డైరెక్టర్ బాబీ కొల్లిగా తెలుగు సినిమా అభిమానులకు దగ్గరయిన ఆయన అసలు పేరు కె.ఎస్.రవీంద్ర.. గుంటూరుకు చెందిన బాబీ బి.కామ్‌లో డిగ్రి పూర్తి చేసి సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో విజయం సాధించాడు. ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతోనే సినిమాలు చేశాడు. రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చాలామంది బాబీ కొల్లి ఎవరు..? తన ఫ్యామిలీ ఏంటి..? విషయాలపై చర్చించుకుంటున్నారు.
ఘోస్ట్ రైటర్‌గా..
టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా బాబీ కొల్లి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయన మొదట ఘోస్ట్ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో పనిచేశారు. ఈక్రమంలో మొదటిసారి 2008 సమయంలో శ్రీహరి నటించిన హిట్ సినిమా 'భద్రాద్రి' కథతో బాబీ తన ప్రయాణం కొనసాగించారు. తర్వాత డాన్ శీను,బాడీగార్డ్,ఓ మై ఫ్రెండ్ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు. బలుపు,అల్లుడు శీను వంటి చిత్రాలకు కథను అందించిన ఆయన తొలిసారి 2014లో రవితేజ పవర్ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ అందుకున్నాడు. అక్కడి నుంచి తనదైన స్టైల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ,జై లవ కుశ,వెంకీ మామా,వాల్తేరు వీరయ్య,డాకు మహారాజ్ వంటి టాప్ సినిమాలు తెరకెక్కించాడు.
చెస్ క్రీడాకారిణి హారిక సోదరితో ప్రేమ.. పెళ్లి తర్వాత కష్టాలు
చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి అక్క అనూషను బాబీ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె జన్మించింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి బాబీ ఇలా చెప్పాడు. అనూష తన జీవితంలోకి రావడం తన అదృష్టమని బాబీ అన్నారు. 'స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే తనను నేను ప్రేమించాను. ఒక సందర్భంలో నీళ్ల బాటిల్ షేర్ చేసుకోవడంతో మొదలైన మా పరిచయం ఫైనల్‌గా పెళ్లి వరకు చేరింది. అనూష స్కూల్ టాపర్.. చాలా కష్టపడి చదువుతుంది. ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్‌గా సత్తా చాటిన ఆమె వేలూరులో ఎంటెక్ పూర్తి చేసింది. అక్కడ కూడా గోల్డ్ మెడలిస్ట్‌గానే తనేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ సమయంలో ఏమీ లేని ఈ బాబీని అనూష పెళ్లి చేసుకోవాలని అనుకుంది.
ఆమె కుటుంబం కూడా చాలా పెద్దది. అయినా కూడా ఆమె నన్ను ఇష్టపడింది. కూతురిపై ప్రేమతో ఆమె తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ సమయంలో నేను ఘోస్ట్ రైటర్‌గా మాత్రమే ఉన్నాను. కనీసం స్క్రీన్ మీద నా పేరు కూడా పడేది కాదు. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ వారందరూ నన్ను నమ్మారు. హైదరాబాద్‌లో సంపాదన లేకుండా జీవించడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ పెళ్లి తర్వాత చాలా కష్టాలు పడ్డాం.
ఆమె తల్లిదండ్రులు మాకు సపోర్ట్ చేయాలని అనుకున్నప్పటికీ మేమే వారికి తెలిపే వాళ్లం కాదు. అలా ఇబ్బందులు మా ఇంటిలోపలి వరకే ఉంచాం. సినిమా ఛాన్స్‌ల కోసం వెతక్కుంటూనే ఎదోలా ఇంటి అద్దెలతో పాటు ఈఎంఐలు చెల్లించేవాళ్లం. అలా మొదలైన మా ప్రయాణం.. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎన్నీ మారినా అనూష మారలేదు. ఇప్పటికీ సింపుల్‌గానే ఉంటుంది. ఒక స్టార్ డైరెక్టర్ భార్య అని కూడా చెప్పుకోదు. కారు ఉన్నా కూడా పాపను స్కూటీలోనే స్కూల్‌కు తీసుకెళ్తుంది. నా జీవితానికి ఆమె ఆదర్శం' అంటూ తన భార్యపై ప్రశంసలు కురిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment