బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అమూల్ పాల విషయం కాస్తా పొలిటికల్ హీట్‌ను పెంచింది. కర్నాటకలో తమ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించడం, అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వివరాల ప్రకారం.. వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని అమూల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న నందిని సంస్థను అమూల్‌లో విలీనం చేయాలనే వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అమూల్ పాల ఉత్పత్తులను రానిచ్చే ప్రస్తకే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ క్రమంలోనే కర్నాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. కేఎంఎఫ్‌ను, రాష్ట్రంలోని పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావ్ చెప్పారు. ఇకపై మంచి కాఫీ, స్నాక్స్ తయారు చేసేందుకు నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని వెల్లడించారు. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న అమూల్‌కు ఊహించని షాక్ తగిలింది. నందిని పాల ఉత్పత్తులకు సౌత్ ఇండియాలో కూడా డిమాండ్ ఉంది.
#WATCH | Bengaluru: We want to protect our milk and our farmers. We already have Nandini which is a better brand than Amul...We don't need any Amul..our water, our milk, and our soil is strong: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/LNvBynEDsB
— ANI (@ANI) April 8, 2023
Comments
Please login to add a commentAdd a comment