తిరువొత్తియూరు: తాళంబూర్ సమీపంలో చేతులు, కాళ్లను కట్టి వేసి మహిళా ఇంజినీరును దహనం చేసి హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెంగల్పట్టు జిల్లా తాళంబూరు సమీపం ఫోన్‌మార్ మాంబాక్కం వెళ్లే రోడ్డులో ప్రైవేటు నీళ్ల కంపెనీ ఉంది. కంపెనీ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి శనివారం రాత్రి 8 గంటల సమయంలో సుమారు 50 మీటర్ల దూరంలో మహిళ ఆర్తనాదాలు వినిపించాయి.
ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులు శబ్దం విని అక్కడికి వెళ్లి చూడగా యువతి ఒకరు చేతులు, కాళ్లు గొలుసులతో కట్టివేయబడి మండుతున్న దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. ప్రజలు నీళ్లను ఆమైపె పోసి మంటలు ఆర్పారు. ఈ లోపు ఆ మహిళ మృతి చెందింది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు తాళంబూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చార్లెస్ నేతృత్వంలో పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం క్రోమ్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఒక సెల్ ఫోన్ లభ్యమైనది. ఆ ఫోన్లో ఆ నంబర్లను ఆధారంగా విచారణ జరిపారు. మృతి చెందిన మహిళ బెంగళూరులో ఉన్న ప్రైవేటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్ నందిని(25) అని తెలిసింది. ఈ సంఘటన గురించి తాళంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చేతులు కాళ్లు కట్టి వేసిన మహిళా ఇంజినీర్ హత్య చేయబడిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment