అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులపై గెలిచారు. శుక్రవారం జరిగిన ఆరో రౌండ్‌లో అబ్దుల్లా అల్ రకీబ్ (బంగ్లాదేశ్)పై హంపి; పీటర్ కొస్టెంకో (కజకిస్తాన్)పై హారిక విజ యం సాధించారు. జు యింగ్‌లున్ (చైనా)తో జరిగిన గేమ్‌ను లలిత్ బాబు ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత హంపి, హారిక 4 పాయింట్లతో మరో తొమ్మిది మందితో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.