చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటిన ద్రోణవల్లి హారిక
జిల్లా వాసి కార్తీక్‌తో 2018లో వివాహం
ఖమ్మం స్పోర్ట్స్: చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగిన ద్రోణవల్లి హారికకు జిల్లా క్రీడాకారులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. అయితే, జట్ల విజయంలో కీలకంగా వ్యవహరించిన ద్రోణవల్లి హారిక ఖమ్మం కోడలే కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు.
హారిక స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా కాగా, ఖమ్మంకు చెందిన చంద్ర వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర కార్తీక్‌తో 2018లో వివాహం జరిగింది. తొలినాళ్ల నుంచి అంతర్జాతీయ టోర్నీలపై దృష్టి సారించిన ఆమెకు 2022లో కుమార్తె జన్మించింది. అయినప్పటికీ భర్త, పాపతో కలిసి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటూ నైపుణ్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్న హారిక ఇప్పుడు చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment