కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం ఎర్లదిన్నె వద్ద తుంగభద్ర నదిలో మునిగి తల్లీ కుమార్తెలు మృతి చెందారు. ఉరుకుణ్ణమ్మ (26) తన కుమార్తెలు నందిని (6), నాగేశ్వరి(8)తో కలసి తుంగభద్ర నదిలో చేపల సేకరణకు గాను తెప్పపై వెళ్లింది. దానికి రంధ్రం ఏర్పడి లోపలికి నీరు చేరడంతో అది మునిగిపోయింది. ఉరుకుణ్ణమ్మ, నందిని నీళ్లలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందగా... నాగేశ్వరి మాత్రం ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకుంది.
తుంగభద్ర నదిలో ప్రమాదం ఇద్దరి మృతి
Published Wed, Mar 16 2016 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement
Advertisement