Wardhannapet
-
విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్ భూతం
-
పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పోలీసు అధికారులకు ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీపీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నాగరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియర్లు ఉన్నప్పటికీ టికెట్ దక్కించుకుని వర్ధన్నపేట నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై విజయం సాధించారు. ప్రచారంలో కూడా వెనుకే.. నాగరాజు ఎన్నికల ప్రచారం అంతంతమ్రాతమే చేశారు. ఆయన గెలుపునకు నాయకులు, కార్యకర్తలే కష్టపడ్డారు. నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాల్లో ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తమకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. ప్రభుత్వంపై వ్యతిరేకత నాగరాజు గెలు పునకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. -
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
వర్ధన్నపేటలో అసమ్మతి సెగ!
వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య. సీసీ, బిటి రోడ్లు పూర్తీ స్ధాయిలో లేవు. తీవ్రంగా వేదిస్తున్న డ్రైనేజీ సమస్య. త్రాగు నీరు సమస్య. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. 8 మండలాల్లో రెండు మూడు చోట్ల మాత్రమే నిర్మించారు. ధరణి వల్ల భూ సమస్యలు. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ ఆరూరి రమేష్ కాంగ్రెస్ కేఆర్ నాగరాజు మాజీ ఐపిఎస్ అధికారి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బీజేపీ కొండేటి శ్రీధర్ మాజీ ఎమ్మల్యే (కొత్త వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోంది) నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. రాజకీయ అంశాలు : వర్ధన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉండగా మూడోసారి కూడా అధిష్టానం అతనికే టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : వర్దన్నపేట నియోజకవర్గం వరంగల్, హన్మకొండ జిల్లాల చుట్టు ఉంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు వర్దన్నపేట నియోజకవర్గం ఉంది. వర్ధన్నపేట నుంచి హసన్ పర్తి అటు నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు విస్తరించి ఉంది. నదులు : వర్ధన్నపేట ఆకేరు వాగు, కోనారెడ్డీ, పర్వతగిరి రిజర్వాయర్. పర్యాటకం : ఖిలా వరంగల్ కోట, ఐనవోలు, పర్వతగిరి అన్నారం షరీఫ్ దర్గా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా ఉన్న మామునూరు విమానాశ్రయం. 4th బెటాలియన్, రాష్ట్రంలోని ప్రధాన పోలిస్ ట్రైనింగ్ సెంటర్. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం, పర్వతగిరి. అన్నారం యాకుబ్ శావలి దర్గ -
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం ఈ అభ్యర్థికి హ్యాట్రిక్ లభించనుందా..!
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం వర్ధన్న పేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆరూరి రమేష్ రెండోసారి విజయం సాదించారు.ఆయనకు 97670 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2014లో ఆయనకు 86వేలపైచిలుకు మెజార్టీ వస్తే 2018లో అది ఇంకా పెరిగింది. రమేష్ తన సమీప తెలంగాణ జనసమితి ప్రత్యర్ధి పి.దేవయ్యపై విజయం సాధించారు. మహాకూటమిలో బాగంగా ఇక్కడ టిజెఎస్ పోటీచేసింది.బిజెపి పక్షాన పోటీచేసిన కె.సారంగారావుకు సుమారు 5400 ఓట్లు వచ్చాయి.రమేష్ కు 128764 ఓట్లు రాగా, దేవయ్యకు 31094 ఓట్లు వచ్చాయి. వర్ధన్న పేట నియోజకవర్గంలో 2014లో అప్పటి సిటింగ్ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌ను ఆరూరి రమేష్ 86349ఓట్ల తేడాతో ఓడిరచారు. రమేష్ 2009లో స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయినా, 2014, 2018లలో వర్దన్నపేట నుంచి విజయం సాధించారు. ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్యక్షుడు మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసి 2014లో ఇక్కడ పోటీచేసినా 20526 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి చెందారు. రెండువేల తొమ్మిదిలో మందకృష్ణ ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో ఇక్కడ టిఆర్ఎస్ తరపున పోటీచేసిన సీనియర్ నేత విజయరామారావు తదుపరి పరిణామాలలో కాంగ్రెస్ ఐలో చేరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో ఆయన ఘనపూర్ నుంచి గెలిచి టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. కొంతకాలం వై.ఎస్. మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికలలో వర్ధన్నపేటలో పోటీచేసి పరాజితులయ్యారు. ఈయన గతంలో మెదక్‌జిల్లా గజ్వేలు నుంచి ఒకసారి గెలిచారు. అలాగే సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి వర్ధన్నపేట దళితులకు రిజర్వు అయింది. దాంతో అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి కి మారి మరో మూడుసార్లు గెలిచి మొత్తం ఆరుసార్లు గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. దయాకరరావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు గెలిచారు. దయాకరరావు2008లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. దయాకరరావు కొంతకాలం విప్‌గా పనిచేశారు. తెలంగాణ తొలి శాసనసభలో టిడిపి పక్ష నేత అయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి మారి, 2018 ఎన్నికలలో ఆ పార్టీ పక్షాన గెలిచి మంత్రి అయ్యారు. వర్ధన్నపేటలో ఒకసారి ఇండిపెండెంటుగా, మరోసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరుపున గెలిచిన టి.పురుషోత్తంరావు ఇంకోసారి వరంగల్ నుంచి కాంగ్రెస్ ఐ తరుపున గెలిచారు. అప్పట్లో తెలంగాణ వాదిగా వున్న పురుషోత్తంరావు, ఆ తర్వాత కాలంలో కోట్ల విజయ భాస్కరరెడ్డి క్యాబినెట్‌లోను, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చాక మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఛెర్మన్గాను పనిచేశారు. ఇక్కడ నుంచి మాచర్ల జగన్నాథం ఒకసారి జనతా పక్షాన, మరోసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. వర్ధన్నపేటలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, ఎన్‌టిపిఎస్ ఒకసారి, జనతా ఒకసారి గెలవగా, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. 1952లోవర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ సీట్లను, వరంగల్ లోక్‌సభ సీటును గెలిచిన పెండ్యాల రాఘవరావు అసెంబ్లీ సీట్లను వదిలి లోక్‌సభకు వెళ్ళారు. వర్ధన్నపేట జనరల్‌గా ఉన్నప్పుడు ఆరుసార్లు వెలమ, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసిలు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి ఇతరులు గెలిచారు. వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
భార్య ఆత్మహత్య తట్టుకోలేక భర్త బలవన్మరణం.. అనాథలైన ముగ్గురు పిల్లలు
సాక్షి, వరంగల్: భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక భర్త సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన స్వర్ణకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం సీత్యతాండాకు చెందిన బానోత్ మురళి(30)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఐషు, అమ్ములు, అభిరామ్ ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మురళి మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమంగా తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. తాగుడు మానాలని భార్య స్వర్ణ ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలో అటు కుటుంబ బాధ్యతలు పెరగడం, భర్త మద్యానికి బానిసై మాట వినకపోడంతో విసుగు చెందిన స్వర్ణ ఈనెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మత్తు వీడిన తర్వాత భార్య ఆత్మహత్యను తట్టుకోలేక గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో పురుగుల మందు తాగి మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో పసి పిల్లలు అనాథలుగా మారారు. -
వరంగల్: ఘోర ప్రమాదంలో కుటుంబం బలి
సాక్షి, వరంగల్: జిల్లాలో రహదారి మరోసారి నెత్తుటి మరకలు అంటించుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్ని జిల్లాలోని పెరుకవాడకు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి.. ఆయన భార్య వరలక్ష్మి, కొడుకు వెంకటసాయి రెడ్డిగా గుర్తించారు. ఒంగోల్ నుండి వరంగల్ వస్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన ఆరుగురికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఘటన జరిగిన సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: అయ్యో బిడ్డ.. అంటూనే కుప్పకూలిన తల్లి -
తల్లులు ఇళ్లలో... తనయులు పొలాల్లో..!
