ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు నెగ్గాయి. మహిళల జట్టు 2.5–1.5తో పోలాండ్‌పై... పురుషుల జట్టు 3.5–0.5తో అమెరికాపై గెలిచాయి. మోనికా సాకో–ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక; జోలాంటా–తానియా; జోనా మజ్దాన్–విజయలక్ష్మి మధ్య జరిగిన గేమ్‌లు ‘డ్రా’కాగా... కరీనాతో జరిగిన గేమ్‌లో పద్మిని రౌత్ 77 ఎత్తుల్లో గెలిచి భారత విజయాన్ని ఖాయం చేసింది. పురుషుల జట్టులో ఆదిబన్, శశికిరణ్, నేగి తమ గేముల్లో గెలుపొందగా... విదిత్ గేమ్ ‘డ్రా’ చేసుకున్నాడు. నాలుగో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో, మహిళల జట్టు మూడో స్థానంలో ఉన్నాయి.