nandini
-
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్‌లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‌తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్‌కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్‌తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పిరమల్ ఫార్మా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్‌కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్‌ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్‌వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది. -
‘రివర్స్’తో నందిని నెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.టెండర్లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్‌నే పిలవాలి.రివర్స్ టెండర్‌కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్‌పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. -
నందిని నెయ్యి వద్దన్నది బాబే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచార కుట్ర కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పూటకో కట్టు కథ, రోజుకో అవాస్తవ ఆరోపణలతో కుతంత్రానికి పదును పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశి్నస్తుండటం ఈ కుట్ర కథలో తాజా అంకం. వాస్తవం ఏమిటంటే.. దశాబ్ద కాలంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డెయిరీని 2015లో తొలిసారిగా పక్కకు తప్పించింది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసేందుకు యతి్నస్తుండటం గమనార్హం. నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబే... కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలంపాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ ప్రక్రియను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. నాడు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచి్చంది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అప్పట్లో ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా ఉన్న సమయంలో నందినీ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ వార్తలు కూడా ప్రసారం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచి్చనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నందినీ డెయిరీని కాదని గోవింద్ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టింది. నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లలో పాల్గొనని నందిని ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వనందున టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనబోమని పేర్కొంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఇదీ అసలు విషయం. అయినా సరే ఎందుకు ఇవ్వలేదంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచడం విస్మయం కలిగిస్తోంది. అసలు వైఎస్సార్సీపీ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2015లో టీడీపీ హయాంలో టెండరు ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వనిది చంద్రబాబే అన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వెనుక చంద్రబాబు రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
National Inter State Senior Athletics Championships 2024: జ్యోతి, నందినిలకు స్వర్ణాలు
పంచ్‌కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది. నందిని ఓవరాల్‌గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు. -
పొంగిన నందిని పాల ధర
శివాజీనగర: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరికొన్ని నిత్యావసరాల ధరలను భగ్గున మండించింది. రాష్ట్ర పాల సమాఖ్య (కేఎంఎఫ్) నందిని బ్రాండ్ పాల ధరను లీటర్‌పై రూ. 2 పెంచింది, బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటినుంచి అర్ధ, 1 లీటర్ పాల ప్యాకెట్లో అదనంగా 50 మి.లీ.పాలను చేర్చి విక్రయిస్తామన్నారు. 50 మిల్లీలీటర్ల పాల విలువ 2 రూపాయల 10 పైసలు అవుతుందన్నారు. ఇది అదనపు పాల ధర తప్ప పెంపు కాదని చెప్పారు.లీటరుకు రూ. 44కు చేరికప్రస్తుతం నందిని నీలిరంగు ప్యాకెట్ పాల ధర లీటర్ రూ.42 ఉండగా, బుధవారం నుంచి రూ.44 అవుతోంది. అర్ధ లీటర్ పాల ధర రూ.22 నుంచి రూ. 24కు చేరుతుంది. పెరుగు, ఇతర నందిని ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని తెలిపారు. కొన్నిరోజుల పాటు పాల ప్యాకెట్లపై పాత ఉన్నా కొత్త రేటును వసూలు చేస్తారని ప్రజలు గమనించాలని కోరారు.పోరాడుతాం: బీజేపీపాల ధరపై బీజేపీ నేతలు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే పాల ధరను 2 సార్లు పెంచారు. పేదలు, మద్య తరగతి ప్రజలపై కొంచైమెనా కనికరం ఉంటే తక్షణమే పాల ధరను తగ్గించాలన్నారు. పెట్రోల్–డీజిల్ ధరల పెరుగుదల, కూరగాయలతో ప్రజలు కంగారు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ధరల పెంపుపై నిరంతరం ఆందోళనలు చేస్తామని తెలిపారు.నాకు తెలియదే: సీఎం సిద్దుకేఎంఎఫ్ పాల ధర పెంపు తన దృష్టికి రాలేదని సీఎం సిద్దరామయ్య చెప్పడం గమనార్హం. మంగళవారం తన నివాస కార్యాలయం కృష్ణాలో అఖిల భారత సాహిత్య సమ్మేళనం నిర్వహణపై సాహితీవేత్తలతో చర్యలు జరిపారు. ఆపై విలేకరులతో మాట్లాడుతూ పాల ధర పెంపు నాకు తెలియదు. కేఎంఎఫ్‌తో మాట్లాడుతాను. ధరల విషయం ప్రభుత్వ పరిధిలో ఉండదు అని అన్నారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాల ధర తక్కువగా ఉంటుందని చెప్పారు. -
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
ఖమ్మం రేసులో డిప్యూటీ సీఎం భార్య.. ఎంపీ టికెట్‌కు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియాగాంధీ, ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని, తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్త చేశారు. దేశంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని నందిని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇదీ చదవండి: టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్ ప్లీజ్! -
ఖమ్మం నుంచి అవకాశం ఇవ్వండి: మల్లు నందిని
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తెరపైకి కొత్త ముఖాలు వస్తున్నాయి. ఈసారి ఎంపీలుగా పోటీచేసే జాబితాలో పలువురు మంత్రుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తనకు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆమె గురువారం గాందీభవన్‌లో దరఖాస్తు సమర్పించారు. కాగా, ఇదే సీటుకు మరో సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌లు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ హాట్‌సీటుగా మారిందనే చెప్పవచ్చు. రెండోరోజు 34 మంది దరఖాస్తు రెండోరోజు 34 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆయా పార్లమెంట్ స్థానాల వారీగా చూస్తే మహబూబాబాద్‌కు 9, నాగర్‌కర్నూల్‌కు 8, వరంగల్‌కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్‌కు 3 దరఖాçస్తులు వచ్చాయి. భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఉస్మానియా విద్యారి్థనేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ దరఖాస్తు సమర్పించారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత దరఖాస్తు అందజేశారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 41 మంది దరఖాస్తు చేశారు. కాగా ఈనెల 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉండటంతో శుక్ర, శనివారాల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని గాం«దీభవన్వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
చేతులు, కాళ్లు కట్టేసి మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య
తిరువొత్తియూరు: తాళంబూర్ సమీపంలో చేతులు, కాళ్లను కట్టి వేసి మహిళా ఇంజినీరును దహనం చేసి హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెంగల్పట్టు జిల్లా తాళంబూరు సమీపం ఫోన్‌మార్ మాంబాక్కం వెళ్లే రోడ్డులో ప్రైవేటు నీళ్ల కంపెనీ ఉంది. కంపెనీ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి శనివారం రాత్రి 8 గంటల సమయంలో సుమారు 50 మీటర్ల దూరంలో మహిళ ఆర్తనాదాలు వినిపించాయి. ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులు శబ్దం విని అక్కడికి వెళ్లి చూడగా యువతి ఒకరు చేతులు, కాళ్లు గొలుసులతో కట్టివేయబడి మండుతున్న దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. ప్రజలు నీళ్లను ఆమైపె పోసి మంటలు ఆర్పారు. ఈ లోపు ఆ మహిళ మృతి చెందింది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు తాళంబూరు పోలీస్ ఇన్స్పెక్టర్ చార్లెస్ నేతృత్వంలో పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం క్రోమ్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఒక సెల్ ఫోన్ లభ్యమైనది. ఆ ఫోన్లో ఆ నంబర్లను ఆధారంగా విచారణ జరిపారు. మృతి చెందిన మహిళ బెంగళూరులో ఉన్న ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్ నందిని(25) అని తెలిసింది. ఈ సంఘటన గురించి తాళంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చేతులు కాళ్లు కట్టి వేసిన మహిళా ఇంజినీర్ హత్య చేయబడిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. -
Nandini Rai: బిగ్ బ్యాస్ బ్యూటీ నందిని రాయ్..తెల్లచీరలో మెరిసిపోతున్న (ఫోటోలు)
-
షేక్స్పియరే తన పవర్
‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు. వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్ ఇండియా’ పుస్తకం. ఫ్రొఫెసర్ నందిని దాస్ రాసిన ‘కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్–2023 గెలుచుకుంది... ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్‌కు షేక్స్పియర్ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి. అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో నందిని దాస్ ప్రొఫెసర్. షేక్స్పియర్ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్ ఇన్ షేక్స్పియర్ స్టడీస్’ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్‌షిప్‌పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్ రిసెర్చ్‌లోకి వచ్చింది. ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్ ఇండియా’ యూరోపియన్ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్ రాజకీయాలను ఆవిష్కరించింది. ‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్ అకాడమీ బుక్‌ప్రైజ్– ఛైర్ ఆఫ్ ది జ్యూరీ ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్. -
నేనేంటో నాకు తెలుసు.. వదిలిపెట్టను: స్వప్నాకు నందిని అగసార కౌంటర్
స్వప్నా బర్మన్ చేసిన సంచలన ఆరోపణలను భారత అథ్లెట్ నందిని అగసార ఖండించింది. తన విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చింది. తానేంటో తనకు తెలుసునని.. ఒకవేళ స్వప్నా దగ్గర తనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరింది. కాగా ఆసియా క్రీడలు-2023లో తెలంగాణకు చెందిన నందిని అగసార హెప్లథ్టాన్ విభాగంలో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చైనాలోని హోంగ్జూలో ఏడు క్రీడాంశాలతో కూడిన హెప్టథ్టాన్లో సత్తా చాటి మెడల్ సాధించింది. ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ట్రాన్స్‌జెండర్ వల్ల తాను కాంస్యం కోల్పోయానంటూ సంచలన పోస్టుతో నందినిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓటమిని తట్టుకోలేని ఆమె విద్వేషంతో ఈ మేరకు చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. నందినిని తక్కువ చేసేలా మాట్లాడిన స్వప్నా బర్మన్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందించిన నందిని అగసార స్వప్నాకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ‘‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర నాకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. నేను కూడా నా దగ్గర దేశం కోసం గెలిచిన ఈ మెడల్‌ను చూపిస్తాను. దేశం కోసం ఆడాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడు మేము గెలిచాం. మా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయనుకుంటా. ఈ విషయాన్ని నేను భారత అథ్లెటిక్స్ సమాఖ్య దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతం నేను పతకం సాధించానన్న ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఇండియాకు వెళ్లిపోతున్నాను’’ అని నందిని అగసార పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా తెలంగాణకు చెందిన 20 ఏళ్ల నందిని మహిళల హెప్లథ్టాన్ విభాగంలో 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. మరోవైపు స్వప్నా బర్మన్కు ఈ ఈవెంట్లో 5708 పాయింట్లు మాత్రమే వచ్చాయి. చదవండి: కోహ్లికి నో ఛాన్స్! మరో టీమిండియా స్టార్‌కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్: బట్లర్ #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
భారత అథ్లెట్ నందినిపై విషం చిమ్మిన స్వప్నా.. ట్రాన్స్‌జెండర్ అంటూ తీవ్ర ఆరోపణలు
భారత అథ్లెట్ స్వప్నా బర్మన్ తోటి క్రీడాకారిణి అగసార నందినిపై విషం చిమ్మింది. ఆసియా క్రీడలు-2023లో ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తెలంగాణ అమ్మాయి నందినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నందినిని ట్రాన్స్‌జెండర్‌గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన స్వప్నా వెంటనే దానిని డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో స్వప్నా తీరుపై భారత క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ప్లేయర్‌పై విద్వేషపూరిత కామెంట్లు చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. కాగా చైనా వేదికగా హోంగ్జూలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో నందిని కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో 5712 పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా బ్రాంజ్ మెడల్ సాధించి ఆసియా క్రీడల్లో సత్తా చాటింది. అయితే, ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో వెనుదిరగింది. గత ఎడిషన్‌లో పసిడి పతకం సాధించిన స్వప్నా ఈసారి ఘోర ఓటమి నేపథ్యంలో నందిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. Now this is Shocking! Swapna Barman, who finished 4th in Heptathlon yesterday, saying that compatriot Nandini, who won Bronze medal, is a transgender and that this is against the rules of Athletics! https://t.co/ST6Th0mAc9 — India_AllSports (@India_AllSports) October 2, 2023 ‘‘చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడల్లో భాగంగా నేను నా కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ వుమెన్‌కు చేజార్చుకున్నాను. నా మెడల్ నాకు కావాలి. నాకు ఎవరైనా సాయం చేయండి. అథ్లెటిక్స్‌లో ఇలాంటి వాళ్లు పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధం’’ అంటూ ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వెంటనే ఆ పోస్ట్‌ను స్వప్నా డిలీట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్‌గా మారాయి. కాగా స్వప్నా బర్మన్ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ వచ్చిందా లేదంటే ఆమె అకౌంట్ నుంచి వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా నందినిపై ఆరోపణలు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వరల్డ్ అథ్లెటిక్స్ రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం.. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళా వరల్డ్ ర్యాంకింగ్స్ ఈవెంట్లలో పాల్గొనడానికి వీల్లేదు. మార్చి 31 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కాగా స్వప్నా ఇటీవల బ్రిడ్జ్‌తో మాట్లాడుతూ.. ‘‘టెస్టోస్టిరాన్ లెవల్స్ 2.5 కంటే ఎక్కువగా ఉన్నవాళ్లు 200 మీ. మించి ఏ ఇతర ఈవెంట్లలో పాల్గొనకూడదు. ఏ అమ్మాయైనా సరే.. త్వరగా హెప్టాథ్లాన్ ఈవెంట్‌ను పూర్తి చేయలేదు. నేనైతే 13 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న తర్వాతే ఇక్కడిదాకా వచ్చాను. కానీ ఆమె నాలుగు నెలల శిక్షణలోనే ఈ స్థాయికి ఎలా చేరుకుందో’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్‌పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం), 800 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటిన అగసార నందిని కాంస్యం కైవసం చేసుకున్న నేపథ్యంలో స్వప్నా బర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 🎽𝗔 𝗖𝗢𝗡𝗧𝗥𝗢𝗩𝗘𝗥𝗦𝗬 𝗨𝗡𝗙𝗢𝗟𝗗𝗜𝗡𝗚! Swapna Barman, who finished fourth in the Heptathlon, has alleged that her fellow Indian and Bronze winner Nandini Agasara is transgender and contends that this gives her an unfair advantage in competing in the women's event. 🥉… pic.twitter.com/CsM5sJVF8I — Team India at the Asian Games 🇮🇳 (@sportwalkmedia) October 2, 2023 -
‘నందివర్ధనం’.. పేద కుటుంబం నుంచి వచ్చి.. ‘అవరోధాలు’ అధిగమించి
Asian Games 2023: గత కొంత కాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెట్ అగసార నందిని అసలు సమయంలో తన ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారి కాంస్యంతో మెరిసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నందిని మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5712 పాయింట్లు సాధించింది. హెప్టాథ్లాన్‌లోని తొలి ఆరు ఈవెంట్లు ముగిసేసరికి నందిని ఐదో స్థానంలో నిలిచింది. 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసి 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్‌పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం)... ఇలా వరుసగా ఆమె ప్రదర్శన కొనసాగింది. అయితే చివరి ఈవెంట్ 800 మీటర్ల పరుగులో సత్తా చాటడంతో కాంస్యం ఖాయమైంది. ఈ పరుగును 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసిన నందిని అగ్ర స్థానంలో నిలిచింది. దాంతో ఓవరాల్ పాయింట్లలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది. 2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన మరో భారత అథ్లెట్ స్వప్న బర్మన్ చివరి వరకు పోటీలో నిలిచినా... ఓవరాల్‌గా 5708 పాయింట్లతో నాలుగో స్థానానికే పరిమితమైంది. పేద కుటుంబం పేద కుటుంబం నుంచి వచ్చి నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివిన నందిని అదే పాఠశాలలో నెలకొల్పిన అథ్లెటిక్స్ అకాడమీ తొలి బ్యాచ్ విద్యార్థిని. ప్రస్తుతం సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న నందినికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తాజా విజయానికి రూ. 1 లక్ష నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
మనస్తాపంతో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
మహబూబ్‌నగర్: మనస్తాపం చెంది ఓ వివాహిత పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం మండలంలోని గుంపన్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాత్లావత్ భాస్కర్‌కు లింగాల మండలం ఎంసీతండాకు చెందిన నందిని(18)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల పాటు అన్నోన్యంగా ఉన్న దంపతులు రెండు రోజులుగా చిన్నపాటి గొడవ అయ్యిందని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని పురుగుల మందు తాగింది. అపస్మారకస్థితిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సెల్‌ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ
దుబ్బాక టౌన్: అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ చిచ్చు రాజేసింది. ఫోన్‌కోసం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, చెల్లెలు క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మర్గల శంకర్, వసంత దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. రెండో కుమార్తె నందిని డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్న కుమార్తె నవిత అలి యాస్ నవ్య (18) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఉదయం ఇద్దరూ సెల్‌ఫోన్ విషయమై గొడవ పడ్డారు. ఇది గమనించిన తల్లి, వారిని మందలించి ఫోన్ ను బీరువాలో పెట్టి తాళం వేసి పని కోసం వెళ్లింది. దీంతో అప్పటికే ఆవేశంలో ఉన్న నవిత గడ్డిమందు తాగింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నందిని, చెల్లి అపస్మరక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు చేరుకున్నా రు. వెంటనే నవితను దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం సిద్దిపేట హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నవ్య మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెరగనున్న పాల ధరలు.. ఆగష్టు 01 నుంచే..
టమాట ధరల పెరుగుదల మిగతా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపుతోంది. కర్ణాటకలో పాల ధరలు కూడా 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్ఎఫ్) బృందం & ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య జరిగిన సమావేశం తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని (Nandini) ధరలు లీటరుకు రూ. 3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కారణంగా పాల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కెఎమ్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. కెఎమ్ఎఫ్ చైర్మన్ భీమా నాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను ఆమోదించింది. కావున కొత్త ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ధరల పెరుగుదల కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని.. పెరుగు, ఇతర పాల పదార్థాలు వర్తించే అవకాశం లేదని తెలిపారు. (ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 సన్‌రూఫ్ ఫీచర్ కార్లు - వివరాలు) ప్రస్తుతం మార్కెట్లో నందిని టోన్డ్ మిల్క్ ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కి చేరుతుంది. పాల పొడి ధరలు కూడా పెంచాలన్న బృందం విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియంత్రణలో నడిచే నందిని ఇప్పుడు పాల ధరను పెంచనుండడంతో మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. నందిని రూ.3 పెంచితే ప్రైవేట్ కంపెనీలు కనీసం రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి. -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
కర్ణాటకలో నందిని Vs అమూల్
-
పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..
పాలకుర్తిటౌన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కన్నడనాట పాల గోల.. ఇప్పుడు నందినీపై పడ్డారని బీజేపీపై విమర్శలు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో పాలపై వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బెంగళూరులో ఆన్లైన్ ద్వారా అమూల్ పాలు, పెరుగు విక్రయించనున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇటీవల చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమూల్‌కు వ్యతిరేకంగా పలు కన్నడ సంస్థలు సోమవారం నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి. గో బ్యాక్ అమూల్, సేవ్ నందిని అంటూ హాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలోనూ నిరసనలు జోరందుకుంటున్నాయి. అమూల్‌ను రాష్ట్రంలోకి తీసుకొచ్చి స్థానిక నందినీ డెయిరీని దెబ్బ తీసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని విపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘గుజరాత్‌కు చెందిన బరోడా బ్యాంక్ మా విజయ బ్యాంక్‌ను కబళించింది. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలన్నింటినీ గుజరాతీ అయిన అదానీకి కట్టబెడుతున్నారు. ఇప్పుడు నందినీ డెయిరీపై పడ్డారు’’ అంటూ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య దుయ్యబట్టారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి కూడా అమూల్‌పై విమర్శలతో ట్వీట్లు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అమూల్ కర్ణాటకలోకి ప్రవేశించడం లేదని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ చెప్పారు. నందినీ డెయిరీని అమూల్‌లో విలీనం చేస్తారన్నది కూడా కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ హయాంలోనే నందినీ డెయిరీ భారీగా విస్తరించిందని చెప్పుకొచ్చారు. -
కర్నాటక ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. నందిని Vs అమూల్
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అమూల్ పాల విషయం కాస్తా పొలిటికల్ హీట్‌ను పెంచింది. కర్నాటకలో తమ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించడం, అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం.. వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని అమూల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న నందిని సంస్థను అమూల్‌లో విలీనం చేయాలనే వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అమూల్ పాల ఉత్పత్తులను రానిచ్చే ప్రస్తకే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. కేఎంఎఫ్‌ను, రాష్ట్రంలోని పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావ్ చెప్పారు. ఇకపై మంచి కాఫీ, స్నాక్స్ తయారు చేసేందుకు నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని వెల్లడించారు. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న అమూల్‌కు ఊహించని షాక్ తగిలింది. నందిని పాల ఉత్పత్తులకు సౌత్ ఇండియాలో కూడా డిమాండ్ ఉంది. #WATCH | Bengaluru: We want to protect our milk and our farmers. We already have Nandini which is a better brand than Amul...We don't need any Amul..our water, our milk, and our soil is strong: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/LNvBynEDsB — ANI (@ANI) April 8, 2023 -
సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2023–24 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి, డిప్యుటీ చైర్‌పర్సన్‌గా ఆర్ నందిని ఎన్నికయ్యారు. 2022–23కి గాను సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా వ్యవహరిస్తున్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఉన్న కమల్ బాలికి సీఐఐతో చిరకాల అనుబంధం ఉంది. 2022–23కి గాను ఆయన సీఐఐ సదరన్ రీజియన్ డిప్యుటీ చైర్మన్‌గా ఉన్నారు. పరిశ్రమలోని పలు సంస్థలు, ఇన్వెస్ట్ కర్ణాటక ఫోరం మొదలైన వాటిలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అటు నందిని .. చంద్ర టెక్స్టైల్స్ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె సీఐఐ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సీఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్లో సభ్యురాలిగా, సీఐఐ నేషనల్ కౌన్సిల్ టాస్క్ ఫోర్స్ (గ్రామీణాభివృద్ధి, వలస కార్మికులు)కు కో–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలాగే పలు సంస్థల్లో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ (సీఐఈఎస్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సీఐఐ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం, ప్రతీక్షా ట్రస్ట్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్‌ఫాం .. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలదని తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఐఐ సీఐఈఎస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.