Harika Dronavalli
-
‘బంగారు తల్లి’ హారిక ద్రోణవల్లి.. అందమైన కుటుంబం (ఫొటోలు)
-
తిరంగాతో భారత్‌కు పాక్ విషెస్.. హాకీ ఆటగాళ్లలా కాదు!
చెస్ ఒలింపియాడ్-2024లో భారత్ విజయోత్సవాల సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో దేశానికి తొలిసారి పసిడి పతకాలు అందించిన అనంతరం భారత పురుషుల జట్టు సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ క్రీడాకారులుమ సంతోషాన్ని పంచుకున్నారు.ఈ క్రమంలో.. పాకిస్తాన్ టీమ్ సైతం త్రివర్ణ పతాకం ప్రదర్శిస్తూ.. టీమిండియాను విష్ చేసింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రశంసలు, విమర్శలుక్రికెట్, హాకీ, టెన్నిస్.. క్రీడ ఏదైనా మ్యాచ్ జరుగుతున్న వేళ అభిమానులు భావోద్వేగాలు నియంత్రించుకోలేరు. మ్యాచ్ ఫలితం ఆధారంగా ఆయా జట్ల ఆటగాళ్లపై ప్రశంసలు, విమర్శలు కురుస్తాయి. ఇక ఇటీవల ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీ సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గ్రూప్ స్టేజిలో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. సెమీ ఫైనల్‌కు చేరినా అక్కడ చైనా చేతిలో పరాజయం పాలైంది. పాక్ హాకీ ఆటగాళ్లు చైనా జెండాలతోమూడోస్థానం కోసం పోటీపడి కాంస్యాన్ని దక్కించుకుంది. అయితే, ఫైనల్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు వ్యవహరించినతీరు విమర్శలకు తావిచ్చింది. భారత్- చైనా టైటిల్ కోసం పోటీపడుతున్న వేళ.. పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు చైనా జెండాలు చేతబట్టి ఆ జట్టుకు తమ మద్దతు ప్రకటించారు. తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తిఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవడంతో.. వారి ముఖాలు వాడిపోయాయి. అయితే, చెస్ ఒలింపియాడ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించడం విశేషం. భారత జట్టుతో కలిసి పాక్ టీమ్ తిరంగాను ప్రదర్శిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటింది.స్వర్ణ చరిత్రఇక భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా- పాక్ ప్లేయర్ అర్షద్ నదీం సైతం తమ స్నేహబంధంతో ఇరు దేశాల అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే.బుడాపెస్ట్‌లో జరిగిన మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుని పసిడి పతకం కైవసం చేసుకుంది.మరోవైపు.. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.చదవండి: ‘యువతరానికి బ్రాండ్ అంబాసిడర్లు’Pakistani Chess Team with the Champions of Chess Olympiad 2024 - Team India!#chess #chessbaseindia #ChessOlympiad2024 #india pic.twitter.com/LHEveDvEOt— ChessBase India (@ChessbaseIndia) September 26, 2024 -
Harika Dronavalli: ఖమ్మం కోడలు బంగారం!
ఖమ్మం స్పోర్ట్స్: చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగిన ద్రోణవల్లి హారికకు జిల్లా క్రీడాకారులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. అయితే, జట్ల విజయంలో కీలకంగా వ్యవహరించిన ద్రోణవల్లి హారిక ఖమ్మం కోడలే కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. హారిక స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా కాగా, ఖమ్మంకు చెందిన చంద్ర వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర కార్తీక్‌తో 2018లో వివాహం జరిగింది. తొలినాళ్ల నుంచి అంతర్జాతీయ టోర్నీలపై దృష్టి సారించిన ఆమెకు 2022లో కుమార్తె జన్మించింది. అయినప్పటికీ భర్త, పాపతో కలిసి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటూ నైపుణ్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్న హారిక ఇప్పుడు చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటడం విశేషం. -
World Blitz Chess : రెండో స్థానంలో ద్రోణవల్లి హారిక
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఏడు పాయింట్లతో మరో నలుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచింది. హారిక ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఒక గేమ్‌లో ఓడిపోయింది. నేడు మిగతా ఎనిమిది రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 6 పాయింట్లతో 13వ ర్యాంక్‌లో, 6 పాయింట్లతో నూతక్కి ప్రియాంక 24వ ర్యాంక్‌లో... రక్షిత, కోనేరు హంపి 5.5 పాయింట్లతో వరుసగా 28వ, 31వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఓపెన్ విభాగంలో 11 రౌండ్ల తర్వాత భారత గ్రాండ్ మాస్టర్లు నిహాల్ సరీన్, ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. నేడు మిగతా పది రౌండ్లు జరుగుతాయి. -
Asian Games 2023 chess: శుభారంభం చేసిన కోనేరు హంపి, హారిక
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్లో ఇరాన్‌కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్ రౌండ్లో వియత్నాం గ్రాండ్ మాస్టర్ ఫామ్ లే థావో న్గుయెన్‌ను చిత్తు చేసింది. దీంతో మూడో రౌండ్‌కు హంపి అర్హత సాధించింది. అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్లో సింగపూర్ గ్రాండ్‌మాస్టర్ కియాన్యున్ గాంగ్‌ను ఓడించింది. అయితే పురుషల చెస్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్లో విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్లో కజికిస్తాన్‌కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. తొలిరౌండ్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్.. రెండవ రౌండ్ గేమ్‌ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్ పోటోలు జరగనున్నాయి. భారత ఖాతాలో తొలి గోల్డ్‌మెడల్ ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్ గేమ్స్‌లో భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. -
మార్పును స్వాగతించాలి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కబళించని రంగం లేదు. ఈ వైరస్ బారిన పడి నష్టపోని వ్యాపారం మనకు కనిపించదు. ముఖ్యంగా క్రీడారంగంపై దీని ప్రభావం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వైరస్ దెబ్బకు ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్సే వెనక్కి వెళ్లిపోయాయి. ఐపీఎల్ స్థితి అగమ్యగోచరంగా తయారైంది. మైదానాలు బోసి పోతున్నాయి. ఆటలెప్పుడు ప్రారంభమవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కోవిడ్–19 కట్టడి తర్వాత కూడా పరిస్థితులు మాత్రం మునుపటిలా ఉండవంటున్నారు దిగ్గజ క్రీడాకారులు. మ్యాచ్‌ల కోసం ప్రేక్షకులు పోటెత్తడం కష్టమేనని అంటున్నారు. జట్టుగా ఆడే క్రీడల్లో ఆటగాళ్లు స్వేచ్ఛగా కదల్లేరంటూ... కరోనా తర్వాత ఆటల్లో వచ్చే మార్పు గురించి భారత క్రీడారంగం ప్రముఖులు సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా, మేరీకోమ్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, సాయిప్రణీత్, మహేశ్ భూపతి వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... మరో మాటకు తావు లేకుండా మన జీవితకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. దీని కారణంగా బౌలర్లు బంతిని మెరిపించేందుకు ఉమ్మిని వాడాలంటే జంకుతారు. మైదానంలో సహచరులను కౌగిలించుకోవాలన్నా, అభినందించాలన్నా భయపడతారు. ఆటలోనూ భౌతిక దూరం పాటిస్తారు. –సచిన్ టెండూల్కర్ (క్రికెటర్) ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే సాధనం క్రీడలు. వీటికి ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు ఆరోగ్య భద్రత కోసం విధించిన ఆంక్షలు భవిష్యత్‌లో మేలు చేస్తాయి. సాధారణ ప్రజలు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ వహించి ఆటలను జీవితంలో భాగంగా చేసుకుంటారు. – అభినవ్ బింద్రా (షూటర్) క్రీడలు ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. ఒక్కసారి వైరస్ నుంచి మనం బయటపడితే యథావిధిగా ఆటలు జరుగుతాయి. –మహేశ్ భూపతి (టెన్నిస్ ప్లేయర్) పరిస్థితి సద్దుమణిగి ప్రపంచం మునుపటిలా మారిపోవాలని మనందరం కోరుకుంటున్నాం. కానీ అలా జరిగే అవకాశం కనిపించట్లేదు. కంటికి కనబడని ఈ శత్రువు కారణంగా ఆట స్వరూపం మారుతోంది. ప్రత్యర్థిని తాకకుండా బాక్సింగ్‌లో తలపడలేం. ఇదే ఆందోళన కలిగిస్తోంది. ప్రాక్టీస్‌లో కూడా తీవ్రత తగ్గిపోయింది. దీనికి నేను వ్యతిరేకం. అంతా చక్కబడ్డాక మ్యాచ్ చూసేందుకు అభిమానులు వస్తారు. వారి కోసం అత్యున్నత స్థాయిలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలి. వ్యాక్సిన్ కనిపెడితే మునుపటి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. అంతవరకు ప్రయాణాలు, ప్రాక్టీస్ అన్ని విషయాల్లో రాజీ పడాల్సిందే. – మేరీకోమ్ (బాక్సర్) అభిమానులతో మైదానాల్లో క్రీడల నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితం కాదు. మరో ఏడాది వరకు ఆటల్ని నిర్వహించకపోవడమే ఉత్తమం. నా అభిప్రాయం ప్రకారం మనం కొంతకాలం ఓపిక పట్టాల్సిందే. – కోనేరు హంపి (చెస్ గ్రాండ్‌మాస్టర్) ప్రపంచం దీని నుంచి బయటపడేందుకు మరికొంత సమయం పడుతుంది. దాదాపు ఒక సీజన్ క్రీడలు ఆగిపోయాయి. చాలా మంది క్రీడాకారులను ఇది ప్రభావితం చేస్తుంది. మరో ఆరు నెలలు లేదా సంవత్సరంలో ఎటువంటి సమస్య లేకుండా ఆటలు జరుగుతాయని అనుకుంటున్నా. – హారిక (చెస్ గ్రాండ్‌మాస్టర్) బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడే క్రమంలో చైనా, కొరియా లాంటి దేశాలకు తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆడే సమయంలో లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనస్సులో కచ్చితంగా వైరస్‌కు సంబంధించిన భయం ఉంటుంది. మ్యాచ్ సమయంలో షర్ట్ మార్చుకునేటపుడు లేదా షటిల్‌ను ఆటగాళ్లు, సర్వీస్ జడ్జి తాకాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాకే ఆట జరగాలని కోరుకుంటున్నా. – సాయిప్రణీత్ (షట్లర్) -
చెస్ ఒలింపియాడ్‌కు హంపి, హారిక, ఆనంద్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారీ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. మహిళల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టులోని మిగతా మూడు బెర్త్‌ల కోసం తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి, ఆర్.వైశాలి రేసులో ఉన్నారు. అయితే మే 1వ తేదీన మిగతా ముగ్గురు క్రీడాకారిణుల పేర్లను ఖరారు చేస్తామని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేరు ఖరారైంది. ర్యాంకింగ్ ప్రకారం పెంటేల హరికృష్ణ, విదిత్ ఎంపిక కూడా లాంఛనమే. మిగతా రెండు బెర్త్‌ల కోసం ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం రేసులో ఉన్నారు. చెస్ ఒలింపియాడ్ ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 18 వరకు రష్యా రాజధాని మాస్కోలో జరుగుతుంది. మొత్తం 180 దేశాలు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నాయి. -
హారిక రెండో గేమ్ ‘డ్రా’
లుసానే (స్విట్జర్లాండ్): ‘ఫిడే’ మహిళల చెస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మేరీ సెబాగ్‌తో మంగళవారం జరిగిన రెండో గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ పియా క్రామ్లింగ్తో సోమవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హారిక 37 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో రౌండ్ తర్వాత హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉంది. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
తొలిసారి ఓటు వేయబోతున్నాను : చెస్ స్టార్
ఆమె చదరంగ క్షేత్రంలో తన ప్రత్యర్థులపై ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చెక్ పెడుతుంది. ప్రత్యర్థి వేసే ఎత్తులను వెంటనే పసిగట్టి... ఎలాంటి ఎత్తు వేస్తే తనకు విజయం పాదాక్రాంతమవుతుందో ముందుచూపుతో ఆలోచిస్తుంది. చిన్ననాటి నుంచి చదరంగంపై మక్కువతో పావులను తన ఆరో ప్రాణంగా మార్చుకుని జిల్లా స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు చెస్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ వయో విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ చెస్ క్రీడాకారిణియే ద్రోణవల్లి హారిక. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన చెస్ గ్రాండ్‌మాస్టర్ హారికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత నాలుగో పౌర పురస్కారం ‘పద్మశ్రీ’తో గౌరవించింది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు కులం, మతం ప్రాతిపదికన కాకుండా సమర్థుడైన నాయకుడికి ఓటు వేయాలని ఆమె సూచించింది. గతంలో ఎన్నికల వేళ టోర్నీలు ఆడుతూ విదేశాల్లో ఉన్నకారణంగా ఓటు వేయలేకపోయానని... ఈసారి కచ్చితంగా తన ఓటును వినియోగించుకుంటానని హారిక తెలిపింది. ప్రభుత్వాలు ఏవైనా దేశం కోసం పేరు తెచ్చే క్రీడాకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారికిచ్చే హామీలను సకాలంలో నెరవేర్చాలని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హారిక తెలిపింది. పలు అంశాలపై హారిక వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజకీయ పార్టీలు క్రీడల గురించి ప్రస్తావించకపోవడానికి కారణమేంటి? ఒకవేళ ప్రస్తావిస్తే ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటారు? ఇతర రంగాలతో పోలిస్తే క్రీడా రంగంలో ఉండే వారి సంఖ్య తక్కువ. అందుకే రాజకీయ పార్టీలు క్రీడల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయవేమోనని నా అభిప్రాయం. నా సలహా ప్రకారమైతే మంచి ఫలితాలు సాధించే క్రీడాకారులకు సముచిత రీతిలో నగదు పురస్కారాలు ఇవ్వాలి. వారికి సరైన సమయంలో సరైన గుర్తింపు ఇవ్వాలి. ముఖ్యంగా క్రీడాకారులకు ఇచ్చే హామీలు సకాలంలో అమలుచేసే చిత్త్తశుద్ధి ఉండాలి. ఈ విషయాల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదు. క్రీడా సమాఖ్యల్లో రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం ఉండటాన్ని మీరు సమర్థిస్తారా? వారి వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తారా? క్రీడా సమాఖ్యల్లో క్రీడా నేపథ్యమున్న వారుంటే సత్ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారుల తల్లిదండ్రులకు స్థానం కల్పించినా ఫర్వాలేదు. క్రీడలతో పరిచయం లేని వారుంటే క్రీడాకారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయంపై వారికి అవగాహన ఉండదు. క్రీడాకారులందరికీ ప్రభుత్వాలు సమప్రాధాన్యత ఇస్తున్నాయా? కొందరికి భారీ మొత్తంలో నజరానాలు లభిస్తాయి... మరికొందరిని అసలే పట్టించుకోరు. ఈ విషయంలో మీ అభిప్రాయం? క్రీడాకారులందరికీ ప్రభుత్వాలు సమ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కచ్చితంగా చెప్పగలను. ఎక్కడా సమతుల్యత కనిపించడంలేదు, పాటించడంలేదు. ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. అన్నీ ఉన్న వారికి ఇంకా ఇస్తూ పోతే అది క్రీడాభివృద్ధికి దోహదపడదు. అర్హత లేని వారిని కూడా అందలం ఎక్కిస్తున్నారు. గొప్ప ఫలితాలు సాధించకున్నా ప్రభుత్వాల నుంచి భారీ మొత్తంలో నగదు పురస్కారాలు పొందిన వారున్నారు. క్రీడాకారులకు నజరాలు ఇచ్చే విషయంలో లోటుపాట్లు ఉండకూడదనుకుంటే సమర్థులైన క్రీడాధికారులను నియమించాలి. ఏ క్రీడాకారుడికి ఎంత మొత్తం ఇవ్వాలి, వారికి ఏ రకమైన సహాయం అవసరం ఉందనే విషయాలపై వారికి మంచి అవగాహన ఉండాలి. మన దేశం క్రీడలను ప్రేమించే దేశమని, క్రీడలు ఆడే దేశం కాదని గతంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. క్రీడల్లో భారత్ అగ్రగామి కావాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? సచిన్ అన్నది నిజమే. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన క్రీడాకారులకు ప్రేమాభిమానాలు లభిస్తాయి. అయితే చాలా దేశాల్లో ఇది కనిపించదు. అయితే క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే విషయంలో చాలా మంది రిస్క్ తీసుకోవాలనుకోరు. కనీసం డిగ్రీ కలిగి ఉంటే తమ పిల్లలకు ఉద్యోగభద్రత ఉంటుందని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఈ విషయంలో ఇప్పుడిపుడే తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారుతోంది. అయితే ఇక్కడా ఓ సమస్య ఉంది. అవసరమైనంత సమయం కేటాయించకుండా తక్కువ సమయంలో, తొందరగా సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు. ఏ రంగంలోనైనా సక్సెస్ లభించాలంటే చాలా కష్టపడాలి. ఎంతో ఓపిక ఉండాలి. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉండాలి. ఇలాంటి రిస్క్ తీసుకుంటే క్రీడలపట్ల ఆకర్షితులయ్యే సంఖ్య పెరుగుతుంది. రాజకీయాలను, రాజకీయ పార్టీల వార్తలను ఫాలో అవుతారా? నిజం చెప్పాలంటే అంతగా పట్టించుకోను. అయితే ఇంట్లో సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి అప్పడప్పుడు మాట్లాడుకుంటారు. ఆ సమయంలోనే వాటి గురించి తెలుసుకుంటానుతప్ప ప్రత్యేకంగా రాజకీయాల గురించి ఆలోచించను. రాబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకుంటారా? ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన సమయాల్లో నేను దేశం తరఫున టోర్నీలు ఆడేందుకు విదేశాల్లో ఉండాల్సి రావడంతో ఓటు వేయలేకపోయాను. ఈసారి మాత్రం ఇక్కడే ఉంటున్నాను. తొలిసారి తప్పకుండా నా ఓటు వేయబోతున్నాను. తెలుగు రాష్ట్రాల ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటి? తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అభ్యర్థులు మన కులం వాళ్లని, మన మతం వాళ్లని చూడకుండా సమర్థుడైన నాయకుడికి ఓటు వేయండి. –కరణం నారాయణ -
హారిక గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఏడో ‘డ్రా’ నమోదు చేసింది. జార్జియా గ్రాండ్‌మాస్టర్ బేలా ఖోటెనాష్విలితో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హారిక 4.5 పాయింట్లతో ఇరీనా క్రుష్ (అమెరికా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. తొమ్మిదో రౌండ్లో ఇరీనా క్రుష్‌తో హారిక ఆడుతుంది. -
హారిక తొలి గెలుపు
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ‘డ్రా’ల పరంపరకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయం నమోదు చేసింది. జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 79 ఎత్తుల్లో గెలుపొందింది. పది మంది క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత హారిక 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), వాలెంటినా గునీనా (రష్యా) ఐదు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
సంగీత్‌లో అదరగొట్టిన చెస్ క్వీన్
సాక్షి, హైదరాబాద్ : చెస్ క్వీన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి పెళ్లి పీటలెక్కుతోంది. రేపు(ఆగస్టు 19న) ఈమె వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్ ఇంజినీర్ కార్తీక్ చంద్రను ఆమె పెళ్లాడుతోంది. హైదరాబాద్‌లో ఆమె సంగీత్ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. సంగీత్‌లో పాల్గొన్న ప్రముఖులు, సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ ఆట పాటలతో సందడి చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు సైతం ఆమె కుటుంబ సభ్యులతో పాల్గొని, సంగీత్‌ను ఎంజాయ్ చేశారు. ఈ సంగీత్‌లో చెస్ క్వీన్ వేసిన స్టెపులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చెక్ క్వీన్ అ..ఆ మూవీలోని ఓ సాంగ్‌కు డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఆహా నా పెళ్లంట.. ఓహోనా పెళ్లంట అనే పాటలకే వేసిన డ్యాన్స్‌లు కూడా సంగీత్‌ను సూపర్బ్ అనిపించాయి. హారిక జనవరి 12న గుంటూరులో జన్మించింది.చిన్నప్పటి నుంచే చెస్‌పై ఇష్టం పెంచుకున్న హారిక అద్భుతంగా రాణించింది. అండర్-9 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక.. 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. కోనేరు హంపి తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి రికార్డు కెక్కింది. -
పెళ్లి పీటలెక్కనున్న ద్రోణవల్లి హారిక...
భారత స్టార్ చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పెళ్లి కూతురు కానుంది. సివిల్ ఇంజనీర్ అయిన కార్తీక్ చంద్రతో ఈనెల 18న హైదరాబాద్‌లో హారిక వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 19న పెళ్లి జరుగుతుంది. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన హారిక... 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. -
హారిక పరాజయం
న్యూఢిల్లీ: అబుదాబి ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో ఓటమిని చవిచూసింది. ఇవాన్ రోజుమ్ (రష్యా)తో సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ఓడింది. -
భారత చెస్ జట్ల విజయం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు నెగ్గాయి. మహిళల జట్టు 2.5–1.5తో పోలాండ్‌పై... పురుషుల జట్టు 3.5–0.5తో అమెరికాపై గెలిచాయి. మోనికా సాకో–ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక; జోలాంటా–తానియా; జోనా మజ్దాన్–విజయలక్ష్మి మధ్య జరిగిన గేమ్‌లు ‘డ్రా’కాగా... కరీనాతో జరిగిన గేమ్‌లో పద్మిని రౌత్ 77 ఎత్తుల్లో గెలిచి భారత విజయాన్ని ఖాయం చేసింది. పురుషుల జట్టులో ఆదిబన్, శశికిరణ్, నేగి తమ గేముల్లో గెలుపొందగా... విదిత్ గేమ్ ‘డ్రా’ చేసుకున్నాడు. నాలుగో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో, మహిళల జట్టు మూడో స్థానంలో ఉన్నాయి. -
భారత మహిళల జట్టుకు తొలి ఓటమి
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన మూడో రౌండ్లో భారత్ 1.5–2.5తో ఓడిపోయింది. అనా ఉషెనినాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 62 ఎత్తుల్లో; లులిజా ఉస్మాక్‌తో జరిగిన గేమ్‌ను ఇషా కరవాడే 50 ఎత్తుల్లో; నటాలియా బుక్సాతో జరిగిన గేమ్‌ను పద్మిని రౌత్ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇనా గపోనెంకో చేతిలో తానియా సచ్దేవ్ 83 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు భారత పురుషుల జట్టు 2.5–1.5తో బెలారస్‌పై గెలిచి ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. విదిత్, పరిమార్జన్ నేగి, శశికిరణ్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ఆదిబన్ నెగ్గి భారత్‌ను గెలిపించాడు. -
హారిక గేమ్ ‘డ్రా’
టెపి సిజ్మన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో ‘డ్రా’ నమోదు చేసింది. స్వీడన్‌లోని మాల్మో నగరంలో జొబావా (జార్జియా)తో శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హారిక 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
నిరాశ... అయినా ఆనందమే!
ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనపై ‘సాక్షి’తో హారిక సాక్షి, హైదరాబాద్: గత రెండు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలతో సంతృప్తి పడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తుందని అందరూ భావించారు. అయితే కీలకదశలో అదృష్టం కలిసి రాకపోవడంతో ఆమె మూడోసారీ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనా క్రీడాకారిణి తాన్ జోంగితో చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ టైబ్రేక్‌లో హారిక ఓటమి చవిచూసింది. ఈసారీ హారిక కాంస్యమే నెగ్గినా అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. వరుసగా మూడు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ (నాకౌట్ ఫార్మాట్) పోటీల్లో పతకం నెగ్గిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2004, 2008, 2010లలో) కూడా మూడు కాంస్యాలు నెగ్గినా వరుస చాంపియన్‌షిప్‌లలో ఆమె ఈ పతకాలను సాధించలేదు. ఈ టోర్నీ వేదికగా నిలిచిన ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం బయలుదేరేముందు ఈ మెగా ఈవెంట్లో ప్రదర్శనపై హారిక ‘సాక్షి’తో ముచ్చటించింది. మూడోసారీ కాంస్యమే సాధించారు... ఎలా అనిపిస్తోంది? నా అనుభూతిని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఒకవైపు నిరాశ కలుగుతోంది. మరోవైపు వరుసగా 3సార్లు ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించినందుకు ఆనందంగా కూడా ఉంది. టోర్నీ ఆసాంతం మీ ప్రదర్శనను విశ్లేషిస్తే... క్లాసికల్ గేమ్స్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. సులువుగా గెలవాల్సిన చోట లేదా ‘డ్రా’ చేసుకోవాల్సిన సమయంలో కాస్త తడబడ్డాను. అయినప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఒత్తిడిని అధిగమించి రాణించినందుకు సంతోషంగా ఉన్నాను. సెమీఫైనల్ టైబ్రేక్‌లో ఎక్కడ పొరపాటు జరిగింది? ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన టైబ్రేక్ తొలి గేమ్‌లో బాగా ఆడి గెలిచాను. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్న సమయంలో రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవాలనే తొందరలో తప్పటడుగు వేశాను. కీలక దశలో బంటును కోల్పోయి గేమ్‌లో ఓటమి చెందాను. ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన సెమీఫైనల్ రెండో గేమ్‌లో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ గేమ్ ఆరంభంలోనే నేను విజయావకాశాలను సృష్టించుకున్నాను. కానీ కీలకదశలో పొరపాటు చేసి నా ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చాను. అయితే ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో అనుభవాన్నంతా రంగరించి పోరాడాను. చివరకు 6 గంటలపాటు జరిగిన ఈ గేమ్‌లో నేను 162 ఎత్తుల వరకు ఆడాల్సి వచ్చింది. సెమీఫైనల్ చేరే క్రమంలో మీకు అన్ని మ్యాచ్‌లలో టైబ్రేక్‌లోనే విజయాలు దక్కడాన్ని ఎలా చూస్తారు? ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కాబట్టి అందరూ పక్కాగా సిద్ధమై వచ్చారు. నా తొలి రౌండ్ ప్రత్యర్థి బంగ్లాదేశ్‌కు చెందిన షమీమా ఆమె రేటింగ్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. నాకౌట్ టోర్నమెంట్ కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా, రిస్క్ తీసుకోకుండా ఆడాను. అయితే అన్ని టైబ్రేక్‌లలో నా ప్రదర్శన బాగా ఉంది. ఈ టోర్నీలో నాతోపాటు ఉన్న మా అమ్మమ్మ అన్ని విధాలా అండగా నిలిచింది. క్లిష్ట సమయంలో ఆమె మద్దతు నాకు ఎంతో ఉప యోగపడింది. ఎలాంటి విరామం తీసుకోకుండా వచ్చే నెలలో రెండు అంతర్జాతీయ టోర్నీలలో (షార్జా, ఐస్లాండ్) ఆడనున్నాను. -
ఐదో ర్యాంక్‌కు హారిక
జియాజింగ్ (చైనా): గత రెండు నెలల నుంచి అద్భుతంగా రాణిస్తున్న భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. తన ర్యాంకింగ్‌ను కూడా గణనీయంగా మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో హారిక 10 నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. ఇటీవల చెంగ్డూలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ టైటిల్‌ను గెలవడం హారికకు బాగా కలిసొచ్చింది. మరోవైపు చైనాలోనే జరుగుతున్న చైనీస్ చెస్ లీగ్‌లోనూ హారిక జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షాన్‌డోంగ్ టీమ్ తరఫున వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. డు యుక్సిన్తో జరిగిన ఈ గేమ్‌లో హైదరాబాదీ పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టింది. టీమ్ షాంఘైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ... గ్జూ మింగ్యు (జియాంగ్ టీమ్)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. -
హరికృష్ణ జోరు
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్‌గేమ్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బ్లిట్జ్ ఈవెంట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలిరోజు ఆదివారం 10 రౌండ్లు పూర్తయ్యాక రెండో స్థానంలో నిలిచిన హరికృష్ణ... సోమవారం 20 రౌండ్లు ముగిశాక రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం హరికృష్ణ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. రెండో రోజు జరిగిన 10 రౌండ్ల గేముల్లో హరికృష్ణ నాలుగింటిలో గెలిచి, ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 20 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మంగళవారం మరో 10 రౌండ్లు జరుగుతాయి. -
రెండో స్థానంలో హరికృష్ణ
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్‌గేమ్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బ్లిట్జ్ ఈవెంట్లో రాణించాడు. ఆదివారం 10 రౌండ్లు ముగిశాక హరికృష్ణ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రికృష్ణ ఆరు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. మరో గేమ్‌లో ఓడిపోయాడు. సోమవారం మరో పది రౌండ్లు, మంగళవారం మిగతా పది రౌండ్లు జరుగుతాయి. మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 10 రౌండ్ల తర్వాత 4.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. -
హరికృష్ణకు ఏడో స్థానం
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ మైండ్ గేమ్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక నిరాశ పరి చారు. పురుషుల ర్యాపిడ్ విభాగంలో హరికృష్ణ ఏడో స్థానంలో... మహిళల ర్యాపిడ్ విభాగంలో హారిక 14వ స్థానంలో నిలిచారు. నిర్ణీత ఏడు రౌండ్ల త ర్వాత హరికృష్ణ నాలుగు పాయింట్లు సాధించగా... హారిక 2.5 పాయింట్లు సంపాదించింది. పురుషుల విభాగంలో షక్రియార్ మమెదైరోవ్ (అజర్బైజాన్-5 పాయిం ట్లు), మహిళల విభాగంలో తాన్ జోంగి (చైనా-6 పాయింట్లు) విజేతలుగా నిలిచారు. -
హంపికి రెండో గెలుపు
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో హంపి 42 ఎత్తుల్లో వాలెంటినా గునీనా (రష్యా)పై గెలుపొందింది. నినో బాత్సియాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హంపి ఖాతాలో 4.5 పాయింట్లు... హారిక ఖాతాలో 3.5 పాయింట్లు ఉన్నాయి. -
హంపి, హారిక గేమ్ లు ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నానా జాగ్‌నిద్జే (జార్జియా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో పోటీపడిన హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన గేమ్‌ను హారిక 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మూడో రౌండ్ తర్వాత హాంపి ఖాతాలో 2 పాయిం ట్లు, హారిక ఖాతాలో ఒక పాయింట్ ఉన్నాయి. 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ 23న ముగుస్తుంది. -
హంపి, హారిక గేమ్ ‘డ్రా’
అల్ అయిన్ (యూఏఈ) : ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికల మధ్య శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్ 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. హంపి, హారిక ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా... ఆరుసార్లు ‘డ్రా’తో సరిపెట్టుకోగా, ఒకసారి హంపి గెలిచింది. లలిత్ బాబు, అభిజిత్ కుంతేల గేమ్ 16 ఎత్తుల్లో డ్రా’ అయింది. ఏడో రౌండ్ తర్వాత హంపి, హారిక ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. ఇదే టోర్నీ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఏడో రౌండ్లో 36 ఎత్తుల్లో థి ఎన్గుయెన్ (వియత్నాం)పై గెలిచింది.