వార్సా (పోలాండ్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఐదో స్థానం దక్కింది. గురువారం ముగిసిన మహిళల ఈవెంట్‌లో ఆమె 11.5 పాయింట్లతో టాప్–5లో నిలిచింది. 17 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 16వ రౌండ్ ముగిసే సరికి రెండో స్థానంలో నిలిచిన హంపికి ఆఖరి రౌండ్ ఫలితం నిరాశను మిగిల్చింది. చివరి రౌండ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన తెలుగమ్మాయికి రష్యాకు చెందిన పొలిన షువలొనా చేతిలో ఓటమి ఎదురైంది.
ఈ బ్లిట్జ్ ఈవెంట్‌లో హంపి 10 గేముల్లో గెలిచి నాలుగు పోటీల్లో ఓడింది. మరో మూడు గేముల్ని డ్రా చేసుకుంది. టోర్నీలో కజకిస్తాన్ టీనేజర్ బిబిసర అసాబయెవా విజేతగా నిలిచింది. 17 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ బిబిసర 13 గేముల్ని గెలిచి, రెండు డ్రా చేసుకోవడం ద్వారా 14 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది.
చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment