సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఏడు పాయింట్లతో మరో నలుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచింది. హారిక ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఒక గేమ్‌లో ఓడిపోయింది. నేడు మిగతా ఎనిమిది రౌండ్ గేమ్‌లు జరుగుతాయి.
భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 6 పాయింట్లతో 13వ ర్యాంక్‌లో, 6 పాయింట్లతో నూతక్కి ప్రియాంక 24వ ర్యాంక్‌లో... రక్షిత, కోనేరు హంపి 5.5 పాయింట్లతో వరుసగా 28వ, 31వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఓపెన్ విభాగంలో 11 రౌండ్ల తర్వాత భారత గ్రాండ్ మాస్టర్లు నిహాల్ సరీన్, ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. నేడు మిగతా పది రౌండ్లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment