
సోషల్ మీడియా జమానాలో చీటికిమాటికి గొడవలు పడి వేరు కాపురాల దగ్గరి నుంచి.. విడాకుల లాంటి తీవ్ర నిర్ణయాల దాకా వెళ్తున్న జంటలు షరామాములుగా మారిపోయాయి. ఈ తరుణంలో భార్యభర్తల అనుబంధానికి ప్రతీకగా నిలిచే జంటలూ అక్కడక్కడా.. అప్పుడప్పుడే మనకు కనిపిస్తున్నాయి. అదిగో అలాంటి అరుదైన జంట గురించి.. భార్య మీద అపరిమితమైన ప్రేమ ఉన్న గొప్ప భర్త గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.
భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడు?. ఎవరి సంగతి ఎందుకోలేండి.. ఇక్కడ.. ఈ భర్త మాత్రం ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా తన భార్య, కూతురు.. ఇద్దరినీ తన వెంటే ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు.
వెంకటేష్ నందిని.. సొంతూరు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. గత ఏడు సంవత్సరాలుగా వలసజీవనానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతానికి.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నివాసముంటున్నారట. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి వర్ధన్నపేట వద్ద సాక్షి వర్ధన్నపేట రిపోర్టర్ అజీజుద్దీన్‌కు కనిపించారు. వాళ్లను పలకరించగా..
చాన్నాళ్లుగా నందినికి ఫిట్స్ ఉందట. ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్తే.. ఆమెకు జరగరానిది ఏదైనా జరుగుతుందేమోనని ఆయన భయమట. అందుకే నందినితో పాటు కుమార్తె ఆదిలక్ష్మిని ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో తీసుకెళ్తూ నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment