World Blitz Chess Championship for Women
-
World Blitz Chess : రెండో స్థానంలో ద్రోణవల్లి హారిక
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఏడు పాయింట్లతో మరో నలుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచింది. హారిక ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఒక గేమ్‌లో ఓడిపోయింది. నేడు మిగతా ఎనిమిది రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 6 పాయింట్లతో 13వ ర్యాంక్‌లో, 6 పాయింట్లతో నూతక్కి ప్రియాంక 24వ ర్యాంక్‌లో... రక్షిత, కోనేరు హంపి 5.5 పాయింట్లతో వరుసగా 28వ, 31వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఓపెన్ విభాగంలో 11 రౌండ్ల తర్వాత భారత గ్రాండ్ మాస్టర్లు నిహాల్ సరీన్, ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. నేడు మిగతా పది రౌండ్లు జరుగుతాయి. -
World Blitz Chess: హంపి అద్భుతం
అల్మాటీ (కజకిస్తాన్): ఊహకందని ఆటతీరుతో అదరగొట్టిన భారత మహిళా చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. నిర్ణీత 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి రోజు గురువారం తొమ్మిది రౌండ్లు ముగిశాక హంపి 5 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉండటంతో ఆమెకు పతకం నెగ్గే అవకాశాలు లేవని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హంపి రెండో రోజు జరిగిన ఎనిమిది గేముల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు గేముల్లో గెలవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 44వ స్థానం నుంచి ఏకంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది. 13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్) విజేతగా నిలువగా... 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ. 24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్‌లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్ సాధించగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 12 పాయింట్లతో 42వ ర్యాంక్‌లో నిలిచారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో హంపి సాధించిన మొత్తం పతకాలు. ర్యాపిడ్ విభాగంలో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకం గెలిచింది. బ్లిట్జ్ విభాగంలో రజతం రూపంలో తొలిసారి పతకం సాధించింది. -
ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హంపికి ఐదో స్థానం
వార్సా (పోలాండ్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఐదో స్థానం దక్కింది. గురువారం ముగిసిన మహిళల ఈవెంట్లో ఆమె 11.5 పాయింట్లతో టాప్–5లో నిలిచింది. 17 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 16వ రౌండ్ ముగిసే సరికి రెండో స్థానంలో నిలిచిన హంపికి ఆఖరి రౌండ్ ఫలితం నిరాశను మిగిల్చింది. చివరి రౌండ్లో నల్లపావులతో బరిలోకి దిగిన తెలుగమ్మాయికి రష్యాకు చెందిన పొలిన షువలొనా చేతిలో ఓటమి ఎదురైంది. ఈ బ్లిట్జ్ ఈవెంట్లో హంపి 10 గేముల్లో గెలిచి నాలుగు పోటీల్లో ఓడింది. మరో మూడు గేముల్ని డ్రా చేసుకుంది. టోర్నీలో కజకిస్తాన్ టీనేజర్ బిబిసర అసాబయెవా విజేతగా నిలిచింది. 17 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ బిబిసర 13 గేముల్ని గెలిచి, రెండు డ్రా చేసుకోవడం ద్వారా 14 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
హంపికి 12వ స్థానం
మాస్కో: ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్న భారత మహిళల చెస్ నంబర్‌వన్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి బ్లిట్జ్ విభాగంలో మాత్రం తడబడింది. సోమవారం ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో 32 ఏళ్ల హంపి నిర్ణీత 17 రౌండ్ల తర్వాత 10.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హంపికి 12వ స్థానం ఖాయమైంది. 14వ రౌండ్ వరకు రెండో స్థానంలో కొనసాగి స్వర్ణ, రజత, కాంస్య పతకాల రేసులో నిలిచిన హంపి వరుసగా 15, 16, 17వ రౌండ్లలో ఓడిపోయి పతకావకాశాలను చేజార్చుకుంది. ఓవరాల్‌గా బ్లిట్జ్ టోర్నీలో హంపి ఎనిమిది గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా నాలుగు గేముల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 10 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కాటరీనా లాగ్నో 13 పాయింట్లతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 12.5 పాయింట్లతో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) రజతం, 12 పాయింట్లతో తాన్ జోంగి (చైనా) కాంస్య పతకం దక్కించుకున్నారు. ఎదురులేని కార్ల్సన్ ఓపెన్ ర్యాపిడ్ విభాగంలో టైటిల్ గెలిచిన ప్రపంచ నంబర్‌వన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ బ్లిట్జ్ విభాగంలోనూ విశ్వవిజేతగా అవతరించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత కార్ల్సన్, హికారు నకముర (అమెరికా) 16.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య రెండు గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న కార్ల్సన్... రెండో గేమ్‌లో నకమురను ఓడించి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో కార్ల్సన్ చెస్‌లోని క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు. -
హారికకు పదో స్థానం
ఖాంటీమన్సిస్క్ (రష్యా): ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పదో స్థానంలో నిలిచింది. 34 మంది క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఈ పోటీల్లో నిర్ణీత 30 రౌండ్లు ముగిశాక హారిక 16.5 పాయింట్లు సాధించింది. చివరిరోజు సోమవారం హారిక ఒక్క గేమ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. 23 పాయింట్లు సాధించిన అనా ముజిచుక్ (స్లొవేనియా) విజేతగా నిలిచింది. నానా జాగ్నిజ్దె (జార్జియా-20.5 పాయింట్లు) రజతం... తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా-20 పాయింట్లు) కాంస్యం గెలిచారు.