వర్ధన్నపేట: కలిసిమెలిసి ఉంటున్న కుటుంబసభ్యులను కరోనా చెట్టుకొకరు, పుట్టకొకరుగా చేస్తోంది. అసలే చిన్న ఇళ్లు కావడంతో వసతుల్లేక తల్లులను ఇళ్లలో ఉంచి తనయులు పొలాల్లో తలదాచుకోవ్సాలిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ కరోనా సోకిన ఇంట పరిస్థితి. వివరాలు... వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బోయిన వెంకటలక్ష్మికి వారం క్రితం కరోనా సోకింది. దీంతో బయటకు రావొద్దని ఆ కుటుంబసభ్యులను గ్రామస్తులు కట్టడి చేశారు. కానీ, వారిది చిన్న ఇల్లు కావడం, లోపల విడివిడిగా ఉండే అవకాశం లేకపోవడం కష్టంగా మారింది. దీంతో తల్లి వెంకటలక్ష్మిని అదే ఇంట్లో ఉంచిన ఆమె కుమారుడు రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయాడు. అక్కడ ట్రాక్టర్‌నే ఇంటిగా మార్చుకొని నివాసముంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన బుస్స సారమ్మకు సైతం కరోనా సోకింది. దీంతో ఆమెను ఇంట్లోనే ఉంచి ఆమె కుమారుడు ఎల్లస్వామి, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గ్రామసమీపంలోని మామిడి తోటలో జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయమై బుధవారం బాధితులను ఆరా తీయగా తమ ఇళ్లలో మరుగుదొడ్డి ఒకటే ఉండటం, ఇళ్లు చిన్నవి కావడంతో తమ తల్లులను అక్కడే ఉంచి పొలాల్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. అయితే, వర్ధన్నపేటలో ఐసోలేషన్ కేంద్రం ఉన్నట్లుగా వీరికి సమాచారం లేకపోవడం గమనార్హం. చదవండి: మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుపైనే -
కొడుకు కోసం చూసి.. కూతురుని అమ్మేశారు
సాక్షి, వర్ధన్న పేట : వారు ఇద్దరు-వారికి ఇద్దరు కూతుర్లు. అయినా కొడుకు కావాలంటూ మూడోసారి మందులు వాడారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్న సంగతి తెలియక పూజలు కూడా చేశారు. అయినా మూడో సంతానంగా మరో ఆడశిశువుకు జన్మనిచ్చారు. దీంతో ముగ్గురి పోషణ భారం అంటూ అప్పుడే పుట్టిన ముక్కుపచ్చలారని పసిబిడ్డను అంగడిలో వస్తువులా అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న ఊరి వాసులు నిలదీయడంతో తప్పు ఒప్పుకున్నారు.. వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డిసితాండాకు చెందిన మాలోత్ నరేష్, రజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయినా మగ సంతానం కోసం వేచి చూడగా ఈనెల 3న మరో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. దీంతో ముగ్గురి పోషణ భారం అంటూ మద్యవర్తులు నీలగిరి స్వామి తాండాకు చెందిన భూక్యా, బౌన్ సింగ్‌ల ద్వారా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన ప్రవీణ్‌కు రూ.80 వేలకు అమ్మారు. పాపను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ డబ్బు మొత్తానికి ప్రామిసరీ నోటు రాయించి, పాపను అధికారికంగా దత్తత తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారు. విషయం కాస్తా తాండాలో బయటకు పొక్కడంతో మాలోత్ నరేష్ దంపతులను తాండావాసులు గట్టిగా నిలదీశారు. అయితే వారి వద్ద నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు
-
బిర్యానీ వండటం రాదన్న సాకుతో...
సాక్షి, వరంగల్: బిర్యానీ వండట్లేదని.. భార్యను వద్దన్నాడు ఓ ప్రబుద్ధుడు. బిర్యానీ వండటం రాదన్న సాకుతో పెళ్ళైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు భర్త. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది ఓ వివాహిత. వివరాలు... వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి ఖాజిపేట దర్గాకు చెందిన మానస అనే యువతితో 2016 నవంబరులో వివాహం జరిగింది. సుమారు రూ. 7 లక్షల కట్నం ఇచ్చారు. పెళ్ళైన రెండు నెలలకే బిర్యానీ వండట్లేదని గొడవ చేసి ఇంట్లో నుండి వెళ్లగొట్టాడని బాధితురాలు మానస తెలిపింది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే రాజేంద్రప్రసాద్ రోజు తాగి వచ్చి గొడవ చేసేవాడని, అత్త, ఆడపడుచు సైతం తిట్టేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 10 నెలలు గడిచినా భర్త తీసుకెళ్లడానికి రాకపోవడంతో ఆవేదనకు గురైన మానస తన తల్లి తండ్రులతో కలిసి భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగేవరకు తన భర్త ఇంటి ముందు నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. మానస ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విషయం ఆరా తీశారు. -
డప్పుకట్టి చిందేసిన ఎమ్మెల్యే
-
స్వైన్ ఫ్లూతో వర్ధన్నపేట ఏసీపీ మృతి!
-
ఏడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
వర్ధన్నపేట టౌన్ (వరంగల్ జిల్లా) : వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సోమవారం పట్టుకున్నారు. బంతిని గ్రామం సమీపంలో ట్రాక్టర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమష్టిగా పరిష్కార మార్గం చూపాలి: జేడీ శీలం
వర్ధన్నపేట: రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలపై ఇరుప్రాంతాల ప్రజాప్రతినిధులు కలిసి చర్చించి, పరిష్కార మార్గం చూపాలని కేంద్రమంత్రి జేడీ శీలం కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన ఓ వివాహానికి బుధవారం ఆయన హాజరయ్యారు. అనంతరం ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో రాజధాని అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగస్తుల్లో అభద్రత భావం నెలకొందని, రాయలసీమలో తాగునీరు భయం పట్టుకుందన్నారు. ఈ క్రమంలో సీమాంధ్రలో ప్రజలు 75 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. వారి సమస్యలపై ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవాలన్నారు.