మనిషిని చంపి, ముక్కలు చేయడమెలా? | Khammam incident: Telangana | Sakshi
Sakshi News home page

మనిషిని చంపి, ముక్కలు చేయడమెలా?

Oct 10 2025 5:54 AM | Updated on Oct 10 2025 5:54 AM

Khammam incident: Telangana

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ తిరుపతిరెడ్డి

యూట్యూబ్‌లో చూసి నిందితుల స్కెచ్‌...

ఖమ్మంలో డబ్బు కోసం కిరాతకం 

నిద్రిస్తున్న స్నేహితుడిని గొంతు కోసి హతమార్చి ఆపై ముక్కలుగా నరికిన వైనం 

శరీర భాగాలను బైక్‌పై దూరంగా తరలించి విసిరేసిన కేటుగాళ్లు 

మృతుడి ఫోన్‌ నుంచి డబ్బు బదిలీ కావడంతో కేసును ఛేదించిన పోలీసులు 

ముగ్గురి అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

ఖమ్మం రూరల్‌: ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడిన పరిచ యం స్నేహంగా మారి అసహజ శృంగార బంధానికి దారితీసింది. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి.. రెండో వ్యక్తి అడిగినప్పుడల్లా డబ్బు అప్పుగా ఇచ్చేవాడు. అయితే అతన్ని చంపితే ఆ డబ్బంతా సొంతం చేసుకోవచ్చని రెండో వ్యక్తికి దుర్బుద్ధి పు ట్టింది. అంతే.. వెంటనే తనకు పరిచయమైన మూడో వ్యక్తి తోపాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం మృతదేహా న్ని ముక్కలుగా నరికి పడేశాడు. మృతదేహాన్ని ఎలా ముక్కలు చేయాలో యూట్యూబ్‌ వీడియోలు చూసి అమలు చేశాడు. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో బయటపడ్డ ఒళ్లు జలదరించే విషయాలివి. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. ఆ వివరాలను గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 

జీతం సరిపోక.. సాగు కలిసిరాక 
ఏపీలోని ఎనీ్టఆర్‌ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్‌ ఎం.ఫార్మసీ చదివాక తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కడే ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. జీతం సరిపోక గ్రామంలో కూరగాయలు సాగు చేసినప్పటికీ నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాడు. ఆపై ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలెంకు చెందిన కొమ్ము నగ్మాతో ఏర్పడిన పరిచ యం వివాహేతర సంబంధానికి దారితీసింది.

వారిద్దరూ ఖమ్మంలో ఉండేవారు. మరోవైపు అశోక్‌కు కామేపల్లి మండలం కెపె్టన్‌ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లు (ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం)తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. తరచూ అశోక్‌ గదికి వచ్చే వెంకటేశ్వర్లు అతని అవసరానికి డబ్బు అప్పు ఇచ్చేవాడు. ఈ క్రమంలో అశోక్, వెంకటేశ్వర్లు నడుమ అసహజ సంబంధం ఏర్పడింది. ఆపై అశోక్‌కు డ్రిప్‌ కంపెనీలో పనిచేసిన పెంటి కృష్ణయ్య పరిచయమయ్యాడు. వారిద్దరూ వెంకటేశ్వర్లు వద్ద డబ్బు బాగా ఉందని భావించి దోచుకోవాలని కుట్రపన్నారు. 

యూట్యూబ్‌లో చూసి.. 
వెంకటేశ్వర్లు హత్యకు సిద్ధమైన నిందితులు ఇందుకోసం యూట్యూబ్‌ వీడియోలు చూశారు. నిద్రలో ఉన్నప్పుడు కత్తితో గొంతు కోస్తే శబ్దం రాకుండా చనిపోతాడని నిర్ణయానికి వచ్చారు. అలాగే మృతదేహాన్ని ముక్కలుగా ఎలా నరకాలో కూడా తెలుసుకున్నారు. ఇందుకోసం కత్తులు సిద్ధం చేసుకున్నారు. గత నెల 15న రాత్రి వెంకటేశ్వర్లు అశోక్‌ ఇంటికి వచ్చి పడుకోవడంతో 16న తెల్లవారుజామున నగ్మాను బయట కాపలా ఉంచిన అశోక్‌.. కృష్ణయ్యతో కలిసి వెంకటేశ్వర్లు గొంతు భాగంలో కత్తితో పలుమార్లు నరికాడు. దీంతో అతని తల, మొండెం వేరయ్యాయి.

ఆపై మృతదేహాన్ని ముక్కలుగా కోసి కవర్లలో కుక్కి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి కరుణగిరి ప్రాంతంలో పడేశారు. అనంతరం గదిలో రక్తం మరకలను శుభ్రం చేశారు. అయితే వెంకటేశ్వర్లు తిరిగి హైదరాబాద్‌ చేరుకోకపోవడంతో ఆయన సోదరుడు యాదగిరి గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. వెంకటేశ్వర్లు ఫోన్‌ మాయం కావడం.. ఆయన ఫోన్‌పే యాప్‌ నుంచి నగదు బదిలీ అవుతుండటంతో అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టగా కృష్ణయ్య, నగ్మాతో కలిసి అశోక్‌ హత్యకు పాల్పడ్డట్లు తేలింది. నిందితుల నుంచి 2.7 తులాల బంగారం గొలుసు, నాలుగు ఫోన్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement