File Photo
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్‌లో ఇరాన్‌కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్ రౌండ్‌లో వియత్నాం గ్రాండ్ మాస్టర్ ఫామ్ లే థావో న్గుయెన్‌ను చిత్తు చేసింది. దీంతో మూడో రౌండ్‌కు హంపి అర్హత సాధించింది.
అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్‌లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్‌లో సింగపూర్ గ్రాండ్‌మాస్టర్ కియాన్యున్ గాంగ్‌ను ఓడించింది. అయితే పురుషల చెస్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
మొదటి రౌండ్‌లో విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్‌లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్‌లో కజికిస్తాన్‌కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు.
తొలిరౌండ్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్.. రెండవ రౌండ్ గేమ్‌ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్‌తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్ పోటోలు జరగనున్నాయి.
భారత ఖాతాలో తొలి గోల్డ్‌మెడల్
ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్ గేమ్స్‌లో భారత్ కైవసం చేసుకుంది.
చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్..
Comments
Please login to add a commentAdd a comment