
నందిని మైనా
చెన్నై, పెరంబూరు : బుల్లితెర నటిపై సమత్తువ మక్కళ్‌కట్చి నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుల్లితెర నటి నందిని మైనా నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించింది. అందులో సమత్తువ మక్కళ్ కట్చి నాయకుడి ఫోన్ నంబరును నమోదు చేసింది. ఆ ఫోన్ నంబరుకు పలువురు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడినట్టు తెలిసింది. ఆ ఫోన్ నంబరు ఈ రోడ్డు జిల్లా, అందియూర్ సమీపంలోని అన్నామడులై గ్రామానికి చెందిన గురునాథన్ అనే వ్యక్తిది. ఈయన ఉత్తర ఈరోడ్డు జిల్లా సమత్తువ మక్కళ్ కట్టి కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఆయన ఫోన్ నంబర్ నటి నందిని మైనా నకిలీ ఫేస్‌బుక్‌లో నమోదు చేయడంతో అది ఆమె నంబర్ అనుకుని ఎవరెవరో అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి విసిగించడంతో గరునాథన్ నటి నందిని మైనాపై అందియూర్ లీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోడ్డు జిల్లా సైబర్ పోలీసులకు కేసును అప్పగించారు. సైబర్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment