత్తుల్లో మోనికా సోకో (పోలాండ్)ను ఓడించింది. దాంతో తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ టైబ్రేక్‌లో 1–0తో గెలిచింది. రెండు మ్యాచ్‌లతో కూడిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో భారత్ 2–4తో ఓడిపోయింది. విశ్వనాథన్ ఆనంద్, విదిత్, దివ్య దేశ్‌ముఖ్ ఓడిపోగా... నిహాల్ సరీన్ గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ఇక ఫైనల్ చేరాలనే ఆశ ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో భారత్ 4.5–1.5తో నెగ్గి స్కోరును సమం చేసింది. హంపి, హారిక, ఆనంద్, విదిత్ తమ గేముల్లో గెలుపొందగా... ప్రజ్ఞానంద ఓడిపోయాడు. వంతిక అగర్వాల్ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇక విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌లో ‘అర్మగెడాన్’ గేమ్‌ను ఆడించారు. ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం టాస్ గెలిచిన వారికి తెల్లపావులు లేదంటే నల్లపావులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. తెల్లపావులతో ఆడే వారికి ఐదు నిమిషాలు, నల్లపావులతో ఆడే వారికి నాలుగు నిమిషాలు ఇస్తారు. తెల్లపావులతో ఆడే వారికి అదనంగా ఒక నిమిషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కచ్చితంగా గెలవాలి. మరోవైపు నల్లపావులతో ఆడేవారికి ఒక నిమిషం తక్కువ ఉంటుంది కాబట్టి వారు ‘డ్రా’ చేసుకున్నా చాలు వారినే విజేతగా ప్రకటిస్తారు. మోనికా సోకోతో జరిగిన అర్మగెడాన్ గేమ్‌లో హంపి టాస్ గెలిచి నల్ల పావులను ఎంచుకుంది. ‘డ్రా’ చేసుకుంటే సరిపోయే స్థితిలో హంపి చకచకా ఎత్తులు వేస్తూ, ప్రత్యర్థి వ్యూహాలు చిత్తు చేస్తూ 73 ఎత్తుల్లో ఏకంగా విజయాన్నే సొంతం చేసుకుంది. రష్యా, అమెరికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. చెస్ ఒలింపియాడ్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం (2014లో). ఈసారి భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. -
సెమీ ఫైనల్లో హంపి
చెన్నై: ‘ఫిడే’ మహిళల స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ గ్రాండ్‌ప్రి చివరిదైన నాలుగో అంచె పోటీల్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి, ప్రపంచ మహిళల రాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి సెమీ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో హంపి 6–5తో వాలెంటినా గునినా (రష్యా)పై విజయం సాధించింది. సెమీస్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ హూ యిఫాన్ (చైనా)తో హంపి తలపడుతుంది. హూ యిఫాన్ తన క్వార్టర్స్ మ్యాచ్‌లో 7.5–3.5తో జన్సయ అబ్దుమాలిక్ (కజకిస్తాన్)పై గెలుపొందింది. -
హంపి, హారిక ఓటమి
చెన్నై: ‘ఫిడే’ మహిళల స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ గ్రాండ్‌ప్రి మూడో అంచె పోటీల్లో భారత పోరాటం ముగిసింది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలయ్యారు. వరల్డ్ నంబర్ 2 హంపి 2–9తో అలెగ్జాండ్రా కోస్టెనిక్ (రష్యా) చేతిలో చిత్తు కాగా, వరల్డ్ నంబర్‌వన్ హూ యిఫాన్ (చైనా) 7–3తో హారికపై విజయం సాధించింది. ఈ టోర్నీలో చివరిదైన నాలుగో అంచె పోటీలు బుధవారంనుంచి జరుగుతాయి. ఇందు లో హంపి, హారిక పాల్గొంటారు. -
హంపి పరాజయం
చైన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల స్పీడ్ చెస్ చాంపియన్ షిప్లో భారత టాప్ ప్లేయర్, ప్రస్తుత ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి చుక్కెదురైంది. తొలి రౌండ్లో ఆమె 4.5–5.5తో లీ తావో న్యూయెన్ ఫామ్ (వియత్నాం) చేతిలో ఓటమిపాలైంది. అయితే భారత యువ మహిళా గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేశ్ బాబు సంచలన విజయాన్ని నమోదు చేసింది. బల్గేరియాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ ఆంటోయినెటే స్టెఫనోవాను 6–5తో ఓడించింది. కరోనా కారణంగా ఈ టోర్నీ ఆన్లైన్లో జరుగుతోంది. -
మార్పును స్వాగతించాలి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కబళించని రంగం లేదు. ఈ వైరస్ బారిన పడి నష్టపోని వ్యాపారం మనకు కనిపించదు. ముఖ్యంగా క్రీడారంగంపై దీని ప్రభావం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వైరస్ దెబ్బకు ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్సే వెనక్కి వెళ్లిపోయాయి. ఐపీఎల్ స్థితి అగమ్యగోచరంగా తయారైంది. మైదానాలు బోసి పోతున్నాయి. ఆటలెప్పుడు ప్రారంభమవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కోవిడ్–19 కట్టడి తర్వాత కూడా పరిస్థితులు మాత్రం మునుపటిలా ఉండవంటున్నారు దిగ్గజ క్రీడాకారులు. మ్యాచ్‌ల కోసం ప్రేక్షకులు పోటెత్తడం కష్టమేనని అంటున్నారు. జట్టుగా ఆడే క్రీడల్లో ఆటగాళ్లు స్వేచ్ఛగా కదల్లేరంటూ... కరోనా తర్వాత ఆటల్లో వచ్చే మార్పు గురించి భారత క్రీడారంగం ప్రముఖులు సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా, మేరీకోమ్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, సాయిప్రణీత్, మహేశ్ భూపతి వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... మరో మాటకు తావు లేకుండా మన జీవితకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. దీని కారణంగా బౌలర్లు బంతిని మెరిపించేందుకు ఉమ్మిని వాడాలంటే జంకుతారు. మైదానంలో సహచరులను కౌగిలించుకోవాలన్నా, అభినందించాలన్నా భయపడతారు. ఆటలోనూ భౌతిక దూరం పాటిస్తారు. –సచిన్ టెండూల్కర్ (క్రికెటర్) ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే సాధనం క్రీడలు. వీటికి ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు ఆరోగ్య భద్రత కోసం విధించిన ఆంక్షలు భవిష్యత్‌లో మేలు చేస్తాయి. సాధారణ ప్రజలు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ వహించి ఆటలను జీవితంలో భాగంగా చేసుకుంటారు. – అభినవ్ బింద్రా (షూటర్) క్రీడలు ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. ఒక్కసారి వైరస్ నుంచి మనం బయటపడితే యథావిధిగా ఆటలు జరుగుతాయి. –మహేశ్ భూపతి (టెన్నిస్ ప్లేయర్) పరిస్థితి సద్దుమణిగి ప్రపంచం మునుపటిలా మారిపోవాలని మనందరం కోరుకుంటున్నాం. కానీ అలా జరిగే అవకాశం కనిపించట్లేదు. కంటికి కనబడని ఈ శత్రువు కారణంగా ఆట స్వరూపం మారుతోంది. ప్రత్యర్థిని తాకకుండా బాక్సింగ్‌లో తలపడలేం. ఇదే ఆందోళన కలిగిస్తోంది. ప్రాక్టీస్‌లో కూడా తీవ్రత తగ్గిపోయింది. దీనికి నేను వ్యతిరేకం. అంతా చక్కబడ్డాక మ్యాచ్ చూసేందుకు అభిమానులు వస్తారు. వారి కోసం అత్యున్నత స్థాయిలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలి. వ్యాక్సిన్ కనిపెడితే మునుపటి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. అంతవరకు ప్రయాణాలు, ప్రాక్టీస్ అన్ని విషయాల్లో రాజీ పడాల్సిందే. – మేరీకోమ్ (బాక్సర్) అభిమానులతో మైదానాల్లో క్రీడల నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితం కాదు. మరో ఏడాది వరకు ఆటల్ని నిర్వహించకపోవడమే ఉత్తమం. నా అభిప్రాయం ప్రకారం మనం కొంతకాలం ఓపిక పట్టాల్సిందే. – కోనేరు హంపి (చెస్ గ్రాండ్‌మాస్టర్) ప్రపంచం దీని నుంచి బయటపడేందుకు మరికొంత సమయం పడుతుంది. దాదాపు ఒక సీజన్ క్రీడలు ఆగిపోయాయి. చాలా మంది క్రీడాకారులను ఇది ప్రభావితం చేస్తుంది. మరో ఆరు నెలలు లేదా సంవత్సరంలో ఎటువంటి సమస్య లేకుండా ఆటలు జరుగుతాయని అనుకుంటున్నా. – హారిక (చెస్ గ్రాండ్‌మాస్టర్) బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడే క్రమంలో చైనా, కొరియా లాంటి దేశాలకు తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆడే సమయంలో లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనస్సులో కచ్చితంగా వైరస్‌కు సంబంధించిన భయం ఉంటుంది. మ్యాచ్ సమయంలో షర్ట్ మార్చుకునేటపుడు లేదా షటిల్‌ను ఆటగాళ్లు, సర్వీస్ జడ్జి తాకాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాకే ఆట జరగాలని కోరుకుంటున్నా. – సాయిప్రణీత్ (షట్లర్) -
చెస్ ఒలింపియాడ్‌కు హంపి, హారిక, ఆనంద్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారీ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. మహిళల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టులోని మిగతా మూడు బెర్త్‌ల కోసం తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి, ఆర్.వైశాలి రేసులో ఉన్నారు. అయితే మే 1వ తేదీన మిగతా ముగ్గురు క్రీడాకారిణుల పేర్లను ఖరారు చేస్తామని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేరు ఖరారైంది. ర్యాంకింగ్ ప్రకారం పెంటేల హరికృష్ణ, విదిత్ ఎంపిక కూడా లాంఛనమే. మిగతా రెండు బెర్త్‌ల కోసం ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం రేసులో ఉన్నారు. చెస్ ఒలింపియాడ్ ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 18 వరకు రష్యా రాజధాని మాస్కోలో జరుగుతుంది. మొత్తం 180 దేశాలు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నాయి. -
ప్రపంచ రెండో ర్యాంకర్‌గా కోనేరు హంపి
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్ పాయింట్లతో హూ ఇఫాన్ (చైనా) టాప్ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ రెండో ర్యాంక్ నుంచి (చైనా–2583 పాయింట్లు) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 2517 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది. -
హంపికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక కెయిన్స్ కప్ టైటిల్ గెల్చుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అభినందనలు తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూసియాలో జరిగిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో చివరి గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని హంపి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. కొత్త ఏడాదిని గొప్ప విజయంతో మొదలుపెట్టిన కోనేరు హంపి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. -
కోనేరు హంపికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. 2020 సంవత్సరాన్ని విజయంతో ఆరంభించిన హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పదిమంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నిలో హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. చదవండి: కెయిన్స్ కప్ క్వీన్ హంపి... -
కెయిన్స్ కప్ క్వీన్ హంపి...
తెలుగు తేజం, ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కెరీర్లో మరో గొప్ప విజయం చేరింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించిన ఈ భారత నంబర్‌వన్ మహిళా చెస్ స్టార్... తాజాగా అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లోనూ విజేతగా నిలిచింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజా ప్రదర్శనతో హంపి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకోనుంది. సెయింట్ లూయిస్ (అమెరికా): రెండు నెలల క్రితం ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించి కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి... మళ్లీ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇద్దరు మాజీ ప్రపంచ చాంపియన్స్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), మరియా ముజిచుక్ (ఉక్రెయిన్), ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), ప్రపంచ బ్లిట్జ్ మాజీ చాంపియన్ కాటరీనా లాగ్నో (రష్యా), మూడుసార్లు యూరోపియన్ చాంపియన్ వాలెంటినా గునీనా (రష్యా)లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలోకి దిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో హంపి చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని అలంకరించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో పోటీపడిన హంపి నల్లపావులతో ఆడుతూ కేవలం 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి నాలుగు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. 5.5 పాయింట్లతో జూ వెన్జున్ రన్నరప్‌గా నిలువగా... 5 పాయింట్లతో మరియా ముజిచుక్ మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 4.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్షా 80 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించిన ఈ టోర్నీలో పాల్గొన్న పది మందికీ ప్రైజ్‌మనీ ఇచ్చారు. విజేతగా నిలిచిన హంపికి 45 వేల డాలర్లు (రూ. 32 లక్షల 10 వేలు)... రన్నరప్ జూ వెన్‌జున్‌కు 35 వేల డాలర్లు (రూ. 24 లక్షల 97 వేలు)... మూడో స్థానంలో నిలిచిన మరియా ముజిచుక్‌కు 25 వేల డాలర్లు (రూ. 17 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ఫలితంతో హంపి 2585 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ లైవ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. చైనా గ్రాండ్‌మాస్టర్ హు ఇఫాన్ 2658 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోఉంది. పలువురు మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా రెండు వారాలపాటు ప్రాక్టీస్ చేశాను. వివిధ రకాల ఓపెనింగ్స్ సాధన చేశాను. రెండు నెలల క్రితం నేను సాధించిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ గాలివాటంగా వచ్చినదేమీ కాదని తాజా ప్రదర్శనతో నిరూపించాను. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత స్వదేశంలో నా ఉద్యోగ సంస్థ పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఇంటర్ యూనిట్ టోర్నమెంట్లో పాల్గొంటాను. ఆ తర్వాత మే నెలలో ఇటలీలో జరిగే గ్రాండ్‌ప్రి టోర్నీలో బరిలోకి దిగుతాను. ఈ ఏడాది చివర్లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడమే నా తదుపరి లక్ష్యం. –‘సాక్షి’తో కోనేరు హంపి -
కెయిన్స్ చాంపియన్‌గా హంపి
సెయింట్ లూయిస్ (అమెరికా): గతేడాది చివర్లో ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన భారత నంబర్‌వన్ చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించారు. కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హంపి విజేతగా నిలిచారు. తొమ్మిదిరౌండ్ల తర్వాత ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భాగంగా సహచర క్రీడాకారిణి ద్రోణవల్లి హారికతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న హంపి టైటిల్‌ను గెలుచుకున్నారు. దాంతో ఐదు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్న హంపి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి రెండో స్థానాన్ని సాధించారు. టైటిల్ గెలిచిన తర్వాత హంపి మాట్లాడుతూ.. ‘కెయిన్స్ కప్ సాధించడం ఒక సరికొత్త అనుభూతిని తీసుకొచ్చింది. నేను వరల్డ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా అది నాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఏడో రౌండర్లో అలెగ్జాండర్ కౌస్టినియక్తో జరిగిన మ్యాచ్ చాలా కఠినంగా జరిగింది. అయినా ఆమెపై ఉన్న విజయాల రికార్డును కొనసాగించి గెలుపును అందుకున్నాను. అదే నేను టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది’ అని హంపి తెలిపారు. ఇక హారిక 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. -
ప్రపంచ మాజీ చాంపియన్‌పై హంపి విజయం
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, మహిళల విభాగంలో భారత నంబర్‌వన్ కోనేరు హంపి మూడో విజయం నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హంపి 61 ఎత్తుల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హారిక 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత హంపి, జూ వెన్జున్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. హారిక మూడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. -
గోల్డ్ మెడల్ సాధించడం 15 ఏళ్ల కల
-
సెరెనా, మేరీలే స్ఫూర్తి!
విజయవాడ: అమ్మగా మారిన తర్వాత కూడా ఆటలో సత్తా చూపేందుకు బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌లే తనలో స్ఫూర్తి కలిగించారని ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి వెల్లడించింది. తన ఇటీవలి విజయం విశేషాలను వెల్లడిస్తూ హంపి ఈ వ్యాఖ్య చేసింది. తల్లి అయిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో విశేషంగా రాణిస్తున్నారని, వారిలా తాను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని అనుకున్నానని హంపి అన్నారు. అయితే ప్రపంచ చాంపియన్ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందులో తన కుటుంబం పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపింది. ‘ నేను నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశాను కూడా.’ అంటూ హంపి తన ప్రణాళిక గురించి తెలియజేసింది. ఓవరాల్‌గా తన 2019 ఏడాది ఘనంగా గడిచిందని... క్లాసికల్ విభాగంలో 30 రేటింగ్ పాయింట్లను, ర్యాపిడ్ విభాగంలో 45 రేటింగ్ పాయింట్లను సాధించానని గర్వంగా చెప్పుకుంది. -
‘రెండేళ్ల తర్వాత ఆడటం కొంచెం కష్టమనిపించింది’
-
‘రెండేళ్ల తర్వాత ఆడటం కొంచెం కష్టమనిపించింది’
సాక్షి, విజయవాడ : ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌గా గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొన్నారు. గత నెల రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే. గురువారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం తన 15 ఏళ్ల కల అని అన్నారు. ఆరేళ్ల వయసు నుంచి చెస్ ప్లేయర్‌గా రాణిస్తున్నానని.. రెండు సంవత్సరాల బ్రేక్ తర్వాత చెస్ ఆడటం కొంచెం కష్టమనిపించిందన్నారు. తనకు పాప పట్టడం వల్ల రెండేళ్ల వరకు ఆట జోలికి వెళ్లలేదని, తిరిగి ఆడిన గేమ్ ప్రపంచ ఛాంపియన్‌గా గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.(కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు) తన విజయాన్ని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యర్థులతో ఎత్తుకు పైఎత్తు వేసి మేధస్సుకు పని చెప్పానన్నారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, భర్త పాత్ర ఎంతోగానో ఉందని తెలిపారు. ఎన్నో జయాపజయాలను చవి చూశానని...అపజయాలను అధిగమించి ప్రపంచ ఛంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని టోర్నమెంట్లు ఆడి దేశం గర్వించేలా చేస్తానన్నారు. -
పట్టుదల, కృషితోనే లక్ష్య సాధన: హంపి
సాక్షి, గన్నవరం: వర్ధమాన క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. మహిళల విభాగంలో భారత నంబర్‌వన్‌గా ఉన్న 32 ఏళ్ల హంపి రష్యాలో గతవారం జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో మహిళల ర్యాపిడ్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హంపి బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్), ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ‘శాప్’ నుంచి స్పోర్ట్స్ డైరెక్టర్ రమణ, ఓఎస్డీ రామకృష్ణ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జీ.మధుసూదనరావు... ఏపీఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేపీ రావు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు శ్రీహరి, నామిశెట్టి వెంకటేశ్వరరావు, ధనియాల నాగరాజు, చెరుకూరి సత్యనారాయణ, అర్జా పాండురంగారావు, ఆర్చరీ క్రీడాకారిణి చెరుకూరి డాలీ, హంపి భర్త దాసరి అన్వేష్, తల్లిదండ్రులు కోనేరు అశోక్, లత తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో హంపి మీడియాతో మాట్లాడింది. ‘తండ్రి అశోక్ నిరంతరం ఇచ్చే విలువైన సూచనలతో చెస్‌లో ఉన్నతస్థితికి చేరుకున్నాను. ఆయన శిక్షణలో మరింతగా రాటుదేలి భవిష్యత్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాను. భర్త అన్వేష్ ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారంతోనే చెస్‌లో పునరాగమనం చేయగలిగాను. ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించాను. క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా నిలువడమే తదుపరి లక్ష్యం’ అని హంపి వ్యాఖ్యానించింది. -
హంపికి 12వ స్థానం
మాస్కో: ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్న భారత మహిళల చెస్ నంబర్‌వన్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి బ్లిట్జ్ విభాగంలో మాత్రం తడబడింది. సోమవారం ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో 32 ఏళ్ల హంపి నిర్ణీత 17 రౌండ్ల తర్వాత 10.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హంపికి 12వ స్థానం ఖాయమైంది. 14వ రౌండ్ వరకు రెండో స్థానంలో కొనసాగి స్వర్ణ, రజత, కాంస్య పతకాల రేసులో నిలిచిన హంపి వరుసగా 15, 16, 17వ రౌండ్లలో ఓడిపోయి పతకావకాశాలను చేజార్చుకుంది. ఓవరాల్‌గా బ్లిట్జ్ టోర్నీలో హంపి ఎనిమిది గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా నాలుగు గేముల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 10 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కాటరీనా లాగ్నో 13 పాయింట్లతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 12.5 పాయింట్లతో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) రజతం, 12 పాయింట్లతో తాన్ జోంగి (చైనా) కాంస్య పతకం దక్కించుకున్నారు. ఎదురులేని కార్ల్సన్ ఓపెన్ ర్యాపిడ్ విభాగంలో టైటిల్ గెలిచిన ప్రపంచ నంబర్‌వన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ బ్లిట్జ్ విభాగంలోనూ విశ్వవిజేతగా అవతరించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత కార్ల్సన్, హికారు నకముర (అమెరికా) 16.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య రెండు గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న కార్ల్సన్... రెండో గేమ్‌లో నకమురను ఓడించి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో కార్ల్సన్ చెస్‌లోని క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు. -
ఈ విజయం ఎంతో మధురం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని... గతంలో ఏ భారతీయ క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకొని... అంతర్జాతీయ వేదికపై మరోసారి అబ్బురపరిచే ప్రదర్శనతో భారత చెస్ పతాకాన్ని రెపరెపలాడించి... అందరిచేతా శభాష్ అనిపించుకుంది ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం), భారత మహిళల నంబర్‌వన్ ప్లేయర్ కోనేరు హంపి. మాస్కోలో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల ర్యాపిడ్ విభాగంలో హంపి విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో నాలుగుసార్లు సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హంపికి సీనియర్ విభాగంలో మాత్రం విశ్వకిరీటం ఊరిస్తూ వస్తోంది. అయితే తనకెంతో పట్టున్న క్లాసికల్ విభాగంలో కాకుండా ధనాధన్ పద్ధతిలో జరిగే ర్యాపిడ్ విభాగంలో హంపి విశ్వవిజేతగా నిలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. సాక్షి, హైదరాబాద్ : ఒకదశలో టాప్–3లో నిలిస్తే చాలు అనుకునే స్థితిలో ఉన్నప్పటికీ...ఒకవైపు ఫేవరెట్స్‌గా భావించిన క్రీడాకారిణుల ఫలితాలు చివరి రెండు రౌండ్లలో తారుమారు కావడం... మరోవైపు తాను వరుసగా రెండు విజయాలు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కోనేరు హంపికి ఒక్కసారిగా ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకం కోసం, ప్రపంచ టైటిల్ కోసం పోటీపడే అవకాశం వచి్చంది. ఊహించని ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న హంపి... ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, స్థిరచిత్తంతో ఆడి ప్రత్యర్థి ఆట కట్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఊహించనిరీతిలో అద్భుత విజయం సొంతం కావడం ఎంతో మధురంగా అనిపిస్తోందని... ఈ గెలుపు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని మాస్కో నుంచి ‘సాక్షి’కి ఇచి్చన ఇంటర్వ్యూలో హంపి వ్యాఖ్యానించింది. పలు అంశాలపై హంపి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ఊహించలేదు... ర్యాపిడ్ విభాగం చివరి రోజు గేమ్‌లు మొదలయ్యే సమయానికి నేను ఐదో స్థానంలో ఉన్నా. మిగిలిన నాలుగు గేముల్లో మంచి ప్రదర్శన చేసి టాప్–3లోకి రావాలనుకున్నా. కానీ నేను రెండు గేముల్లో నెగ్గడం... ఇతర క్రీడాకారిణులు ఓడిపోవడంతో నాతోపాటు మరో ఇద్దరు లీ టింగ్జి (చైనా), ఎకతెరీనా అతాలిక్ (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోకి వచ్చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలువడంతో నేను, లీ టింగ్జి ప్రపంచ టైటిల్ కోసం టైబ్రేక్ గేమ్‌లు ఆడాల్సి వచి్చంది. సీనియర్ విభాగంలో తొలి ప్రపంచ టైటిల్ గెలిచే అవకాశం వచ్చిందని భావించాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. టైబ్రేక్ తొలి గేమ్‌లో ఓడిపోయినా... రెండో గేమ్‌లో పుంజుకొని గెలిచాను. నిర్ణాయక ‘అర్మగెడాన్’ గేమ్‌లో నల్లపావులతో ఆడాల్సి రావడం... ‘డ్రా’ చేసుకుంటే టైటిల్ ఖాయమయ్యే స్థితిలో ఈ గేమ్‌లో ఆరంభం నుంచే మంచి స్థితిలో నిలిచి చివరకు అనుకున్న ఫలితం సాధించాను. ఫలించిన నిరీక్షణ... 2001లో నేను అండర్–20 ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచా. ఆ తర్వాత పలుమార్లు ప్రపంచ చాంపియన్íÙప్లలో పాల్గొన్నాను. కొన్నిసార్లు ఆరంభ దశలోనే వెనుదిరిగాను. మరి కొన్నిసార్లు కాంస్యం, రజతంతో సరిపెట్టుకున్నాను. ఐదేళ్ల క్రితం పెళ్లి కావడం... ఆ తర్వాత పాప పుట్టడంతో రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యాను. గత ఏడాది పునరాగమనం చేశా. సంవత్సరం తిరిగేలోపు ప్రపంచ టైటిల్ సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నాను. 18 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్ కావడం గొప్ప అనుభూతినిస్తోంది. ర్యాపిడ్ ఫార్మాట్లో విశ్వకిరీటం లభించినప్పటికీ.... క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ టైటిల్ వేటను కొనసాగిస్తాను. నా కుటుంబ సభ్యులకు అంకితం... ఈ ప్రపంచ టైటిల్‌ను నా కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నాను. పునరాగమనంలో తల్లిదండ్రులు కోనేరు అశోక్, లత... భర్త దాసరి అన్వేష్ ఎంతో మద్దతు ఇస్తున్నారు. వారి సహకారం లేకపోయుంటే నేను మళ్లీ కెరీర్ కొనసాగించేదాన్ని కాదు. ఇప్పటికీ నేను రోజూ ఐదారు గంటలు నాన్న అశోక్ పర్యవేక్షణలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఆటతీరులోని లోపాలను ఎప్పటికప్పుడు ఆయన సరిదిద్దుతున్నారు. నేను టోర్నమెంట్లు ఆడేందుకు విదేశాలకు వెళ్లిన సమయంలో నా రెండేళ్ల పాప అహానాను అమ్మా, నాన్న చూసుకుంటారు. కొన్నేళ్లు తీవ్రంగా కష్టపడాల్సిందే... దాదాపు 25 ఏళ్లుగా చెస్ ఆడుతున్నాను. నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మార్పు వచి్చంది. మనలో సహజసిద్ధమైన ప్రతిభ ఉంటే కొన్నేళ్లు తీవ్రంగా కష్టపడితే తప్పకుండా ఉన్నతస్థితికి చేరుకుంటాం. కెరీర్ ఆరంభంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు తట్టుకొని స్థిరంగా నిలబడాలి. అప్పడే మంచి భవిష్యత్ ఉంటుంది. అయితే విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ వ్యవహరం చాలా ఖరీదుతో కూడుకున్నది. నాన్న అశోక్ రూపంలో నాకు మంచి కోచ్ లభించడంతో నా కెరీర్లో విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. పక్కా వ్యవస్థ ఉండాలి.... గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్‌లో చెస్‌కు ఆదరణ ఎంతో పెరిగింది. అయితే ఇప్పటికీ మనవద్ద చెస్ చాంపియన్లను తయారు చేసే పక్కా వ్యవస్థ లేదనే చెప్పాలి. బ్యాడ్మింటన్‌లో పుల్లెల గోపీచంద్ అకాడమీ మాదిరిగా చెస్లోనూ ఉంటే బాగుంటుంది. చైనా, రష్యాలలో జాతీయ జట్లకు రెగ్యులర్ కోచ్‌లు ఉంటారు. అందుకే ఆ దేశాల నుంచి రెగ్యులర్‌గా మేటి ఆటగాళ్లు తెరపైకి వస్తుంటారు. భారత్‌లో ఇప్పటివరకు వచి్చన గ్రాండ్‌మాస్టర్లు, చాంపియన్స్ తమ స్వశక్తితో పైకి వచి్చన వాళ్లే. విజయాలు సాధించాక సన్మానాలు చేసే బదులు చాంపియన్స్ తయారయ్యేలా వ్యవస్థను రూపొందించాలి. ఇప్పటికైతే వ్యక్తిగతంగా చెస్ అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన లేదు. వచ్చే ఏడాది కోసం ప్రత్యేకంగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. బరిలో దిగే టోర్నీలలో గొప్ప ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాను. ‘బ్లిట్జ్’లో సంయుక్తంగా రెండో స్థానంలో... ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి బ్లిట్జ్ విభాగంలోనూ ఆకట్టుకుంది. నిరీ్ణత 17 రౌండ్లకుగాను ఆదివారం తొమ్మిది రౌండ్లు జరిగాయి. తొమ్మిది రౌండ్ల పూర్తయ్యాక హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), దరియా చరోచ్కినా (రష్యా), అలీనా కష్లిన్స్కాయ (రష్యా)లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. 8 పాయింట్లతో కాటరీనా లాగ్నో (రష్యా) అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో మరో ఆరుగురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. నేడు మిగతా ఎనిమిది రౌండ్లు జరుగుతాయి. బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో 10 రౌండ్లు పూర్తయ్యాక భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి 7.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. నేడు మిగతా 11 రౌండ్లు జరుగుతాయి. హంపికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందన సాక్షి, అమరావతి: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకున్న తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. మాస్కోలో శనివారం రాత్రి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో చైనా ప్లేయర్ లీ టింగ్జిపై హంపి గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. హంపి సాధించిన విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. హంపికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా అభినందనలు తెలిపారు. -
దూసుకెళుతోన్న హంపి, హారిక
మాస్కో: ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. టోర్నీలో ఎనిమిది రౌండ్ల అనంతరం వీరిద్దరూ 6 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ... ర్యాంకుల్ని వర్గీకరించగా హంపి ఐదో స్థానంలో, హారిక ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 6.5 పాయింట్లతో రొమేనియా ప్లేయర్ బల్మగ ఇరినా అగ్రస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం మొత్తం నాలుగు రౌండ్లు జరుగగా హంపి ఐదో గేమ్‌లో గిర్యా ఓల్గాపై గెలుపొంది, ఆరో గేమ్‌లో బల్మగ ఇరినా చేతిలో ఓడిపోయింది. ముజిచుక్ అనాతో ఏడో గేమ్‌ను డ్రా చేసుకున్న ఆమె.. ఎనిమిదో గేమ్‌లో జనిజె ననాపై గెలుపొందింది. మరోవైపు హారిక మూడు గేమ్‌ల్ని డ్రా చేసుకొని ఒక గేమ్‌లో గెలుపొందింది. గలియామోవా అలీసా (ఆరో గేమ్)పై గెలుపొందిన హారిక... కశ్లిన్స్కాయా అలీనా (ఐదో గేమ్), పొగోనినా నటలిజా (ఏడో గేమ్), లగ్నో కాటెరినా (ఎనిమిదో గేమ్)లతో మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. -
రన్నరప్ హంపి
మోంటెకార్లో: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 7 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), అలెగ్జాండ్రా గొర్యాచికినా (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే టోర్నీ టైబ్రేక్ నిబంధనల ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కొస్టెనిక్ విజేతగా నిలిచింది. హంపి రన్నరప్‌గా నిలువగా... గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గొర్యాచికినాపై హంపి 68 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వాలెంటినా గునీనా (రష్యా), మరియా ముజిచుక్ (ఉక్రెయిన్), జావో జుయ్ (చైనా)లపై కూడా నెగ్గిన హంపి... హారిక (భారత్), నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా), కొస్టెనిక్ (రష్యా), పియా క్రామ్లింగ్ (స్వీడన్)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడింది. హారిక 11 గేములు ఆడి మూడింటిలో (ఎలిజబెత్, గునీనా, మరియాలపై) విజయం సాధించింది. నానా జాగ్‌నిద్జె, పియా క్రామ్లింగ్, అనా ముజిచుక్, హంపి, లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక... గొర్యాచికినా, కొస్టెనిక్, జావో జుయ్లతో జరిగిన మూడు గేముల్లో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నమెంట్లలో భాగంగా రెండు టోర్నీలు ముగిశాక హంపి మొత్తం 293 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. గత సెప్టెంబర్‌లో రష్యాలో జరిగిన తొలి గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపి విజేతగా నిలిచింది. గ్రాండ్‌ప్రి సిరీస్‌లో మొత్తం 15 మంది క్రీడాకారిణులు గరిష్టంగా మూడు టోర్నీల్లో ఆడతారు. ఇప్పటికే రెండు టోర్నీలు ఆడిన హంపి వచ్చే ఏడాది మే నెలలో ఇటలీలో జరిగే చివరిదైన నాలుగో గ్రాండ్‌ప్రి టోర్నీలో పాల్గొంటుంది. హారిక మాత్రం వచ్చే ఏడాది మార్చిలో స్విట్జర్లాండ్‌లో జరిగే మూడో గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆడుతుంది. ప్రస్తుతం హారిక 120 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉంది. టాప్–2లో నిలిచిన వారు క్యాండిడేట్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. క్యాండిడేట్ టోర్నీ విజేత ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్‌తో 12 గేమ్‌లు ఆడుతుంది. -
హంపికి నాలుగో స్థానం
పెంగ్షుయ్ (చైనా): ప్రపంచ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్ బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. 16 మంది మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో నిర్ణీత 22 రౌండ్లు ముగిశాక హంపి 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 11.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. చైనా గ్రాండ్‌మాస్టర్ లీ టింగ్జి 15 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. -
బెజవాడకు స్వచ్ఛ పరీక్ష
నేటి నుంచి నగరంలో సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరగనుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడంతోపాటు ప్రజాభిప్రాయాలు సేకరిస్తారు. 500 నగరాలతో పోటీ పడుతున్న బెజవాడను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ అంబాసిడర్‌గా ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిని నియమించారు. విజయవాడ సెంట్రల్ : స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు టీం సభ్యులు నగరంలోని మురికివాడలు, కాలనీలు, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్, రైల్వే, బస్స్టేషన్లలో పర్యటిస్తారు. మరుగుదొడ్లను పరిశీలించడంతో పాటు నగరపాలక సంస్థ అందిస్తు న్న సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి.. స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిని నియమించారు. ఈ మేర కు సోమవారం మేయర్ చాంబర్లో మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు ఆమెకు దుశ్శా లువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛసర్వేక్షణ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాదిగా నగరంలో ఎంతోమార్పు కనిపిస్తోందన్నారు. మేయర్, కమిషనర్ల కృషి ఫలితంగానే నగరం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతోం దన్నారు. స్వచ్ఛభారత్ కల సాకారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం అన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఇలా..... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ పాల్గొంటున్నట్లు మీకు తెలుసా.. మీ ప్రాంతం గతం కంటే ఇప్పుడు పరిశుభ్రంగా ఉందా ఈ ఏడాది మీ ప్రాంతంలోని మార్కెట్లలో చెత్త వేసేందుకు డస్ట్, లిట్టర్ బిన్స్ అందుబాటులో ఉన్నాయా .. ఇంటి నుంచి చెత్త సేకరణ నూరుశాతం జరుగుతోందా ప్రజా, సామాజిక మరుగుదొడ్లు అవసరానికి తగ్గట్లు ఉన్నాయా మరుగుదొడ్ల నిర్వహణ మెరుగ్గా ఉందా. మిస్డ్‌కాల్ ఇస్తేచాలు..: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొనదల్చి నవారు 1969 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే చాలు. వెంటనే ఫోన్ వస్తోంది. పైన పేర్కొన్న ప్రశ్నలను టీం సభ్యులు అడుగుతారు. ప్రజలు ఇచ్చే సమాధానాలను పరిగణనలోకి తీసుకొని మార్కు లు కేటాయిస్తారు. ప్రజా భిప్రాయ సేకరణకు సంబంధించి సర్వే బృందం వెయ్యిమందికి మాత్రమే ఫోన్ చేస్తోంది. ఆసక్తి గలవా రు 1969నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మార్కుల కేటాయింపు ఇలా..: మొత్తం మార్కులు 2000 కాగా, 34 అంశాలకు సంబంధించి అధికారులు రూపొందించిన డాక్యుమెంట్లు, ఫొటోలకు 900, క్షేత్రస్థాయి పరిశీలనకు 550, సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు 450 చొప్పున మార్కులు కేటాయిస్తారు. వీటి ఆధారంగానే ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా అమృత్ పథకం కింద ఎంపికైన 500 నగరాలతో బెజవాడ పోటీలో తలపడుతోంది. గతంలో ఐదు లక్షల పైబడి జనాభా ఉన్న 73 నగరాలతో పోటీ పడగా 23వ స్థానంలో నిలిచింది. -
కోనేరు హంపికి పదో స్థానం
ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పదో స్థానాన్ని సంపాదించింది. దోహాలో బుధవారం ముగిసిన 12 రౌండ్ల ఈ టోర్నీలో హంపి మొత్తం 7 పాయింట్లు సాధించింది. అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన చివరి రౌండ్లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. ఒకవేళ ఈ గేమ్‌లో హంపి గెలిచిఉంటే కాంస్య పతకం లభించేది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచింది. -
హంపి, హారికలకు నిరాశ
దోహా: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పతకం నెగ్గే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఎనిమిదో రౌండ్ ముగిశాక హారిక 4 పాయింట్లతో 16 వ స్థానంలో, హంపి 4 పాయింట్ల తోనే 20 వ స్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగిన నాలుగు గేముల్లో హంపి మూడింటిని ‘డ్రా’ చేసుకుని, మరో గేములో ఓడింది. హారిక రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుని , ఒక గేములో గెలిచి, మరో గేములో ఓడిపోయింది. బుధవారం మరో నాలుగు గేములు జరుగనున్నాయి. మరో వైపు ఓపెన్ విభాగంలో పదో రౌండ్ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ 7 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు -
హంపి, హారికలకు నిరాశ
దోహా: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పతకం నెగ్గే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఎనిమిదో రౌండ్ ముగిశాక హారిక 4 పాయింట్లతో 16వ స్థానంలో, హంపి 4 పాయింట్లతోనే 20వ స్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగిన నాలుగు గేముల్లో హంపి మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడింది. హారిక రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయింది. బుధవారం మరో నాలుగు గేమ్‌లు జరుగుతాయి. మరోవైపు ఓపెన్ విభాగంలో పదో రౌండ్ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ 7 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
హంపి, హారికలకు మిశ్రమ ఫలితాలు
దోహా: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు తొలిరోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. నాలుగో రౌండ్ ముగిసిన తర్వాత హంపి 2.5 పాయింట్లు, హారిక 2 పాయింట్లు సాధించారు. హంపి రెండు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. హారిక ఒక గేమ్‌లో గెలిచి, మరో గేమ్‌లో ఓడి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు రెండు గేముల్లో ఓడి, మరో రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. -
ముగింపు అదిరేనా?
• నేటి నుంచి ప్రపంచ బ్లిట్జ్, ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ • బరిలో ఆనంద్, హంపి, హారిక దోహా: ఈ ఏడాది మొత్తం నిలకడగా రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరో గొప్ప ప్రదర్శనతో సీజన్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం మొదలయ్యే ప్రపంచ బ్లిట్జ్, ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో హారికతోపాటు మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోనేరు హంపి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2015–2016 గ్రాండ్‌ప్రి క్లాసిక్ విభాగం సీజన్లో రన్నరప్‌గా నిలిచిన హంపి ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఈ సంవత్సరం రెండు అంతర్జాతీయ టోర్నీల్లో టైటిల్స్ సాధించడంతోపాటు చెంగ్డూ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన హారిక అదే జోరును ఈ మెగా ఈవెంట్లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. ఆదివారం కేవలం ప్రారంభోత్సవం జరుగుతుంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ర్యాపిడ్ విభాగంలో పోటీలు మొదలవుతాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు బ్లిట్జ్ కేటగిరీలో పోటీలుంటాయి. మహిళల ర్యాపిడ్ విభాగంలో మొత్తం 15 రౌండ్లు... పురుషుల ర్యాపిడ్ విభాగంలో 15 రౌండ్లు... బ్లిట్జ్ విభాగంలో 21 రౌండ్లు నిర్వహిస్తారు. మహిళల విభాగంలో 36 మంది... పురుషుల విభాగంలో 120 మంది క్రీడాకారులు బరిలో ఉన్నారు. భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు, విదిత్ సంతోషి గుజరాతి, ఆధిబన్, సూర్యశేఖర గంగూలీ, దేబాశిష్ దాస్, నీలోత్పల్ దాస్, ఎం.ఆర్.వెంకటేశ్ పాల్గొంటున్నారు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా), హికారు నకముర (అమెరికా)లతో పురుషుల విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. నాలుగు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజేతలకు 40 వేల డాలర్ల చొప్పున అందజేస్తారు. 24వ ర్యాంక్ వరకు ప్రైజ్‌మనీ ఇస్తారు. టాప్–3లో నిలిచిన వారికి ప్రైజ్‌మనీతోపాటు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
హారికకే పట్టం
‘ఫిడే’ గ్రాండ్ ప్రి విజేతగా తెలుగమ్మాయి కోనేరు హంపికి రెండో స్థానం చెంగ్డూ (చైనా): ఒలింపిక్స్‌లో చెస్ క్రీడ లేదు గానీ ఉంటే మనకు మరో రెండు పతకాలు ఖాయంగా వచ్చేవేమో! అంతర్జాతీయ యవనికపై భారత మహిళా చెస్ క్రీడాకారిణుల ఇటీవలి ప్రదర్శన చూస్తే అలాంటి భావనే కలుగుతోంది. గురువారం ఇక్కడ ముగిసిన ప్రతిష్టాత్మక ‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టోర్నీలో ఇద్దరు తెలుగు క్రీడాకారిణులు స్వర్ణ, రజతాలు సొంతం చేసుకోవడం విశేషం. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. ఆమె కెరీర్లో ఇది తొలి గ్రాండ్ ప్రి టైటిల్ కావడం మరో విశేషం. టాప్-12 క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఒక్క పరాజయం కూడా లేకుండా నిలకడగా ఆడిన హారిక, ప్రతీ రౌండ్ తర్వాత మొదటి లేదా రెండో స్థానాల్లోనే ఉంటూ తన ఆధిక్యం కొనసాగించింది. ఏపీకే చెందిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి రెండో స్థానం లభించింది. మొత్తం 11 రౌండ్ల అనంతరం ఈ ఇద్దరూ చెరో 7 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే టైబ్రేక్ ఆధారంగా హారికకు టైటిల్ దక్కింది. గిర్యా ఓల్గా (రష్యా)తో జరిగిన తన చివరి రౌండ్ మ్యాచ్‌ను హారిక 62 ఎత్తులో డ్రాగా ముగించింది. మరో వైపు హంపి తన ఆఖరి రౌండ్లో ఆంటోనెటా స్టెఫనోటా (బల్గేరియా)పై 65 ఎత్తుల్లో విజయం సాధించింది. టోర్నీలో హారిక 3 విజయాలు సాధించి 8 గేమ్‌లను డ్రా చేసుకోగా... హంపి 5 గేమ్‌లలో నెగ్గి 4 నాలుగు డ్రా చేసుకుంది. మరో 2 ఓడింది. అయితే టైబ్రేక్ నిబంధనల ప్రకారం ఈ ఇద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో హారిక గెలవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. ‘ తొలి గ్రాండ్ ప్రి టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. టోర్నీ ఆరంభం నుంచి చాలా బాగా ఆడాను. ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. అజేయంగా ముగించడం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. హంపి, నేను తరచుగా ఆడుతుంటాం కాబట్టి మా మధ్య పోటీకి ప్రత్యేకత ఏమీ లేదు. బయటినుంచి చూసేవారికి ఆసక్తికరంగా కనిపిస్తుందంతే. అయితే ఓవరాల్‌గా భారత్‌కే తొలి రెండు స్థానాలు దక్కడం మాత్రం అందరం గర్వపడే అంశం. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తా. ’ - ‘సాక్షి’తో ద్రోణవల్లి హారిక -
ఆధిక్యంలో హంపి
చెంగ్డు: ఫిడే ఉమెన్స్ గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి తమ గేమ్‌లను డ్రాగా ముగించారు. గురువారం లీలా జవకిశ్విలీతో జరిగిన గేమ్‌ను హంపి డ్రా చేసుకున్నప్పటికీ 4 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. మరో మ్యాచ్‌లో పియా క్రామ్లింగ్తో జరిగిన గేమ్ ను హారిక డ్రాగా ముగించింది. ఆమె ప్రస్తుతం 3.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. -
హంపికి మూడో విజయం
చెంగ్డూ: ఫిడే ఉమెన్స్ గ్రాండ్‌ప్రి చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్మాస్టన్ కోనేరు హంపి వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానానికి చేరింది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్లో తను టాన్ జోంగ్యి (చైనా)పై నెగ్గింది. మరోవైపు ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గేమ్‌ను డ్రాగా ముగించింది. -
హంపికి ఆరో స్థానం
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో హంపి మొత్తం ఆరు పాయింట్లు సాధించింది. చివరిదైన 11వ రౌండ్లో తెల్ల పావులతో ఆడిన హంపి 61 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను ఓడించింది. ఈ టోర్నీలో హంపి మూడు గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయి, మిగతా ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చివరిదైన 11వ రౌండ్లో జు వెన్జున్ (చైనా)తో తలపడిన హారిక 50 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. హారిక ఒక గేమ్‌లో గెలిచి, మూడింటిలో ఓడిపోయి, మిగతా ఏడింటిని ‘డ్రా’గా ముగించింది. హారిక, పియా క్రామ్లింగ్ (స్వీడన్), వాలెంటినా గునీనా (రష్యా) ముగ్గురూ 4.5 పాయింట్లు సంపాదించినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా క్రామ్లింగ్ ఎనిమిదో స్థానంలో, హారిక తొమ్మిదో స్థానంలో, వాలెంటినా పదో స్థానంలో నిలిచారు. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో జు వెన్జున్ 7.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. -
హంపి, హారిక గేమ్‌లు ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ పదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నినో బత్సియాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 68 ఎత్తుల్లో... పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. -
హంపికి రెండో గెలుపు
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో హంపి 42 ఎత్తుల్లో వాలెంటినా గునీనా (రష్యా)పై గెలుపొందింది. నినో బాత్సియాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హంపి ఖాతాలో 4.5 పాయింట్లు... హారిక ఖాతాలో 3.5 పాయింట్లు ఉన్నాయి. -
హంపి గేమ్ ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ ఎనిమిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సరాసదత్ (ఇరాన్)తో జరిగిన గేమ్‌ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... హారిక 45 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జే (జార్జియా) చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో పేస్ జంట న్యూఢిల్లీ: డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-చార్డీ (ఫ్రాన్స్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పేస్-చార్డీ జంట 6-3, 4-6, 10-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్)-సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. -
హంపి, హారిక గేమ్ లు ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నానా జాగ్‌నిద్జే (జార్జియా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో పోటీపడిన హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన గేమ్‌ను హారిక 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మూడో రౌండ్ తర్వాత హాంపి ఖాతాలో 2 పాయిం ట్లు, హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉన్నాయి. 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ 23న ముగుస్తుంది. -
హంపికి తొలి ఓటమి
మోంటెకార్లో (మొనాకో): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తొలి పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 59 ఎత్తుల్లో ఓడిపోయింది. నాలుగో రౌండ్ తర్వా త హంపి 2.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉంది. -
హంపి, హారిక గేమ్ ‘డ్రా’
అల్ అయిన్ (యూఏఈ) : ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికల మధ్య శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్ 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. హంపి, హారిక ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా... ఆరుసార్లు ‘డ్రా’తో సరిపెట్టుకోగా, ఒకసారి హంపి గెలిచింది. లలిత్ బాబు, అభిజిత్ కుంతేల గేమ్ 16 ఎత్తుల్లో డ్రా’ అయింది. ఏడో రౌండ్ తర్వాత హంపి, హారిక ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. ఇదే టోర్నీ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఏడో రౌండ్లో 36 ఎత్తుల్లో థి ఎన్గుయెన్ (వియత్నాం)పై గెలిచింది. -
హంపి, హారిక గెలుపు
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులపై గెలిచారు. శుక్రవారం జరిగిన ఆరో రౌండ్లో అబ్దుల్లా అల్ రకీబ్ (బంగ్లాదేశ్)పై హంపి; పీటర్ కొస్టెంకో (కజకిస్తాన్)పై హారిక విజ యం సాధించారు. జు యింగ్లున్ (చైనా)తో జరిగిన గేమ్‌ను లలిత్ బాబు ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత హంపి, హారిక 4 పాయింట్లతో మరో తొమ్మిది మందితో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
హంపి విజయం
ఆసియా కాంటినెంటల్ చెస్ అల్ అయిన్ (యూఏఈ) : ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ నాలుగో రౌండ్లో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజయం సాధించింది. గురువారం జరిగిన ఓపెన్ విభాగంలో తను భారత్‌కే చెందిన పి.కార్తికేయన్‌ను ఓడించింది. ప్రస్తుతం 2.5పాయింట్లతో కొనసాగుతోంది. అలాగే ఏపీకి చెందిన ద్రోణవల్లి హారిక చైనాకు చెందిన యువాన్ క్వింగ్యుతో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించింది. మరోవైపు మూడో రౌండ్లో ఓటమిని ఎదుర్కొన్న ఎంఆర్ లలిత్ బాబు నాలుగో రౌండ్లో ఎనాముల్ హొస్సేన్ (బంగ్లాదేశ్)పై నెగ్గాడు. విష్ణు ప్రసన్న, సూర్యశేఖర గంగూలీ 3.5 పాయింట్లతో సంయుక్తంగా తమ అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. -
కామన్వెల్త్ చెస్ నుంచి వైదొలిగిన హంపి
న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి అర్ధంతరంగా వైదొలిగింది. నాలుగో రౌండ్లో హిమాన్షు శర్మ చేతిలో ‘టైమ్ కంట్రోల్’ నిబంధన కారణంగా హంపి ఓడిపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై హంపి అప్పీల్ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని వివరిస్తూ హంపి అప్పీల్‌ను కమిటీ తోసిపుచ్చింది. దాంతో హంపి ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఐదో రౌండ్లో ఆర్గాదీప్దాస్తో జరిగిన గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు ‘డ్రా’ చేసుకున్నాడు. -
హంపి, లలిత్ గెలుపు
న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, లలిత్ బాబు వరుసగా మూడో విజయాన్ని సాధించారు. బుధవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నాసిర్ అహ్మద్ (బంగ్లాదేశ్)పై హంపి, రఘునందన్ (భారత్)పై లలిత్ బాబు గెలిచారు. మూడో రౌండ్ తర్వాత వీరిద్దరూ మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
మెరిసిన హారిక, హంపి
► ప్రపంచ మహిళల టీమ్ చెస్‌లో రజత, కాంస్య పతకాలు ► భారత్‌కు నాలుగో స్థానం చెంగ్డూ (చైనా): ప్రపంచ చెస్ వేదికపై మరోసారి తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి సత్తా చాటుకున్నారు. మంగళవారం ముగిసిన ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో హారిక రజత పతకం సాధించగా... హంపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ విభాగంలో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచి మరోసారి తమ అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేసింది. 2011 టర్కీలో జరిగిన ఈవెంట్లోనూ భారత్ నాలుగో స్థానాన్ని పొందింది. ఈసారి ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన భారత జట్టు 10 జట్లు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 10 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 17 పాయింట్లతో జార్జియా విజేతగా నిలువగా... 15 పాయింట్లతో రష్యా రెండో స్థానాన్ని... 11 పాయింట్లతో చైనా మూడో స్థానాన్ని సాధించాయి. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 3-1తో ఆర్మేనియాపై గెలిచింది. హంపి 52 ఎత్తుల్లో లిలిత్ చేతిలో ఓడిపోగా... హారిక 41 ఎత్తుల్లో లిలిత్ గలోజాన్పై; పద్మిని రౌత్ 59 ఎత్తుల్లో మరియా కుర్సోవాపై; సౌమ్య స్వామినాథన్ 36 ఎత్తుల్లో సుసానా గబోయాన్పై విజయం సాధించారు. ఆయా దేశాల టాప్-4 క్రీడాకారిణులు వరుసగా తొలి నాలుగు బోర్డులపై ఆడతారు. బోర్డు-2పై ఆడిన హారిక 5.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. తొలుత గేమ్‌లు ఆడిన శాతం (68.8)... ఆ తర్వాత పా యింట్ల ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ఇద్దరూ సమంగా నిలిచారు. దాంతో ఈ టోర్నీలో వీరిద్దరు కనబరిచిన రేటింగ్ ప్రదర్శన ఆధారంగా హారిక (2565)కు రజతం ఖాయమైంది. మరియా (2552)కు కాంస్యం దక్కింది. 6.5 పాయింట్లతో లిలిత్ ఎంక్రిట్చియాన్ (ఆర్మేనియా)కు స్వర్ణం లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన హారిక ఈ టోర్నీలో ఆడిన ఎనిమిది గేముల్లోనూ అజేయంగా నిలిచింది. మూడు గేముల్లో గెలిచి, మిగతా ఐదింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈజిప్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె బరిలోకి దిగలేదు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారిక రజతం సాధించడం ఇది రెండోసారి. 2011 టర్కీలో జరిగిన పోటీల్లోనూ హారిక బోర్డు-2పైనే రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఈ నెలారంభంలో రష్యాలోని సోచిలో జరిగిన ప్రపంచ చెస్ నాకౌట్ చాంపియన్‌షిప్‌లో హారిక సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక బోర్డు-1పై ఆడిన కోనేరు హంపి 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. నిబంధనల ప్రకారం పతకాన్ని ఖరారు చేసేందుకు ముందుగా ఆడిన గేమ్‌ల శాతాన్ని, ఆ తర్వాత పాయింట్లను, రేటింగ్ ప్రదర్శనను లెక్కలోకి తీసుకోవడంతో హంపి మూడో స్థానంలో నిలవాల్సి వచ్చింది. హంపి 9 గేమ్‌లు ఆడగా... హంపి కంటే ఒక గేమ్ తక్కువగా ఆడిన వాలెంటినా గునీనా (రష్యా)కు రజతం లభించింది. 7.5 పాయింట్లతో బేలా ఖొతెనాష్విలి (జార్జియా) స్వర్ణం సంపాదించింది. ఈ పోటీల చరిత్రలో హంపికిది రెండో పతకం. 2011 టర్కీలో జరిగిన ఈవెంట్లో హంపి స్వర్ణం సాధించింది. హరికృష్ణకు చేజారిన పతకం మరోవైపు ఆర్మేనియాలో ముగిసిన ప్రపంచ పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 1-3 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. డింగ్ లిరెన్‌తో గేమ్‌ను హరికృష్ణ; జియాంగ్జీతో గేమ్‌ను శశికిరణ్ ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్, దీప్ సేన్‌గుప్తా ఓడిపోయారు. వ్యక్తిగత విభాగంలో బోర్డు-1పై ఆడిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. హరికృష్ణ, డొమింగెజ్ పెరెజ్ (క్యూబా) గేమ్‌లు ఆడిన శాతం, పాయింట్ల ఆధారంగా సమఉజ్జీగా నిలిచినా... ఈ టోర్నీలో మెరుగైన రేటింగ్ ప్రదర్శన ఆధారంగా పెరెజ్ (2724)కు కాంస్యం దక్కగా, హరికృష్ణ (2707) నాలుగో స్థానంతో సంతృప్తి పడ్డాడు. ఈ టోర్నీలో హరికృష్ణ తొమ్మిది గేమ్‌లు ఆడి ఒక దాంట్లో నెగ్గి, మిగతా ఎనిమిదింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఉక్రెయిన్ను నిలువరించిన భారత్
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ చెంగ్డూ (చైనా) : ప్రపంచ చాంపియన్స్‌తో కూడిన టాప్ సీడ్ ఉక్రెయిన్ జట్టును నిలువరిస్తూ.... భారత మహిళల జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత్, ఉక్రెయిన్ జట్లు 2-2 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ అన్నా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కేవలం 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... క్లాసిక్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరియా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినాతో జరిగిన గేమ్‌లో పద్మిని రౌత్ 52 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరిదైన నాలుగో గేమ్‌లో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ సౌమ్య స్వామినాథన్ 71 ఎత్తుల్లో నటాలియా జుకోవా చేతిలో ఓడిపోవడంతో భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో భారత్ రెండు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. బుధవారం జరిగే నాలుగో రౌండ్లో రష్యాతో భారత్ ఆడుతుంది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయింది. బోరిస్ గెల్ఫాండ్‌తో పెంటేల హరికృష్ణ తన గేమ్‌ను 27 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఎవగెని పోస్ట్నీపై దీప్ సేన్‌గుప్తా గెలిచాడు. అయితే సేతురామన్ 28 ఎత్తుల్లో సుటోవ్స్కీ చేతిలో; శశికిరణ్ 35 ఎత్తుల్లో సిమిరిన్ చేతిలో పరాజయం పాలవ్వడంతో భారత ఓటమి ఖాయమైంది. -
‘డ్రా’లతో సరి...
చైనా, అమెరికాలతో భారత జట్ల డ్రా ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ చెంగ్డూ (చైనా): తొలి రౌండ్లో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న భారత మహిళల జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఆతిథ్య చైనా జట్టుతో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ను భారత్ 2-2 పాయింట్లతో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హంపి 34 ఎత్తుల్లో జూ వెన్జున్పై నెగ్గగా... హారిక 33 ఎత్తుల్లో తాన్ జాంగితో ‘డ్రా’ చేసుకుంది. పద్మిని రౌత్, షెన్ యాంగ్ల మధ్య గేమ్ 33 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... మేరీ ఆన్‌గోమ్స్ 32 ఎత్తుల్లో లీ తింగ్జి చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా జట్టుతో మ్యాచ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’గా ముగించింది. శామ్యూల్ శాంక్లాండ్తో హరికృష్ణ 46 ఎత్తుల్లో; అలెగ్జాండర్ ఒనిస్చుక్తో సేతురామన్ 34 ఎత్తుల్లో; అకోబియాన్తో శశికిరణ్ 44 ఎత్తుల్లో; నరోద్స్కీతో విదిత్ 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. -
ఆశల పల్లకిలో...
నేటి నుంచి ప్రపంచ చెస్ టీమ్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: పతకాలే లక్ష్యంగా ఏకకాలంలో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతున్నాయి. పురుషుల టీమ్ చాంపియన్‌షిప్ ఆర్మేనియాలో... మహిళల టీమ్ చాంపియన్‌షిప్ చైనాలో ఆదివారం ప్రారంభం కానున్నాయి. తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, విదిత్ షంతోష్ గుజరాతి, దీప్ సేన్‌గుప్తాలతో కూడిన భారత పురుషుల జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తం పది జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనున్న ఈ పోటీల్లో భారత్‌తోపాటు ఆర్మేనియా, చైనా, రష్యా, క్యూబా, ఈజిప్టు, హంగేరి, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, అమెరికా జట్లు పాల్గొంటున్నాయి. గతేడాది చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం సాధించినందుకు భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించింది. తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత మహిళల జట్టుకు ‘వైల్డ్ కార్డు’ కేటాయించడంతో ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. చైనా, రష్యా, ఆర్మేనియా, జార్జియా, అమెరికా, పోలండ్, ఈజిప్టు, ఉక్రెయిన్, కజకిస్థాన్ కూడా ఈ టోర్నీలో ఆడనున్నాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. భారత మహిళలకు హాకీలో మరో ఓటమి న్యూఢిల్లీ: హాక్స్ బే కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. అమెరికాతో శనివారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో టీమిండియా 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దాంతో ఆదివారం భారత జట్టు ఏడు, ఎనిమిది స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో ఆడుతుంది. -
క్వార్టర్స్‌లో హంపి ఓటమి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది. క్వార్టర్ఫైనల్లో మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన రెండు గేమ్‌ల్లో 1-1తో సమ ఉజ్జీగా నిలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్న హంపి... శనివారం జరిగిన టైబ్రేక్‌లో మాత్రం 0.5-1.5తో పరాజయం పాలైంది. తొలి టైబ్రేక్‌ను నల్లపావులతో ఆడిన హంపి 58 ఎత్తుల్లో డ్రాగా ముగించింది. రెండో టైబ్రేక్‌లో మాత్రం మరియా ఎత్తులకు చిత్తయ్యింది. తెల్లపావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ఓటమిని అంగీకరించింది. సెమీఫైనల్ పోరులో ఏపీ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో మరియా తలపడుతుంది. -
హంపికి షాక్, హారిక గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో టాప్ సీడ్ హంపి 29 ఎత్తుల్లో అనూహ్య ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో హంపికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో హంపి తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు హారిక తన ప్రత్యర్థి మేరీ అరాబిద్జె (జార్జియా)తో జరిగిన తొలి గేమ్‌ను కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వీరిద్దరి మధ్య శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో నెగ్గిన వారు సెమీఫైనల్‌కు అర్హత పొందుతారు. ఒకవేళ ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిస్తే శనివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
క్వార్టర్స్‌లో హంపి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అలీసా గలియమోవా (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 2-0తో గెలిచింది. మంగళవారం జరిగిన రెండో గేమ్ లో హంపి 53 ఎత్తుల్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో హంపికిది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మాత్రం ప్రిక్వార్టర్స్ రెండో గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో 51 ఎత్తుల్లో ఓడిపోయింది. ఫలితంగా వీరిద్దరూ 1-1తో సమఉ జ్జీగా నిలిచారు. దాంతో ఈ ఇద్దరి మధ్య బుధవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
హంపి, హారిక గెలుపు
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ జోరు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో వీరిద్దరూ గెలిచారు. అలీసా గలియమోవా (రష్యా)తో జరిగిన గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 38 ఎత్తుల్లో గెలుపొందగా... ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 55 ఎత్తుల్లో అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగే రెండో గేమ్‌లో హంపి, హారిక ‘డ్రా’ చేసుకుంటే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
మూడో రౌండ్‌కు హంపి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. శనివారం లీ తింగ్జీ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లోనూ హంపి విజయం సాధించింది. దీంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ముగించింది. మరోవైపు ద్రోణవల్లి హారిక, ఇరీనా క్రుష్ (అమెరికా)తో తన రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా డ్రా చేసుకుంది. నేడు (ఆదివారం) జరిగే టైబ్రేకర్‌లో నెగ్గినవారు మూడో రౌండ్‌కు వెళతారు. -
హంపి గెలుపు, హారిక గేమ్ ‘డ్రా’
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన విజయపరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 66 ఎత్తుల్లో లీ తింగ్జి (చైనా)పై గెలిచింది. శనివారం జరిగే రెండో గేమ్‌ను హంపి కనీసం ‘డ్రా’ చేసుకున్నా మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన రెండో రౌండ్ తొలి గేమ్‌ను ఇరీనా క్రుష్ (అమెరికా)తో 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
రెండో రౌండ్‌కు హంపి, హారిక
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హంపి 2-0తో అయా మొతాజ్ (ఈజిప్టు)పై, హారిక 2-0తో తతేవ్ అబ్రహమియాన్ (అమెరికా)పై విజయం సాధించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ రెండో గేమ్‌లో హంపి 28 ఎత్తుల్లో అయా మొతాజ్ను ఓడించగా... హారిక 51 ఎత్తుల్లో తతేవ్ అబ్రహమియాన్పై గెలిచింది. భారత్‌కే చెందిన మేరీ ఆన్ గోమ్స్ తన ప్రత్యర్థి తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా)తో జరిగిన రెండో గేమ్‌ను 24 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లూ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించడానికి గురువారం టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి రెండో రౌండ్ పోటీలు జరుగుతాయి. -
హంపి, హారిక శుభారంభం
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. అయా మొతాజ్ (ఈజిప్టు)తో మంగళవారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో టాప్ సీడ్ హంపి 31 ఎత్తుల్లో విజయం సాధించగా... హారిక 57 ఎత్తుల్లో తతేవ్ అబ్రహమియాన్ (అమెరికా)ను ఓడించింది. తొలి రౌండ్ ప్రత్యర్థులతోనే బుధవారం జరిగే రెండో గేమ్‌ను హంపి, హారిక కనీసం ‘డ్రా' చేసుకున్నా రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం గురువారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. మేరీ ఆన్ గోమ్స్ (భారత్), తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా)ల మధ్య జరిగిన మరో తొలి రౌండ్ గేమ్ 80 ఎత్తుల్లో ‘డ్రా'గా ముగిసింది. -
హంపి, హారిక విజయం
మహిళల గ్రాండ్ ప్రి చెస్ షార్జా: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ తొలి రౌండ్లో ఓటమి పాలైన మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి... రెండో రౌండ్లో విజయాన్ని దక్కించుకుంది. మంగళవారం షార్జాలో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో రుమేనియాకు చెందిన ఎల్ అమీ అలీనాను ఓడించింది. తెల్ల పావులతో ఆడిన హంపి 48 ఎత్తుల్లో ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మరో గేమ్‌లో ద్రోణవల్లి హారిక 50 ఎత్తుల్లో ముమినోవా నఫీసా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది. -
కోనేరు హంపి వివాహం వేడుక
-
హంపి వెడ్స్ అన్వేష్
-
హంపి పెళ్లికూతురాయెనే...
వైభవంగా చెస్ స్టార్ వివాహంసాక్షి, విజయవాడ: చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పెళ్లికూతురుగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. విజయవాడకే చెందిన పారిశ్రామికవేత్త దాసరి అన్వేష్‌తో బుధవారం రాత్రి ఎ-కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా హంపి వివాహం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చెస్ క్రీడాకారులు, కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వివాహానికి హాజరయ్యారు. -
కోనేరు హంపి పెళ్లికూతురాయె