సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుండె కుడివైపు ఉందంటూ వివాహమైన 20 రోజులకే భార్యను పుట్టింటికి పంపించాడు భర్త. మోసం చేసి వివాహం చేశారంటూ భర్త తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భార్యకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. న్యాయస్థానం తీర్పును కూడా భర్త భేఖాతరు చేశారు. న్యాయం కోసం ఏడేళ్లుగా బాధితురాలు ఒంటరి పోరాటం చేస్తోంది.
ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన అబ్బనపల్లి భవానిని పెద్దల సమక్షంలో 2018లో బోనకల్ మండలానికి చెందిన తవుడోజు భాస్కరాచారి వివాహమాడాడు. 20 రోజులు కాపురం చేసి భార్య భవానిని పుట్టింటికి పంపించాడు. గుండె కుడివైపున ఉందంటూ భార్యపై వేధింపులకు దిగాడు. భర్త భాస్కరాచారి ఇంటికి వెళ్లిన భవానిపై మామ వెంకటేశ్వర్లు దాడి చేశాడు.
బోనకల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా భవాని మామ విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం భవాని భర్త భాస్కరచారి పరారీలో ఉండగా, భర్త ఆచూకీ తెలపకుండా అత్తమామలు గోప్యంగా ఉంచుతున్నారు. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment